తిరుమలలో 1752 నకిలీ లడ్డూ టికెట్లు!
తిరుమలలో నకిలీ లడ్డూ టికెట్ల అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఇప్పటివరకు తాము 1752 నకిలీ లడ్డూ టికెట్లను గుర్తించామని ఆయన చెప్పారు.
అక్రమాల్లో టీటీడీకి చెందిన ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధం ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైందని ఈవో సాంబశివరావు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన ఐదుగురు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.