కన్యకా పరమేశ్వరి ఆదాయం 3.64 లక్షలు
పెనుగొండ : స్థానిక శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ హుండీ ఆదాయం రూ.3,64,923 లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్‌మోహన్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఉదయం దేవాదాయ ఇన్‌స్పెక్టర్ బాలాజీ రాం ప్రసాద్ పర్యవేక్షణలో లెక్కించినట్టు చెప్పారు. 87 రోజులకు గాను పై ఆదాయం లభించినట్టు తెలిపారు. ఆలయ ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ నూలి చిన గణేష్, కార్యనిర్వహణాధికారి కుడుపూడి నాగేశ్వరరావు పాల్గొన్నారు.