తిరుపతి అర్బన్: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తిరుపతి ఘన స్వాగతం పలికింది. అత్యాధునికమైన, వేగవంతమైన ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు. రాత్రి 10.40 గంటలకు రైలు తిరుపతి చేరుకుంది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తిరుపతి వరకు ప్రయాణం చేశారు.
తిరుపతి రైల్వే స్టేషన్‌లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, రైల్వే డీఆర్‌ఎం వెంకటరమణారెడ్డి, ఏడీఎం సూర్యనారాయణ, సీనియర్ డీసీఎం ప్రశాంత తదితరులు స్వాగతం పలికారు. టీటీడీ నేతృత్వంలో తిరుపతి స్టేషన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు ట్రయల్ రన్‌లో భాగంగా రైల్వే అధికారులు పలువురు విద్యార్థులు, ఉద్యోగులకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు.
తిరుపతికి చెందిన పలువురు విద్యార్థులతోపాటు రైల్వే ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు శనివారం ప్యాసింజర్ రైలులో నెల్లూరు వెళ్లి, అక్కడి నుంచి తిరుపతికి వందేభారత్ రైలులో ప్రయాణం చేశారు. మరో రెండు రోజులు ఈ ట్రైన్ ట్రయల్ రన్ కొనసాగనుంది. ఆ తర్వాత రెగ్యులర్ సరీ్వసు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌కు బయల్దేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment