దసరాకు తాత్కాలిక ఏర్పాట్లు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గగుడిపై అక్టోబర్ 1 నుంచి 11వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో దేవస్థాన ప్రాంగణంలో తొలగించిన షెడ్డు స్థానంలో తాత్కలిక షెడ్డును సిద్ధం చేస్తున్నారు. వీఐపీలను ఘాట్ రోడ్డు మీదుగా అనుమతిస్తుండటంతో కొండపై ప్రొటోకాల్, దేవస్థాన అధికారులు వేచి ఉండేందుకు ఈ షెడ్డును ఉపయోగిస్తారు. సమాచార కేంద్రాన్ని ఓం టర్నింగ్ సమీపంలోని పొంగలి షెడ్డులో ఏర్పాటు చేశారు.