తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 6.00 నుంచి 8.00 గంటల మధ్య బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5.36 నిముషాల నుంచి 6.00 గంటల మధ్య మీన లగ్నమందు ధ్వజారోహణం ఉంటుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామి వారికి ఏపీ సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు రాత్రి 7.45 గంటలకు స్వామి వారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారని టీటీడీ ఆలయ ఈవో ఎంజీ గోపాల్ వెల్లడించారు. తిరుమల చేరుకునేందుకు చంద్రబాబు ప్రయాణించే అలిపిరి టోల్గేట్ నుంచి రెండవ ఘాట్ రోడ్డు వద్ద భారీగా బందోబస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే చంద్రబాబు పర్యటించే అన్ని ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించినట్లు చెప్పారు.
ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అలాగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలకు ఆర్టీసీ మరిన్ని బస్సు సర్వీసులను నడుపుతుందని ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు.