
హవాలా కేసు సీఐడీకి అప్పగింత: డీజీపీ
విశాఖపట్నం: బోగస్ కంపెనీల పేర్లతో సుమారు రూ.1,500 కోట్లను విశాఖ కేంద్రంగా హవాలా రూపంలో తరలించిన ముఠా వెనుక ఎవరున్నారన్నదని దర్యాప్తులో తేలుతుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశిరావు అన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్టు తెలిపారు. కుంభకోణంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతామని చెప్పారు. వేల కోట్ల రూపాయలు హవాలా రూపంలో విదేశాలకు తరలించారన్నారు. విచారణ తర్వాత మొత్తం వివరాలు వెల్లడవుతాయని డీజీపీ చెప్పారు.
ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ప్రధాన నిందితుడు వడ్డి మహేష్.. ఓ ఏపీ మంత్రి, ఎంపీ అండతోనే వ్యవహారం సాగించినట్టు అనుమానిస్తున్నారు.