by police
-
ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లు, జేసీబీ సీజ్
ఆచంట : అయోధ్యలంక పంచాయతీ పరిధి పుచ్చలంకలో బుధవారం రాత్రి బొండు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లతోపాటు, జేసీబీని ఆచంట పోలీసులు సీజ్ చేశారు. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లాను ఆనుకుని ఉండడంతో రాత్రి వేళల్లో అక్రమార్కులు ట్రాక్టరర్లపై అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. వీఆర్వో అప్పారావు ఫిర్యాదు మేరు ఆచంట ఎస్ఐ ఏజీఎస్ మూర్తి సిబ్బందితో దాడిచేశారు.అక్రమార్కులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఎస్ఐ పాలకొల్లు సీఐ చంద్రశేఖర్‌కు సమాచారం ఇచ్చారు. సీఐ అదనపు పోలీసులతో గ్రామానికి చేరుకున్నారు. దీంతో అక్రమార్కులు పరారయ్యారు. దీంతో పోలీసులు ఏడు ట్రాక్టర్లు, జేసీబీని సీజ్ చేసిఇ.వెంకటేశ్వరరావుతోపాటు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. -
క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై దాడి
పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలోని క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై దాడిచేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పట్టణ సీఐ కె.రజనీకుమార్ తెలిపారు. స్థానిక కుళాయి చెరువు గట్టు వద్ద బీ.వీ.ఆర్.టవర్స్‌లో ఐదో అంతస్తు ఫ్లాట్ నంబర్ 501లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు శుక్రవారం సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ బెట్టింగ్ నిర్వహి స్తూ ఐదుగురు పట్టుబడ్డారు. వారి నుంచి క్రికెట్ లైన్‌బాక్స్, రెండు ల్యాప్‌టాప్‌లు, సోనీ ఎల్ఈడీ టీవీ, 25 సెల్ఫోన్లు, రూ.24వేలు స్వాధీనం చేసుకున్నారు. -
బైక్ కంట పడిందా గోవిందా!
పెనుగొండ : మోటార్ సైకిల్ కనిపిస్తే చాలు నిమిషాల్లో మాయం చేయడంలో అతను సిద్ధహస్తుడు. మోజు తీరేవరకూ దానిపై తిరిగి చివరకు పాత ఇనుప సామాన్లకు అమ్ముకోవడం అతని నైజం. ఈ ఘరానా దొంగను పెనుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుగొండ సీఐ సి.హెచ్.రామారావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. పోడూరుకు చెందిన నక్కా చిన్నా సోమవారం పెనుగొండ మార్కెట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించడంతో మోటార్‌సైకిళ్ల చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తం 8 మోటార్‌సైకిళ్లు చోరీ చేసినట్టు చిన్నా అంగీకరించాడు. వీటిని ఘాటాల దిబ్బ సమీపంలో పాత ఇనుప సామాను కొనే దుకాణాల్లో ఉంచాడు. వీటికి రికార్డులు లేక అమ్మలేదు. పక్కనే పాడేసి ఉంచాడు. గతంలో రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో మోటారుసైకిల్ చోరీ కేసు నమోదై ఉండడంతో అనుమానంగా తిరుగుతున్న చిన్నాను అరెస్ట్ చేసినట్టు సీఐ వెల్లడించారు. వీటిలో పెనుగొండ పోలీస్‌స్టేషన్‌లో మూడు మోటారు సైకిళ్లు, పోడూరు, పెనుమంట్ర, పాలకొడేరు పోలీస్స్టేషన్లలో ఒక్కో బైక్ చోరీకి గురైనట్టు కేసులు నమోదై ఉన్నాయని, . మరో రెండు మోటారు సైకిళ్ల వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఎలుకలు పట్టుకుంటూ జీవించే చిన్నా మోటార్‌సైకిళ్లపై తిరగాలనే మోజుతో చోరీలకు అలవాటు పడ్డాడని తెలిపారు. మోటారు సైకిళ్లు రికవరీ కావడంతో చిన్నాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్లు చెప్పారు.