వైభవంగా నెట్టికంటుడి శోభాయాత్ర
వైభవంగా నెట్టికంటుడి శోభాయాత్ర
Published Sun, Dec 11 2016 10:45 PM | Last Updated on Sat, Jun 2 2018 8:47 PM
గుంతకల్లు రూరల్: హనుమాన్ మాలధారుల పాదయాత్ర సందర్భంగా చేపట్టిన నెట్టికంటుడి శోభాయాత్ర ఆద్యంతం అత్యంత వైభవంగా సాగింది. ఆంజనేయ స్వామి నామస్మరణతో గుంతకల్లు పట్టణ పురవీధులు మార్మోగాయి. అశ్వ వాహనంపై కొలువుదీరిన నెట్టికంటుడిని అడుగడుగునా దర్శించుకుంటూ భక్తులు పునీతులయ్యారు. హనుమద్ వ్రతం ఉత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంలోని హనుమాన్ సర్కిల్‌నుండి కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం వరకూ శోభాయాత్రను నిర్వహించారు. ముందుగా విశేష పుష్పాలు, వివిధ రకాల స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని, అంతే అందంగా అలంకరించిన అశ్వవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ఈవో ముత్యాలరావు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ నారికేâýæను సమర్పించి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో మున్సిపల్ వైస్ చైర్మెన్ శ్రీనాథ్ గౌడ్, మార్కెట్ యార్డు చైర్మెన్ బండారు ఆనంద్, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement