తిరుమల : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వేకువజాము 4 గంటలకు అభిషేక సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు, నూతన సంవత్సర కేలండర్, డైరీ లను అందజేశారు. ఆయన వెంట నిత్యాన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో సాగి వేణుగోపాల్ ఉన్నారు.