వాసవీ మాత.. ఆరాధ్య దేవత | vasavi mata.. aradya devta | Sakshi
Sakshi News home page

వాసవీ మాత.. ఆరాధ్య దేవత

Published Sat, Aug 27 2016 7:07 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

వాసవీ మాత.. ఆరాధ్య దేవత

వాసవీ మాత.. ఆరాధ్య దేవత

 పెనుగొండ: జై వాసవీ.. జై జై వాసవీ..జై వాసమాంబాయన నమః అంటూ పెనుగొండ క్షేత్రం మార్మోగింది. పెనుగొండ వాసవీ శాంతి ధాంలో అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అమ్మవారి నిజపాదాల ప్రతిష్ఠ వైభవోపేతంగా జరిగింది. దక్షిత భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్యవైశ్యులు వేలాదిగా తరలివచ్చారు. పెనుగొండ పీఠాధిపతి  కష్ణానందపురి స్వామీజీ, వేద పండితులు రామడుగుల లక్ష్మీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ట్రస్ట్‌ అధ్యక్షుడు పీఎన్‌ గోవిందరాజులు, గౌరవ అధ్యక్షుడు ఎస్‌.రామమూర్తి నిజపాదుకల ప్రతిష్ఠను జరిపించారు. ఆర్యవైశ్యుల 102 గోత్రీకులకు సూచికగా 102 స్తంభాలతో 141 అడుగులు ఎత్తునిర్మించిన మందిరంలో 90 అడుగుల వాసవీ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 45 టన్నుల బరువు గల విగ్రహానికి గాను 1.55 టన్నుల పాదాలను పంచలోహాలతో తయారుచేశారు. అమ్మవారి పాదాల కింద తామ్ర, రజత, స్వర్ణ పత్రాలు నిక్షిప్తం చేసి పూర్ణాహుతి జరిపించారు. 
కలశాలతో భారీ ఊరేగింపు
ముందుగా కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు 1008 కలశలతో భారీగా గ్రామోత్సవం నిర్వహించారు. వాసవీ మాత మూలవిరాట్‌ నగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి వాసవీ శాంతి ధాంకు చేరుకుని కలశాల్లోని పవిత్ర జలాలతో అమ్మవారి పాదాలను అభిషేకించారు. గ్రామోత్సవంలో కర్ణాటక కౌన్సిల్‌ చైర్మన్‌ డీహెచ్‌ శంకరమూర్తి, కర్ణాటక ఎమ్మెల్సీ టీఏ శరవణ, ఎమ్మెల్యే హెచ్‌పీ మంజునాథ్‌ పాల్గొన్నారు. వీరితో పాటు కోయంబత్తూరు నుంచి తరలి వచ్చిన ఆర్యవైశ్య మహిళలూ ఉన్నారు. 
 
1.55 టన్నుల పాదాలు
భారీ క్రేన్‌ సాయంతో 1.55 టన్నుల పాదాలను వేదికపై ఆశీనులు గావించారు. విగ్రహం 90 అడుగులు ఉండటంతో సుమారు 15 అడుగుల ఇనుప కమ్మిలను పాదాల మధ్యలో ఏర్పాటుచేసి ప్రతిష్ఠించారు. 
 
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పెనుగొండ
వాసవీ శాంతి ధాంతో పెనుగొండ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పేర్గాంచనుందని కర్ణాటక కౌన్సిల్‌ చైర్మన్‌ డీహెచ్‌ శంకరమూర్తి అన్నారు. వాసవీ పాదాల ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి ఆర్యవైశ్యుడూ క్షేత్రాన్ని సందర్శించాలన్న ఉద్దేశంతో ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. వాసవీ మాత ప్రపంచంలోనే తొలి శాంతిదూత అన్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా హింసకు తావివ్వకుండా శాంతి మార్గంలో వెళ్లాలన్న సందేశాన్ని అమ్మవారు ప్రపంచానికి తెలియజెప్పారన్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు. శాంతి ధాంలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రార ంభించారు. 
పీఠాధిపతులు రాక
ప్రతిష్ఠ ఉత్సవాల్లో పెనుగొండ పీఠాధిపతి కష్ణానంద పురి స్వామిజీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పీఠాధిపతులు సదానందగిరి స్వామి, చిదానందగిరి స్వామి, సత్‌ చిత్త్‌ ఆనందగిరిస్వామి, శుద్ధ చైతన్యనందగిరి స్వామి, ఈశ్వరానంద స్వామి, వెంకటస్వామి, శంకర్‌ బాండు, మాత శివచైతన్యానంద, ప్రతిష్ఠానంద సరస్వతి స్వామి హాజరయ్యారు. 
ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ప్రభుత్వ విప్‌ అంగర రామ్మోహన్, కర్ణాటక ఐటీ మంత్రి కార్యదర్శి నందకుమార్, ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌.రామమూర్తి, అధ్యక్షుడు డాక్టర్‌ పీఎన్‌ గోవిందరాజులు, ఉపాధ్యక్షుడు ఎంవీ నారాయణ గుప్త, డాక్టర్‌ టీఏ శరవణ, కార్యదర్శి కేఆర్‌ కష్ణ, కోశాధికారి ఎన్‌ఎస్‌ శ్రీనివాసమూర్తి, కోట్ల వెంకటేశ్వరరావు, ఆర్‌పీ రవిశంకర్, ఎస్‌.సతీష్, టి.శ్రీనివాసమూర్తి, కోట్ల సూర్యారావు, కోట్ల కష్ణ మూర్తి పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement