TTD Executive Officer
-
విబేధాలపై స్పందించిన టీటీడీ చైర్మన్, ఈవో
తిరుపతి, సాక్షి: తొక్కిసలాట ఘటన దురదృష్టకర ఘటనేనని టీటీడీ చైర్మన్, ఈవో సంయుక్త ప్రెస్మీట్లో మరోసారి ప్రకటించారు. అంతేకాదు.. విబేధాలు ఉన్నాయంటూ నడుస్తున్న ప్రచారంపైనా ఇద్దరూ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. సోమవారం మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.జనవరి 8వ తారీఖున అత్యంత దురదృష్టవంతమైన సంఘటన జరిగింది. అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, గాయపడిన వారికి సీఎం అదేశాల ప్రకారం పరిహారం అందజేశాం. బోర్డు సభ్యులతో ఏర్పాటు చేసిన రెండు బృందాలు బాధితులకు పరిహారం అందజేసారుకొన్ని ప్రసార మాధ్యమాలలో, సామాజిక మాధ్యమాలలో టీటీడీ(TTD)పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. తిరుమల అనేది కోట్లాది మంది హిందువులు మనోభావాలకు సంభందించిన విషయం. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటిరెండు సార్లు పరిశీలించండి. పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అందరు సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తున్నాం. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. భక్తులు ప్రశాంతంగా వైకుంఠద్వార దర్శనం చేసుకుంటున్నారు అని ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో తిరుమలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టీటీడీ ఈఓ(TTD EO) శ్యామలరావు అన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును నేను విభేదించానన్న వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారం. చైర్మన్‌తో పాటు సభ్యులతో, అదనపు ఈఓ తో నాకు విభేదాలు ఉన్నట్టు సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారాలు పూర్తి అవాస్తవం. అలాగే సమన్వయం లోపం వల్ల తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందన్న వార్తలూ అవాస్తవం. వైకుంఠ ద్వార దర్శన పని ఒత్తిడి వల్ల ఇలాంటి వార్తలను పట్టించుకోలేదు. వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు బాగానే చేశాం. కానీ తిరుపతిలో జరిగిన ఘటన ప్రోటోకాల్ ప్రకారమే జరిగింది. టోకెన్లకు వదిలినప్పుడు తొక్కిసలాట అనుకోకుండా జరిగింది. దీనిపై విచారణ జరుగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అందరి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాము. ఆరునెలల్లో అనేక మార్పులు చేశాం. ప్రక్షాళనలో భాగంగా కల్తీనెయ్యి వినియోగాన్ని గుర్తించి కల్తీనెయ్యి సరఫరా చేసిన సరఫరాదారులపై చర్యలు తీసుకున్నాం. స్వచ్ఛమైన నెయ్యితో ప్రసాదాల్లో నాణ్యత తీసుకొచ్చాం. దళారీలను అరికట్టాం, వేల సంఖ్యలో ఉన్న ఆన్ లైన్ బ్రోకర్ల బెడదను నివారించాం. సీఎం ఆదేశాల మేరకు భక్తులకు ఇబ్బందులూ లేకుండా చాలా చర్యలు తీసుకున్నాం. భవిష్యత్ లో ఇంకా అనేక మార్పులు తీసుకొని రావాల్సి ఉంది. మార్పులు ఏమైనా చేయాల్సి వస్తే వచ్చే ఏడాది నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు.పవన్ ఏమన్నారంటే.. ఇదిలా ఉంటే.. తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేసారు. తప్పు జరిగిందని.. క్షమించమని భక్తులను కోరారు. ఘటనలో టీటీడీ బోర్డు వైఫల్యం ఉందని, ఈవో శ్యామలా రావు, ఏఈవో వెంకయ్య చౌదరి మధ్య గ్యాప్ ఉందని వ్యాఖ్యానించారు. బాధ్యతలు నిర్వర్తించడంలో టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారన్నారు. ఈ ఘటనను బాధ్యతగా తీసుకోవాలని.. ఈ సందర్భంగా వారిద్దరికి పవన్ కల్యాణ్ సూచించారు. అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. -
టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలు: మార్గాని భరత్
సాక్షి, రాజమండ్రి: రాజకీయాల కోసం చంద్రబాబు తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని దుయ్యబట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలయ్యాయని తెలిపారు. సీఎంకు ఇచ్చిన నివేదికలో ఒకలా.. షోకాజ్ నోటీసుల్లో మరోలా ఉందని పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం రాజమంత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలైలో రిపోర్టు వస్తే రెండు నెలల వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కేసులు ఎందుకు నమోదు చేయలేదని, అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ‘జులై 23న నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నట్లు నివేదిక వచ్చిందన్న ఈవో.. సీఎంకు ఇచ్చన నివేదికలో మాత్రం జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చని ఎన్డీడీబీ అనుమానం వ్యక్తం చేసిందని తెలిపారు. ఎన్డీడీబీ నుంచి రిపోర్టు తెప్పించిన తర్వాత సెకండ్ ఒపినియన్ ఎందుకు తీసుకోలేదు? ఎవరిని మీరు తప్పు దోవ పట్టిస్తున్నారు? ’ అని మండిపడ్డారు.చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి -
అంతా బోగస్.. సంచలన నిజాలు బయటపెట్టిన టీటీడీ ఈవో..
-
టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకరణ
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కార్యనిర్వహణ అధికారి (ఈవో)గా జె.శ్యామలరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఈవో (ఎఫ్ఏసీ) ఎ.వి.ధర్మారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం సతీమణితో కలిసి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆయనకు స్వామి విశిష్టతను తెలిపారు. దర్శనం అనంతరం ఈవోని వేద పండితులు ఆశీర్వదించి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. దీనికిముందు సంప్రదాయాన్ని అనుసరించి ఈవో తొలిగా వరాహస్వామిని దర్శించుకుని క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, సీవీఎస్వో నరసింహకిషోర్, అధికారులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాంహైందవుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల అని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. దేశవిదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం భారీస్థాయిలో భక్తులు తిరుమలకు వస్తుంటారన్నారు. ఈవోగా పనిచేసే భాగ్యం దక్కడం తన అదృష్టమని, స్వామి ఆశీస్సులతో ఈ మహాద్భాగ్యం దక్కిందని చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీలో మంచి పరిపాలన సాగేలా చర్యలు చేపడతామన్నారు. ప్రపంచవ్యాప్తంగా రిచెస్ట్ టెంపుల్ తిరుమల అని గుర్తుచేశారు. బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంతోషంగా తిరుగుప్రయాణం అవ్వాలనే ప్రయత్నం చేస్తానన్నారు. ఆగమశాస్త్రం అనుసారం శ్రీవారి కైంకర్యాలు సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. శ్రీవారి ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుకు ప్రత్యేకదృష్టి ఉందన్నారు. టీటీడీ నిధులు దుబారా కాకుండా సక్రమంగా వినియోగిస్తామని చెప్పారు. గతంలో అవకతవకలు జరిగి ఉంటే విచారణ చేపడతామన్నారు. అలాంటి చర్యలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతన ఈవో తనిఖీలుటీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్యామలరావు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. క్యూలైన్లో భక్తులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్ల వద్ద పారిశుధ్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిరోజే టీటీడీ అధికారులకు చుక్కలు చూపించారు. క్యూలైన్ల వద్ద భక్తులకు అందించే తాగునీటిని పరిశీలించి ల్యాబ్‌కు పంపించాలని అధికారులకు సూచించారు. హెల్త్ విభాగంలో ఇద్దరు అధికారులకు మెమో జారీచేసే యోచనలో ఉన్నారు. తనిఖీల అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ.. క్యూలైన్లలో ఆహారం, తాగునీరు ఇస్తున్నామని చెప్పారు. నీటిలో కొంత మట్టిలాంటి పదార్థం ఉన్నట్లు గుర్తించామని, నీటిని ల్యాబ్ టెస్టింగ్‌కు పంపించామని తెలిపారు. క్యూలైన్లో పాలను సరిగ్గా ఇవ్వడం లేదని ఫిర్యాదు అందిందని చెప్పారు. దీనిపై విచారిస్తామన్నారు. కాలిబాటలో టికెట్లు ఇవ్వడం లేదని భక్తులు ఫిర్యాదు చేశారని, దీనిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. క్యూలైన్ల పైన కూడా సమీక్షించి భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. -
టీటీడీ కొత్త ఈవోగా జె.శ్యామలరావు నియామకం
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఈవో ధర్మారెడ్డి బదిలీ అయ్యారు. -
అలిపిరి నడక మార్గంలో పటిష్ట బందోబస్తు: టీటీడీ ఈవో ధర్మారెడ్డి
తిరుమల: తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతిచెందిన బాలిక ఘటనపై టీటీడీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి శనివారం అత్యవసర సమావేవేశాన్ని ఏర్పాటు చేశారు. అటవీశాఖ, విజిలెన్స్ అధికారులతో సమావేశమయ్యారు. తిరుమల నడకమార్గంలో భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు చిరుత దాడి విషయం తెలిసి హైదరాబాద్ నుంచి హుటాహుటిన తిరుమలకు బయలుదేరారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చిన్నారిపై దాడి బాధాకరం: ఈవో తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి బాధాకరమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలిపిరి నడకమార్గం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేతపై ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. నడక దారిలో ప్రతి 40 అడగులకు సెక్యూరిటీ ఉండే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలకు చిన్న పిల్లలతో వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు నడక దారిలో ఫారెస్ట్, పోలీస్, టీటీడీ కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ధర్మారెడ్డి అన్నారు. అలిపిరి నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చిరుత దాటి ఘటనపై సీసీఎఫ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించాని తెలిపారు. ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటలకు బైక్స్ నిలిపి వేయాలని సూచనలు వచ్చాయని.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాని పేర్కొన్నారు. చదవండి: ఇదేం చిత్రం చంద్రబాబూ.. ఇదే కదా నీ కొంపముంచేది? దాడి చేసింది చిరుతనా లేదా ఎలుగబంటినా? బాలికపై చిరుత దాడికి పాల్పడిన ఘటనా స్థలాన్ని సీసీఎఫ్ నాగేశ్వర రావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్ పరిశీలించారు. దాడి చేసింది చిరుతా లేక ఎలు బంటా అన్నది పోస్టుమార్టం రిపోర్టు వస్తే నిర్ధారణ అవుతుందని తెలిపారు. దాడి చేసిన జంతువును బంధించేందుకు బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎలుగుబంటి అయితే మత్తు ద్వారా బంధిస్తామని, చిరుత అయితే బోన్ ద్వారా బంధిస్తామని చెప్పారు. జంతువుల కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తామని తెలిపారు. 7వ మైలు రాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్‌గా ప్రకటిస్తున్నామని అన్నారు. కాగా తిరుమలలోని అలిపిరి కాలి బాటలో ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం చెందిన దినేష్ కుమార్, శశికళ కుమార్తె లక్షిత శుక్రవారం సాయంత్రం అలిపిరి కాలిబాటలో కనిపించకుండా పోయింది. చిరుత దాడిని గుర్తించని తల్లిదండ్రులు.. నడకదారిలో చిన్నారి కోసం వెతగ్గా దొరకలేదు. నిన్న రాత్రి పోలీసులకు లక్షిత తప్పిపోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. రాత్రి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చే పట్టారు. శనివారం ఉదయం నడక దారిలో లక్షిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి..ఈ ఘటనపైకేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవ్వగా.. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. -
పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపు: ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుపతి: పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయించామని, ట్రస్ట్‌కు ఇప్పటివరకు రూ.880 కోట్ల విరాళాలు వచ్చినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,500 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఈ ట్రస్ట్ ద్వారా విరాళాలు ఇచ్చిన భక్తులు ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదని స్పష్టం చేశారు. సమ్మర్ రద్దీ నేపథ్యంలో రూ.300 రూపాయల దర్శన టికెట్ల కోటా తగ్గించామని, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తిరిగి రూ.300 దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తల మధ్య ఎక్కువ తోపులాట లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తామని, మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు సింగిల్ లైన్లో భక్తులను అనుమతిస్తున్నామని ఈవో పేర్కొన్నారు. చదవండి: సాహసోపేత నిర్ణయాలు.. వారికి వైఎస్ జగన్ సర్కార్ ఐదు వరాలు -
కోర్టు ధిక్కార కేసులో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఊరట
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఊరట లభించింది. జైలు శిక్ష విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది హైకోర్టు ధర్మాసనం. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఈఓ ధర్మారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు ఏమిటి? టీటీడీ ధర్మ ప్రచార పరిషత్‌లో ప్రోగ్రాం అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి 2011లో జారీ చేసిన టీటీడీ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, తమను ప్రోగ్రాం అసిస్టెంట్లుగా తమ స్వర్వీసులను క్రమబద్ధీకరించేలా ఆదేశించాలని కొమ్ము బాబు, రామావత్ స్వామి నాయక్, భూక్యా సేవ్లానాయక్‌లు పిటిషన్ దాఖలు చేశారు. క్రమబద్ధీకరించాలంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, హైకోర్టు తీర్పును అమలు చేయటం లేదని పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జూన్ 16న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్.. టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి నెలరోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో వారం పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాజాగా హైకోర్టు ధర్మాసనం స్టే విధించటంతో ఊరట లభించింది. ఇదీ చదవండి: సింగిల్ జడ్జి తీర్పుపై ధర్మారెడ్డి అప్పీల్ -
టీటీడీ బోర్డు కార్యదర్శిగా ఈవో ప్రమాణ స్వీకారం
తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్య కార్యదర్శిగా టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈవోతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. గరుడోత్సవం రోజున శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను అందజేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ ఆహ్వానించనుందని వెల్లడించారు. దీంతోపాటు హనుమంతుని జన్మస్థలం అంజనాద్రిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నామన్నారు. తాళ్లపాక అన్నమాచార్యుని సంకీర్తనలు పాటలు పోటీలను ‘అదివో అల్లదివో’ పేరుతో నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలపై నిరంతర పరిశోధనలు అన్నమాచార్యుల సంకీర్తనలపై నిరంతరం పరిశోధనలు నిర్వహించేందుకు తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ‘అన్నమయ్య పీఠం’ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టులపై శుక్రవారం ఆయన సమీక్షించారు. -
వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
సాక్షి, తిరుమల: వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఐదు సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కేంద్రాలను అడిషనల్ ఈవోతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఎల్లుండి నుంచి భక్తులకు లక్ష సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో స్థానికులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. బయట ప్రాంతాల నుంచి రావొద్దని భక్తులకు జవహర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఈనెల 24 నుంచి స్థానికులకు టీటీడీ టిక్కెట్లు) -
టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి
సాక్షి, తిరుపతి: టీటీడీ నూతన ఈఓగా ఐఏయస్ అధికారి డాక్టర్ జవహర్ రెడ్డి శనివారం భాద్యతలు చేపట్టారు. ఉదయం అలిపిరి నుంచి నడకదారిలో తిరుమలకి చేరుకున్నారు. అనంతరం 12 గంటలకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ ధర్మారెడ్డి నుంచి పదవీబాధ్యతలు తీసుకున్నారు. జవహర్ రెడ్డి భాద్యతలు చేపట్టాకా మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. టీటీడీ 27వ ఈఓగా జవహర్ రెడ్డి భాద్యతలు చేపట్టారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని దర్శించుకొని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
తిరుమలకు బయల్దేరిన జవహర్ రెడ్డి
సాక్షి, తిరుపతి: డాక్టర్ జవహర్ రెడ్డి శనివారం తెల్లవారుజామున అలిపిరి మార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు గానూ, ఆయన కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. కాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమిస్తూ బుధవారం రాత్రి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. జవహర్‌రెడ్డి ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొద్ది రోజుల కిందటే టీటీడీ ఈవోగా పనిచేస్తున్న అనిల్‌కుమార్ సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. -
ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన నవంబరు మాసం కోటా కింద మొత్తం 69,254 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసినట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆన్లైన్ డిప్ విధానంలో 10,904 సేవా టికెట్లు విడుదల చేశామని.. ఇందులో సుప్రభాతం 7,549, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టికెట్లు ఉన్నాయని వెల్లడించారు. ఆన్లైన్ జనరల్ కేటగిరిలో 58,350 సేవా టికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 1,500, కల్యాణం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,850, సహస్ర దీపాలంకార సేవ 16,800 టికెట్లు ఉన్నాయన్నారు. కాగా, ఈనెల 13, 27 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు.. 14, 28 తేదీల్లో ఐదేళ్లలోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. అలాగే ప్లాస్టిక్ నివారణలో భాగంగా ఈ నెల మూడో వారం నుంచి తిరుమలలో అందరికీ జనప నార బ్యాగులను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వివరించారు. టీటీడీ ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. సామాన్య భక్తుల సౌకర్యార్థమే బ్రేక్ దర్శనాల కేటగిరీలను రద్దు చేశామని స్పష్టంచేశారు. దీనివల్ల గంట సమయం ఆదా అవుతోందని, తద్వారా దాదాపు 5 వేల మంది సామాన్య భక్తులకు అదనంగా దర్శనం చేయించేందుకు వీలవుతోందని తెలిపారు. సమావేశంలో తిరుపతి జేఈఓ బసంత్‌కుమార్, సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి, ఇన్చార్జి సీఈ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 9 నుంచి ‘మనగుడి’ ఇదిలా ఉండగా.. ఈనెల 9 నుంచి 15 వరకు తెలుగు రాష్ట్రాలల్లోని ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ‘డయల్ యువర్ ఈఓ’ కార్యక్రమంలో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. 9న తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్న నేపథ్యంలో మహిళలకు సౌభాగ్యం పేరిట కుంకుమ, గాజులు, కంకణాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే తిరుమలలో 124 రోజులకు సరిపడా నీటి నిల్వలున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ఏడాది జూలైలో హుండీల ద్వారా శ్రీవారికి రూ.102.88కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అదే నెలలో రూ.109.60 కోట్లు వచ్చిందని ఈఓ వెల్లడించారు. -
‘టీటీడీ చరిత్రలో ఇంత అసమర్ధుడైన ఈఓను చూడలేదు’
సాక్షి, తిరుమల : శ్రీవారి బంగారాన్ని మాయం చేయడానికే బ్యాంకు నుండి తీసుకొచ్చారని స్వామి కమలానంద భారతి మండిపడ్డారు. టీటీడీ చరిత్రలో సింఘాల్ లాంటి అసమర్ధుడైన ఈఓను ఎప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు. తిరుమల జేఈవో శ్రీనివాస రాజు హిందూ మత వ్యతిరేకి అని, అవినీతి పరుడని నిప్పులు చెరిగారు. 400 కోట్ల రూపాయల బంగారం స్కాంలో ప్రధాన పాత్రదారులైన టీటీడీ ఈఓ, జేఈఓలను వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. బంగారం స్కాంపై సీబీఐతో లేదా న్యాయమూర్తులతో కానీ విచారణ జరిపించాలన్నారు. -
నన్ను మళ్లీ విధుల్లోకి తీసుకోండి : రమణ దీక్షితులు
సాక్షి, తిరుమల : హైకోర్టు తీర్పును శిరసావహించి తనను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘల్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం టీటీడీ ఈవోకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. రెండు రోజుల క్రితమే ఈఓకు లేఖ రాశానని, స్పందించకపోవడంతో ఫోన్ చేసి మాట్లాడానని రమణ దీక్షితులు తెలిపారు. కాగా హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తనకు అందలేదని ఈవో సింఘల్ పేర్కొన్నారు. మరికాసెపట్లో తిరుచానురు ఆలయ మాజీ అర్చకుల తరపు న్యాయవాది హైకోర్టు తీర్పు కాపీని ఈవోను అందజేయనున్నారు. ఈ రోజు సాయంత్రం టీటీడీ ఈవోను రమణ దీక్షితులు కలిసే అవకాశం ఉంది. -
‘తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు’
సాక్షి, తిరుమల: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సంఘాల్ వెల్లడించారు. సెప్టెంబర్ 12 నుంచి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 9 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుపుతామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం జరిగిన టీటీడీ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గత ఉత్సవాల్లో చోటుచేసుకున్న తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. మాడ వీధుల్లో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నామనీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాల సేవలను సైతం బ్రహ్మోత్సవాల్లో వినియోగించుకుంటామని అన్నారు. ఆగస్టు 31 లోపు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని స్పష్టం చెప్పారు. కాగా,టీటీడీ ఉన్నతస్థాయి సమావేశంలో కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వాహన సేవల్లో మార్పులు.. ఉత్సవాల్లో ఇబ్బందులు తలెత్తకుండా వాహన సేవల్లో మార్పులు చేశామని అనిల్‌కుమార్ చెప్పారు. శ్రీవారి వాహన సేవలు రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతాయని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 లక్షల లడ్డూలను నిల్వ చేశామని వెల్లడించారు. శ్రీవారికి గరుడ వాహన సేవ రోజున కొండపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించబోమని అన్నారు. పిన్స్ సిస్టమ్, చైల్డ్ ట్యాగింగ్ సిస్టమ్‌ను ఈ ఏడాది కూడా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు. పార్కింగ్ కోసం ప్రత్యేక యాప్ రూపొందించామనీ, బ్రహ్మోత్సవాలలో ఈ యాప్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. -
శ్రీవారి ఆలయ మూసివేతపై మారిన ఈవో స్వరం!
సాక్షి, తిరుమల : మహా సంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని సుమారు తొమ్మిది రోజులపాటు మూసివేస్తామని ప్రకటించి.. సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న టీటీడీ బోర్డు తాజాగా స్వరాన్ని మార్చింది. మహా సంప్రోక్షణ సమయంలో గత నిబంధనలు, సంప్రదాయాలకు అనుగుణంగా భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సమావేశమై.. భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేసే విషయమై చర్చిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయమై వారంలోగా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని ఈవో చెప్పారు. మహా సంప్రోక్షణ సందర్భంగా రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు రెండు విడతలుగా శ్రీవారి దర్శనం భక్తులకు కల్పించాలని యోచిస్తున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న సమయం, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విమర్శలు, ఆగ్రహం మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామని టీటీడీ మొదట నిర్ణయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ఇటు భక్తులు, అటు హిందూ ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా భక్తులు నిరసనలు వ్యక్తం చేశారు. ఆలయాన్ని మూసివేస్తామని చెప్పడం వెనుక కుట్ర దాగుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుమానం వ్యక్తం చేశారు. మహా సంప్రోక్షణ సమయంలో సీసీ కెమెరాలను సైతం ఆపేస్తామనడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. -
ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి 50శాతం ఇవ్వండి
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్ డిప్ విధానం ద్వారా 50 శాతం, ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి మొదటి ప్రాధాన్యత కింద మరో 50శాతం టికెట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను కోరారు. తిరుమలలో ప్రతి నెల మొదటి శుక్రవారం నిర్వహించే డయిల్ యువర్ ఈవో కార్యక్రమంలో 16 మంది భక్తులు తమ సూచనలు, సలహాలు, విన్నపాలు తెలియజేశారు. ఆర్జిత సేవలు పరిమితంగా ఉన్నాయని, లక్షమందికి పైగా భక్తులు నమోదు చేసుకుంటున్నారని వారిలో కేవలం 5 వేల మందికి మాత్రమే అవకాశం లభిస్తుందని ఈవో తెలిపారు. వేసవి సెలవుల అనంతరం వృద్ధులు, దివ్యాంగులు 5ఏళ్ళలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు నెలలో 2రోజుల పాటు కల్పించే ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని తిరిగి అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జూలై 10, 24 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులు, జూలై 11, 25 తేదీల్లో 5ఏళ్ళలోపు చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులకు దర్శనభాగ్యాన్ని కల్పిస్తామన్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం, ఆగçస్టు 12 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈ తేదీల్లో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశామన్నారు. ఆన్లైన్లో 53,642 ఆర్జిత సేవా టికెట్లు విడుదల శ్రీవారి ఆర్జితసేవలకు సంబంధించి అక్టోబర్ నెల కోటాలో మొత్తం 53, 642 టికెట్లను శుక్రవారం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ విడుదల చేశారు. ఆన్లైన్ డిప్ విధానంలో 9,742 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,597, తోమాల 90, అర్చన 90, అష్టదళ పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 1,725 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్లైన్లో జనరల్ కేటగిరీలో 43,900 సేవా టికెట్లు ఉండగా వీటిలో విశేష పూజ 2,000, కళ్యాణం 9,975, ఊంజలసేవ 3,150, ఆర్జిత బ్రహ్మోత్సం 5,775, వసంతోత్సవం 11,000, సహస్రదీపాలకంరణ సేవ 12,000 టికెట్లును విడుదల చేశారు. కాగా భక్తుల సౌకర్యార్థం అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్, ఈ– దర్శన్, పోస్టాఫీస్‌లో ఈనెల 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది. -
వెయ్యికాళ్ల మండపం తిరిగి నిర్మించాలి: రోజా
సాక్షి, నగరి: తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. మండప నిర్మాణం కోసం కోర్టుని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. నగరి నియోజకవర్గంలోని టీడీడీ ఆలయాలను నాలుగేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆలయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీటీడీ ఈవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయ సమస్యలు పరిష్కరించాలని గత నాలుగేళ్లుగా అనేక విన్నపాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. కడప స్టీల్ ప్టాంట్ కోసం సీఎం రమేష్ దీక్ష చేస్తాననడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగిన టీడీపీ ఇప్పుడు కడప ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు. దోచుకున్న నిధులను దాచుకోవడానికి చంద్ర బాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. -
సీఎం పదేపదే అదే చెప్పారు: టీటీడీ ఈవో
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో నగల మాయం వ్యవహారం, అర్చకుల మధ్య విబేధాలు తదితర పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం టీటీడీ ముఖ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో భేటీ అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. వివాదాలకు సంబంధించి సీఎం ఏం చెప్పారో వివరించారు.. (చదవండి: లేని వజ్రాన్ని తెమ్మంటే ఎలా?: పుట్టా) సీఎం గట్టిగా చెప్పారు: ‘‘టీటీడీలో అన్ని పనులూ చట్టప్రకారం, ఆగమశాస్త్ర నియమాల ప్రకారం జరుగుతున్నాయి. నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని చెప్పగలుగుతున్నాం. ఇకపోతే సమావేశంలో సీఎంగారు మాకు పదేపదే ఒకే విషయాన్నిగుర్తుచేశారు. వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రతకు ఎక్కడా భంగం వాటిల్లకుండా, భక్తుల మనోభావాలు గాయపడకుండా చూసుకోవాలని చెప్పారు. అదేసమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగొద్దని ఆదేశించారు. ఆయా రోజులకు సంబంధించి స్వామివారి కైంకర్యాల వేళల్లో ఎలాంటి మార్పులు చేయలేదని మేం సీఎంకు వివరించాం’’ అని సింఘాల్ తెలిపారు. ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే ప్రదర్శిస్తాం: 1952 నుంచి శ్రీవారి ఆభరణాలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని టీటీడీ ఈవో చెప్పారు. ‘‘2011 జనవరి 20న టీటీడీ వేసిన రిటైర్డ్ జడ్జీల కమిటీ కూడా ఆభరణాలన్నీ ఉన్నాయని తేల్చింది. కానీ శ్రీకృష్ణ దేవరాయల ఆభరణాలు యేవో ఆ కమిటీ తేల్చలేకపోయింది. ప్రతి ఏడాది ఆభరణాల తనిఖీ జరుగుతూనే ఉంటుంది. ఒక్క మిల్లీ గ్రాము అటూ ఇటైనా రికార్డుల్లోకి వస్తాయి. శ్రీవారి ఆభరణాల జాబితా ఇప్పటికే ఇచ్చాం. ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రచారంలో ఉన్నట్లు గులాబీ వజ్రం ఏదీ లేదు. రూబీ మాత్రమే ఉంది. అదికూడా భక్తులు విసిరిన నాణేలు తగిలి పగిలిపోయింది’’ అని అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. కాగా, సీఎంతో భేటీకి ముందు ఈవో మీడియాకు ఏం చెప్పారో, సమావేశం తర్వాత కూడా అదే చెప్పడం గమనార్హం. తద్వారా శ్రీవారి నగల మాయంపై వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు ఎలాంటి చర్యలుగానీ, విచారణగానీ చేపట్టబోవడంలేదని తెలుస్తున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. -
టీటీడీపై కేంద్రం పెత్తనం.. అంతలోనే వెనక్కి
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తిరుమల్లోని ఇతర ఆలయాలను పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే తిరుమలలోని పలు ఆలయాలు, వాటి చరిత్రను కేంద్ర పురవాస్తు శాఖ పరిశీలించింది. ఆలయాలు, నిర్మాణాలు పూర్వకాలంలో నిర్మాణమైనట్లుగా పురావస్తు శాఖ వెల్లడించింది. వీటితో పాటు ఇతర ఆలయాలు, భవనాల వివరాలు అందించాలని టీటీడీ ఈవోకు కేంద్ర పురవాస్తు శాఖ లేఖ రాసింది. దీంతో టీటీడీ రాష్ట్ర పురవాస్తు శాఖకు వివరాలు అందించినట్లు సమాచారం. తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర పురావస్తు శాఖ వెల్లడించింది. పురాతన కట్టడాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని, భక్తులు ఇచ్చిన విలువైన కానుకలు సరిగ్గా భద్రపరచట్లేదని, పూర్వకాలంలో రాజులు ఇచ్చిన ఆభరణాలు భద్రతకు నోచుకోవట్లేదనే ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకొన్నట్లు కేంద్ర పురావస్తు శాఖ ప్రకటించింది. దీంతో తిరుమలలోని పురాతన కట్టడాలు అన్నింటిని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకొనే అవకాశం ఉంది. అయితే టీటీడీ నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందలేదని, అందిన వెంటనే అధికారులు తిరుమలలో సందర్శించే అవకాశం ఉన్నట్లు పురావస్తు అధికార వర్గాలు వెల్లడించాయి. పరిశీలన అనంతరం పలు కట్టడాలను ఆధీనంలోకి తీసుకొనే అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవుడిపై కేంద్రం పెత్తనం ఏంటని నిలదీస్తున్నారు. అదంతా అబద్ధం : ఎంపీ జీవీఎల్ నరసింహరావు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందన్న ప్రచారం అబద్ధమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఈ విషయంపై కేంద్ర సాంస్కృతిక శాఖా అధికారులతో మాట్లాడామని, అటువంటి అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. దేవస్థానం నుంచి కేంద్రం జోక్యం కోరితే పరిశీలిస్తారని తెలిపారు. కేవలం రాజకీయ దురుద్ధేశంతో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ విమర్శించారు. అంతలోనే వెనక్కి తగ్గిన కేంద్రం : తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తిరుమలలోని ఆలయాలను ఆధీనంలోకి తీసుకోవటంపై కేంద్రం వెనక్కి తగ్గింది. పురావస్తు శాఖ ఢిల్లీ నుండి విజయవాడ కార్యాలయానికి పంపిన లేఖను కేంద్ర పురావస్తు శాఖ వెనక్కు తీసుకోనుందని, ఈ మేరకు తమకు సమాచారం వచ్చినట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. సమాచారం లోపం కారణంగానే ఈవోకు లేఖ పంపామంటూ పురావస్తు శాఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. -
హిందూయేతర ఉద్యోగులను తొలగించొద్దు
సాక్షి, హైదరాబాద్: తిరుమల, తిరుపతి దేవస్థానాలతో పాటు, ఆ దేవస్థానాల ఆర్థిక సాయంతో నడిచే దేవాలయాలు, ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు తొలగించవద్దని హైకోర్టు బుధవారం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)ను ఆదేశించింది. అయితే ఈవో జారీ చేసిన షోకాజ్ నోటీసులకు మాత్రం సమాధానం ఇవ్వాలని హిందూయేతర ఉద్యోగులకు స్పష్టం చేసింది. ఈవో జారీ చేసిన షోకాజ్ నోటీసుల చట్టబద్ధతపై తరువాత లోతుగా విచారణ జరుపుతామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోలను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. -
అన్యమత ఉద్యోగులకు టీటీడీ నోటీసులు!
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ)లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా సంస్థలో పనిచేస్తున్న 44 మంది అన్యమతస్థులకు ఒకటి, రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికార వర్గాలు వెల్లడించాయి. సంస్థలో ఉద్యోగులుగా అన్యమతస్తులను కొనసాగించాలా, లేదా అనే అంశంపై ప్రభుత్వంతో చర్చించిన పిదప తుది నిర్ణయం తీసుకోనున్నారు. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ ఈవో స్నేహలత టీటీడీ వాహనంలో చర్చికి వెళ్లడంతో అన్యమతస్థుల వివాదం మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వాహన వినియోగం అమెను ఈవో వివరణ కోరారు. కాగా, 1989 నుంచి 2007 వరకు టీటీడీలో 37మంది అన్యమతస్తులు ఉద్యోగాలు పొందారు. 2007 లో అప్పటి టీటీడీ పాలకమండలి అన్యమతస్థుల ఉద్యోగాలపై తీర్మానం చేసింది. తీర్మానం చేసిన తర్వాత కూడా ఏడుగురు ఇతర మతస్థులు విధుల్లో చేరారు. కాగా, ఆలయాలు, ఇతర ముఖ్య విభాగాలకు అన్యమతస్థులను దూరంగా ఉంచాలని పీఠాధిపతులు డిమాండ్ చేస్తున్నారు. -
తిరుమల భద్రతలో రాజీపడొద్దు
► అత్యాధునిక పరికరాలు తెప్పించుకోండి ► టీటీడీ భద్రతాధికారులతో ఈఓ సింఘాల్ ఆదేశం తిరుపతి అర్బన్ : తిరుమల పుణ్యక్షేత్రం తో పాటు యాత్రికులకు భద్రత కల్పించడంలో రాజీ పడొద్దని టీటీడీ భద్రతాధికారులకు ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ సూచించారు. వివిధ భద్రతాపరమైన అంశాలపై గురువారం ఆయన తిరుపతి పరిపాలనా భవనంలో సీవీఎస్ఓ రవి కృష్ణ, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈఓ మాట్లాడుతూ భక్తుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తిరుపతి, తిరుమలలో ఉన్నతమైన భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. శ్రీవారి ఆలయం, ఘాట్ రోడ్లు, నడక మార్గాలు, తిరుపతిలోని టీటీడీ సంస్థల్లో భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భద్రతా పరికరాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా అలిపిరి టోల్గేట్ చెక్ పాయింట్, అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ కలిగిన అధునాతన సీసీ కెమెరాలు, టీవీలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న సీసీ టీవీల్లో అప్‌గ్రేడ్ చేయాల్సినవి, పూర్తిగా మార్పు చేయాల్సిన వాటి వివరాలను రూపొం దించుకోవాలని సూచించారు. భద్రతా పరికరా ల నాణ్యతను పరిశీలించేందుకు నోయిడా నుంచి భద్రతా నిపుణులను రప్పించాలన్నారు. వాటికి అనుసంధానించే సాంకేతిక పరిజ్ఞానం అంశంలో హెచ్‌సీఎల్ సంస్థ ప్రతినిధుల సహకారం తీసుకోవాలని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లోపు సీసీ టీవీల ఏర్పాటు తిరుమలలో అధునాతన సీసీ టీవీలు బ్రహ్మోత్సవాల్లోపు ఏర్పాటు చేయాలని ఈఓ సింఘాల్ ఆదేశించారు. సీసీ టీవీలు, ఇతర భద్రతా పరికరాలను సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలన్నారు. తద్వారా నిరంతరం తిరుమల భద్రతను పర్యవేక్షించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1లో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్(డీఎఫ్ఎండీ) పరికరాలు, అత్యాధునిక లగేజీ స్కానర్లు త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. భద్రతా పరికరాల వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాస రాజు, హెచ్‌సీఎల్ మేనేజర్ సాయికృష్ణ, పలు వురు భద్రతాధికారులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో 44,896 ఆర్జిత సేవా టికెట్లు
టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడి సాక్షి, తిరుమల: సెప్టెంబర్ నెలకు సంబంధించి 44,896 సేవాటికెట్ల కోటాను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలోని అన్న మయ్య భవనంలో గురువారం జేఈవో కేఎస్.శ్రీనివాస రాజుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతినెలా ఆర్జితసేవా టికెట్లు విడుదలైన నిమిషాల వ్యవధిలోనే అమ్ము డవుతున్నాయని, ఇంటర్నెట్ వేగంగా లేక రిజర్వు చేసు కోలేక పోతున్నామని భక్తుల నుంచి సూచనలు రావడంతో సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశామన్నారు. కొత్త విధానంలో సుప్రభాతం 6,985, తోమాల 90, అర్చన 90, అష్టద ళపాద పద్మారాధన 120, విశేష పూజ 1,125, నిజపాద దర్శనం 2,300 టికెట్లు కలసి మొత్తం 10,710 సేవాటికెట్లను లక్కీడిప్ విధానం ద్వారా కేటాయిస్తామన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 23వ తేదీ వరకు భక్తులు తమకు అవసరమైన టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో డిప్ తీస్తా మని, టికెట్లు పొందిన భక్తులకు ఎస్ఎంఎస్ లేదా ఈ–మొ యిల్లో సమాచారాన్ని తెలియజేస్తామని వివరించారు. ఒకసారి సేవా టికెట్ పొందిన భక్తుడు తిరిగి 180 రోజుల తర్వాతే బుక్ చేసుకునే వీలవుతుందన్నారు. ఇక శ్రీవారి కల్యాణోత్సవం 8,250, ఊంజల్ సేవ 2,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 4,730, వసంతోత్స వం 9,030, సహస్ర దీపాలంకార సేవ 9,976 టికెట్లు.. మొత్తం 34,186 సేవా టికెట్లను పాత విధానంలో ఇంటె ర్నెట్ ద్వారా రిజర్వు చేసుకోవచ్చన్నారు. జూలై 1 నుంచి గదులు ముందస్తుగా ఖాళీ చేస్తే కొంత నగదు తిరిగి చెల్లిస్తామన్నారు. ఆనంద నిలయుడి దర్శనానికి ఆధార్ స్వామివారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులకు ఆధార్ అనుసంధానం ద్వారా పారదర్శకమైన సేవలు అందించేం దుకు టీటీడీ సమాయత్తమవుతోంది. టీటీడీ తాజా లెక్కల ప్రకారం సగటున నిత్యం 72,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీనికి పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఓటరుకార్డు, రేషన్‌కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇలా దాదాపు 9 రకాలైన గుర్తింపు కార్డులను టీటీడీ అనుమతిస్తోంది. ఆధార్ మినహా ఇతర కార్డుల వల్ల భక్తుడి సమగ్ర వివరాలు తెలుసుకోవటం కష్టమవుతోంది. ఈ నేప థ్యంలో అన్నిరకాల దర్శనాలు, సేవలకు ఆధార్ అనుసం ధానం చేయటంతో తిరుమలకు ఎవరు ఎప్పుడు వచ్చారు? ఎన్నిసార్లు దర్శించుకున్నారు? పొందిన సౌకర్యాలు, రోజులో ఎంతమంది వచ్చారు? తదితర వివరాలతో సమగ్ర వివరాలు సేకరించవచ్చని టీటీడీ భావిస్తోంది. బుకింగ్ రద్దు చేసుకుంటే డబ్బు వాపస్ తిరుమలలో నేరుగా నగదు చెల్లించి గది పొందిన భక్తుల తోపాటు ఆన్లైన్లో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నవారు గదుల బుకింగ్ రద్దు చేసుకున్నా, నిర్ణీత సమయం కంటే ముందుగానే ఖాళీ చేసినా ఆ మేరకు నగదు తిరిగి భక్తుల ఖాతాకు బదిలీ చేసే విధానం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆధార్‌తో దర్శనానికి ‘రేషన్’ తిరుమల, తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెలా ఐదువేల మందికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. డిమాండ్ అధికంగా ఉండటంతో ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేశారు. దీంతో ఒకసారి వచ్చినవారు మూడు నెలల తర్వాతే తిరిగి శ్రీవారి దర్శనం పొందే అవకాశం ఉంది. ప్రతినెలా మొదటి శుక్రవారం ఆన్లైన్లో విడుదల చేసే టికెట్ల కోటాకూ దీన్ని అమలు చేస్తున్నారు. ఇదే విధానాన్ని భవిష్యత్‌లో అన్ని రకాల దర్శనాలకు అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. -
వెంకన్న ఐటీకీ వన్నా క్రై వైరస్
తిరుమల : ప్రపంచాన్ని వణికిస్తున్నవాన్నక్రై వైరస్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తాకింది. సుమారు 30 కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడ్డాయి. భక్తులకు సమాచారం అందించే వ్యవస్థపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేదు. కంప్యూటర్లలోని కేవలం పరిపాలనా పరమైన కొన్ని అంశాలకు వైరస్ సోకడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సాఫ్ట్‌వేర్‌ను టీటీడీ వినియోగిస్తున్నప్పటికీ.. కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియకుండా పైరేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ ఐటీ విభాగం అధికారులు వైరస్ సోకిన కంప్యూటర్లను తొలగించారు. ఇతర వ్యవస్థకు ఇబ్బందుల్లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వానక్రై వైరస్ వల్ల 30 కంప్యూటర్లకు వైరస్ సోకిన మాట వస్తావమేనని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం మీడియాతో చెప్పారు. దీనితో పాలనాపరమైన పనులకు కొంత విఘాతం కలిగిందని, ఐటీ అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. -
పవన్‌కు మోహన్‌బాబు పంచ్!
ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా నియమించడంపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై ప్రముఖ నటుడు మోహన్ బాబు స్పందించారు. పవన్‌కు ఆయన తన మార్కు పంచ్ వేశారు. టీటీడీ ఈఓగా సింఘాల్ నియామకానికి ఆయన మద్దతు తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ వెంకన్న బాబు దేవుడని, అలాంటి దేవుడిని ఒక ప్రాంతానికో, ఒక భాషకో మాత్రమే పరిమితం చేయడాన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. తెలుగు భాష రాకపోవడం ఒక్కటే పెద్ద సమస్య అని తాను అనుకోవట్లేదని మోహన్ బాబు చెప్పారు. ఉత్తరాది ఐఏఎస్ అధికారినిని టీటీడీ ఈవోగా నియమించడంపై తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని పవన్ ఇటీవల ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఉత్తరాది ఐఏఎస్ అధికారులకు తాను వ్యతిరేకం కాదని అన్నారు. అయితే అమర్నాథ్, వారణాసి, మధుర లాంటి పవిత్ర ఆలయాల్లో దక్షిణాది అధికారులకు ఎందుకు స్థానం కల్పించడం లేదని పవన్ ప్రశ్నించారు. దానిపైనే ఇప్పుడు మోహన్ బాబు స్పందించారు. -
‘పవన్‌కు తప్పుడు సలహాలు ఇస్తున్నారు’
అమరావతి: టీటీడీ ఈవో నియామకంపై జనసేన అధ్యక్షుడు, హీరో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ తప్పుబట్టారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులకు కులాలు, మతాలు ఉండవన్నారు. పవన్ కల్యాణ్‌కు ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. మాట్లాడేముందు పవన్ స్టడీ చేయాలంటూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై పవన్ పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ నేత వర్ల రామయ్య కూడా పవన్ ట్విట్‌పై తీవ్రస్థాయిలో స్పందించారు. ఉత్తరాది, దక్షిణాది అని విడదీయడం మంచి పద్ధతి కాదన్నారు. మీడియాలో ప్రచారం కోసమే మాట్లాడటం సరికాదని, ఉత్తరాది అధికారులను ఈవోగా నియమించకూడదని, దక్షిణాది అధికారులకే ఆ పదవి అని ఏ చట్టంలోనూ రాసిలేదని అన్నారు. మేధావి అయిన పవన్ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని వర్ల రామయ్య అన్నారు. మరోవైపు ఇదే అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...భక్తి భావం ఉన్న ఎవరైనా స్వామివారికి సేవ చెయ్యొచ్చని, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరికాదని అన్నారు. సేవ చేసే ఏ వ్యక్తి అయినా ఈవోగా పని చేసే అర్హత ఉంటుందన్నారు. కాగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఈవో నియామకంపై టీడీపీతో పాటు, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలంటూ ట్విట్ చేసిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు సమాధానం చెప్పాలి: పవన్ కల్యాణ్
హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీటీడీ ఈవో పదవిపై సంచలన ట్విట్ చేశారు. ఉత్తరాది ఐఏఎస్ అధికారినిని టీటీడీ ఈవోగా నియమించడంపై తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఉత్తరాది ఐఏఎస్ అధికారులకు తాను వ్యతిరేకం కాదని అన్నారు. అయితే అమర్నాథ్, వారణాసి, మధుర లాంటి పవిత్ర ఆలయాల్లో దక్షిణాది అధికారులకు ఎందుకు స్థానం కల్పించడం లేదని పవన్ సూటిగా ప్రశ్నించారు. కాగా ఈవో నియామకంపై రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు తెలుగువారు తమ సత్తా చాటారని చెబుతున్న చంద్రబాబు మరోవైపు రాష్ట్రానికి చెందిన అధికారులను పక్కనపెట్టి ఉత్తరాది అధికారిని టీటీడీ ఈవోగా ఎలా నియమిస్తారంటూ రాష్ట్రానికి చెందిన అధికారులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్‌కుమార్ సింఘాల్ నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లనున్నట్లు విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్న విషయం తెలిసిందే. ‘పవన్ కల్యాణ్ మౌనం ఆశ్చర్యమేస్తోంది’ టీటీడీ ఈవో నియామకంపై కోర్టుకెళ్తా pic.twitter.com/9ohFTEuF3p — Pawan Kalyan (@PawanKalyan) 8 May 2017 -
‘పవన్ కల్యాణ్ మౌనం ఆశ్చర్యమేసింది’
టీటీడీ ఈవో పదవి విషయంలో జనసేన నేత, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ నోరు విప్పకపోవడంపై ఏపీకి చెందిన ఓ ఐఏఎస్ స్థాయి అధికారి విస్మయం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉత్తరాదికి చెందిన ఓ ఐఏఎస్ అధికారిని నియమించడంపై దక్షిణాది రాష్ట్రాల ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన అధికారులను కాదని, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి ఈవో పదవి కట్టబెట్టడంపై ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే విషయంపై పవన్ ఎందుకు స్పందించడం లేదని రాష్ట్రానికి చెందిన ఓ అధికారి ప్రశ్నిస్తున్నారు. గతంలో చాలా విషయాల్లో కేంద్రంపై ప్రశ్నలు వర్షం కురిపించిన పవన్ ..ఈ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అంతేకాకుండా ప్రశ్నించేందుకే జనసేన పుట్టిందన్న ఆయన ఈ విషయంలో మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సవతి ప్రేమ కురిపిస్తోందని గతంలో పవన్ చేసిన విమర్శలను ఆ అధికారి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటిది ఏపీ సర్కార్... సొంత రాష్ట్రానికి చెందిన అధికారులను పక్కనపెట్టి ఉత్తరాది అధికారికి ఈవో పదవి ఎలా ఇస్తారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించరా అని అన్నారు. దీనిపై స్పందించిన పవన్... ప్రభుత్వంతో పాటు, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
భక్తులకే తొలి ప్రాధాన్యం
► టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ బాధ్యతల స్వీకరణ ► సామాన్య భక్తుడిగానే తిరుమలతో అనుబంధమెక్కువ ► శ్రీవారి దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో శ్రీవారి సేవా భాగ్యం ► ఉత్సవమూర్తి ఊరేగింపులో తొలిరోజే సింఘాల్ మార్క్ సాక్షి, తిరుమల: సామాన్య భక్తుడిగానే తరచూ శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే సంప్రదాయముందని, ఆవిధంగా 1994 నుంచి తనకు తిరుమలతో అనుబంధముందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. శనివారం ఆయన తిరుమల ఆలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తాను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నపుడు తరచూ తిరుమలను సందర్శించే అవకాశం కలిగిందన్నారు. శ్రీవారి దయ, తన తల్లిదండ్రుల ఆశీస్సులతో టీటీడీ ఈవోగా సేవలందించే భాగ్యం కలగడం ఆనందంగా ఉందన్నారు. కాలిబాట, రూ.300 టికెట్లు, ఇతర సేవల్లో పాల్గొనే భక్తులందరికీ మెరుగైన దర్శనం కల్పించే ఏర్పాట్లు చేపడతానన్నారు. ఇప్పటికే అలాంటి చర్యలు అమలవుతున్నాయనీ, పెరుగుతున్న భక్తుల రద్దీని బట్టి మార్పులు చేస్తానన్నారు. మానవ సేవే, మాధవసేవగా విధులు కొనసాగిస్తానని చెప్పారు. ఇందులో భాగంగా టీటీడీ ధర్మకర్తల మండలి, అధికారులు, సిబ్బందిని కలుపుకుని మెరుగైన సేవలు అందిస్తానన్నారు. తొలిరోజే ఈవో సింఘాల్ మార్క్ అనిల్‌కుమార్ సింగాల్ టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే తన మార్కు చూపించారు. శనివారం పద్మావతి పరిణయోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహన తిరుగు ప్రయాణంలో కల్యాణవేదికపై ఉండే భక్తులందరికీ ఉత్సవమూర్తులు కనిపించేలా అటు ఇటు తిప్పుతూ చూపించాలని ఆదేశించారు. ఆమేరకు పేష్కార్ రమేష్, డాలర్ శేషాద్రి, గురురాజా వాహనాన్ని అటు ఇటు తిప్పుతూ భక్తులు అందరూ స్వామి అమ్మవార్లను దర్శించుకునే వెసులుబాటు కల్పించారు. -
తెలుగువారు లేరనా?!
తిరుమల తిరుపతి దేవస్థానాల వ్యవస్థ ఆవిర్భవించి దాదాపు శతాబ్దం గడిచింది. చరిత్రాత్మకమైన ఆ ఆలయాల పరిపాలనా వ్యవహారాలు ఇంతకాలం ఒక సంప్రదాయం మేరకు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హఠాత్తుగా ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. ఉత్తర భారతదేశానికి చెందిన ఐఏఎస్ అధికారిని తొలిసారి టీటీడీ కార్యనిర్వహణాధికారి పదవికి ఎంపిక చేసింది. తెలుగు ప్రాంతానికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమించే సంప్రదాయమే ఇంతవరకు టీటీడీలో ఉన్నది. ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు తప్పించవలసిన అవసరం ఏమీ కనిపించదు. అలాగే ఇలాంటి నియామకం చేపట్టడానికి దారితీసిన ప్రత్యేక పరిస్థితులు ఏమీ కానరావు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రశ్నార్థకంగా మారింది. ఒకింత వివాదాస్పదంగా తయారైంది కూడా. తెలుగు వారైన, సమర్థులైన ఐఏఎస్ అధికారులు, దక్షిణాదివారు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమల ఆలయ పాలన చరిత్ర, పాలన బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తించారో, ఆ వ్యక్తులు, సంస్థలు ఎలాంటివో ఒక్కసారి మననం చేసుకోవడం అవసరం. దానితో కాలక్రమంలో టీటీడీ పాలనా వ్యవస్థలో వచ్చిన మార్పులను కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాసం ఉద్దేశం అదే. తిరుమల ఆలయ చరిత్ర తిరుమల వేంకటేశుని ఆలయ చరిత్ర పురాతనమైనది. ప్రాచీన తమిళ సాహి త్యంలో ఈ ఆలయ ప్రస్తావన విరివిగా కనిపిస్తుంది. తిరుమలను ‘వడ వెంగడము’ అని పిలిచేవారు. అంటే–ఉత్తర దిక్కున ఉన్న పర్వతం. ‘తోల్కప్పీయం’ అనే ప్రాచీన తమిళ వ్యాకరణ గ్రంథంలో తిరుమల గిరులను తమిళదేశానికి ఉత్తర సరిహద్దుగా పేర్కొన్నారు. సంగమ సాహిత్యంలో కూడా తిరుమల ఆలయ ప్రస్తావన ఉంది. ఇక తిరుమల ఆలయ ప్రాచీనతను శాసనాధారాలు కూడా ఆవిష్కరిస్తున్నాయి. పల్ల వుల శాసనాలలో తిరుమలేశుని ఆలయం గురించి వివరణ ఉంటుంది. తరువాత చోళులు, పాండ్యులు, యాదవ వంశీయులు తిరుమల ఆల యాన్ని సంరక్షించడంతో పాటు, అభివృద్ధి చేసేందుకు కూడా పాటు పడ్డారు. వైష్ణవ మతాన్ని ఆదరించి పోషించిన విజయనగర సామ్రాజ్య ఏలికలు తమ కాలంలో తిరుమల ఆలయానికి ఎంతో సేవ చేశారు. గుడిలో దీపాలు వెలిగించడం కోసం పల్లవులు, చోళులు బంగారం, భూములు సమర్పించుకున్నట్టు వారి శాసనాలు ఘోషిస్తున్నాయి. ధూప దీపాలతో పాటు నైవేద్యాలు, అన్న సంతర్పణకు నిధులు ఏర్పాటు చేసిన వివరాలు కూడా వారి శాసనాలలో కనిపిస్తుంది. ఆలయ నిర్వహణ కోసం తిరు చానూరు శ్రీవైష్ణవ బ్రాహ్మణ సభను ఏర్పాటు చేసినది పల్లవుల కాలంలోనే. ఇలాంటి విధులను నిర్వహించడం కోసం స్థానిక ప్రముఖులతో ‘స్థానత్తార్’ అనే ఆలయ సంఘాన్ని ఏర్పాటు చేయించినవారు కూడా పల్లవులే. అసలు స్థానత్తార్ బాధ్యతే దేవళాల సక్రమ నిర్వహణ. చోళులు కూడా ఈ సంప్రదాయాన్నే కొన సాగించారన్న సంగతిని విస్మరించలేం. కానీ చోళుల కాలంలో ఆలయ నిర్వహ ణలో లోపాలు తలెత్తినట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీనితో ఈ అంశాన్ని రాజ్యాధి కారులు విచారించి, దీపారాధన సక్రమంగా జరగడానికి చర్యలు చేపట్టారు. ఈ విషయాలు కూడా శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. విజయనగర పాలకుల కాలంలో ఆలయాల నిర్వహణలో స్థానత్తార్లకు ప్రాధాన్యం తగ్గింది. వైష్ణవ మతాన్ని అవలంబించి, పోషించిన వారు కావడం చేత విజయనగర రాజుల కాలంలో స్థానిక శ్రీవైష్ణవులకు ఆలయ నిర్వహణ బాధ్యతను స్వీకరించే అవ కాశం వచ్చింది. తమకు సాయంగా ఉంటూ ఆలయ ఆదాయ వ్యయాలను చూసేందుకు ఈ శ్రీవైష్ణవులే కొందరు అధికారులను నియమించుకున్నారు. విజయనగర పాలకులలో ప్రముఖుడు సాళ్వ నరసింహరాయలి కాలంలోనే, ఆయన సహాయ సహకారాలతోనే కందాడై రామానుజ అయ్యంగార్ ఆలయ పరిపాలన, సేవలు, ఇతర కార్యక్రమాల నిర్వహణలో సమూలమైన మార్పులు తీసుకుని వచ్చారు. ఇక శ్రీకృష్ణదేవరాయలు తిరుమల ఆలయం పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు చూపారు. ఏడుసార్లు శ్రీవేంకటేశుని దర్శించుకుని, భూరి విరా ళాలు, కానుకలు సమర్పించుకున్నాడు. ఆ తరువాత అచ్యుతరాయలు, సదా శివరాయులు కూడా ఆలయానికి విశేషమైన సేవలు అందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే విజయనగర సామ్రాజ్య వైభవ దశలో ఆలయ నిర్వహణ మొత్తం శ్రీవైష్ణవుల చేతిలోనే కొనసాగింది. మహమ్మదీయుల చేతిలో పాలన విజయనగర సామ్రాజ్య పతనం తరువాత దక్షిణ భారతంలో పెనుమార్పులు సంభవించాయి. తిరుమల ఆలయ పరిపాలన కొంతకాలం గోల్కొండ నవాబుల పర్యవేక్షణలో ఉండేది. వారి మంత్రులు అక్కన్న, మాదన్న ఆలయాభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆలయ నిర్వాహకులుగా స్థానాల వారిని నియమించినది కూడా అక్కన్న, మాదన్నలే. ఆపై తిరుమల ఆలయం నిర్వహణ ఆర్కాట్ నవాబు అధీనంలోకి వెళ్లింది. ఆర్కాట్ నవాబు కాలంలో ఆలయ నిర్వహణ కోసం శ్రీనివాసాచారి, వాసుదేవాచారి అనే అమల్దారులను ఏర్పాటు చేశారు. ఏటా నవాబుకు నిర్ణీత పైకం చెల్లించే పద్ధతిన ఈ నియామకాలు జరిగాయి. ఆలయ నిర్వహణలో హిందూ రాజుల కాలానికీ, మహ్మదీయుల కాలానికీ మధ్య ఒక ముఖ్య వైరుధ్యం కనిపిస్తుంది. ఆలయ సక్రమ నిర్వహణకీ, అభివృద్ధికీ హిందూరాజులు ప్రాధాన్యం ఇచ్చారు. మహ్మదీయ పాలకులు ఆలయాన్ని ఆదా యాన్ని సమకూర్చే ప్రధాన వనరుగా గుర్తించారు. అందుకు తగ్గట్టే ఆలయ వ్యవ హారాలను నిర్వహించారు కూడా. ఎవరు ఎక్కువ ధనం నవాబుకు సమకూర్చ గలరో వారి చేతికే ఆలయ నిర్వహణ అప్పగించారు. ఈస్టిండియా కంపెనీ పాలన కర్ణాటక యుద్ధాలలో చేసిన సాయానికి గాను ఆర్కాట్ నవాబు మహమ్మదలీ తిరుమల ఆలయ ఆదాయాన్ని ఈస్టిండియా కంపెనీకి దఖలు పరిచాడు. ఆ విధంగా 1801లో ఆలయ ప్రత్యక్ష పాలన ఈస్టిండియా కంపెనీ వశమైంది. అప్పటి నుంచి మళ్లీ 1843లో హాథీరాంజీ మఠానికి అప్పగించే వరకు కంపెనీయే ఆలయ నిర్వహణను చూసింది. ఉత్తర ఆర్కాట్ కలెక్టర్ పర్యవేక్షణలో బ్రూస్‌కోడ్ అనే విధివిధానాలను అనుసరించి పరిపాలన సాగింది. అప్పుడు ఆలయ పాల నలో కలెక్టర్‌కు సాయపడిన వాడే పారుపత్తిదారు. ఈనాటి కార్యనిర్వహణాధి కారి పదవికి బీజం పారుపత్తిదారు విధుల నుంచే పడింది. నిజానికి ఈస్టిం డియా కంపెనీ ఆలయ పాలనను సమర్థంగానే నిర్వహించింది. ఆలయ ఆచార సంప్రదాయాలకనుగుణంగా పాలన నిర్వహించడానికీ, ఆ సంప్రదాయాలు ఎలాంటివో తెలుసుకునేందుకూ ఒక విధానం అనుసరించారు. ఆలయ పాల నలో అనుభవం ఉన్న వారిని కొన్ని ప్రశ్నలు వేసి, వారి జవాబులనే విధానాలుగా స్థిరీకరించారు. దీనినే ‘సవాల్ జవాబ్ పట్టీ’ అంటారు. ఈనాటికీ తిరుమల అంశంలో ఏ వివాదానికైనా న్యాయస్థానాలు కూడా ఈ సవాల్ జవాబ్ పట్టీని ప్రామాణికంగా స్వీకరిస్తున్నాయి. అదే విధంగా ఆలయంలో వివిధ కార్యక్ర మాలు నిర్వహించే వారి వివరాలతో కైంకర్య పట్టీ రూపొందించారు. పై మాయిష్ అనే పత్రంæ ద్వారా అన్ని విగ్రహాల వివరాలను రూపొందించారు. దిట్టం పుస్తకం ద్వారా ప్రసాదాల పరిణామాలను బట్టి దానికి కావలసిన సరు కుల ముడి పదార్థాల పరిణామాలు స్థిరీకరించడం జరిగింది. ఈ విధంగా ఈస్టిం డియా కంపెనీ తిరుమల ఆలయంలో ప్రథమంగా ఒక వ్యవస్థీకృత నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టి, పాలనను నిర్వహించారు. హాథీరాంజీ మఠం కేంద్రంగా... కానీ కంపెనీ ప్రత్యక్షంగా ఆలయాన్ని నిర్వహించడానికి ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్లు అభ్యంతరం తెలిపారు. ఫలితంగానే 1843 నుంచి ఆలయ నిర్వహణ హాథీరాంజీ మఠం మహంతులకు అప్పగించారు. అప్పటి నుంచి 1933 వరకు ఆరుతరాల మహంతుల విచారణకర్తలుగా వ్యవహరించారు. వీరి నిర్వహణ కాలంలో చాలా కోర్టు కేసులు నడిచాయి. ఒక మహంతు హత్యకు గురయ్యాడు. సేవాదాస్ అను మహంతుకు బంగారు నాణాల దుర్వినియోగం కేసులో శిక్ష పడింది. మహంతుల కాలంలో పరిపాలన సరిగా లేనందున ప్రీవి కౌన్సిల్ ఒక స్కీంను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం జిల్లా కోర్టును ఆలయ నిర్వహణలో భాగస్వామిని చేశారు. ఆలయానికి ఒక కోశాధికారిని జిల్లా కోర్టు నియమిస్తుంది. అన్ని ఆదాయ వ్యయ వివరాలు ఆయనే చూస్తారు. విచా రణకర్త ప్రతి సంవత్సరం జిల్లా కోర్టుకు ఆదాయ వ్యయ వివరణతో కూడిన బడ్జెట్ సమర్పించాలి. ప్రధానంగా ఈ స్కీమ్‌లో మిగులు ధనం ఆలయ అభి వృద్ధికే వినియోగించాలని నిర్దేశించారు. ఈ విధంగా విచారణకర్తల అధీనంలో ఆలయ నిర్వహణ 1933 వరకు జరిగింది. కార్యనిర్వహణాధికారి పదవి 1932 సంవత్సరంలో మద్రాస్ ప్రభుత్వం టీటీడీ చట్టాన్ని రూపొందించి ఏడు గురు సభ్యుల మండలికి తిరుమల నిర్వహణ బాధ్యతను అప్పగించింది. ఒక కమిషనర్‌ను ఆలయ నిర్వహణ కోసం నియమించారు. ఈ చట్టం స్థానంలో 1951లో మరో చట్టం వచ్చింది. 1951నాటి చట్టంలో ప్రప్రథమంగా కార్య నిర్వహణాధికారి పదవిని సృష్టించారు. 1965లో ప్రథమ ఐఏఎస్ ఆఫీసరు ఉమాపతి కార్యనిర్వహణాధికారి బాధ్యతలు చేపట్టేదాకా ఎనిమిది మంది 1933 చట్టం క్రింద కమిషనర్లుగా, 1951 చట్టం తరువాత కార్య నిర్వహణాధికారు లుగా బాధ్యతలు నిర్వహించారు. వీరిలో ఏడుగురు తెలుగువారు. రఘునాథ మొదలియారు 1936–39 వరకు కమిషనరు బాధ్యతలను నిర్వహించారు. వీరిలో సుదీర్ఘకాలం–1949 నుంచి 1964 వరకు సి. అన్నారావు మొదట కమిష నరుగా, ఆపై కార్య నిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గాడిలో పెట్టిన సమర్థవంతుడైన అధికారిగా వీరికి పేరు న్నది. ఆ పై కాలంలో టీటీడీ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఉత్తర భారత ఐఏఎస్ పట్ల అభ్యంతరం ఎందుకంటే... తిరుమల, శబరిమలై, ఉడిపి సహా ఎన్నో మహా పుణ్యక్షేత్రాలు మనకు ఉన్నాయి. అందులో మొత్తం భారతదేశంలో శ్రీవేంకటేశుని తిరుమల దేవస్థానం తలమాని కమైనది. ఇక్కడ ఆచరిస్తున్న ఆగమ సంప్రదాయంలో 21 కులాలకు సంబంధం ఉంది. ఇవన్నీ అర్థం చేసుకోవడం తేలిక కాబట్టే ఇంతకాలం స్వరాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిని కార్యనిర్వహణాధికారిగా నియమించడం జరిగింది. ఇది సహేతుకమైన సంప్రదాయం. ఈ నేపథ్యం ఉన్న ఆలయంలో ఉత్తర భారత దేశా నికి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని కార్యనిర్వహణాధికారిగా నియమించారు. ఇది జీర్ణించుకోలేని నిర్ణయమే. అయితే ఒక విషయం అర్థం చేసుకోవడం అత్యవసరం. ఇక్కడ ఉత్తర భారతదేశ అధికారి నియామకం పట్ల అభ్యంతరం అంటే, అది వ్యక్తుల పట్ల వ్యతిరేకత కాదు. భౌగోళికమైనది అంతకంటే కాదు. ఇది సంప్రదాయాల మధ్య సంఘర్షణకు, ముఖ్యంగా ఆగమ సంప్రదాయాలకు భాష్యం చెప్పుకోవడం దగ్గర, ఆచరింపచేయడం దగ్గర సంఘర్షణ చెలరేగే అవకాశం ఉన్నదని చెప్పడానికే. దీనితో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసమే. ఆగమ సంప్రదాయం, దాని పరమార్థాలు, లోతుపాతులు ఔత్తరాహులకు ఎంతవరకు అవగతమో తెలియదు. ఆగమ పండితులు ఇచ్చే వివరణకు ఉత్తరభారతీయులు ఎంతవరకు ఆమోదిస్తారో కూడా తెలియదు. ఉత్తర భారత దేశం సేవాభావం ప్రధానంగా కలది. దక్షిణ భారతదేశం అలా కాదు. ఇది కర్మ భూమి. యజ్ఞయాగాదులకు ఇక్కడ ప్రాధాన్యం ఎక్కువ. ఈ అంశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పరిగణనలోనికి తీసుకోవడం లేదో అర్థం కాదు. అంతా తెలుగువారే 1965లో మొదలైన ఐఏఎస్ అధికారుల కార్యనిర్వహణాధికారి బాధ్యతలు ఈనాటికీ కొనసాగుతున్నాయి. 1965 నుంచి నేటి వరకు 21 మంది ఐఏఎస్ అధికారులు ఈ పదవి నిర్వహించారు. 1972–74 మధ్య కార్యనిర్వహణాధి కారిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం మినహా మిగిలిన అధికారులందరూ తెలుగు వారే. శతాబ్దాలుగా, అవిచ్ఛిన్నంగా వస్తున్న సంప్రదాయానికి తిలోదకాలివ్వ వలసిన ప్రత్యేక పరిస్థితులేమిటో అర్థం కావటం లేదు. సమర్థులు, ప్రతిభావం తులైన తెలుగు అధికారులు లేరా అంటే అది నిజం కాదు. ఇప్పుడు నియ మించిన అధికారి సమర్థతను శంకించడం లేదు. చాలాకాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని ఉల్లంఘించాల్సిన అవసరమేదీ కన్పించడం లేదన్నది నా అభి ప్రాయం. ఎడ్మండ్ బర్క్ చెప్పినట్లు ‘Institutions of antiquity should not be altered for temporal reasons’(సనాతనంగా వస్తున్న విధానాలను లౌకిక ప్రయోజనాల కోసం మార్చడం సమంజసం కాదు). శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి విశాఖ శారదాపీఠం అధిపతి -
కాలి నడకన తిరుమలకు టీటీడీ ఈవో
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా నియమితులైన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం కాలినడకన తిరుమల చేరుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి ఆయన తలనీలాలు అర్పించి మొక్కు తీర్చుకున్నారు. అలాగే నడకదారి భక్తుల క్యూలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుత ఈవో సాంబశివరావు నుంచి శనివారం ఉదయం సింఘాల్ టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా తితిదే ఈవోగా సాంబశివరావు పదవీకాలం ముగియడంతో ఆయనను ప్రభుత్వం.. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. టీటీడీ చరిత్రలో ఉత్తరాది వ్యక్తి ఈవోగా నియమితులవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకు ముందు అనిల్‌కుమార్ సింఘాల్‌కు టీటీడీ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. -
చీలిపోయిన ఏపీ ఐఏఎస్ అధికారులు
-
టీటీడీ ఈవో..ఉత్తరాది ఐఏఎస్ సింఘాల్
టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఉత్తరాది అధికారికి అవకాశం సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తరాది వ్యక్తి ఈవోగా నియమితులైనట్లయింది. సింఘాల్‌తో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇప్పటి వరకు తెలుగువారినే టీటీడీ ఈవోగా నియమించే సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఆ రాష్ట్ర సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారులు చేసిన విజ్ఞప్తిని తోసిరాజని ఉత్తరాదికి చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమించారు. దీంతో ఈ వ్యవహారం సీనియర్ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం పేషీ అధికారి, ఢిల్లీలోని కేంద్ర మంత్రి చేసిన తీవ్ర ఒత్తిడికి లొంగిపోయి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, టీటీడీ ఈవోగా ఉన్న డి.సాంబశివరావును వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ , రిజిస్ట్రేషన్లు, స్టాంపుల (రెవెన్యూ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ప్రవీణ్ ప్రకాష్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించింది. -
టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాంబశివరావు అమరావతి: తిరుమల-తిరుపతిదేవస్థానం (టీటీడీ) చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తరాది వ్యక్తి కార్యనిర్వహణాధికారి (ఈవో)గా నియమితులయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉత్తరాది ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనతోపాటు మరికొందరు ఐఏఎస్ అధికారులను కూడా సోమవారం ప్రభుత్వం బదిలీ చేస్తూ జీవో ఇచ్చింది. తెలుగువారినే టీటీడీ కార్యనిర్వహణాధికారులుగా నియమించే సంప్రదాయం ఇప్పటి వరకూ కొనసాగుతూ వచ్చింది. తెలుగువారికే ఈ పోస్టు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాదికి చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమించారనే విషయం సీనియర్ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం పేషీ అధికారి, ఢిల్లీలోని కేంద్ర మంత్రి చేసిన తీవ్ర ఒత్తిడికి లొంగిపోయి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీ ఈవోగా ఉన్న డి. సాంబశివరావును వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ , రిజిస్ట్రేషన్లు, స్టాంపుల (రెవెన్యూ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసి ఈ స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించింది. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ప్రవీణ్ ప్రకాష్‌ను ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించింది. ప్రవీణ్ ప్రకాష్ బాధ్యతలు చేపట్టే వరకూ ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాలని ప్రస్తుతం అక్కడ స్పెషల్ కమిషనర్‌గా పనిచేస్తున్న అర్జ శ్రీకాంత్‌ను ఆదేశించింది. కృష్ణాజిల్లా కలెక్టరుగా పనిచేసి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎ. బాబును ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఇక్కడ పనిచేస్తున్న కె. సాంబశివరావు (ఐఆర్టీఎస్)ను బదిలీ చేసింది. రియల్‌టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) వైఎస్ ఛైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను కూడా ఎ. బాబుకు అప్పగించింది. ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జె.నివాస్‌ను విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఈ–దర్శన్ కౌంటర్‌ను పునఃప్రారంభించండి
► తిరుమల జేఈఓను కోరిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల : పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ–దర్శన్ కౌంటర్‌ను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి టీటీడీ ఈవో సాంబ శివరావును కోరారు. మంగళవారం తిరుపతిలో ఈవోను కలిసి మాట్లాడారు. ఈనెల 19 నుంచి ఈ–దర్శన్ కౌంటర్‌ను మూసివేశారన్నారు. దీం తో ఈ ప్రాంత ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. వెంటనే ఈ–దర్శన్ కౌంటర్‌ను ప్రారంభించాలని ఆయన ఈవోను కోరారు. -
దాశరధిని దర్శించుకున్న టీటీడీ ఈఓ
ఒంటిమిట్ట(రాజంపేట): టీటీడీ ఈఓ సాంబశివారావు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయాన్ని సందర్శించారు. శ్రీరామ నవమి బ్రహ్మోత్సలను పురష్కరించుకొని శనివారం ఆయన రామాలయానికి విచ్చేశారు. ముందుగా ఆలయ ప్రధానఅర్చకుడు వీణారాఘవాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాట్లు, సౌకర్యాలపై ఆరా తీశారు. స్వయంగా పరిశీలించారు. తాగునీటి సౌకర్యం, ఆలయ ఆవరణంలో చలువపందిళ్లు, ఆలయ సంప్రదాయపరంగా నిర్వహించాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. ఈవో వెంట జెఈఓ పోలాభాస్కర్, టీటీడీ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా జిల్లా కలెక్టరు సత్యనారాయణ వచ్చిన ఆలయం బయటే వేచివుండాల్సి వచ్చింది. కలెక్టరు ఉన్న విషయాన్ని టీటీడీ అధికారులు విస్మరించడం వల్లనే ఆయన బయటేఉండిపోయారనే వాదన వినిపిస్తోంది. -
గతేడాది 2.66 కోట్ల మందికి శ్రీవారి దర్శనం
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి సాక్షి, తిరుమల: గతేడాదిలో మొత్తం 2.66 కోట్ల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు చెప్పారు. శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాదిలో హుండీ ద్వారా శ్రీవారికి రూ.1,018 కోట్ల కానుకలు లభించాయని తెలిపారు. టీటీడీ 10.34 కోట్ల లడ్డూలు భక్తులకు పంపిణీ చేసి రికార్డు నెలకొల్పిందన్నారు. శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మొత్తం 50,974 టికెట్లను శుక్రవారం విడుదల చేసినట్లు ఈవో వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి విస్తృత ఏర్పాట్లు : ఈ నెల 8న వైకుంఠ ఏకాదశి, 9న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమల ఆలయంతో పాటు టీటీడీ అన్ని స్థానిక ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. ఈ రెండు రోజుల్లో తిరుమలలోని శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం తెరచి ఉంటుందన్నారు. ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు, వృద్ధులు, చంటిబిడ్డ తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసినట్లు చెప్పారు. కాలిబాట భక్తులకు టోకెన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏకాదశి నాడు శ్రీవారికి స్వర్ణ రథోత్సవం: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆదివారం తిరుమలలోని శ్రీవారికి స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై ఆలయ పురవీధుల్లో దర్శనమివ్వనున్నారు. సోమవారం ద్వాదశిని పురస్కరించుకుని వేకువజామున పుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నానం నిర్వహించనున్నారు. -
ఇస్తికఫాల్ మర్యాదలతో గవర్నర్ శ్రీవారి దర్శనం
ప్రజలంతా సంతోషంగా,ఆరోగ్యంగా ఉండాలి: గవర్నర్ సాక్షి, తిరుమల: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. తర్వాత భూ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మహద్వారం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు గవర్నర్‌కు ఇస్తికఫాల్ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా బలిపీఠానికి సాష్టాంగ నమస్కారం చేసి, ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత పచ్చకర్పూరపు వెలుగులో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు నిబంధనల ప్రకారం శ్రీవారి పట్టుశేషవస్త్రాన్ని బహూకరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో గవర్నర్‌కు వేద పండితులు ఆశీర్వదించగా, టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రాత్రి వేళ తిరుమలలోని శ్రీవారి నిత్యాన్నప్రసాద భవనంలో గవర్నర్ నరసింహన్ అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సంతోషం, ఆరోగ్యం, సుఖం, భాగ్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. -
ఆధార్‌తోపాటు ప్రభుత్వ కార్డులకూ టికెట్ల జారీ
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు ఆధార్‌తోపాటు పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లెసెన్స్, ఓటర్, రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి స్వీకరించి టికెట్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు చెప్పారు. గురువారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. కాలినడకన వచ్చే భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం టికెట్లకు కేవలం ఆధార్ మాత్రమే స్వీకరిస్తామన్న నిర్ణయంపై ఈవో స్పష్టత ఇచ్చారు. కాలిబాటల్లో వచ్చే భక్తులకు ఫొటోమెట్రిక్ పద్దతిలోనే టికెట్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం సేవించి కొందరు తిరుమలకు వస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
31 వరకు అదనపు చార్జీలు ఉండవు
భక్తులకు వెసులుబాటు కల్పించామన్న టీటీడీ ఈవో సాంబశివరావు తిరుపతి అర్బన్: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు తిరుపతి, తిరుమలలో నిర్వహించే నగదు రహిత లావాదేవీలపై ఈ నెల 31వ తేదీ వరకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. దీనిపై సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో బ్యాంక్ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో శ్రీవారి భక్తులకు ఎలాంటి అదనపు చార్జీలు విధించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రధానంగా తిరుమల, తిరుపతిలోని గదుల బుకింగ్, శ్రీవారి డాలర్లు, లడ్డూ ప్రసాదాలు కొనుగోళ్లకు క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి స్వైపింగ్ మిషన్ల ద్వారా లావాదేవీలు జరపాలని భక్తులకు సూచించారు. అలాగే టీటీడీ ప్రచురణలు, డైరీలు, క్యాలెండర్లు కొనుగోలు చేసే భక్తుల వద్ద కూడా అదనపు చార్జీలు వసూలు చేయవద్దని బ్యాంకర్లను కోరారు. టీటీడీ పరకామణి ద్వారా బ్యాంక్‌లకు చేరుతున్న చిల్లర నాణేలు, చిన్న నోట్లను భక్తులకు చిల్లర ఇచ్చేందుకు అందుబాటులో ఉంచాలని కోరారు. టీటీడీ నిర్వహిస్తున్న ఈ-హుండీ ద్వారా కానుకలు సమర్పించే భక్తులకు , ఈ - డొనేషన్ ద్వారా టీటీడీ ట్రస్టులకు విరాళాలు ఇచ్చేవారికి సర్వీసు చార్జీలు టీటీడీ భరిస్తుందని స్పష్టం చేశారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
- టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్‌తో కలసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను మీడియాకు వెల్లడించారు. అక్టోబరు 1 నుండి 12వ తేదీ వరకు తిరుమల రెండు ఘాట్‌రోడ్లలో 24 గంటలూ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు. భక్తుల దర్శనార్థం 7వ తేదీన గరుడ వాహన సేవను రాత్రి 7.30 గంటలకే నిర్వహిస్తామన్నారు. వాహన మండపం నుండి హథీరాంజీ మఠం వరకు ఉండే సుమారు 25 వేల మంది భక్తులను గరుడ సేవను దర్శించుకున్న తర్వాత వారిని వెలుపలకు పంపి అదేస్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుమన్నారు. వాహన సేవలో హారతి కూడళ్ల వద్ద రెట్టింపు స్థాయిలో భక్తులను అనుమతించి ఉత్సవ దర్శనం కల్పిస్తామన్నారు. గరుడ సేవలో శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని 24 గంటలూ తెరిచి ఉంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. రోజుకు 2 వేల ఆర్టీసీ బస్సు ట్రిప్పులు, గరుడసేవలో 3800 ట్రిప్పులు తిరిగే ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9 నుండి అర్థరాత్రి 1 గంట వరకు అన్నప్రసాదాలు వడ్డించే ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తుల ఫిర్యాదులు, సూచనల కోసం కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో టోల్‌ఫ్రీ నెంబరు 1800425111111 అందుబాటు ఉంటుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే లడ్డూలు వితరణ చేస్తామన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి:ఈవో
తిరుమల : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు. శుక్రవారం తిరుమలలో సాంబశివరావు విలేకర్లతో మాట్లాడుతూ... 2వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని... 3న ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. మూడో తేదీన స్వామివారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకుర 24 గంటలూ ఘాట్ రోడ్లు తెరచి ఉంటాయని సాంబశివరావు వెల్లడించారు. -
ఆకట్టుకునేలా ఎస్వీబీసీ ప్రసారాలు
– బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అధికారులతో ఈవో సమీక్ష – ప్రసారాలు మెరుగ్గా ఉండాలని ఆదేశం తిరుపతి అర్బన్: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రేక్షకులకు తన్మయత్వం కలిగేలా ఎస్వీబీసీ ప్రసారాలు మెరుగ్గా వుండాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఆదేశించారు. శనివారం ఆయన తిరుపతిలోని పరిపాలన భవనంలో ఎస్వీబీసీ అధికారులతో సమీక్షించారు. భక్తులు మరింత ఆకర్షితులయ్యేలా టీటీడీ చానల్ ప్రసారాలు వుండాలన్నారు. అవసరమైన అధునాతన కెమెరాలు, లెసెన్స్‌లు, రోప్ కెమెరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. శ్రీవారి వాహన సేవలపై తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిపుణులతో వ్యాఖ్యానాలు చేయించాలన్నారు. కెమెరాల ద్వారా చిత్రీకకరణకు అనుగుణంగా మాఢవీధులు, గ్యాలరీల్లో మరింత లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీకి చెందిన ట్రస్టులు, పథకాలు, ఇతర సేవా సంక్షేమ కార్యక్రమాలు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలన్నారు. తిరుమల, తిరుపతిలోని వివిధ వేదికలపై ఏర్పాటు చేస్తున్న అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులకు కళ్లకు కట్టినట్టు చూపించాలని కోరారు. అనంతరం ఈవో డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్‌పై తిరుమల జేఈవో శ్రీనివాసరాజుతో కలసి సమీక్షించారు. ఈసమావేశంలో టీటీడీ ఎఫ్ఎఅండ్సీఏవో బాలాజీ, సీఏవో రవిప్రసాద్, అన్నదానం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. -
గరుడ సేవరోజు నడక మార్గాలు తెరిచి ఉంచాలి
– బ్రహ్మోత్సవ భక్తులకు సురక్షిత రవాణా – టికెట్ల కోసం వేచి వుండకుండా చర్యలు – ఘాట్ రోడ్లలో క్రేన్లు, మెకానిక్‌లు అందుబాటులో ఉంచండి – ఆర్టీసీ, టీటీడీ ట్రాన్స్‌పోర్టు అ«ధికారులకు ఈవో ఆదేశం తిరుపతి అర్బన్: తిరుమలలో అక్టోబర్ 3 నుంచి జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ జరిగే రోజు అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలను 24 గంటల పాటు తెరిచి ఉంచాలని ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు సూచించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం రవాణా ఏర్పాట్లు, సురక్షిత ప్రయాణం, టికెట్ల కొనుగోలు విషయంలో చేపట్టాల్సిన చర్యలపై బుధవారం ఈవో ఆర్టీసీ, టీటీడీ ట్రాన్స్‌పోర్టు అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సురక్షితమైన రవాణా ఏర్పాట్లు చేపట్టేందుకు రెండు విభాగాలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాల సమయాల్లో ఘాట్ రోడ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు, టీటీడీ భద్రతా విభాగం, మెకానిక్ సిబ్బంది అందుబాటులో వుండాలన్నారు. ఐదు ప్రాంతాల్లో క్రేన్లు, సంక్లిష్ట ప్రాంతాల్లో అదనపు మెకానిక్‌లను సిద్ధంగా వుంచుకోవాలన్నారు. గరుడసేవ రోజు మరింత పటిష్ట ఏర్పాట్లు: బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన గరుడసేవ రోజు భక్తులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు, టీటీడీ భద్రతా విభాగం అ«ధికారులకు ఈవో సూచించారు. గరుడసేవ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా వుండనున్న నేపధ్యంలో అలిపిరి నడకమార్గంతో పాటు శ్రీవారి మెట్టు మార్గాన్ని 24 గంటలపాటు తెరచి వుంచాలని కోరారు. అందులో భాగంగానే అక్టోబర్ 16వతేదీ వరకు బ్రహ్మోత్సవాల రోజులతో పాటు శని, ఆదివారాల్లోను ఘాట్ రోడ్లను భక్తులకు సౌకర్యంగా తెరిచి వుంచాలన్నారు. తిరుమలలో పార్కింగ్ ఏర్పాట్లు తిరుమలలోని పాపవినాశనంరోడ్, రింగ్‌రోడ్ ప్రాంతాలను వాహనాల పార్కింగ్ కోసం వినియోగించుకోవాలన్నారు. అందుకోసం పోలీసులు, టీటీడీ భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని యాత్రికులకు పార్కింగ్ కష్టాలు లేకుండా చూడాలన్నారు. ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించేందుకు భక్తులు టికెట్లకోసం వేచివుండకుండా తగినంత కండక్టర్ సిబ్బంది అందుబాటులో వుంచుకోవాలన్నారు. ఆర్టీసి సిబ్బందికి ఎక్కడికక్కడ సమస్యలు గుర్తించి పరిష్కరించే దిశగా వైర్లెస్ సెట్లు, ఇతర సదుపాయాలను సమకూర్చాలని టీటీడీ అ«ధికారులను ఈవో ఆదేశించారు. శ్రీవారిమెట్టుకు ఉచిత బస్సులు : గరుడసేవ రోజు తిరుపతి, పరిసర ప్రాంతాల నుంచి శ్రీవారి మెట్టుకు ఉచితంగా బస్సులు నడపనున్నట్టు ఈవో వెల్లడించారు. ఇందుకోసం 3 బస్సులను నిరంతరం తిప్పనున్నట్టు పేర్కొన్నారు. గరుడసేవ ముగిసిన తర్వాత కూడా భక్తులు శ్రీవారి మెట్టు నుంచి ఉచిత బస్సుల ద్వారా ఆయా ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు తీసుకోనున్నట్టు తెలిపారు. ఉచిత బస్సులతో పాటు ఆర్టీసి బస్సులు యధాతథంగా నడుస్తాయని వివరించారు. రోజుకు 516 బస్సులు : బ్రహ్మోత్సవాల్లో రోజుకు 516 బస్సుల ద్వారా 2వేల ట్రిప్పులు తిప్పనున్నట్టు ఆర్టీసి ఆర్ఎం నాగశివుడు తెలిపారు. గరుడసేవ రోజు 540 బస్సులతో 3,500 ట్రిప్పులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈసమావేశంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆల్ ప్రాజెక్ట్స్ స్పెషల్ ఆఫీసర్ ముక్తేశ్వరరావు, ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు, టీటీడీ ట్రాన్స్‌పోర్టు జనరల్ మేనేజర్ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
'బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం'
- టీటీడీ ఈవో సాంబశివరావు తిరుమల : అక్టోబరు 3 నుండి 11వ తేదీ వరకు జరగనున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అన్నారు. మంగళవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో ఆయన టీటీడీలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులతో బ్రహ్మోత్సవాలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈసారి ఉత్సవాలకు రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా బస, దర్శనం, అన్నప్రసాదం, భద్రత,ఉత్సవాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 16వ తేదీన పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను మాదిరి బ్రహ్మోత్సవాల తరహాలోనే నిర్వహించి లోటుపాట్లను పరిశీలిస్తామన్నారు. ఉత్సవాల్లో వాహన సేవను భక్తులందరూ దర్శించుకునే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉత్సవాల్లో భక్తులకు లడ్డూల కొరత లేకుండా 7 లక్షల లడ్డూలు నిల్వ ఉంచుకునే ఏర్పాట్లు చేశామన్నారు. ఉత్సవాలతోపాటు తిరుమల శనివారాల నేపథ్యంలో ఆలయంలోని మూలమూర్తి దర్శనం కూడా పకడ్బందీగా నిర్వహిస్తామని, రోజుకు కనీసం 80 నుండి 90వేల పైబడి భక్తులకు సంతృప్తిక దర్శనం కల్పిస్తామన్నారు. -
ఇంటర్నెట్లో శ్రీవారి ఆర్జిత సేవాటికెట్లు
– టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు – జూలైలో 97.09 కోట్ల హుండీకానుకలు, 6.27 లక్షల మందికి రూ.300 టికెట్ల దర్శనం సాక్షి,తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి అక్టోబరు 1 నుండి 31వ తేది వరకు మొత్తం 40,087 టికెట్లు విడుదల చేసినట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వెల్లడించారు. ఇందులో సుప్రభాతం 5477, అర్చన 80, తోమాల 80, విశేష పూజ 1125, అష్టదళ పాద పద్మారాధన సేవ 40, నిజపాద దర్శనం1125, కల్యాణోత్సవం 7875, వసంతోత్సవం8170, ఆర్జిత బ్రహ్మోత్సవం 4515, సహస్రదీపాలంకారసేవ 9500, ఊంజల్‌సేవ 2100 టికెట్లు ఉన్నాయన్నారు. జూలైలో రికార్డు స్థాయిలో రూ.300 టికెట్ల క్యూలో ద్వారా 6.27 లక్షలు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, S హుండీ కానుకలు కూడా రూ.97.09 కోట్లు లభించటం రికార్డన్నారు. టీటీడీ పథకాలకు విరాళాలిచ్చిన దాతలకు ఆగస్టు 15వ తేదిలోగా ఈ పాసులు బుక్‌లు అందజేస్తామన్నారు. కృష్ణాపుష్కరాల్లో నమూనా ఆలయంలో స్వామివారి ప్యాకట్ సైజ్ ఫొటోలు ఉచితంగా పంపిణీ చేస్తామని, 5,10 గ్రాముల శ్రీవారి రాగి డాలర్లు విక్రయిస్తామన్నారు. నమూనా ఆలయంలో రోజూ అత్యధిక మంది భక్తులకు దర్శనం, అన్నప్రసాదం వితరణ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. -
ఈయనెవరో కాదు..
తిరుమల: ఈ ఫొటోలో నిలుచున్న వ్యక్తి ఎవరో తెలుసా..? ఆయనే టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు. టీటీడీ సిబ్బందితో కలసి పరకామణిలో ఇలా పాల్గొన్నారు. ఏటా హుండీ ద్వారా నగదు, బంగారు, వెండి, ఇతర కానుకల ద్వారా మొత్తంగా రూ.1,300 కోట్ల వరకు టీటీడీకి లభిస్తోంది. ప్రతిష్టాత్మకమైన హుండీ లెక్కింపులో పాత మూసపద్ధతులు పక్కన బెట్టి శాస్త్రీయత పెంచాలని ఈవో నిర్ణయించారు. నిబంధనల ప్రకారం పరకామణిలో పాల్గొనాలంటే పంచె, బనియన్ మాత్రమే ధరించాలి. ఆ నిబంధన తాను కూడా పాటించారు. భక్తులు హుండీలో సమర్పించిన నగదు, బంగారు, వెండి, విలువైన రాళ్లు, విదేశీ కరెన్సీనోట్ల లెక్కింపును మూడు గంటలపాటు పర్యవేక్షించారు. లోటుపాట్లు గుర్తించారు. మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. -
అంగ ప్రదక్షిణం చేసే భక్తులకు ఆధార్ తప్పనిసరి
టీటీడీ ఈవో సాంబశివరావు తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం చేసేందుకు టికెట్లు పొందే భక్తులకు ఆధార్‌కార్డు తప్పనిసరి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అధికారులను మంగళవారం ఆదేశించారు. రోజూ పరిమితంగానే 750 టికెట్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ టికెట్ల కేటాయింపులు ఆధార్‌తో అనుసంధానం చేయటం వల్ల రొటేషన్ పద్దతిలో అందరికీ ఉపయుక్తంగా ఉండేలా నిర్ణయం తీసుకునేందుకు వీలు ఉంటుందని చెప్పారు. మంగళవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీనియర్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
రూ.300 టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ గడువు పెంపు
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి సాక్షి, తిరుమల: శ్రీవారి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌ను 60 రోజుల నుంచి 90 రోజులకు పెంచుతున్నట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని భక్తులకు వారంలోపు కల్పిస్తామని, గదులు, శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిజర్వేషన్లు కూడా 90 రోజుల ముందే బుకింగ్ చేసుకునేందుకు పరిశీలిస్తామన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు 56,640 ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచామని, శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి www. ttdsevaonline.com వెబ్సైట్లో రిజర్వేషన్ చేసుకోవచ్చని చెప్పారు. ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలకు టీటీడీ తరఫున త్వరలోనే నమూనా ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. -
త్వరలో ఎస్వీబీసీ తమిళ ఛానల్
* తెలుగు, తమిళం, కన్నడ భక్తులకు ధర్మప్రచారం మరింత విస్తృతం * సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు సాక్షి, తిరుమల: తెలుగు బుల్లితెరపై ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేష ఆదరణ పొందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఇక తమిళ భాషలోనూ కనిపించనుంది. ఇందుకోసం టీటీడీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వైభవ ప్రాశస్త్యం, ఆథ్యాత్మిక, ధార్మిక, భక్తి కార్యక్రమాలను జనబాహుళ్యంలో నేరుగా తీసుకెళ్లాలని టీటీడీ సంకల్పించింది. ఆమేరకు జూలై 7వ తేదీ, 2008న శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ను ప్రారంభించింది. రోజూ తిరుమల, తిరుచానూరు అమ్మవారి ఆలయంలో నిర్వహించే విశేష సేవల ప్రత్యక్ష ప్రసారాలు ఎస్వీబీసీ ప్రత్యక్షంగా భక్తుల ఇళ్ల వద్దకే చేరుస్తోంది. రోజుకు 11 గంటలు కేటాయించారు. ఏపీ, తెలంగాణ వారికి తెలుగులోనే వ్యాఖ్యానం చేస్తుంటారు. ఇక తమిళనాడులోని భక్తులకు తమిళ వ్యాఖ్యానం, కర్ణాటకాలోని భక్తులకు కన్నడ వ్యాఖ్యానం చేయటం వల్ల ఆయా ప్రాంతాల్లోని భక్తులకు సులభంగా శ్రీవారి కార్యక్రమాలు చేరుతున్నాయి. వీటితోపాటు తమిళ భక్తుల కోసం ఆథ్యాత్మిక విశేషాలు, ప్రవచనాలు, భక్తి కార్యక్రమాల కోసం 1.30 గంటలు, కన్నడ భక్తుల కోసం గంట కేటాయించారు. ఇలా తమిళ భక్తులకు 12.30 గంటలు, కన్నడ భక్తులకు 12 గంటలపాటు శ్రీవారి కార్యక్రమాలు చేరవేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చేవారిలో 35 నుంచి 45 శాతం తమిళ భక్తులు, మరో 20 శాతం కన్నడ భక్తులు ఉన్నారు. వీరికోసం ప్రత్యేకంగా తమిళంలోనే ఎస్వీబీసీ కార్యక్రమాలు ప్రసారం చేయాలని రెండేళ్లకు ముందే టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు లెసైన్సు హక్కుల కోసం ఢిల్లీలోని సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకుంది. తమిళ, కన్నడ భక్తుల నుంచి తమ భాషలకు కూడా ప్రాధ్యాత ఇవ్వాలని విజ్ఞప్తులు పెరిగాయి. దీంతో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తమిళఛానల్పై దృష్టిపెట్టారు. అతిత్వరలోనే తమిళ ఛానల్ ఎస్వీబీసీకి భక్తుల నుంచి విశేష ఆదరణ ఉంది. తిరుమలకు వచ్చేవారిలో తమిళులు, కన్నడిగులూ ఉన్నారు. వారి భాషల్లోనూ స్వామి కైంకర్యాలతోపాటు టీటీడీ కార్యక్రమాలను విసృతం చేసేందుకు తమిళ ఛానల్ అవసరం ఉంది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సంబంధిత మంత్రిత్వశాఖతో సంప్రదింపులు చేస్తున్నాం. త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నాం. - టీటీడీ ఈవో సాంబశివరావు -
భక్తులకు అందుబాటులో 49,046 ఆర్జిత సేవా టికెట్లు
టీటీడీ ఈవో సాంబశివరావు సాక్షి, తిరుమల: తిరుమల ఆలయంలో జూన్ నెలలో స్వామివారికి నిర్వహించే ఆర్జిత సేవకు సంబంధించి మొత్తం 49,046 టికెట్లు అందుబాటులో ఉన్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వివరాలు వెల్లడించారు. టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులు సులభంగా రిజర్వు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందులో సుప్రభాతం-6,157, అర్చన-140, తోమాల-140, విశేషపూజ-750, అష్టదళ పాదపద్మారాధన-80, నిజపాద దర్శనం-1,115, కల్యాణోత్సవం-10,874, వసంతోత్సవం-6,880, ఆర్జిత బ్రహ్మోత్సవం-6,235, సహస్రదీపాలంకార సేవ-13,775, ఊంజల్‌సేవ -2,900 ఉన్నాయన్నారు. ఈ నెల 21 నుంచి ఎస్వీబీసీలో అన్నమయ్య పాటలకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. తిరుమల కల్యాణ వేదికలో వివాహాలు చేసుకునేందుకు, శ్రీవారి సేవలో పాల్గొనేందుకు దరఖాస్తులు ఈ నెల 9 నుండి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నామని పేర్కొన్నారు. ఈ నెల 10 నుండి 2017 మే ఒకటి వరకు ఏడాదిపాటు శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 22 నుంచి 29 వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లో 55 కేంద్రాల్లో శుభప్రదం కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
8వ తేదీ రాత్రి శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల : మార్చి 19 నుంచి 23వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో డి.సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో డి. సాంబశివరావు మాట్లాడుతూ... మార్చి 9వ తేదీ సూర్యగ్రహణం నేపథ్యంలో 8వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 10.00 గంటల వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయం మూసివేస్తామని తెలిపారు. తిరుమలలోని కళ్యాణ వేదికలో వివాహం చేసుకున్న వారికి ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వివాహానికి అవసరమైనవన్నీ టీటీడీ సమకూరుస్తుందన్నారు. అలాగే వెయ్యి కాళ్ల మండపం పునర్ నిర్మాణానికి టెండర్లు మార్చి 11వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్ నెలకు గాను 50 వేల ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేశారు. -
నేడు డయల్ యువర్ టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల: ప్రతినెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తారు. జనవరి ఒకటో తేదీ శుక్రవారం భక్తుల రద్దీ కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అందువల్ల రెండో శుక్రవారం(8-1-2016)న డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తిరుమలలో ఎదురయ్యే సమస్యలు, సూచనలపైభక్తులు 0877-2263261కు డయల్ చేసి టీటీడీ ఈవో డి.సాంబశివరావుకు ఫోన్ ద్వారా నేరుగా తెలియజేయవచ్చు. 11గంటల నుంచి ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరిలో జరిగే వివిధ ఆర్జిత సేవలకు సంబంధించి టికెట్ల కోటాను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఇంటెర్నెట్ ఆన్లైన్లో www. ttds-eva-online. com వెబ్సైట్ ద్వారా ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు. -
అందుబాటులోకి రానున్న తిరుమల ఘాట్ రోడ్లు
తిరుమల: తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో డి.సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో ఈవో డి.సాంబశివరావు విలేకర్లతో మాట్లాడుతూ... ఈ పర్వదినాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాలు 16వ తేదీతో ముగుస్తాయన్నారు. 16వ తేదీన తిరుచానురులో పంచమి తీర్థం నిర్వహిస్తామని సాంబశివరావు పేర్కొన్నారు. తిరుమలో రెండో ఘాట్ రోడ్డులో మరమ్మతులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి రెండు ఘాట్ రోడ్డను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రెండవ ఘాట్‌రోడ్డులో ప్రమాదకర ప్రాంతాలను ముందుగా గుర్తించి... నిపుణులచే మరమ్మతులు చేయిస్తామన్నారు. -
మరింత నాణ్యతగా శ్రీవారి లడ్డూ: టీటీడీ
తిరుమల :శ్రీవారి లడ్డూ నాణ్యతను మరింత పెంచేందుకు కృషి చేస్తామని టీటీడీ ఈఓ దొండపాటి సాంబశివరావు తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శనివారం ఆయన ఆలయంతో పాటూ, ఆలయం వెలుపల లడ్డూ కౌంటర్లను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలకు తగ్గట్టుగానే నాణ్యమైన లడ్డూలు ఇస్తామన్నారు. ఇందులో భాగంగా లడ్డూ తయారీకి వాడే సరుకులు మరింత నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి భక్తుడికీ నాలుగు లడ్డూలకు తగ్గకుండా ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. -
భారీ వర్షాలతో తిరుమలకు జలకళ
వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన వర్షాలు.. నీటి ఎద్దడితో అల్లాడుతున్న తిరుమలకు స్వాంతన నిచ్చాయి. తిరుమలలోని జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. మంగళవారం ఆకాశగంగ, గోగర్భం డ్యాములు పొంగి పొర్లాయి. పాపవినాశనం, కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల్లో 70శాతం నీరు చేరింది. ఈ వర్షాల పుణ్యమా అని ఏడాదికి సరిపడా తాగునీరు చేరింది. శ్రీవారి దర్శనం కోసం రోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు. వీరి అవసరాలతోపాటు ఆలయం, నిత్యాన్న ప్రసాదం కోసం 32 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. ప్రస్తుతం ఐదు జలాశయాల్లో చేరిన నీరు ఏడాదికి సరిపోతుందని టీటీడీ ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక తిరుపతి కల్యాణీ డ్యాంలోనూ 35 శాతం నీరు చేరింది. దాంతో పాటు తెలుగుగంగ నీరు రోజూ 7 నుంచి 8 ఎంఎల్డీలు అందుతోంది. అవసరాన్ని బట్టి వినియోగించుకుంటే ఏడాదిన్నర కాలానికి ఎలాంటి ఢోకా లేదని ఇంజినీర్ల అభిప్రాయం. కాగా, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు మంగళవారం జలాశయాలను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. -
ఒకే గొడుగు కిందకు టీటీడీ సేవలు
కోర్కెలు తీర్చే కొండలరాయునికి భక్తిశ్రద్ధలతో సామాన్య భక్తులు సమర్పించే ముడుపులతోనే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ముందుకు సాగుతోంది. అలాంటి ధార్మిక సంస్థలో పారదర్శక పాలనతోపాటు అన్ని విభాగాల సేవల్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సామాన్య భక్తులకు మరింత చేరువ కావాలని ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు సంకల్పించారు. కొత్తవాటికి, వివాదాంశాల జోలికెళ్లకుండా ఉన్నవాటిని మరింత లోతుగా అధ్యయనం చేసి లోపాలను సవరించి కొత్త జవసత్వాలతో ముందుకు నడిపించాలని భావిస్తున్న టీటీడీ ఈవో ‘సాక్షి ఫన్డే’తో పంచుకున్న మనోభావాలివి... ♦ టీటీడీ ఈవోగా బ్రహ్మోత్సవాల బాధ్యత తీసుకోవడంపై ఎలాంటి అనుభూతి ఉంది? దేవదేవుని సన్నిధిలో వీఐపీ, సామాన్యుడు అన్న తేడా ఉండదు. దేవుని ముందు అందరూ సమానమే. ధార్మిక సంస్థ టీటీడీ కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సామాన్యుడే మాన్యుడు అన్న లక్ష్యంతో సాగిపోతున్నాం. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. దేవదేవుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు పర్యవేక్షించే బాధ్యత రావటం అదృష్టంగా భావిస్తున్నా. ఆ అనుభూతి చెప్పలేనిది. అంతకంటే బాధ్యతతో పనిచేయాలని సంకల్పించాము. ♦ ధార్మిక సంస్థలోని వివిధ విభాగాల సేవల్ని భక్తులకు ఎలా చేరవేయబో తున్నారు? టీటీడీలో అనేక విభాగాలున్నాయి. కొన్ని ప్రత్యక్షంగా భక్తులకు సేవ చేస్తుంటాయి, మరికొన్ని పరోక్షంగా సేవలందిస్తాయి. వీటిలో కొన్ని భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే, మరికొన్ని ధర్మప్రచారం ద్వారా స్వామి వైభవ ప్రాశస్త్యాన్ని చాటటం, మానవ సంబంధాలు- నైతిక విలువలు పెంపొందించటం ద్వారా యువతను ధార్మికత దిశగా తీసుకెళుతుంటాయి. రిసెప్షన్, ఆలయం, అన్నప్రసాదం, కల్యాణకట్ట, ధర్మప్రచారంలో భాగంగా శ్రీనివాసకల్యాణోత్సవాలు, శుభప్రదం, మనగుడి, వైభవోత్సవాలు, సప్తగిరి మాసపత్రిక, శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్ వంటి ఎన్నెన్నో విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఇలా అన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి భక్తుడి కేంద్రంగా సేవలందించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. అన్ని విభాగాలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే భక్తుడికి టీటీడీ సేవలు సత్వరంగా లభిస్తాయి. ♦ ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం అమలుతో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం చక్కగా అమలు చేస్తున్నాం. భక్తులకు స్వామి దర్శనం సంతృప్తిగా లభిస్తోంది. గతంలో భక్తుల మధ్య ఉండే తోపులాటలు తగ్గాయి. గతంలో కంటే స్వామిని దర్శించుకునే భక్తుల శాతం 5నుండి 10 శాతం వరకు పెరిగింది. దీన్ని మరింత అభివృద్ధి చేయాలని యోచిస్తున్నాం. హుండీ కానుకలు కూడా 10 శాతం వరకు పెరగటం శుభపరిణామం. ♦ రూ.300 టికెట్లు, రూ.50 సుదర్శనం వంటి ఆన్లైన్ దర్శనాలు ఎలా అమలవుతున్నాయి? రూ.300 టికెట్ల ఆన్లైన్ దర్శనాలు సజావుగా అమలవుతున్నాయి. రోజుకు 26వేలు రూ.300 టికెట్లు, మరో 4వేల వరకు రూ.50 సుదర్శనం టికెట్లు కేటాయిస్తున్నాం. భక్తుల నుంచి స్పందన విశేషంగా ఉంది. ఆ టికెట్లు పొందిన భక్తులు తిరుమలకు వచ్చినట్టుగాను, తిరిగి వెళ్లినట్టుగాను తెలియటం లేదంటే ఎంత సక్సెస్‌ఫుల్‌గా అమలవుతున్నాయో ఇక చెప్పనక్కరలేదు. దీనివల్ల సిఫారసు దర్శనాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ♦ లడ్డూ నాణ్యత, రుచి విషయంలో స్వామి భక్తులు కొంత ఆవేదనతో ఉన్నారు? దిట్టాన్ని సవరించి భక్తుల కోర్కె తీరుస్తారా? స్వామి దర్శనం తర్వాత అంత ప్రాధాన్యత లడ్డూకు ఉంది. నాణ్యత, రుచికరమైన లడ్డూలు శుచిగా తయారికీ కట్టుబడి ఉన్నాం. అందులో భాగంగానే లడ్డూ తయారీలో వాడే ఆవునెయ్యి, చక్కెర, ఇతర పప్పు దినుసులన్నీ కూడా నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలు కలిగిన వాటినే వినియోగిస్తున్నాం. రోజూ 3 లక్షలకు తగ్గకుండా లడ్డూలు తయారు చేస్తున్నాం. భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్లలోనే లడ్డూ టోకెన్లు పొందే సౌకర్యం కల్పించాం. ♦ భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు మీరు ఏమి చేయదలిచారు? ఆలయ నిర్వహణాంశాల్లో వివాదాల జోలికి వెళ్లము. ఉన్న వాటిని ఎలా అభివృద్ధి చేయాలో ఆ దిశగా యోచన చేస్తాం. దేనికైనా సమయం వచ్చినప్పుడు అది తప్పక జరుగుతుంది. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుంది. భవిష్యత్‌లో మార్పులు మాత్రం తప్పవు. ♦ పరిపాలన సంస్కరణలేమైనా చేపట్టబోతున్నారా? పాలనలో సంస్కరణల కంటే ఉన్నవాటిని మెరుగుపరచటం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆయా విభాగాల్లో అమలు చేసేవాటిలోనే నిర్దిష్ట విధానాలను ప్రవేశ పెట్టాము. బస, కల్యాణకట్ట, అన్నప్రసాదం వంటి విభాగాలను సులభతరం చేయటం వల్ల భక్తులకు మరింత చేరువయ్యాయి. రిసెప్షన్ విభాగాల్లో గదుల వేకెన్సీ రిజర్వు తగ్గించాం. గదుల కేటాయింపుల్లో పారదర్శక విధానాల వల్ల ఆక్యుపెన్సీ 110 శాతానికి పెరిగింది. గదుల అద్దె ఆదాయం కూడా మరో 13 శాతం వరకు పెరిగింది. కల్యాణ కట్టల్లోనూ 15 నుండి 20 శాతం భక్తులు అధికంగా తలనీలాలు సమర్పించే అవకాశాలు పెరిగాయి. ♦ వేయికాళ్ల మండపాన్ని ఎలా నిర్మించబోతున్నారు? చారిత్రక నేపథ్యం కలిగిన వేయికాళ్ల మండపాన్ని వెయ్యేళ్లు నిలిచేలా నిర్మించాలని సంకల్పించాం. దేవదేవుని ఉత్సవాలకు అనువుగా చారిత్రక, ఆధ్యాత్మిక, ధార్మికత ఉట్టిపడేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయానికి నైరుతి దిశలో నారాయణగిరి ఉద్యాననవంలో నిర్మిస్తాం. భక్తులు మండపాన్ని దర్శించేలా పూర్వవైభవాన్ని పునరుజ్జీవింప చేస్తాం. ♦ టీటీడీ ఈవోగా మీ ప్రాధాన్యతాంశాలేమిటి? స్వామిదర్శనం కోసం తిరుమల కొండమీద కొచ్చిన సామాన్య భక్తుడి నుంచి వీఐపీ వరకు ఉపయోగించుకునే విధంగా యాత్రిసదన్లు అభివృద్ధి చేయటమే నా తొలి ప్రాధాన్యత. ఒకేచోట అనువైన మరుగుదొడ్లు, స్నానపు గదులు, లాకర్లు, తలనీలాలు సమర్పించే సౌకర్యాలు కల్పించాలి. నాల్గు యాత్రిసదన్లను అభివృద్ధి చేస్తే గదులు కోరుకునే భక్తులు తగ్గుతారు. రూ.300 టికెట్లు పొందిన భక్తులు యాత్రిసదన్లు ఉపయోగించుకునే విధంగా వందశాతం పరిశుభ్రతతో అభివృద్ధి చేస్తాం. తిరుమలలో నీటి ఇబ్బందులు న్నాయి. వాటిని తగ్గించేందుకు చర్యలు చేపడతాం. వర్షపు నీరు వృథా కాకుండా ప్రతినీటి బొట్టును వినియోగించుకునేలా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. వర్షపు నీటిని తిరిగి వాడుకునే విధంగా హార్వెస్టింగ్ చేయాలని భావిస్తున్నాం. గోగర్భం డ్యాము కింద అదనంగా చెక్ డ్యాము నిర్మిస్తాం. వాటర్‌ను ట్రీట్ చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొస్తాం. అది పూర్తయితే సుమారు నాలుగు నెలలపాటు అదనంగా నీరు లభించే అవకాశం ఉంది. ఇక పవర్ విషయానికి వస్తే ఎల్ఈడీ బల్బుల వినియోగానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. బ్రహ్మోత్సవాల అలంకరణలతోపాటు సాధారణ రోజుల్లోనూ ఎల్ఈడీ లైట్లనే వినియోగిస్తాం. దీనివల్ల విద్యుత్ ఆదాతోపాటు పర్యావరణానికి మేలు జరుగుతుంది. సోలార్ విద్యుత్ వినియోగం పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రెండు బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లున్నాయి? అధిక మాసం సందర్భంగా రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. ఒకటి వార్షిక, మరొకటి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. రెండింటినీ అంగరంగవైభవంగా నిర్వహిస్తాం. ఏలోటూ రానివ్వం. * బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారికి ప్రయాణం, బస, కల్పిస్తాం. ఆలయంలో మూలవిరాట్టు దర్శనంతోపాటు ఉత్సవమూర్తుల దర్శనం కల్పిస్తాం. అన్నీ సవ్యంగా సాగుతున్నాయి. * ప్రత్యేకించి గరుడ వాహనం, చక్రస్నానంపై ఎక్కువ దృష్టిపెట్టాం. గరుడ వాహనంపై మలయప్పస్వామిని దర్శించేందుకు వచ్చే అశేష జనవాహిని సంతృప్తిగా స్వామిని దర్శించే ఏర్పాట్లు చేశాం. వాహనాన్ని బాగా రద్దీ ఉండే ప్రాంతాల్లో తిప్పుతూ భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పిస్తాం. * టీటీడీ, విజిలెన్స్, పోలీసు, ఆర్టీసీ విభాగాల మధ్య సమన్వయం పెంచాం. అందరికీ బాధ్యతలు అప్పగించాం. అమలయ్యేలా ప్రత్యేక ఆదేశాలిచ్చాం. అందరూ ఒకే మాటమీద ఉంటూ అన్నీ విజయవంతం చేసేలా చర్యలు చేపట్టాం. * ఆలయ నాలుగు మాడ వీధుల్లో అన్నప్రసాదం, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. వాహన సేవను శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్ ద్వారా నాణ్యమైన ప్రసారాలు చేస్తాము. అధునాతన కెమెరాలు వినియోగిస్తాం. వాహన సేవ విశిష్టతను తెలిపేందుకు అనుభవజ్ఞులైన వ్యాఖ్యాతలను ఏర్పాటు చేస్తాం. * ఉత్సవాల్లో ఉత్సవమూర్తుల అలంకరణకు, వాహన సేవల అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి అలంకారాల్లో ఏలోటూ రానివ్వకుండా చూసుకోవలసిందిగా సిబ్బందికి తగిన ఆదేశాలిచ్చాం. * భక్తులను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అందుకోసం అనుభవ జ్ఞులైన కళాకారుల్ని ఎంపిక చేశాం. -
తిరుమలలో మూడు క్యూలైన్ల విధానం
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు అన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు, నిఘా పెంచేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం ఏర్పాటు చేసినట్లు దేవస్థానం ఈవో సాంబశివరావు వివరించారు. -
తిరుమలలో 9వ తేదీ నుంచి వరుణ యాగం
తిరుపతి : తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లు ఆన్లైన్లో నేటి నుంచి విక్రయిస్తున్నట్లు టీటీడీ ఈవో డి.సాంబశివరావు వెల్లడించారు. నవంబర్ 5వ తేదీ వరకు ఈ ఆన్లైన్ టిక్కెట్లు విక్రయిస్తామని తెలిపారు. శుక్రవారం తిరుపతిలో సాంబశివరావు విలేకర్లతో మాట్లాడుతూ... సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు పార్వేటి మండపంలో వరుణ యాగాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే బ్రహ్మోత్సవాల పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని చెప్పారు. 8 లక్షల లడ్డూలు అదనంగా నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డి. సాంబశివరావు వివరించారు. గతంతో పోలిస్తే తిరుపతిలో భక్తులు గదుల వినియోగం 109 శాతం పెరిగిందన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. దీనికి లాస్ట్ అండ్ ఫౌండ్ అని పేరు పెట్టినట్లు ఆయన విశదీకరించారు. టీటీడీలో ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. అయితే టీటీడీలో ఉద్యోగాలు అంటూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు ఈ సందర్భంగా డి.సాంబశివరావు సూచించారు. -
బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తాం
సాక్షి, తిరుమల: అఖిలాండ బ్రహ్మాండనాయకునికి ఈ ఏడాది నిర్వహించే రెండు బ్రహ్మోత్సవాలు అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, వాటిల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు చెప్పారు. ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. ప్రయాణం, బస, మూల విరాట్టు దర్శనం, ఉత్సవ మూర్తుల దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో నిర్ణీత సమయానికే వాహన సేవలు నిర్వహిస్తామని, ఆ సేవల్లో శ్రీవారి వాహనాల అలంకరణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వివరించారు. అధిక మాసం సందర్భంగా సెప్టెంబరు 16 నుంచి 24 వరకు వార్షిక, అక్టోబరు 14 నుంచి 22వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో ఆ ఏర్పాట్లను ఆయన ఆదివారం ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు.. అరగంట ముందే గరుడ వాహనం ఊరేగింపు బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనం ఊరేగింపు, చక్రస్నానం సమయంలో భక్తులు అశేష సంఖ్యలో తరలివస్తారు. గతంలో ఎదురైన అనుభవాలు సమీక్షించాం. లోటుపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేశాం. ముందుగా నిర్ణయించిన ప్రకారం రాత్రి 8 గంటలకు గరుడ వాహనసేవ నిర్వహిస్తాం. స్వామిని దర్శించేందుకు ఉదయం నుంచే సామాన్య భక్తులు లక్షలాదిగా వేచి ఉంటారు. అవసరాన్ని బట్టి వాహన సేవను అరగంట ముందే ఊరేగించాలని భావిస్తున్నాం. పురవీధుల్లో వాహన సేవ చాలా నిదానంగా సాగుతుంది. రద్దీ ఉండే ప్రాంతాల్లో అటు ఇటు తిప్పుతూ దర్శనం కల్పిస్తాం. పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. భక్తులందరూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా దశలవారీగా అనుమతిస్తాం. భక్తి, ఆధ్యాత్మిక, కళారూపాల ప్రదర్శన ఉత్సవాల తొమ్మిది రోజులు ఆలయ వీధుల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను అలరిస్తాం. ప్రముఖులతో ధార్మిక ఉపన్యాస కార్యక్రమాలు రూపొందిం చాం. ప్రత్యేక కార్యాచరణతో ఉత్సవాల్లో శ్రీవారి ఆధ్యాత్మిక, తేజోవైభవాన్ని చాటుతాం. ఇక బ్రహ్మోత్సవాల విజయవంతం చేయడం లో టీటీడీ, పోలీసు, ఆర్టీసీ విభాగాలది కీలకపాత్ర. ఈ మూడు ఒకేమాటపై నడిచేలా సమన్వయపరుస్తాం. గరుడ వాహ నం రోజున ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను నిషేధించాం. అవసరాన్ని బట్టి ట్రాఫిక్ నియంత్రణలో మార్పులు చేస్తాం. ఏపీ సీఎం చేతుల మీదుగా వేయికాళ్ల మండపానికి పునాది చారిత్రక నేపథ్యం కలిగిన వేయికాళ్ల మండపాన్ని వెయ్యేళ్లు నిలిచేలా నిర్మించాలని సంకల్పించాం. ఉత్సవాలకు అనువుగా ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడేలా సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయానికి నైరుతీ దిశలోని నారాయణగిరి ఉద్యాననవంలో నిర్మిస్తాం. బ్రహ్మోత్సవాల ఆరంభంలో సీఎం చేతుల మీదుగా పునాది వేయించాలని సంకల్పించాం. ప్రత్యేక దర్శనాలు రద్దు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. కొన్ని సేవలను ఏకాంతంగా నిర్వహిస్తాం. ప్రొటోకాల్ మినహా వీఐపీ సిఫారసు దర్శనాలన్నీ రద్దు చేశాం. ఆలయంలో మూలమూర్తి దర్శనం, కైంకర్యాలు పోను మిగిలిన సమయాన్నంతా సామాన్య భక్తులకు కేటాయిస్తాం. నిత్యం ఆలయంలో మూడున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తున్నాం. ఉత్సవ సమయంలో రోజూ ఆరు లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచుతాం. నాణ్యత, శుచి, శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. రోజూ లక్ష మందికిపైగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తాం. -
బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై తనిఖీలు
తిరుమల: తిరుమలలో సెప్టెంబర్ 16 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. ఆదివారం టీటీడీ ఈవో సాంబశివరావు తనిఖీలు నిర్వహించారు. సీవీఎస్వో నాగేంద్రకుమార్, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డితో కలిసి శ్రీవారి ఆలయంలో తనిఖీలు చేశారు. రద్దీ పెరిగిన సందర్భాల్లో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం క్యూలు కదిలే తీరును, లోటుపాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆలయం వెలుపల అఖిలాండం నుంచి మహారథం వరకు బ్రహ్మోత్సవ వాహన సమయాల్లో భక్తులు వేచి ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను పరిశీలించారు. అనంతరం ఎస్వీ మ్యూజియాన్ని పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. -
ఈడీపీ అధికారులపై టీటీడీ ఈవో ఆగ్రహం
తిరుమల : ఈడీపీ అధికారులపై టీటీడీ కార్యనిర్వహాణాధికారి డి. సాంబశివరావు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ప్రత్యేక దర్శనం టికెట్లు ఇష్టానుసారం విక్రయించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించి...భక్తులను ఇబ్బందులకు గురి చేశారని అధికారులపై సాంబశివరావు మండిపడ్డారు. భక్తుల రద్దీ నేపథ్యంలో క్యూలైన్లు తాత్కాలికంగా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. శనివారం తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారుల తీరుపై వారు మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులపై టీటీడీ ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆదివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి... క్యూలైన్లు రోడ్డుపైకి వచ్చాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటలు, నడక దారిలో వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. -
రాజమండ్రిలో 'శ్రీవారి నమూనా' ఆలయం
రాజమండ్రి: గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని నమూనా దేవాలయం ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ కార్యనిర్వహాణాధికారి డి.సాంబశివరావు వెల్లడించారు. అందుకోసం రూ. 2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం రాజమండ్రి వచ్చిన సాంబశివరావు విలేకర్లతో మాట్లాడారు. ఈ నమూనా దేవాలయానికి రోజూ 7 నుంచి 10 వేల మంది దర్శించుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నమూనా దేవాలయం కోసం 500 మంది టీటీడీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. తిరుమలలో జరిగే విధంగానే స్వామివారికి పూజలు నిర్వహిస్తామని సాంబశివరావు తెలిపారు. -
తిరుమలలో 1752 నకిలీ లడ్డూ టికెట్లు!
తిరుమలలో నకిలీ లడ్డూ టికెట్ల అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఇప్పటివరకు తాము 1752 నకిలీ లడ్డూ టికెట్లను గుర్తించామని ఆయన చెప్పారు. అక్రమాల్లో టీటీడీకి చెందిన ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధం ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైందని ఈవో సాంబశివరావు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన ఐదుగురు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. -
వేసవిలో దర్శన ఇబ్బందులుండవ్
- తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు - ఆన్లైన్లో సప్తగిరి చందా బుకింగ్‌కు ఏర్పాట్లు - డయల్ యువర్ ఈవోలో సాంబశివరావు వెల్లడి సాక్షి,తిరుమల: వేసవి సెలవుల్లో అశేష సంఖ్యలో తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు. శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్బంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు జేఈవో కేఎస్ శ్రీనివాసరాజుతో కలసి ఈవో పైవిధంగా బదులి చ్చారు. ఇప్పటికే బస, దర్శనం, తల నీలాలు, ప్రసాదాలు, వేసవిలో తాగునీరు, ఉచిత సముదాయల్లో పరిశుభ్రత వంటి అనేక అంశాల్లోనూ మార్పులు చేశామన్నారు. అన్ని కల్యాణకట్టల్లోనూ టికెట్లు వసూలు చేయకుండా ఉచితంగా తలనీలాలు తీస్తున్నట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు ఉండే బ్లేడ్లను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కల్యాణకట్టలతోపాటు గదులు, దర్శనంలో డబ్బు లు అడిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిని తిరుపతి దింపేసే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. వృద్ధులు, వికలాంగుల దర్శనంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. వారు స్వామి దర్శనం కోసం వచ్చే దూరాన్ని తగ్గిం చేలా పరిశీలిస్తామని తెలిపారు. ఎస్వీబీసీలో ప్రస్తుతం తెలుగులోనే ప్రసారాలున్నాయని, త్వరలోనే తమి ళం, కన్నడ భాషల్లో కార్యక్రమాలు ప్ర సారం చేస్తామన్నారు. సప్తగిరి మాసపత్రికను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. టీటీడీ పరిధిలో భక్తులకు ఎదురైన సమస్యలను దేవస్థానం కాల్‌సెంటర్ 0877-2277777 ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే పరి ష్కరిస్తున్నట్లు ఈవో సాంబశివరావు వివరించారు. -
పచ్చని చెట్లతో తిరుమల క్షేత్రం అభివృద్ధి
టీటీడీ ఈవో సాంబశివరావు వికలాంగుల క్యూ మార్పునకు ఆదేశం సాక్షి,తిరుమల : తిరుమల క్షేత్రాన్ని పచ్చని చెట్లు, మనసుదోచే పుష్పాల మొక్కలతో అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈవో డి.సాంబశివరావు అన్నారు. గురువారం ఆయన ఆలయ నాలుగు మాడ వీధులతోపాటు పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్తోపాటు ఎక్కడ చూసినా పచ్చదనం కనిపించేలా మొక్కలు నాటే పనులు ప్రారంభించాలని అధికారులను ఈవో ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వేసవి రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అన్ని విభాగాలను ఆదేశించామన్నారు. కల్యాణకట్టల్లో సత్వరమే గుండ్లు కొట్టేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అక్కడ కూడా పారిశుధ్యం మరింత మెరుగుపడేలా సత్వర చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. యాత్రాసదన్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. వికలాంగుల క్యూ మార్పునకు ఆదేశం వికలాంగులు, వృద్ధుల నడక భారాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం అనుమతించే తిరుమల ఆలయం నుంచి కాకుండా ఇకపై సహస్రదీపాలంకరణ మండపం ఎదురుగా ఉండే అత్యవసర ద్వారం నుంచే అనుమతించే ఏర్పాట్లు చేయాలని ఈవో సాంబశివరావు ఇంజినీర్లను ఆదేశించారు. ఉదయం10, మధ్యాహ్నం 3 గంటలకు అనుమతించే సమయంలో తాత్కాలిక క్యూలు ఏర్పాటు చేసి వారి నడక భారాన్ని తగ్గించాలని ఆయన ఆదేశించారు. -
తిరుమలలో అన్నదానానికి 30 ఏళ్లు
చిత్తూరు: తిరుమల క్షేత్రంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా నిర్వహిస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు అన్నారు. 1985, ఏప్రిల్ 6న రోజుకు రెండు వేల మందితో అన్నదాన కార్యక్రమం ప్రారంభం కాగా... అది నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. ఆదివారం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనంలో ఈవో సాంబశివరావు విలేకరులతో మాట్లాడారు. అన్నదాన కార్యక్రమం 30 ఏళ్లుగా భక్తుల ఆకలి తీర్చిందన్నారు. రోజుకు 45 వేలు, వారాంతంలో రోజుకు 55 వేలు, పర్వదినాల్లో లక్ష మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నట్టు తెలిపారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరులో రోజుకు 1.16 లక్షల నుంచి 1.42 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నట్టు వెల్లడించారు. 3.6 లక్షల మంది దాతలు ఇచ్చిన రూ.591.36 కోట్ల విరాళాలపై వచ్చే రూ.40 కోట్ల వడ్డీతోపాటు, టీటీడీ రూ.30 కోట్ల గ్రాంట్ కలుపుకుని ఏడాదికి రూ.70 కోట్ల ఖర్చుతో నిత్యాన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇకపై భక్తులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతపై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డెప్యూటీ ఈవోలు వేణుగోపాల్, రమణ, సరోజిని, పీఆర్వో రవి తదితరులు పాల్గొన్నారు. -
‘సేవ’కు వెంకన్న వరం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి కల్యాణకట్ట సేవకులకు శుభవార్త. ప్రస్తుతం కల్యాణ కట్టలో ఉచితంగా సేవలందించే వారికి ఏప్రిల్ 1 నుంచి ఒక్కొక్కరికి రోజుకు కనీసం రూ.400కు తగ్గకుండా బహుమానం ఇవ్వాలని టీటీడీ ఈవో సాంబశివరావు నిర్ణయించారు. తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి డబ్బులు తీసుకోవడం.. వారివద్ద నుంచి కొందరు అధికారులు మామూళ్లు తీసుకోవడం.. వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కల్యాణకట్టల్లో పనిచేసే 280 మంది శాశ్వత ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి రూ.30వేల దాకా జీతభత్యాలు వస్తున్నాయి. 300 మంది కాంట్రాక్టు కార్మికులు (పీసురేటు క్షురకులు)కు ఒక్కో గుండుకు రూ.7, కత్తిరింపులకు రూ.3 టీటీడీ అందజేస్తోంది. ఉచిత సేవచేసే సుమారు వెయ్యిమందికి ఎలాంటి ఉపాధి లేదు. పైగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం భక్తుల నుంచి క్షురకులు చేయిచాచి నగదు అడగరాదు. క్షౌర వృత్తి సాగించేవారు పేద వర్గానికి చెందినవారే. ‘మానవసేవే మాధవ సేవ’గా సేవలందించే ధార్మిక సంస్థ అయిన టీటీడీ కల్యాణకట్టల్లో మూడు విభాగాలు (శాశ్వత ఉద్యోగులు, పీసురేటు కార్మికులు, ఉచిత సేవకులు) అన్న తారతమ్యాలున్నాయి. ఉచిత సేవ చేసేవారు, వారిపై ఆధారపడ్డ కుటుంబాల జీవనం కోసం కాంట్రాక్టు కార్మికుల తరహాలోనే బహుమానం ఇవ్వడం సముచితమని టీటీడీ ఈవో సాంబశివరావు భావించారు. ఈనేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి బహుమానం ఇవ్వాలని నిర్ణయించారు. కనీసం ఒక్కొక్కరికి రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు బహుమానం ఇచ్చే విషయంపై లెక్కలు వేస్తున్నారు. జీవనం కోసం క్షురకులకు బహుమానం : ఈవో కల్యాణకట్టల్లో ఉచిత సేవ చేసే క్షురకులు దాదాపుగా పేదవర్గానికి చెందినవారేనని, అలాంటి వారి జీవనం సాఫీగా సాగేందుకు బహుమానం అందజేస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు గురువారం రాత్రి సాక్షికి తెలిపారు. కల్యాణకట్టల్లో ఉచిత సేవచేస్తూ భక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంలో ధార్మిక సంస్థ ప్రతిష్ట ఇమిడి ఉంటుందన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే పీసురేటు కార్మికుల తరహాలోనే కల్యాణకట్ట సేవకులకూ ఏప్రిల్ నుంచి బహుమానం అందజేస్తామన్నారు. -
నూతన ఏడాదిలో విస్తృతంగా ధర్మప్రచారం
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి తిరుపతి కల్చరల్: శ్రీవారి వైభవాన్ని, సనాతన ధర్మాన్ని మరింత వ్యాప్తి చేసేలా తెలుగు నూతన సంవత్సరంలో విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో శనివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈవో ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్మథనామ సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని, భక్తులందరిపైనా శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులందరికీ మరింత మెరుగ్గా సంతృప్తికరమైన దర్శనం, బస, అన్నప్రసాద వితరణ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. టీటీడీ సామాజిక బాధ్యతగా చేపడుతున్న పేదరోగులకు వైద్యసాయం, విద్యాదానం పథకాలను మరింత ఎక్కువ మందికి వర్తింపచేసి విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా భక్తిభావంతో శ్రీవారిని ప్రార్థిస్తే తప్పక కరుణిస్తాడని, అంతా మంచే జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో భక్తి పెంపు మహతిలో ఉగాది వేడుకల్లో భాగంగా బాలసుబ్రమణ్యం శాస్త్రి పంచాగ శ్రవణం చేస్తూ మన్మథనామ సంవత్సరంలో ప్రజల్లో భక్తిభావం పెరుగుతుందని, తద్వారా శ్రీవారు కొలువైన తిరుమల, తిరుపతి దేవస్థానం అఖండజ్యోతిగా వెలుగొందుతుందని తెలిపారు. శ్రీవేంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. అనంతరం పంచాగ కర్తను ఈవో శాలువ, జ్ఞాపిక, శ్రీవారి ప్రసాదంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనంలో డాక్టర్ సుముద్రాల లక్ష్మణయ్య , కలవకుంట మూర్తి, ఆచార్య మునిరత్నం, ముదివర్తి కొండమాచార్యులు, మన్నవ భాస్కర్‌నాయుడు, ఆకె ళ్ల విభీషణ శర్మ, ఉప్పలపాటి వెంకటరమణ, వీరమల్లయ్య, వెంకటస్వామి, మహర్షి సాగర్, టీటీడీ ఉద్యోగులు తోట వెంకటేశ్వర్లు, రవిచంద్రన్, హేమంత్‌కుమార్, నాగశ్రీలక్ష్మీ, కృష్ణవేణి తమ కవితలను చదివి వినించారు. టీటీడీ తిరుపతి జేఈవో పోల భాస్కర్ వారిని సన్మానించారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగుల పిల్లలు ప్రదర్శించిన ‘తెలుగు వైతాళికులు’ బాలబాలికల వేషధారణ తెలుగు వెలుగు సాంస్కృతిక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఉగాదిని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, పద్యపఠనం, కవితలు, పాటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ప్రయాగ రామకృష్ణ, ప్రత్యేకాధికారి రఘునాథ్, పీఆర్వో రవి, డెప్యూటీ ఈవో గౌతమి, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు. -
వైభవంగా ప్రహ్లాదవరదుడి కల్యాణం
ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లి అమ్మవార్ల కల్యాణం వైభవంగా సాగింది. 108 దివ్యక్షేత్రాల్లో జరిగే బ్రహ్మోత్సవాల్లో కల్యాణోత్సవం జరిగేది ఒక్క అహోబిల క్షేత్రం మాత్రమే. అందుకే అహోబిలంలో జరిగే కల్యాణోత్సవాన్ని తిలకించడానికి వేలాదిగా భక్తులు హాజరయ్యారు. అహోబిలమఠం 46 పీఠాధిపతి శ్రీవన్శఠగోప యతీంద్రమహదేశికన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ దివ్య కల్యాణ క్రతువును నిర్వహించారు. టీటీడీ ఈవో సాంబశివరావు టీటీడీ తరఫున ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. తన కల్యాణోత్సవ సమయంలో వెంకటేశ్వరస్వామి అహోబిల నరసింహస్వామిని పూజించారని పురాణాలు చెపుతున్నాయి. వెంకటేశ్వరస్వామి ఇష్టదైవమైన నరసింహస్వామి కళ్యాణానికి టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. వేదపండితులు విశ్వక్షేణునికి మొదట పూజలు నిర్వహించారు. ఘంటానాదం, మంగళవాయిద్యాలు నడుమ స్వామివారికి, అమ్మవారికి కంకణధారణ కార్యక్రమం నిర్వహించారు. లోకరక్షణ కోసం రక్షబంధనంను సంప్రదాయబద్ధంగా జరిపారు. స్వామి వారికి,అమ్మవారికి మంగళనీరాజనం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.స్త్రీసూక్తం, పురుష సూక్త పారాయణం చేశారు. నిత్యహోమంను హోమద్రవ్యాలతో నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణ మధ్య మాంగళ్యధారణ కార్యక్రమం జరిపారు. పీఠాధిపతికి ఆలయ మర్యాదలు చేశారు. కల్యాణోత్సవాన్ని దేవ స్థాన అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, దేవస్థాన మేనేజర్ రామానుజన్‌లు పర్యవేక్షించారు.ఎఎస్పీ శశికుమార్, సీఐ ఓబులేసు, ఎస్సైలు సాయినాథ్, సోమ్లానాయక్‌లు బందోబస్తు నిర్వహించారు. -
30 నుంచి 2 వరకు ఆర్జిత సేవలు రద్దు: టీటీడీ
తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో తిరుమలలో ఈనెల 30వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ప్రకటించారు. -
టీటీడీ ఈవోగా సాంబశివరావు
ఎంజీ గోపాల్ తెలంగాణకు బదిలీ సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కార్యనిర్వహణ అధికారి ఎంజీ.గోపాల్‌ను ప్రభుత్వం తెలంగాణకు బదిలీ చేసింది. పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.సాంబశివరావును టీటీడీ ఈవోగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఎంజీ.గోపాల్ టీటీడీ ఈవోగా జూలై 6, 2013న నియమితులయ్యారు. ఏడాదిన్నరపాటు ఈవోగా పనిచేసిన ఆయన టీటీడీలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. శ్రీవారి దర్శనంలో సమూలమైన మార్పు లుతెచ్చారు. దర్శనంలో మూడు వరుసల విధానాన్ని ప్రవేశపెట్టారు. రూ.300ల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో విక్రయించే విధానానికి శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో కీలకభూమిక పోషించారు. ఐఏ ఎస్‌ల విభజనలో ప్రత్యూష కమిటీ ఎంజీ.గోపాల్‌ను తెలంగాణకు కేటాయిం చింది. ఆయన్ను తెలంగాణ కేడర్‌కు కేటాయించడంతో ప్రభుత్వం బదిలీ చేసింది. గిరిధర్‌ను తెలంగాణకు కేటాయించినప్పటి నుంచి టీటీడీ ఈవో పదవిని దక్కించుకోవడానికి పలువురు ఐఏఎస్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. సీఎంవో కార్యదర్శిగా పనిచేస్తోన్న 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎ.గిరిధర్‌ను టీటీడీ ఈవోగా నియమిస్తారని అప్పట్లో అధికారవర్గాలు వెల్లడించాయి. కానీ.. పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.సాంబశివరావును టీటీడీ ఈవోగా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. 1986 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన డి.సాంబశివరావుకు సమర్థవంతమైన అధికారిగా పేరుంది. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే సాంబ శివరావుకు గాడితప్పిన టీటీడీని గాడిలో పెట్టే సత్తా ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
టీటీడీ ఈవో గోపాల్ బదిలీ..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగింది. రాష్ట్రప్రభుత్వం ఈమేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో గోపాల్ బదిలీ అయ్యారు. గోపాల్ స్థానంలో డి.సాంబశివరావు నియమితులయ్యారు. మున్సిపల్ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎ. గిరిధర్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా అజయ్ జైన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా సునీతకు అదనపు బాధ్యతలు అప్పగించగా, గుల్జార్, ఎంజీ గోపాల్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలనా శాఖను సంప్రదించాలని వారికి ఆదేశాలు అందాయి. కాగా గుల్జార్ ఇప్పటికే కేంద్ర సర్వీసులకు ఎంపిక అయ్యారు. -
ముత్యపుపందిరిపై కాళంగి మర్ధినియై..
తిరుచానూరు : పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజైన శుక్రవారం ఉదయం కాళంగి మర్ధిని రూపంలో ముత్యపుపందిరి వాహనమెక్కి అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు, అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి అక్కడే సిద్ధంగా ఉంచిన ముత్యపుపందిరి వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైఢూర్య స్వర్ణాభరణాలతో అమ్మవారిని కాళంగి మర్ధనం చేస్తున్న శ్రీకృష్ణునిగా అలంకరించారు. అనంతరం 8 గంటలకు భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, జియ్యర్ స్వాముల దివ్య ప్రబంధ ప్రవచనం, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణ నడుమ తెల్లని, చల్లని ముత్యపుపందిరిపై అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు సింహవాహనంపై యోగనరసింహుని అలంకరణలో అమ్మవారు భక్తులకు తిరువీధుల్లో సాక్షాత్కరించారు. వాహనసేవలో టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఏఈవో నాగరత్న, వీజీవో రవీంద్రారెడ్డి, ఏవీఎస్వో రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు. వాహన సేవలో పుస్తకాల ఆవిష్కరణ తిరుచానూరు : పద్మావతి అమ్మవారి ముత్యపుపందిరి వాహన సేవలో భాగంగా శుక్రవారం ఉద యం వాహన మండపం వద్ద టీటీడీ ఈవో రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. అమ్మవారి విశేషాలు, స్త్రోత్రాలు, స్థలపురాణం, బ్రహ్మోత్సవ వైభవం వంటి అంశాలతో రచించిన అలమేలుమంగాపుర వైభవం, శ్రీవారి ఆలయంలోని రాములవారిమేడ విశేషాలతో డాక్టర్ మేడసాని మోహన్ ఈ పుస్తకాలను రచించారు. వీటిని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో పోలా భాస్కర్, డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య ఆవిష్కరించారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు ఆవిర్భవించిన పద్మసరోవరం(పుష్కరిణి) నిర్మాణమే ఓ అద్భుతం. నాటి కాలపు పనితీరుకు నిదర్శనం. పుష్కరిణి నైరుతి, ఈశాన్యం మూలల్లో భారీ తూములను ఏర్పాటుచేశారు. పొన్నకాలువ నుంచి ఒక పాయ గుండా ప్రవహించే నీరు నైరుతి మూలలోని తూము గుండా పుష్కరిణికి చేరేది. పుష్కరిణి నిండిన తరువాత ఈశాన్యం మూల నుంచి నీరు (ప్రస్తుతం కాలువగడ్డ వీధిలోని కాలువ) గుండా ప్రవహిస్తూ దామినేడు చెరువుకు వెళ్లేది. అలా పుష్కరిణిలో నీళ్లు ఎప్పుడు స్వచ్ఛంగా ఉండేది. అయితే కాలువలు అంతరించాక పుష్కరిణిలోకి నీరు రాకపోవడంతో నిల్వ చేరి పాచిపట్టేది. ఇప్పుడు పుష్కరిణిలోకి బోరు నీటి ద్వారా నీటిని నింపుతున్నారు. ఐదేళ్ల క్రితం సిమెంటు కాంక్రీటు వేశారు. నీళ్లు పరిశుభ్రంగా, తాజాగా ఉండేందుకు ఫిల్టర్లు ఏర్పాటుచేసి క్లోరిన్‌తో శుభ్రం చేస్తున్నారు. భద్రత దృష్ట్యా చుట్టూ ఇనుప గ్రిల్స్‌ను ఏర్పాటుచేశారు. -
దళారుల కట్టడికే ఆన్లైన్ టికెట్లు
సాక్షి, తిరుమల: ఆన్లైన్లో రూ. 300 టికెట్ల విక్రయాల ద్వారా కల్పించే దర్శనంలో అక్రమాలకు అవకాశం లేకుండా అమలు చేస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ అన్నారు. గురువారం జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణతో కలిసితో కలసి ఆయన రూ.300 ఆన్లైన్ టికెట్ల క్యూను సందర్శించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ రోజుకు 11 వేల టికెట్లు ఇస్తున్నామని, త్వరలోనే ఈ సంఖ్యను 15వేలకు పెంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. దళారులను ఆశ్రయించకుండా ఉండేందుకే ఈ ఆన్లైన్ దర్శనం ప్రవేశ పెట్టామన్నారు. వస్త్రధారణ, టీటీడీ నిబంధనలను టికెట్లపై అన్ని భాషల్లో ముద్రించే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ
తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 6.00 నుంచి 8.00 గంటల మధ్య బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5.36 నిముషాల నుంచి 6.00 గంటల మధ్య మీన లగ్నమందు ధ్వజారోహణం ఉంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామి వారికి ఏపీ సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు రాత్రి 7.45 గంటలకు స్వామి వారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారని టీటీడీ ఆలయ ఈవో ఎంజీ గోపాల్ వెల్లడించారు. తిరుమల చేరుకునేందుకు చంద్రబాబు ప్రయాణించే అలిపిరి టోల్గేట్ నుంచి రెండవ ఘాట్ రోడ్డు వద్ద భారీగా బందోబస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే చంద్రబాబు పర్యటించే అన్ని ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించినట్లు చెప్పారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అలాగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలకు ఆర్టీసీ మరిన్ని బస్సు సర్వీసులను నడుపుతుందని ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు. -
వేదాల పరిరక్షణే టిటిడి ధ్యేయం:ఈఓ గోపాలన్
తిరుపతి: వేదాలను పరిరక్షించడమే తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ధ్యేయం అని ఈఓ గోపాలన్ చెప్పారు. శ్రీవెంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం(ఎస్‌వివియు) రెండవ స్నాతకోత్సవం ముగిసింది. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ వేదాలలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని వెలుగులోకి తెస్తున్నట్లు చెప్పారు. అన్ని వేద పాఠశాలలో ఒకే కరికులం ఉండేలా చర్యలు తీసుకుంటామని గోపాలన్ అన్నారు. -
క్షణాల్లో వందల టికెట్లు అమ్ముడైపోయాయి
తిరుపతి : ఇంటర్నెట్, ఈ-దర్శనం కౌంటర్ల కోసం మూడు వందల రూపాయల టికెట్లను టీటీడీ ఈవో గోపాల్ బుధవారం విడుదల చేశారు. ఐదు వేల టికెట్లు విడుదల కాగా.. క్షణాల్లో వందల టికెట్లు అమ్ముడైపోయాయి. మరోవైపు విజయవాడలో ఈ టికెట్ల కోసం భారీ క్యూ కనిపించింది. ప్రయోగాత్మకంగా తొలివిడత 5 వేల టికెట్లు ఇచ్చారు. అందులో 2500 టికెట్లను ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా కేటాయించారు. మిగిలిన వాటిని టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాల నుంచి కేటాయింపు జరిగింది. టీటీడీ ఈ-దర్శన్ టికెట్లను హైదరాబాద్ కౌంటర్లో 850, విశాఖపట్నం 675, విజయవాడ 350, కర్నూలు 100, తిరుపతి 200, నెల్లూరు 100, నిజామాబాద్ 75, వరంగల్ 75, అనంతపురం కౌంటర్లో 75 కేటాయించారు. టికెట్లు పొందిన భక్తులను ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలు, 3 గంటల సమయం స్లాట్లలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇక ఇంటర్నెట్ ద్వారా టికెట్లు పొందే భక్తులు వారి ఫొటో గుర్తింపు కార్డును అప్లోడ్ చేసి, పేమెంట్ గేట్ వే ద్వారా క్రెడిట్, లేదా మాస్టర్ వీసా కార్డులద్వారా నగదు చెల్లింపులు చేయాలి. ఈ దర్శన కౌంటర్లలో భక్తులే నేరుగా వెళ్లి నగదు చెల్లించి ఫొటోమెట్రిక్ పద్ధతిలో వేలి ముద్ర, ఫొటో తీసుకుని టికెట్టు పొందవచ్చు.