26, 27న తిరుపతిలో ప్రధాని పర్యటన  | Prime Ministers visit to Tirupati on 26th and 27th | Sakshi
Sakshi News home page

26, 27న తిరుపతిలో ప్రధాని పర్యటన 

Published Sat, Nov 25 2023 3:17 AM | Last Updated on Sat, Nov 25 2023 8:35 AM

Prime Ministers visit to Tirupati on 26th and 27th - Sakshi

సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26, 27 తేదీల్లో తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) డా.కేఎస్‌.జవహర్‌రెడ్డి శుక్రవారం వీడి­యో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వ­హించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఈనెల 26వ తేదీ సాయంత్రం తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారని తెలి­పారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లి.. రాత్రి బస చేస్తారని చెప్పారు. 27వ తేదీ ఉదయం శ్రీవేంకటేశ్వ­రస్వామిని దర్శించుకుంటారని పేర్కొ­న్నా­రు.

అనంతరం తిరుపతికి చేరుకొని.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారని వెల్లడించారు. ప్రధాని మోదీ తిరుపతి విమానా­శ్రయం నుంచి తిరుమల కొండపైకి చేరుకునే రోడ్డు మార్గం వెంబడి పటిష్ట బందోబస్తు ఏర్పా­టు చేయాలని పోలీస్‌ శాఖ అధికారులను సీఎస్‌ ఆదేశించారు. 27వ తేదీ ఉదయం తిరుమలలో స్వామి వారిని దర్శించుకునే సమయంలో.. వీవీ­ఐపీ పర్యటన నిబంధనల ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సీఎస్‌ సూచించారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని.. ఎలాంటి పొర­పాట్లకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, రాష్ట్ర ప్రొటోకాల్‌ విభాగం డైరెక్టర్‌ బాలసు­బ్ర­హ్మ­ణ్యంరెడ్డి, డీఎంఈ డా.నర్సింహం, ఐ అండ్‌ పీఆర్‌ అదనపు సంచాలకులు ఎల్‌.స్వర్ణలత, తిరు­పతి కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, టీటీడీ ఈవో ధ­ర్మా­రెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి పాల్గొన్నా­రు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement