నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.27 లక్షలు | kasapuram temple hundi counting | Sakshi
Sakshi News home page

నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.27 లక్షలు

Published Tue, Jul 18 2017 9:56 PM | Last Updated on Sat, Jun 2 2018 8:47 PM

kasapuram temple hundi counting

గుంతకల్లు రూరల్‌ : కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ లెక్కింపు ద్వారా రూ. 27.97 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు.  మంగళవారం ఆలయంలోని 24 హుండీలను లెక్కించగా 63 రోజులకు గానూ రూ. 27,97,954 రూపాయల నగదుతోపాటు ,10 గ్రాముల బంగారం, 1.7 కిలోల  వెండి వచ్చినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా అన్నదానం హుండీ ద్వారా రూ. 34,211 నగదును భక్తులు సమర్పించినట్లు తెలిపారు. ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈఓ మధు ఇతర పాలకవర్గం ఆధ్వర్యంలో సాగిన హుండీ లెక్కింపును దేవాదాయశాఖ అనంతపురం అసిస్టెంట్‌ కమిషనర్‌ రాణి,  పాలకమండలి సభ్యులు సతీష్‌ గుప్త, జగదీష్‌ ప్రసాద్, మహేష్, వనగొంది విజయలక్ష్మి, ప్రసాద్‌రెడ్డి, గుడిపాటి ఆంజనేయులు తదితరులు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement