రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు
నెల్లూరు(బృందావనం): కరెంటాఫీస్ సెంటర్ సమీపంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీని మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పులి కోదండరామిరెడ్డి మాట్లాడారు. ఈ ఏడాది జూలై 5 నుంచి సెప్టెంబర్ 27 వరకు భక్తులు రూ.14,62,619 మొత్తాన్ని సమర్పించారన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రత్నం జయరామ్, ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ, తదితరులు పాల్గొన్నారు.