one person arrest
-
మైనర్‌పై సామూహిక లైంగిక దాడి
సాక్షి, పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. పెనుమదం గ్రామానికి చెందిన దొంగ ప్రసాద్, యుగంధర్ అనే యువకులు అంతర్వేది నుంచి వస్తున్న ప్రేమ జంటను బెదిరించి బాలికపై అత్యాచారం చేశారు. పాలకొల్లు పోలీసు స్టేషన్లొ కేసు నమోదు కాగా నిందితులలో ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో నిందితుడు యుగంధర్ కోసం గాలిస్తున్నారు.. -
కొండగొర్రె మాంసం స్వాధీనం
రామాయంపేట: పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఒక ఇంట్లో రహస్యంగా దాచి ఉంచిన నాలుగు కిలోల కొండగొర్రె మాంసాన్ని మంగళవారంరాత్రి అటవీశాఖ అధికారులు స్వాధీనపర్చుకొని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్థానిక అటవీ రేంజీ అధికారి చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు... కాలనీకి చెందిన పిట్టల రాజు కొంత కాలంగా అడవి జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు కొండగొర్రె మాంసాన్ని తన ఇంటిలో దాచిఉంచగా.. ఈవిషయాన్ని కొందరు స్థానిక ఎస్ఐ నాగార్జునగౌడ్కు ఫిర్యాదు చేశారు. దీనితో ఎస్ఐ విషయాన్ని అటవీఅధికారికి దృష్టికి తెచ్చారు. డిప్యూటీ రేంజ్ అధికారి కిరణ్, సెక్షన్ అధికారి దుర్గయ్య, బీట్ అధికారులు చిరంజీవి, కిశోర్ కలిసి రాజు ఇంటిపై దాడి చేసి మాంసాన్ని స్వాధీనపర్చుకొని రాజును కస్టడీలోకి తీసుకున్నారు. ఈమేరకు అతన్ని అరెస్ట్ చేసి మాంసంతోపాటు జంతువులను వధించడానికి వినియోగించే కత్తి, తక్కెడను స్వాధీనపర్చుకున్నారు. -
బైక్ కంట పడిందా గోవిందా!
పెనుగొండ : మోటార్ సైకిల్ కనిపిస్తే చాలు నిమిషాల్లో మాయం చేయడంలో అతను సిద్ధహస్తుడు. మోజు తీరేవరకూ దానిపై తిరిగి చివరకు పాత ఇనుప సామాన్లకు అమ్ముకోవడం అతని నైజం. ఈ ఘరానా దొంగను పెనుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుగొండ సీఐ సి.హెచ్.రామారావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. పోడూరుకు చెందిన నక్కా చిన్నా సోమవారం పెనుగొండ మార్కెట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించడంతో మోటార్‌సైకిళ్ల చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తం 8 మోటార్‌సైకిళ్లు చోరీ చేసినట్టు చిన్నా అంగీకరించాడు. వీటిని ఘాటాల దిబ్బ సమీపంలో పాత ఇనుప సామాను కొనే దుకాణాల్లో ఉంచాడు. వీటికి రికార్డులు లేక అమ్మలేదు. పక్కనే పాడేసి ఉంచాడు. గతంలో రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో మోటారుసైకిల్ చోరీ కేసు నమోదై ఉండడంతో అనుమానంగా తిరుగుతున్న చిన్నాను అరెస్ట్ చేసినట్టు సీఐ వెల్లడించారు. వీటిలో పెనుగొండ పోలీస్‌స్టేషన్‌లో మూడు మోటారు సైకిళ్లు, పోడూరు, పెనుమంట్ర, పాలకొడేరు పోలీస్స్టేషన్లలో ఒక్కో బైక్ చోరీకి గురైనట్టు కేసులు నమోదై ఉన్నాయని, . మరో రెండు మోటారు సైకిళ్ల వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఎలుకలు పట్టుకుంటూ జీవించే చిన్నా మోటార్‌సైకిళ్లపై తిరగాలనే మోజుతో చోరీలకు అలవాటు పడ్డాడని తెలిపారు. మోటారు సైకిళ్లు రికవరీ కావడంతో చిన్నాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్లు చెప్పారు. -
ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ
తాడేపల్లిగూడెం : ఢిల్లీ నుంచి వస్తున్న ఏపీ ఎక్్సప్రెస్ టూటైర్ ఏసీలో నగదు, బ్యాంకు కార్డులు, అత్యవసర మందులు కలిగిన బ్యాగును బోగీల్లో పని చేసే వ్యక్తులు సోమవారం దొంగిలించినట్టు తణుకు బార్ అసోసియేష¯Œæకు చెందిన ఎం.రవిసోమశేఖర్ తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. భోపాల్‌లో రైలు ఎక్కానని చాలాసేపటి వరకూ బ్యాగు తనవద్దే ఉందని బోగీల్లో దుప్పట్లు మార్చే వ్యక్తి ఒకరు అనుమానాస్పదనంగా తిరిగారని, కొంత సేపటికి బ్యాగు కలిపించలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏలూరులోని పోలీసు అధికారి ఒకరికి ఈ సమాచారం బాధితుడు అందించారు. అధికారి ఆదేశం మేరకు తాడేపల్లిగూడెం సివిల్ పోలీసులు రైల్వే స్టేషన్æకు చేరుకున్నారు. ఏసీ ఎక్్సప్రెస్ 2.40 గంటలకు తాడేపల్లిగూడెం స్టేషన్‌కు చేరుకోగానే అనుమానిత వ్యక్తిని పోలీసులు పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ చర్యను నిరసిస్తూ బోగీలో ఇదే తరహా విధుల్లో ఉన్న సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తూ పలుమార్లు చైన్ లాగారు. దీంతో 2.43కు బయలుదేరాల్సిన రైలు దాదాపు 38 నిమిషాలపాటు ఆగిపోయింది. దీంతో విశాఖ వెళ్లే రెండు రైళ్లను ట్రాక్ మళ్లించి రైల్వే అధికారులు పంపించారు. చైన్‌లాగిన వారిని జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.