రాజమండ్రిలో 'శ్రీవారి నమూనా' ఆలయం
రాజమండ్రి: గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని నమూనా దేవాలయం ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ కార్యనిర్వహాణాధికారి డి.సాంబశివరావు వెల్లడించారు. అందుకోసం రూ. 2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం రాజమండ్రి వచ్చిన సాంబశివరావు విలేకర్లతో మాట్లాడారు.
ఈ నమూనా దేవాలయానికి రోజూ 7 నుంచి 10 వేల మంది దర్శించుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నమూనా దేవాలయం కోసం 500 మంది టీటీడీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. తిరుమలలో జరిగే విధంగానే స్వామివారికి పూజలు నిర్వహిస్తామని సాంబశివరావు తెలిపారు.