బైక్ కంట పడిందా గోవిందా!
బైక్ కంట పడిందా గోవిందా!
Published Tue, Aug 2 2016 9:32 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
పెనుగొండ : మోటార్ సైకిల్ కనిపిస్తే చాలు నిమిషాల్లో మాయం చేయడంలో అతను సిద్ధహస్తుడు. మోజు తీరేవరకూ దానిపై తిరిగి చివరకు పాత ఇనుప సామాన్లకు అమ్ముకోవడం అతని నైజం. ఈ ఘరానా దొంగను పెనుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుగొండ సీఐ సి.హెచ్.రామారావు, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. పోడూరుకు చెందిన నక్కా చిన్నా సోమవారం పెనుగొండ మార్కెట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించడంతో మోటార్‌సైకిళ్ల చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తం 8 మోటార్‌సైకిళ్లు చోరీ చేసినట్టు చిన్నా అంగీకరించాడు. వీటిని ఘాటాల దిబ్బ సమీపంలో పాత ఇనుప సామాను కొనే దుకాణాల్లో ఉంచాడు. వీటికి రికార్డులు లేక అమ్మలేదు. పక్కనే పాడేసి ఉంచాడు.
గతంలో రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో మోటారుసైకిల్ చోరీ కేసు నమోదై ఉండడంతో అనుమానంగా తిరుగుతున్న చిన్నాను అరెస్ట్ చేసినట్టు సీఐ వెల్లడించారు. వీటిలో పెనుగొండ పోలీస్‌స్టేషన్‌లో మూడు మోటారు సైకిళ్లు, పోడూరు, పెనుమంట్ర, పాలకొడేరు పోలీస్‌స్టేషన్లలో ఒక్కో బైక్ చోరీకి గురైనట్టు కేసులు నమోదై ఉన్నాయని, . మరో రెండు మోటారు సైకిళ్ల వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఎలుకలు పట్టుకుంటూ జీవించే చిన్నా మోటార్‌సైకిళ్లపై తిరగాలనే మోజుతో చోరీలకు అలవాటు పడ్డాడని తెలిపారు. మోటారు సైకిళ్లు రికవరీ కావడంతో చిన్నాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్లు చెప్పారు.
Advertisement
Advertisement