
మరింత నాణ్యతగా శ్రీవారి లడ్డూ: టీటీడీ
తిరుమల :శ్రీవారి లడ్డూ నాణ్యతను మరింత పెంచేందుకు కృషి చేస్తామని టీటీడీ ఈఓ దొండపాటి సాంబశివరావు తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శనివారం ఆయన ఆలయంతో పాటూ, ఆలయం వెలుపల లడ్డూ కౌంటర్లను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలకు తగ్గట్టుగానే నాణ్యమైన లడ్డూలు ఇస్తామన్నారు. ఇందులో భాగంగా లడ్డూ తయారీకి వాడే సరుకులు మరింత నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి భక్తుడికీ నాలుగు లడ్డూలకు తగ్గకుండా ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.