కనకదుర్గ ఆలయ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం చూపించారు.
విజయవాడ: కనకదుర్గ ఆలయ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం చూపించారు. ఈ ఘటన గురువారం కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గ గుడి హుండీ లెక్కింపులో భాగంగా చోటుచేసుకుంది. వివరాలు... యథావిధిగా ఆలయ అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. కాగా లెక్కింపులో హుండీ నుంచి బంగారు మంగళసూత్రాలు చోరీ చేశారు. దాంతో లెక్కింపు సిబ్బంది పనేనని గ్రహించిన ఆలయ అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.