in pengonda
-
రచయితల దృక్పథం మారాలి
పెనుగొండ: ప్రపంచీకరణతో మానవుడు సామాజిక సృహను కోల్పోతున్నాడని, ఆధునిక కాలంలోనూ స్త్రీ పరిచారికగానే మిగిలిపోతోందని కాకినాడ ఐడియల్ విద్యాసంస్థల సెక్రటరీ కరస్పాండెంట్, రచయిత్రి డాక్టర్ పి. చిరంజీవినీకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. పెనుగొండలో శనివారం ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు కళాశాల, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) సంయుక్త నిర్వహణలో ‘తెలుగులో మహిళా రచయిత అనుభవాలు–ప్రభావాలు’ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా చిరంజీవినీకుమారి మాట్లాడుతూ మానవుడు మనిషిగా కాకుండా సాహిత్యంలో వస్తువుగా మిగిలిపోతున్నాడన్నారు. రచయితలు తమపరిధిలో కాకుండా, స్త్రీ దృక్పథం, దళిత దృక్పథం, మైనార్టీ దక్పథంతో సాహిత్యాన్ని ముందుకు నడిపించాలన్నారు. స్త్రీలది వంటింటి సాహిత్యం కాదు మహిళా సాహిత్యానికి వంటింటి సాహిత్యమనే విమర్శ ఉందని, వంటింటికి మానవుడి జీవితంలో ఉన్న విలువ అనిర్వచనీయమని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ కార్యదర్శి, జాతీయ అవార్డు గ్రహీత, కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య కాత్యాయనీ విద్మహే అన్నారు. మహిళా రచయిత్రులు వంటింటి విషయాలతో ప్రారంభించి సమాజంలో రాజకీయ, ఆర్థిక, సాంస్కతిక, విద్య, వ్యాపార, వాణిజ్య రంగాలను స్పహిస్తున్నారన్నారు. మహిళల గొంతుకగా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ముందుకు సాగుతుందన్నారు. డాక్టర్ కె.అన్నపూర్ణ జ్యోతి ప్రజ్వలనంతో సదస్సును ప్రారంభించారు. ప్రరవే జాతీయ అధ్యక్షురాలు పుట్ల హేమలత, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నడింపల్లి సూర్యనారాయణ రాజు, కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు పితాని సూర్యనారాయణ, సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కె.రామచంద్రరాజు, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్, సదస్సు సంచాలకుడు రంకిరెడ్డి రామ్మోహనరావు, సుమారు 65 మంది రచయిత్రులు పాల్గొన్నారు. -
వాసవీ మాత.. ఆరాధ్య దేవత
పెనుగొండ: జై వాసవీ.. జై జై వాసవీ..జై వాసమాంబాయన నమః అంటూ పెనుగొండ క్షేత్రం మార్మోగింది. పెనుగొండ వాసవీ శాంతి ధాంలో అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మవారి నిజపాదాల ప్రతిష్ఠ వైభవోపేతంగా జరిగింది. దక్షిత భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్యవైశ్యులు వేలాదిగా తరలివచ్చారు. పెనుగొండ పీఠాధిపతి కష్ణానందపురి స్వామీజీ, వేద పండితులు రామడుగుల లక్ష్మీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు పీఎన్ గోవిందరాజులు, గౌరవ అధ్యక్షుడు ఎస్.రామమూర్తి నిజపాదుకల ప్రతిష్ఠను జరిపించారు. ఆర్యవైశ్యుల 102 గోత్రీకులకు సూచికగా 102 స్తంభాలతో 141 అడుగులు ఎత్తునిర్మించిన మందిరంలో 90 అడుగుల వాసవీ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 45 టన్నుల బరువు గల విగ్రహానికి గాను 1.55 టన్నుల పాదాలను పంచలోహాలతో తయారుచేశారు. అమ్మవారి పాదాల కింద తామ్ర, రజత, స్వర్ణ పత్రాలు నిక్షిప్తం చేసి పూర్ణాహుతి జరిపించారు. కలశాలతో భారీ ఊరేగింపు ముందుగా కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు 1008 కలశలతో భారీగా గ్రామోత్సవం నిర్వహించారు. వాసవీ మాత మూలవిరాట్ నగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి వాసవీ శాంతి ధాంకు చేరుకుని కలశాల్లోని పవిత్ర జలాలతో అమ్మవారి పాదాలను అభిషేకించారు. గ్రామోత్సవంలో కర్ణాటక కౌన్సిల్ చైర్మన్ డీహెచ్ శంకరమూర్తి, కర్ణాటక ఎమ్మెల్సీ టీఏ శరవణ, ఎమ్మెల్యే హెచ్‌పీ మంజునాథ్ పాల్గొన్నారు. వీరితో పాటు కోయంబత్తూరు నుంచి తరలి వచ్చిన ఆర్యవైశ్య మహిళలూ ఉన్నారు. 1.55 టన్నుల పాదాలు భారీ క్రేన్ సాయంతో 1.55 టన్నుల పాదాలను వేదికపై ఆశీనులు గావించారు. విగ్రహం 90 అడుగులు ఉండటంతో సుమారు 15 అడుగుల ఇనుప కమ్మిలను పాదాల మధ్యలో ఏర్పాటుచేసి ప్రతిష్ఠించారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పెనుగొండ వాసవీ శాంతి ధాంతో పెనుగొండ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పేర్గాంచనుందని కర్ణాటక కౌన్సిల్ చైర్మన్ డీహెచ్ శంకరమూర్తి అన్నారు. వాసవీ పాదాల ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి ఆర్యవైశ్యుడూ క్షేత్రాన్ని సందర్శించాలన్న ఉద్దేశంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. వాసవీ మాత ప్రపంచంలోనే తొలి శాంతిదూత అన్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా హింసకు తావివ్వకుండా శాంతి మార్గంలో వెళ్లాలన్న సందేశాన్ని అమ్మవారు ప్రపంచానికి తెలియజెప్పారన్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు. శాంతి ధాంలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రార ంభించారు. పీఠాధిపతులు రాక ప్రతిష్ఠ ఉత్సవాల్లో పెనుగొండ పీఠాధిపతి కష్ణానంద పురి స్వామిజీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పీఠాధిపతులు సదానందగిరి స్వామి, చిదానందగిరి స్వామి, సత్ చిత్త్ ఆనందగిరిస్వామి, శుద్ధ చైతన్యనందగిరి స్వామి, ఈశ్వరానంద స్వామి, వెంకటస్వామి, శంకర్ బాండు, మాత శివచైతన్యానంద, ప్రతిష్ఠానంద సరస్వతి స్వామి హాజరయ్యారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, కర్ణాటక ఐటీ మంత్రి కార్యదర్శి నందకుమార్, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.రామమూర్తి, అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు, ఉపాధ్యక్షుడు ఎంవీ నారాయణ గుప్త, డాక్టర్ టీఏ శరవణ, కార్యదర్శి కేఆర్ కష్ణ, కోశాధికారి ఎన్ఎస్ శ్రీనివాసమూర్తి, కోట్ల వెంకటేశ్వరరావు, ఆర్పీ రవిశంకర్, ఎస్.సతీష్, టి.శ్రీనివాసమూర్తి, కోట్ల సూర్యారావు, కోట్ల కష్ణ మూర్తి పాల్గొన్నారు. -
ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభం
పెనుగొండ :102 అడుగుల ఆలయంలో 90 అడుగులు, 45 టన్నుల బరువుండే వాసవీ అమ్మవారి పంచలోహ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విగ్రహంలో భాగంగా తయారు చేయించిన అమ్మవారి నిజ పాదుకల బరువు 1.5 టన్నులన్నారు. పెనుగొండలోని 102 అడుగుల వాసవీ శాంతి థాంలో 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహ ఏర్పాటులో భాగంగా గురువారం నిజ పాదుకల ప్రతిష్ఠాపన ఉత్సవాలను ప్రారంభించారు. 1.5 టన్నుల బరువు కలిగిన నిజ పాదుకలను శనివారం ప్రతిష్టించనున్నారు. తొలుత ప్రతిష్ఠాపన ఉత్సవాలను అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు ప్రారంభించారు. పూజా కార్యక్రమాలను పెనుగొండ పీఠాథిపతి కృష్ణానంద పురిస్వామి జీ, బ్రహ్మశ్రీ రామడుగుల లక్ష్మీ నరసింహమూర్తి శిష్యబృందం పర్యవేక్షణలో నిర్వహించారు. ప్రపంచ ప్రసిద్ధక్షేత్రంగా పెనుగొండ : గోవిందరాజులు ఈ సందర్భంగా గోవిందరాజులు విలేకరులతో మాట్లాడారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు వాసవీ మాత జన్మస్థలమైన పెనుగొండను ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రూ.100 కోట్లతో వాసవీ శాంతి థాంను అభివృద్ధి చేయడానికి 2002లో ప్రణాళిక రూపొందించామని, ఇప్పటివరకూ రూ.45 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. 102 అడుగుల ఆలయంలో 90 అడుగులు, 45 టన్నుల బరువుండే వాసవీ అమ్మవారి పంచలోహ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విగ్రహంలో భాగంగా తయారు చేయించిన అమ్మవారి నిజ పాదుకల బరువు 1.5 టన్నులన్నారు. ఈ పాదుకలను తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో ఊరేగించగా కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్టు చెప్పారు. యాత్ర ముగియడంతో ప్రతిష్ఠాపన చేస్తున్నట్టు చెప్పారు. అమ్మవారి పూర్ణ విగ్రహ ప్రతిష్ఠాపన జనవరిl30న నిర్వహిస్తామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన అమ్మవారి విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీల చేతులమీదుగా ప్రారంభింపచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే ట్రస్ట్ ద్వారా సమాజ సేవ చేస్తున్నట్టు తెలిపారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.రామమూర్తి, ఉపాధ్యక్షుడు ఎంవీ నారాయణ గుప్త, కార్యదర్శి కేఆర్ కృష్ణ, కోశాధికారి ఎన్.శ్రీనివాసమూర్తి, కోట్ల వెంకటేశ్వరరావు, ఆర్పీ రవిశంకర్, ఎస్.సతీష్, టి.శ్రీనివాసమూర్తి, బీసీఎస్ నారాయణ, డి.పార్ధసారథి పాల్గొన్నారు. -
కన్యకా పరమేశ్వరి ఆదాయం 3.64 లక్షలు
పెనుగొండ : స్థానిక శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ హుండీ ఆదాయం రూ.3,64,923 లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఉదయం దేవాదాయ ఇన్స్పెక్టర్ బాలాజీ రాం ప్రసాద్ పర్యవేక్షణలో లెక్కించినట్టు చెప్పారు. 87 రోజులకు గాను పై ఆదాయం లభించినట్టు తెలిపారు. ఆలయ ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ నూలి చిన గణేష్, కార్యనిర్వహణాధికారి కుడుపూడి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
బైక్ కంట పడిందా గోవిందా!
పెనుగొండ : మోటార్ సైకిల్ కనిపిస్తే చాలు నిమిషాల్లో మాయం చేయడంలో అతను సిద్ధహస్తుడు. మోజు తీరేవరకూ దానిపై తిరిగి చివరకు పాత ఇనుప సామాన్లకు అమ్ముకోవడం అతని నైజం. ఈ ఘరానా దొంగను పెనుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుగొండ సీఐ సి.హెచ్.రామారావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. పోడూరుకు చెందిన నక్కా చిన్నా సోమవారం పెనుగొండ మార్కెట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించడంతో మోటార్‌సైకిళ్ల చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తం 8 మోటార్‌సైకిళ్లు చోరీ చేసినట్టు చిన్నా అంగీకరించాడు. వీటిని ఘాటాల దిబ్బ సమీపంలో పాత ఇనుప సామాను కొనే దుకాణాల్లో ఉంచాడు. వీటికి రికార్డులు లేక అమ్మలేదు. పక్కనే పాడేసి ఉంచాడు. గతంలో రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో మోటారుసైకిల్ చోరీ కేసు నమోదై ఉండడంతో అనుమానంగా తిరుగుతున్న చిన్నాను అరెస్ట్ చేసినట్టు సీఐ వెల్లడించారు. వీటిలో పెనుగొండ పోలీస్‌స్టేషన్‌లో మూడు మోటారు సైకిళ్లు, పోడూరు, పెనుమంట్ర, పాలకొడేరు పోలీస్స్టేషన్లలో ఒక్కో బైక్ చోరీకి గురైనట్టు కేసులు నమోదై ఉన్నాయని, . మరో రెండు మోటారు సైకిళ్ల వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఎలుకలు పట్టుకుంటూ జీవించే చిన్నా మోటార్‌సైకిళ్లపై తిరగాలనే మోజుతో చోరీలకు అలవాటు పడ్డాడని తెలిపారు. మోటారు సైకిళ్లు రికవరీ కావడంతో చిన్నాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్లు చెప్పారు.