
దాశరధిని దర్శించుకున్న టీటీడీ ఈఓ
ఒంటిమిట్ట(రాజంపేట): టీటీడీ ఈఓ సాంబశివారావు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయాన్ని సందర్శించారు. శ్రీరామ నవమి బ్రహ్మోత్సలను పురష్కరించుకొని శనివారం ఆయన రామాలయానికి విచ్చేశారు. ముందుగా ఆలయ ప్రధానఅర్చకుడు వీణారాఘవాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయంలో ఏర్పాట్లు, సౌకర్యాలపై ఆరా తీశారు. స్వయంగా పరిశీలించారు. తాగునీటి సౌకర్యం, ఆలయ ఆవరణంలో చలువపందిళ్లు, ఆలయ సంప్రదాయపరంగా నిర్వహించాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. ఈవో వెంట జెఈఓ పోలాభాస్కర్, టీటీడీ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా జిల్లా కలెక్టరు సత్యనారాయణ వచ్చిన ఆలయం బయటే వేచివుండాల్సి వచ్చింది. కలెక్టరు ఉన్న విషయాన్ని టీటీడీ అధికారులు విస్మరించడం వల్లనే ఆయన బయటేఉండిపోయారనే వాదన వినిపిస్తోంది.