భక్తజనంతో పోటెత్తిన కసాపురం
గుంతకల్లు రూరల్: శ్రావణ మాస రెండో శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం భక్తజనంతో పోటెత్తింది. ఆంజనేయ నామస్మరణతో ఆలయ పురవీధులు ప్రతిధ్వనించాయి. నెట్టికంటి ఆంజనేయస్వామి గరుడవాహనంపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈవో ముత్యాలరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యల ఆధ్వర్యంలో సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రాకారోత్సవాన్ని ప్రారంభించారు. ఏఈవో మధు, సూపరింటెండెంట్‌లు వెంకట్వేర్లు, సీనియర్ అసిస్టెంట్ వేమన్నలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నెట్టికంటుడికి అరకిలో వెండి బహూకరణ : నెట్టికంటి ఆంజనేయస్వామి వెండి రథం నిర్మాణానికి రాయచూరుకు చెందిన శ్రీనివాసులు అనే భక్తుడు తనవంతుగా అరకిలో వెండిని బహూకరించారు.