టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌ రెడ్డి | Jawahar Reddy Takes Over As New EO Of TTD | Sakshi
Sakshi News home page

టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌ రెడ్డి

Published Sat, Oct 10 2020 12:32 PM | Last Updated on Sat, Oct 10 2020 2:14 PM

Jawahar Reddy Takes Over As New EO Of TTD - Sakshi

సాక్షి, తిరుపతి: టీటీడీ నూతన ఈఓగా ఐఏయస్ అధికారి డా​క్టర్‌ జవహర్‌ రెడ్డి శనివారం భాద్యతలు చేపట్టారు. ఉదయం అలిపిరి నుంచి నడకదారిలో తిరుమలకి చేరుకున్నారు. అనంతరం 12 గంటలకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ ధర్మారెడ్డి నుంచి పదవీబాధ్యతలు తీసుకున్నారు. జవహర్ రెడ్డి భాద్యతలు చేపట్టాకా మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. టీటీడీ 27వ ఈఓగా జవహర్ రెడ్డి భాద్యతలు చేపట్టారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని దర్శించుకొని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement