ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రూ.253 కోట్లతో రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ సాంబశివరావు చెప్పారు. సోమవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సైతం పోలీసు అనుమతి తీసుకోవాలని, ఇకపై చట్టపరంగా పరిశీలించిన తర్వాతే పాదయాత్రలకు అనుమతి ఇస్తామన్నారు.