ఆటో డ్రైవర్ నిజాయితీ.. | Honest auto driver .. | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్ నిజాయితీ..

Published Tue, Dec 15 2015 7:50 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Honest auto driver ..

తన ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి.. విలువైన వస్తువుల బ్యాగ్ మరిచాడు.. ఇది గమనించిన ఆటో డ్రైవర్ పోలీసుల సాయంతో బ్యాగును ప్రయాణికుడికి చేర్చాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న చౌట శ్రీనివాసరావు మంగళవారం తెనాలి మారీసుపేటలో నివసించే తన అక్క వద్దకు వచ్చాడు. పాత ప్రభుత్వ వైద్యశాల వద్ద ఆటో ఎక్కి, మారీసుపేటలో దిగాడు.

ఆటోను బస్టాండ్ సమీపంలోని స్టాండుకు తీసుకువచ్చిన డ్రైవర్ సాంబశివరావు బ్యాగ్ ఉండడాన్ని గమనించి టూ టౌన్ పోలీసులకు అప్పగించాడు. అందులో రూ. 650 నగదు, బంగారు గొలుసు, ఏటీఎం కార్డులు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. శ్రీనివాసరావు వివరాలను సేకరించిన పోలీసులు అతనికి బ్యాగును అప్పగించారు. బ్యాగును నిజాయితీగా అప్పగించిన డ్రైవర్ సాంబశివరావును టూ టౌన్ పోలీసులు  అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement