ఈయనెవరో కాదు..
తిరుమల: ఈ ఫొటోలో నిలుచున్న వ్యక్తి ఎవరో తెలుసా..? ఆయనే టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు. టీటీడీ సిబ్బందితో కలసి పరకామణిలో ఇలా పాల్గొన్నారు. ఏటా హుండీ ద్వారా నగదు, బంగారు, వెండి, ఇతర కానుకల ద్వారా మొత్తంగా రూ.1,300 కోట్ల వరకు టీటీడీకి లభిస్తోంది. ప్రతిష్టాత్మకమైన హుండీ లెక్కింపులో పాత మూసపద్ధతులు పక్కన బెట్టి శాస్త్రీయత పెంచాలని ఈవో నిర్ణయించారు. నిబంధనల ప్రకారం పరకామణిలో పాల్గొనాలంటే పంచె, బనియన్ మాత్రమే ధరించాలి. ఆ నిబంధన తాను కూడా పాటించారు. భక్తులు హుండీలో సమర్పించిన నగదు, బంగారు, వెండి, విలువైన రాళ్లు, విదేశీ కరెన్సీనోట్ల లెక్కింపును మూడు గంటలపాటు పర్యవేక్షించారు. లోటుపాట్లు గుర్తించారు. మార్పులు చేర్పులు చేయాలని సూచించారు.