
నాలుగో రోజు హుండీ ఆదాయం రూ.1.15 కోట్లు
నకదుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ నాలుగో రోజు మంగళవారం కూడా కొనసాగింది. నాలుగో రోజు రూ.1,15,33,840 నగదు, 185 గ్రాముల బంగారం, 4.190 కిలోల వెండి లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కనకదుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ నాలుగో రోజు మంగళవారం కూడా కొనసాగింది. నాలుగో రోజు రూ.1,15,33,840 నగదు, 185 గ్రాముల బంగారం, 4.190 కిలోల వెండి లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మహా మండపంలోని ఒకటో అంతస్తులో జరిగిన కానుకల లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.