టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలు: మార్గాని భరత్‌ | Margani Bharat Slams TTD EO And Chandrababu On Tirupati laddu Issue | Sakshi
Sakshi News home page

టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలు: మార్గాని భరత్‌

Published Wed, Sep 25 2024 11:40 AM | Last Updated on Wed, Sep 25 2024 12:50 PM

Margani Bharat Slams TTD EO And Chandrababu On Tirupati laddu Issue

సాక్షి, రాజమండ్రి:  రాజకీయాల కోసం చంద్రబాబు తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్‌ మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని దుయ్యబట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలయ్యాయని తెలిపారు. సీఎంకు ఇచ్చిన నివేదికలో ఒకలా.. షోకాజ్‌ నోటీసుల్లో మరోలా ఉందని పేర్కొన్నారు.

ఈ మేరకు బుధవారం రాజమంత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలైలో రిపోర్టు వస్తే రెండు నెలల వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కేసులు ఎందుకు నమోదు చేయలేదని, అరెస్ట్‌  ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.  

‘జులై 23న నెయ్యిలో వెజిటబుల్‌ ఆయిల్స్‌ ఉన్నట్లు నివేదిక వచ్చిందన్న ఈవో.. సీఎంకు ఇచ్చన నివేదికలో మాత్రం జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చని ఎన్‌డీడీబీ అనుమానం వ్యక్తం చేసిందని తెలిపారు. ఎన్‌డీడీబీ నుంచి రిపోర్టు తెప్పించిన తర్వాత సెకండ్‌ ఒపినియన్‌ ఎందుకు తీసుకోలేదు? ఎవరిని మీరు తప్పు దోవ పట్టిస్తున్నారు? ’ అని మండిపడ్డారు.


చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్‌ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement