
సాక్షి, తిరుపతి: డాక్టర్ జవహర్ రెడ్డి శనివారం తెల్లవారుజామున అలిపిరి మార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు గానూ, ఆయన కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. కాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమిస్తూ బుధవారం రాత్రి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. జవహర్‌రెడ్డి ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొద్ది రోజుల కిందటే టీటీడీ ఈవోగా పనిచేస్తున్న అనిల్‌కుమార్ సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment