hundi counting
-
నూతన పరకామణి భవనంలో లెక్కింపు ప్రారంభం
తిరుమల: శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో ఆదివారం నుంచి లెక్కించడం ప్రారంభించినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. నూతన పరకామణి భవనంలో ఆయన పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ సహకారంతో నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తిరుమల పెద్దజీయర్ స్వామి వారి ఆశీస్సులతో ఆదివారం ఉదయం 5.30 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి 12 హుండీలను చిన్న లిఫ్ట్ సహాయంతో లారీలో తరలించినట్లు చెప్పారు. ఇకపై రోజూ అన్ని హుండీలు నూతన పరకామణి భవనానికి చేరుకుంటాయన్నారు. త్వరలో ఆలయంలోని పరకామణి మండపాన్ని భక్తులు కూర్చునేందుకు వీలుగా తీర్చిదిద్దుతామన్నారు. -
దుర్గమ్మ కానుకల లెక్కింపులో వీడని మూస పద్ధతి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం... రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. నిత్యం వేలాది మంది భక్తులు రాక.. రోజుకు రూ.13.90 లక్షలకు పైగానే హుండీ ఆదాయం... ఇక దసరా, భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు ముగిస్తే కానుకల లెక్కింపు మూడు, నాలుగు రోజులు సాగాల్సిందే! రోజుకు వెయ్యి నుంచి 30 వేల పైబడి భక్తులకు పెరిగినా... కానుకల లెక్కింపులో మాత్రం దేవస్థానం ఇంకా మూస పద్ధతినే అవలంభిస్తున్నారు. దీంతో అమ్మవారి కానుకలు, మొక్కుబడులు చేతి వాటానికి గురవుతున్నాయి. బయట పడేవి కొన్నే... గడిచిన ఐదేళ్ల కాలంలో పదికి పైగా ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ఘటనల్లో ఆలయ సిబ్బంది నేరుగా ఉంటే మరి కొన్ని సంఘటనల్లో సేవా సిబ్బంది, అవుట్ సోర్స్ సిబ్బంది ఉంటున్నారు. టీ కప్పులో బంగారం తాడు దాచి దొరికి పోయిన వైనం ఒకటయితే.. హుండీల నుంచి కానుకలను మహా మండపానికి తరలించేందుకు తీసుకెళ్లే ప్లాస్టిక్ సంచులలో బంగారాన్ని దాచి పెట్టి దొరిపోయిన వైనం మరోటి. సేవకు వచ్చి బంగారం, డబ్బు చక్క బెట్టేసిన వైనం ఇంకొకటి.. ఇలా బయట పడిన ఘటనలు కొన్ని.. ఇంక బయట పడని ఘటనలు ఎన్ని ఉన్నాయోననే అనుమానాలు భక్తులు వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానానికి కానుకలు, మొక్కుబడులు పెరుగుతున్న తరుణంలో ప్రతి వారం లేదా పది రోజులకు ఒక సారి లెక్కింపు జరిగితే ఇటువంటి ఘటనలకు చెక్ పెట్టవచ్చునని భక్తులు అభిప్రాయపడుతున్నారు. వారం లెక్కింపునకు అడ్డంకులేంటి.. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను ప్రస్తుతం 15 రోజులకు ఒక సారి చేపడుతున్నారు. దీంతో ఆలయంలోని అన్ని హుండీల నుంచి ఒకే సారి కానుకలను లెక్కింపుకు తీయడంతో అవి వంద నుంచి 120కి పైగా మూటలవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కానుకలను లెక్కించడం ఆలయ సిబ్బందికి ఇబ్బందికరంగా ఉంది. లెక్కింపుకు ఆలయ సిబ్బందితో పాటు సేవా సిబ్బందిని అనుమతిస్తారు. దీంతో కానుకల లెక్కింపు ప్రాంతమంతా గందరగోళంగా మారడమే కాకుండా ఎవరు ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. సోమవారం కూడా ఇదే జరిగింది. ఆలయ సిబ్బంది గంటల తరబడి నేలపై కూర్చోవడం ఇబ్బందికరమే. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆదమరుపుగా ఉన్న తరుణంలో చేతివాటాన్ని ప్రదర్శించి కానుకలను పక్కదారి పట్టించారు. వారంలో ఒక రోజు కానుకల లెక్కింపు క్రమం తప్పకుండా జరిగితే సాయంత్రానికి లెక్కింపు పూర్తవుతుందని ఆలయ ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీని వల్ల బయటి వ్యక్తులను లెక్కింపునకు పిలవాల్సిన అవసరం కూడా ఉండదని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. విరాళాలు.. కానుకలు ఒక విభాగంగా మార్చితే.. దేవస్థానంలో ప్రస్తుతం పరిపాలనా విభాగం, పూజల విభాగం, ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగాలతో పాటు మరి కొన్ని విభాగాలు ఉన్నాయి. అయితే అమ్మవారికి భక్తులు అందచేసే విరాళాలు, కానుకలను ఒక విభాగంగా చేసి బాధ్యులను అప్పగిస్తే ఫలితాలు బాగుంటాయని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయానికి, అన్నదానం, అభివృద్ధి పనులకు దాతలు విరాళాలు అందచేస్తుంటారు. అయితే ఈ విరాళాల సేకరణ ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని గతంలో పలువురు ఈవోలు ప్రతిపాదనలు సిద్ధం చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. విరాళాల సేకరణతో పాటు అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల పర్యవేక్షణ రెండు కలిసి ఒక విభాగం చేసి ఎఈవో స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. (క్లిక్: చిత్తు కాగితాలు ఏరే వారితో స్నేహం.. అనుకోకుండా వచ్చిన అవకాశంతో..) దశాబ్దాలుగా ఇవే పద్ధతులు.. = 15 రోజలకు ఒక సారి లెక్కింపు జరగడం = కానుకలు లెక్కించే ప్రాంతంలోకి వచ్చే సిబ్బందికి మాత్రమే తనిఖీలు ఉండటం = ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు లెక్కింపు జరగడం = సేవా సిబ్బంది పేరిట కొంత మంది సిఫార్సు చేసిన వారిని లెక్కింపులోకి అనుమతించడం = లెక్కింపు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నా, ఏదైనా ఘటన జరిగిన సమయంలో అవి ఉపయోగకరంగా లేకపోవడం = కానుకల లెక్కింపులో పాల్గొనే పోలీసు, సెక్యూరిటీ, హోంగార్డులను సైతం తనిఖీలు లేకపోవడం -
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ. 42 లక్షలు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు చేపట్టారు. హుండీ ద్వారా రూ. 42.07 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ముత్యాలరావు తెలిపారు. ఈఓతో పాటు ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈవో మధు ఇతర పాలకవర్గం ఆధ్వర్యంలో 24 హుండీలను లెక్కించారు. 42 రోజులకు గానూ రూ. 42,07,438 నగదుతో పాటు 28 గ్రాముల బంగారం, 1.6 కిలోల వెండిని భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు. అలాగే అన్నదానం హుండీ ద్వారా రూ. 13,792 నగదును భక్తులు సమర్పించారన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆర్టీసీ సేవాసమితి , సత్యసాయి సేవాసమితి , హనుమాన్ సేవాసమితి సభ్యులు ,ఇతర భక్తులు పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులు సతీష్ గుప్త, జగదీష్ ప్రసాద్, గుడిపాటి ఆంజనేయులు, వనగొంది విజయలక్ష్మి, ప్రసాద్‌రెడ్డి తదితరులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.27 లక్షలు
గుంతకల్లు రూరల్ : కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ లెక్కింపు ద్వారా రూ. 27.97 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు. మంగళవారం ఆలయంలోని 24 హుండీలను లెక్కించగా 63 రోజులకు గానూ రూ. 27,97,954 రూపాయల నగదుతోపాటు ,10 గ్రాముల బంగారం, 1.7 కిలోల వెండి వచ్చినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా అన్నదానం హుండీ ద్వారా రూ. 34,211 నగదును భక్తులు సమర్పించినట్లు తెలిపారు. ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈఓ మధు ఇతర పాలకవర్గం ఆధ్వర్యంలో సాగిన హుండీ లెక్కింపును దేవాదాయశాఖ అనంతపురం అసిస్టెంట్ కమిషనర్ రాణి, పాలకమండలి సభ్యులు సతీష్ గుప్త, జగదీష్ ప్రసాద్, మహేష్, వనగొంది విజయలక్ష్మి, ప్రసాద్‌రెడ్డి, గుడిపాటి ఆంజనేయులు తదితరులు పర్యవేక్షించారు. -
రాట్నాలమ్మకు రూ.7,53,459 ఆదాయం
రాట్నాలకుంట (పెదవేగి రూరల్) : పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన రాట్నాలమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.7,53,459 ఆదాయం లభించింది. గురువారం లెక్కించిన హుండీ లెక్కింపులో దేవస్థాన సిబ్బందితో పాటు భక్తులు పాల్గొన్నారు. ఏలూరు డివిజన్ తనిఖీదారి అనురాధ పర్యవేక్షణలో ఈ లెక్కింపు నిర్వహించారు. రూ.6,93,445 నోట్లు, రూ.60, 014 చిల్లర కాయిన్లు లభించినట్టు సిబ్బంది చెప్పారు. దేవస్థానం చైర్మ¯ŒS రాయల విజయ భాస్కరరావు, ఈవో ఎన్.సతీష్‌కుమార్ పర్యవేక్షించారు. -
మహిళలను అనుమతించవద్దంటూ ఆదేశాలు
► హుండీ లెక్కింపునకు మహిళలు దూరం వేములవాడ: రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హుండీ లెక్కింపులో అనుసరిస్తున్న విధానాలపై సీరియస్‌గా వ్యవహరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. హుండీ లెక్కింపు సందర్బంగా మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని నిబంధన పెట్టారు. ఈ మేరకు రాజన్నసిరిసిల్ల వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ ఈవో డి.రాజేశ్వర్ హుండీ లెక్కింపులో ఎలాంటి పరిస్థితుల్లోనూ మహిళలను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇంతేకాకుండా ఆలయ అధికారులు, సిబ్బంది తప్ప ఇతర దేవాదాయశాఖకు సంబంధంలేని వారిని దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు. హుండీ లెక్కింపు సందర్భంగా కొందరు బంగారం, నగదును దోచుకున్నట్లు, దాచుకున్నట్లు విచారణలో తేలడంతో కమిషనర్ సీరియస్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆలయ ఉద్యోగులెవ్వరూ హుండీ లెక్కింపు రోజున సెలవులు పెట్టొద్దనీ, అలా పాల్పడినట్లైతే గైర్హాజరు వేయడంతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. హుండీ లెక్కింపు సందర్బంగా రాష్ట్ర దేవాదాయశాఖ తీసుకున్న నిర్ణయానికి భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయల జీతాలు పుచ్చుకుంటున్న ఉద్యోగులు, సిబ్బంది హుండీ లెక్కింపులో భాగస్వాములు కాకుండా ప్రైవేట్ వ్యక్తులను అనుమతించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధమైన చర్యలకు అవకాశం కల్పించినట్లవుతుందన్న చర్చ సాగుతోంది. అయితే కొంత మంది ఉద్యోగులు తమతమ పలుకుబడిని ఉపయోగించుకుని హుండీ లెక్కింపులో హాజరు కాకుండా చూసుకుంటున్నట్లు ఆశాఖ ఉన్నతాధికారులకు, మంత్రి దృష్టికి వెళ్లినట్లు సమాచారం. 3న హుండీ లెక్కింపు వేములవాడ రాజన్నను దర్శించుకున్న భక్తులు హుండీలలో వేసిన కట్నాలు, కానుకలను ఆలయ అధికారులు వచ్చేనెల 3న ఉదయం 7.30 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తున్నట్లు ఈవో రాజేశ్వర్ తెలిపారు. ఉద్యోగులంతా విధిగా లుంగీ, ధోవతి మాత్రమే ధరించి రావాలనీ, బనియన్ సైతం వేసుకోకుండా హుండీ లెక్కింపులో హాజరు కావాలని ఆదేశించారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. హుండీ లెక్కింపు సందర్భంగా మరింత భద్రత పెంచుతామనీ, సీసీ కెమెరాల నిఘా సైతం పెంచినట్లు ఆయన చెప్పారు. -
కొమురవెల్లి ఆలయ సిబ్బంది చేతివాటం
సిద్దిపేట: ఓ భక్తురాలు హుండీలో వేసిన కానుక హుండీ లెక్కింపులో కనిపించలేదు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయ హుండీ లెక్కింపు నేపథ్యంలో సీసీ కెమెరాల ఫుటేజీని అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్ శనివారం పరిశీలించారు. అయితే, హుండీలో ఓ భక్తురాలు మంగళసూత్రాన్ని హుండీలో వేస్తున్నట్లు సీసీ కెమెరాల పుటేజీలో కనిపించగా లెక్కింపులో మాత్రం ఆ మంగళసూత్రం కనిపించకుండాపోయింది. దీనిపై ఆలయ ఈవో రామకృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి మెమో జారీ చేస్తున్నట్లు తెలిపారు. -
చెంగాళమ్మ ఆలయ హుండీ లెక్కింపు
సూళ్లూరుపేట: పట్టణంలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ హుండీని చైర్మన్ ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి సమక్షంలో గురువారం లెక్కించారు. 3 నెలల కాలానికి గానూ హుండీ ద్వారా రూ.39లక్షల ఆదాయం సమకూరినట్లు ఆయన తెలిపారు. హుండీ, దర్శనం టికెట్లు, ఇతర మార్గాల ద్వారా వచ్చిన మొత్తం రూ.60లక్షలను శుక్రవారం బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు వివరించారు. అలాగే అన్నదానం హుండీ ద్వారా రూ.30,734 ఆదాయం లభించిందని, ఈ మొత్తాన్ని అన్నదానానికి వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సీహెచ్ సుధాకర్‌బాబు, ఆలయ ఈఓ ఆళ్ల శ్రీనివాసులురెడ్డి, పాలకమండలి సభ్యులు చిలకా యుగంధర్‌యాదవ్, అలవల సూరిబాబు, ఆకుతోట రమేష్, పిట్ల సుహాసిని, చిట్టేటి పెరుమాళ్లు, వేనాటి గోపాల్‌రెడ్డి, పులుగు శ్రీనివాసులురెడ్డి, కీసరపల్లి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నాలుగో రోజు హుండీ ఆదాయం రూ.1.15 కోట్లు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కనకదుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ నాలుగో రోజు మంగళవారం కూడా కొనసాగింది. నాలుగో రోజు రూ.1,15,33,840 నగదు, 185 గ్రాముల బంగారం, 4.190 కిలోల వెండి లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మహా మండపంలోని ఒకటో అంతస్తులో జరిగిన కానుకల లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు
నెల్లూరు(బృందావనం): కరెంటాఫీస్ సెంటర్ సమీపంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీని మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పులి కోదండరామిరెడ్డి మాట్లాడారు. ఈ ఏడాది జూలై 5 నుంచి సెప్టెంబర్ 27 వరకు భక్తులు రూ.14,62,619 మొత్తాన్ని సమర్పించారన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రత్నం జయరామ్, ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ, తదితరులు పాల్గొన్నారు. -
కన్యకా పరమేశ్వరి ఆదాయం 3.64 లక్షలు
పెనుగొండ : స్థానిక శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ హుండీ ఆదాయం రూ.3,64,923 లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఉదయం దేవాదాయ ఇన్స్పెక్టర్ బాలాజీ రాం ప్రసాద్ పర్యవేక్షణలో లెక్కించినట్టు చెప్పారు. 87 రోజులకు గాను పై ఆదాయం లభించినట్టు తెలిపారు. ఆలయ ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ నూలి చిన గణేష్, కార్యనిర్వహణాధికారి కుడుపూడి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయి పురవీధుల వరకు బారులు తీరారు. స్వామివారి సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. హుండీ లెక్కింపులో స్థానికులకు అవకాశం కాగా మల్లన్న హుండీ లెక్కింపు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తొలిసారిగా హుండీ లెక్కింపు కార్యక్రమంలోకి స్థానికులు, భక్తులను అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
ఈయనెవరో కాదు..
తిరుమల: ఈ ఫొటోలో నిలుచున్న వ్యక్తి ఎవరో తెలుసా..? ఆయనే టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు. టీటీడీ సిబ్బందితో కలసి పరకామణిలో ఇలా పాల్గొన్నారు. ఏటా హుండీ ద్వారా నగదు, బంగారు, వెండి, ఇతర కానుకల ద్వారా మొత్తంగా రూ.1,300 కోట్ల వరకు టీటీడీకి లభిస్తోంది. ప్రతిష్టాత్మకమైన హుండీ లెక్కింపులో పాత మూసపద్ధతులు పక్కన బెట్టి శాస్త్రీయత పెంచాలని ఈవో నిర్ణయించారు. నిబంధనల ప్రకారం పరకామణిలో పాల్గొనాలంటే పంచె, బనియన్ మాత్రమే ధరించాలి. ఆ నిబంధన తాను కూడా పాటించారు. భక్తులు హుండీలో సమర్పించిన నగదు, బంగారు, వెండి, విలువైన రాళ్లు, విదేశీ కరెన్సీనోట్ల లెక్కింపును మూడు గంటలపాటు పర్యవేక్షించారు. లోటుపాట్లు గుర్తించారు. మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. -
దుర్గ గుడిలో సిబ్బంది చేతివాటం
విజయవాడ: కనకదుర్గ ఆలయ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం చూపించారు. ఈ ఘటన గురువారం కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గ గుడి హుండీ లెక్కింపులో భాగంగా చోటుచేసుకుంది. వివరాలు... యథావిధిగా ఆలయ అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. కాగా లెక్కింపులో హుండీ నుంచి బంగారు మంగళసూత్రాలు చోరీ చేశారు. దాంతో లెక్కింపు సిబ్బంది పనేనని గ్రహించిన ఆలయ అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. -
రెండో రోజూ హుండీల లెక్కింపు
హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు హన్మకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కళ్యాణ మండపంలో రెండవ రోజూ కొనసాగింది. మంగళవారం ఉదయం 10గంటలకు ప్రారంభమై రాత్రి 8గంటల వరకు జరిగింది. రెవెన్యూశాఖ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ డి.శంకర్, ఆర్డీవో మధుసూదన్, దేవాదాయ ధర్మాదాయశాఖ మల్టిజోన్ జాయింట్ డెరైక్టర్ కృష్ణవేణి , దేవాదాయశాఖ ఐదవ జోన్ డిప్యూటీ కమిషనర్ తాళ్లూరి రమేష్‌బాబు, జాతర ఇన్‌చారిజ దూస రాజేశ్వర్, అసిస్టెంట్ కమీషనర్ గొదుమ మల్లేషం పర్యవేక్షణలో 250 మంది రెవెన్యూ, దేవాదాయశాఖల సిబ్బంది, 30మంది బ్యాంకు సిబ్బంది కలిసి 68 హుండీల లెక్కింపు నిర్వహించారు. మంగళవారం లెక్కింపు ఆదాయం రూ.కోటి ముప్పై లక్షలు నమోదైందని దూస రాజేశ్వర్ ప్రకటించారు.