అంగ ప్రదక్షిణం చేసే భక్తులకు ఆధార్ తప్పనిసరి | aadhaar card compulsory for tirumala devotees | Sakshi
Sakshi News home page

అంగ ప్రదక్షిణం చేసే భక్తులకు ఆధార్ తప్పనిసరి

Published Tue, Jul 12 2016 8:15 PM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

aadhaar card compulsory for tirumala devotees

టీటీడీ ఈవో సాంబశివరావు

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం చేసేందుకు టికెట్లు పొందే భక్తులకు ఆధార్‌కార్డు తప్పనిసరి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అధికారులను మంగళవారం ఆదేశించారు. రోజూ పరిమితంగానే 750 టికెట్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ టికెట్ల కేటాయింపులు ఆధార్‌తో అనుసంధానం చేయటం వల్ల రొటేషన్ పద్దతిలో అందరికీ ఉపయుక్తంగా ఉండేలా నిర్ణయం తీసుకునేందుకు వీలు ఉంటుందని చెప్పారు. మంగళవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీనియర్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement