Sobhayatra
-
వైభవంగా నెట్టికంటుడి శోభాయాత్ర
గుంతకల్లు రూరల్: హనుమాన్ మాలధారుల పాదయాత్ర సందర్భంగా చేపట్టిన నెట్టికంటుడి శోభాయాత్ర ఆద్యంతం అత్యంత వైభవంగా సాగింది. ఆంజనేయ స్వామి నామస్మరణతో గుంతకల్లు పట్టణ పురవీధులు మార్మోగాయి. అశ్వ వాహనంపై కొలువుదీరిన నెట్టికంటుడిని అడుగడుగునా దర్శించుకుంటూ భక్తులు పునీతులయ్యారు. హనుమద్ వ్రతం ఉత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంలోని హనుమాన్ సర్కిల్‌నుండి కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం వరకూ శోభాయాత్రను నిర్వహించారు. ముందుగా విశేష పుష్పాలు, వివిధ రకాల స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని, అంతే అందంగా అలంకరించిన అశ్వవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ఈవో ముత్యాలరావు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ నారికేâýæను సమర్పించి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో మున్సిపల్ వైస్ చైర్మెన్ శ్రీనాథ్ గౌడ్, మార్కెట్ యార్డు చైర్మెన్ బండారు ఆనంద్, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కన్నుల పండువగా శోభాయాత్ర
కన్నుల పండువగా శోభాయాత్ర సాక్షి, తిరుమల: జయతీర్థుల ఆరాధనోత్సవాల్లో భాగంగా తిరుమల ఆలయ మాడవీధుల్లో ఆదివారం శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థులు నేతృత్వంలో సుమారు 3500 మంది కళాకారులు, భజన బృందాల సభ్యులతో నగర సంకీర్తన, భజన, కోలాటాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. -
జై హనుమాన్...
నగరంలో ఘనంగా హనుమజ్జయంతి వైభవంగా సాగిన శోభాయాత్ర అబిడ్స్/కలెక్టరేట్: జై హనుమాన్..జై శ్రీరాం...జై భజరంగబళి నినాదాలతో నగరం హోరెత్తింది. హనుమాన్ జయంతిని ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. నగరం నలుమూలలా హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. వేలాది మంది భక్తజనం పాల్గొన్నారు. గౌలిగూడ రాంమందిర్‌లో ముందుగా భజరంగ్‌దళ్ తెలంగాణ అధ్యక్షులు వై.భానుప్రకాష్ హనుమాన్‌జీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రను వీహెచ్‌పీ అంతర్జాతీయ సహ కార్యదర్శి సురేంద్రకుమార్ జైన్, తెలంగాణ ప్రాంత అధ్యక్షులు మూసాపేట రామరాజు, కార్యాధ్యక్షులు సురేందర్‌రెడ్డి, భాగ్యనగర్ వీహెచ్‌పీ అధ్యక్షులు ఎన్.చంద్రశేఖర్, బెంగుళూరు క్షేత్ర భజరంగ్‌దళ్ సంయోజకులు సూర్యనారాయణ ముఖ్యఅతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. శోభాయాత్రకు జంట నగరాల నుంచి వేలాదిమంది హనుమాన్ భక్తులు ర్యాలీగా తరలివచ్చారు. జంటనగరాలకు చెందిన హిందీనగర్, వివేకానందనగర్, ఆర్యనగర్, విద్యానగర్, మహంకాళినగర్, అణుశక్తి, విశ్వకర్మనగర్, వాయుపుత్రనగర్ జిల్లాలతో పాటు పాతబస్తీలోని ధూల్‌పేట్, బేగంబజార్, మంగళ్‌హాట్, జియాగూడ, పురానాపూల్, షాలిబండ, చార్మినార్, బహదూర్‌పురా, అత్తాపూర్, జాంబాగ్, గన్‌ఫౌండ్రీ, సుల్తాన్‌బజార్, కోఠి, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది హనుమాన్ భక్తులు ర్యాలీలో పాల్గొని జైశ్రీరామ్ నినాదాలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గౌలిగూడ రాంమందిర్ ప్రధాన రహదారి నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా మీదుగా సుల్తాన్‌బజార్, కాచిగూడ, నారాయణగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి నుంచి తాడ్బంద్ హనుమాన్ ఆలయానికి తరలివెళ్లింది. పాల్గొన్న ప్రముఖులు హనుమాన్ శోభాయాత్రలో భజరంగ్ దళ్ నగర అధ్యక్షులు వీరేశలింగం, మాజీ ఎమ్మెల్యే పి.రామస్వామి, భజరంగ్సేన రాష్ట్ర అధ్యక్షులు ఠాకూర్ యమన్‌సింగ్, బీజేపీ సీనియర్ నాయకులు గోవింద్‌రాఠి, వై. కృష్ణ, గొడుగు శ్రీనివాస్‌యాదవ్, బంగారు సుధీర్‌కుమార్, కార్పొరేటర్ జి. శంకర్‌యాదవ్, బీజేపీ నగర కార్యవర్గ సభ్యులు గుండెవోని శ్రీనివాస్‌యాదవ్, మీరంపల్లి కృష్ణ, రమేష్‌లతో పాటు టీఆర్ఎస్ గన్‌ఫౌండ్రి నాయకులు సంతోష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్రకు సెంట్రల్, ఈస్ట్‌జోన్ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. డీసీపీ కమల్‌హాసన్‌రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ ఎ.వి. రంగనాధ్, అడిషనల్ డీసీపీ సుంకరి సత్యనారాయణ, ఏసీపీ రావుల గిరిధర్, ఇన్స్పెక్టర్లు అంజయ్య, శివశంకర్, ఇతర అధికారులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. -
హనుమాన్ యాత్రకు ముస్లింల తోడ్పాటు
హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా జంటనగరాల్లో మతసామరస్యం మరోసారి రుజువు వైంది. కాచిగూడ- నారాయణగూడ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద ముస్లిం సేవా సంస్థల ఆధ్వర్యంలో మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచారు. శోభాయాత్రలో పాల్గొనే వారికి వీటిని అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
శోభాయాత్రకు స్వల్ప అంతరాయం
నగరంలో కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. కర్మన్‌ఘాట్ సమీపంలో యాత్ర ఉండగా డీజేలకు పోలీసులు అనుమతించలేదు. దీంతో కొందరు భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే, పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి యాత్రను ముందుకు సాగేలా వీలుకల్పించారు. -
‘భారత్‌మాతాకీ జై’ అనకుంటే దేశద్రోహులే
ఆధ్యాత్మిక గురువు, ఎంపీ సాద్వీ ప్రాచీ అబిడ్స్/అప్జల్‌గంజ్: ‘హిందుస్థాన్‌లో ఉన్నవారంతా భారత్‌మాతాకీ జై అనాల్సిందే... అలా అనకుంటే దేశద్రోహులే అవుతారు.. అటువంటి వాళ్లు దేశంలో ఉండడానికి వీలులేదు’ అని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు, ఎంపీ సాద్వీ ప్రాచీ అన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శుక్రవారం ధూల్‌పేట్ గంగాబౌలి నుంచి ప్రారంభమైన శోభాయాత్ర బేగంబజార్ చౌరస్తాకు చేరుకుంది. ఈ సందర్భంగా శోభాయాత్రలో భక్తులను ఉద్దేశించి సాద్వీ ప్రసంగిం చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుందన్నారు. మనమంతా హిందూస్థాన్‌లో ఉన్నామన్నారు. ఇటీవల అసదుద్ధీన్ ఒవైసీ భారత్ మాతాకీ జై అని అననని వెల్లడించడం దేశద్రోహమే అవుతుందన్నారు. హైదరాబాద్‌కీ చువ్వా (ఎలుక) ఏ కలుగులో దాక్కుందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి అన్నారు. రాజ్యాంగంలో ‘ఎక్కడా భారత్‌మాతాకీ జై’ అనాలని లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పురానాపూల్ గాంధీ పుత్లా చౌరస్తాలో.... హిందూత్వ ధర్మ పరిరక్షణకు కంకణ బద్ధుడినై ఉన్నానని గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్‌లోథ అన్నారు. శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకొని పురానాపూల్ గాంధీ పుత్లా చౌరస్తా వద్ద ఆయన మాట్లాడారు. గోషామహల్ నియోజకవర్గం లోనే ధూల్‌పేట్ గంగాబౌలి ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొన్నారు. 51 అడుగుల హనుమాన్ విగ్రహం ప్రాణప్రతిష్ట చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చానని, ఇప్పటికే నగరం నుంచే గాక ఇతర పరిసర జిల్లాల నుంచి కూడా ఆకాష్‌పురి హనుమాన్ను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం: సాక్షి మహరాజ్ దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో కేం ద్రం లోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తుదముట్టిస్తుందని ఉత్తర భారతదేశ ఆధ్యాత్మిక గురువు సాక్షి మహరాజ్ పేర్కొన్నారు. శోభాయాత్రలో ధూల్‌పేట్ ప్రాంతంలో ప్రసంగించారు. ఉగ్రవాదం తగ్గుముఖం పట్టడానికి మోడీ ప్రభుత్వమే కారణమన్నారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ హిందుత్వాన్ని పెంపొందించడంలో, గోవులను రక్షించేందుకు చేస్తున్న కృషి అమోఘమని ఆయన కొనియాడారు. -
శోభాయాత్రలో యువకుడి పై దాడి
వినాయక నిమజ్జన శోభాయాత్ర అనంతరం ఇంటికి వెళ్తున్న యువకుడిపై పది మంది వ్యక్తులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ సైట్-3 పెద్దమ్మనగర్‌లో నివాసముండే పి. చంద్రశేఖర్(32) యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంటారు. ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో భార్యతో కలిసి నిమజ్జన శోభాయాత్ర నుంచి ఇంటికి వస్తుండగా పది మంది యువకులు శేఖర్ అంటూ పేరు పెట్టి పిలిచారు. దీంతో వెనక్కి తిరిగిన శేఖర్‌ను అప్పటికే కర్రలతో సిద్ధంగా ఉన్న యువకులు చితక బాదారు. అడ్డు వచ్చిన భార్యపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈఘటనలో శేఖర్‌కు తీవ్ర గాయాలు కాగా వెంటనే శ్రీనగర్‌కాలనీలోని నిఖిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అకారణంగా దాడి చేసిన అదే బస్తీకి చెందిన వీరేశం, రఘు, సాయి, చిట్టి, శివ తదితరులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. దాడిచేసిన వారిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ప్రశాంతంగా జరుగుతున్న శోభాయాత్రలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కూడా సీరియస్‌గా ఉన్నారు. -
గణేషుడి శోభాయాత్రకు పటిష్ట భద్రత
-
‘శోభా’యమానం
అబిడ్స్/జియాగూడ/కలెక్టరేట్/ సుల్తాన్‌బజార్: జైశ్రీరామ్...జై వీర హనుమాన్ అంటూ లక్షలాది మంది భక్తుల నినాదాల నడుమ శ్రీరామ నవమి శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. ధూల్‌పేట్ నుంచి పురానాపూల్, జిమ్మెరాత్ బజార్, చుడీ బజార్, ఛత్రి, బేగంబజార్, సిద్దిఅంబర్‌బజార్, గౌలిగూడ, కోఠి, సుల్తాన్‌బజార్ వరకు నగర రహదారులు కాషాయమయంగా మారాయి. వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధూల్‌పేట్ గంగాబౌలిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర కొనసాగింది. మొదటిసారిగా సీతారాంబాగ్ ఆలయం నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి నాయకులు ఈ యాత్రను నిర్వహించారు. బృందావన్ నుంచి వచ్చిన సాధ్వీ సంహిత, ఆధ్యాత్మిక గురువు స్వామి కమలానంద భారతి సీతారాం బాగ్‌లో ఉదయం 11 గంటలకు పూజలు చేసి... యాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు గంగాబౌలిలో ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ, ఆలిండియా బీజేపీ కార్యదర్శి మురళీధర్‌రావులు శ్రీరాముడికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. రాత్రి వరకూ ఈ వేడుక కొనసాగింది. ఉర్రూతలూగించిన డోల్ పతక్ బ్యాండ్... పూణె నుంచి వచ్చిన కళాకారుల డోల్ పతక్ బ్యాండ్ ఉర్రూతలూగించింది. 101 మంది యువతీ యువకులు నృత్యాలు చేస్తూ... శివాజీ, శ్రీరాముడి భక్తి గీతాలు పాడుతూ బ్యాండ్‌లో పాల్గొన్నారు. ఆకట్టుకున్న విగ్రహాలు ఈ యాత్రలో భారీ శ్రీరాముడి విగ్రహం, శివాజీ, హనుమంతుడు, సీతారామ లక్ష్మణలు, రాణిఅవంతిబాయి, శేషశయ్యపై ఆదివిష్ణువు, రామసేతు, శ్రీరాముడి పట్టాభిషేకం విగ్రహాలు భక్తుల మదిని దోచుకున్నాయి. ధూల్‌పేట్‌లో టీఆర్ఎస్ నాయకులు ఆనంద్‌సింగ్ నిర్వహించిన ఫాల్కీ యాత్రలో తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామ మందిరం నిర్మిద్దాం:సాధ్వీ సంహిత అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ప్రతి భక్తుడూ కోరుతున్నారని బృందావన్ వీహెచ్‌పీ నాయకురాలు సాధ్వీ సంహిత పేర్కొన్నారు. ఛత్రీ చౌరస్తా వద్ద భక్తులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ హిందూ సంస్కృతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గోవధ నిషేధ చట్టం పూర్తిగా అమలయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. హిందువుల ఐక్యతే ప్రధానం: ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ హిందువులు ఐక్యంగా ఉంటే శత్రువులు పారిపోతారని యాత్ర నిర్వాహకుడు, ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ పిలుపునిచ్చారు. బేగంబజార్ చౌరస్తాలో భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు యువత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర నాయకులు కేశవరాజు, రామరాజు, యమన్‌సింగ్, కె.రాములు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్అంతరాయం బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అభ్యంతరం తెలిపి శోభాయాత్ర నిలిపివేశారు. పోలీసులు సైతం విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో యాత్ర కొనసాగింది. ప్రశాంతంగా ముగింపు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శోభా యాత్ర ప్రశాంతంగా ముగిసింది. దీంతో ప్రజలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ బందోబస్తు సాక్షి, హైదరాబాద్: శ్రీరామ నవమి సందర్భంగా నగరంలో నిర్వహించిన శోభాయాత్రలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు వేల మంది సిబ్బందిని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి బందోబస్తుకు కేటాయించారు. మరోపక్క ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా వాహనాలను దారి మళ్లించారు. ఈసారి ‘వీడియో కెమెరా మౌంటెడ్ వెహికిల్’ను యాత్ర ముందు భాగంలో ఒకటి, వెనక భాగంలో మరొక టి వినియోగించారు. వీటి ద్వారా అక్కడి దృశ్యాలను పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, జితేందర్, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ నాగిరెడ్డి, డీసీపీలు రంగనాథ్, చౌహాన్లు తిలకించారు. వీరితో పాటు అగ్నిమాపక శాఖ, విద్యుత్, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్ తదితర ప్రభుత్వ విభాగాల అధికారులు సైతం తిలకించారు. బందోబస్తులో ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్, సౌత్ జోన్ల డీసీపీలు డాక్టర్ రవీందర్, వెంకటేశ్వరరావు, సుధీర్‌బాబు, కమలాసన్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అడ్డుకున్న పోలీసులు యాకుత్‌పురా: ఉప్పుగూడ హనుమాన్ నగర్‌లోని శ్రీ మంగళ్ముఖి హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో డీజేకు అనుమతి లేదని.. వెంటనే తీసేయాలని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, పోలీసుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. కాసేపటి తరువాత వివాదం సద్దుమణిగింది. -
వైభవంగా భజన మండళ్ల శోభాయాత్ర
తిరుపతి కల్చరల్: టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన మండళ్ల శోభాయాత్ర శుక్రవారం వైభవంగా జరిగింది. రెండు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనుకనున్న మూడవ సత్రం ప్రాంగణంలో ఉదయం 5 నుంచి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంకీర్తనాలాపన, ధార్మిక సందేశం, మానవాళికి హరిదాసుల ఉపదేశాలు అందించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి విచ్చేసిన 3500 మంది భజన మండళ్ల సభ్యులు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం నుంచి మూడవ సత్రం వరకు వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పీఆర్.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ హరినామ సంకీర్తన ప్రజల్లో అశాంతిని దూరం చేస్తుందన్నారు. శనివారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద ప్రముఖులతో మెట్ల పూజ నిర్వహిస్తామన్నారు. గోవిందరాజస్వామి ఆలయం డెప్యూటీ ఈవో చంద్రశేఖర్‌పిళ్లై, ఏఈవో ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికారులు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. -
హిందూ ధర్మాన్ని రక్షించండి
సాక్షి, సిటీబ్యూరో: హిందూ ధర్మం, సంస్కృతులను పరిరక్షించడం కర్తవ్యంగా భావించాలని అఖిల భారతీయ సాధ్వీ శక్తి పరిషత్ ప్రధాన కార్యదర్శి వైష్ణవీ ప్రజ్ఞా భారతీయా పిలుపునిచ్చారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్ర సందర్భంగా ఎంజే మార్కెట్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. హిందూ సమాజంపై ఆఘాయిత్యాలకు పాల్పడే వారు ఎక్కడోలేరని, మన మధ్యన ఉంటూనే ప్రమాదం తల పెట్టవచ్చని అన్నారు. హైదరాబాదీ హిందువుల ఐక్యత యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని అభినందించారు. ప్రధానంగా హైదరాబాద్‌లో గోమాతను రక్షించాల్సిన బాధ్యత హిందూ సమాజంపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. చొరబాటుదారులను తరిమి కొట్టాలి భారతదేశంలో చొరబాటుదారులను తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని మధ్యప్రదేశ్‌కు చెందిన సాధ్వీ విభానందగిరి పిలుపునిచ్చారు. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత హిందూ సమాజంపై ఉందని పునరుద్ఘాటించారు. గోవధ నిషేధానికి కృషి గోవధ నిషేధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఒక్క గోమాత ప్రాణం కూడా పోకుండా రక్షించి తీరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి. బీజేపీ జాతీయ నాయకుడు చింత సాంబమూర్తి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంతరావు తదితరులు ప్రసంగించారు. గణేష్ ఉత్సవాలకు అంతర్జాతీయ గుర్తింపు: బండారు దత్తాత్రేయ అబిడ్స్: గణేష్ ఉత్సవాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడతానన్నారు. సోమవారం ఎంజే మార్కెట్-అబిడ్స్ రోడ్డులో ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ ఏర్పాటుచేసిన వేదికపై ఆయన ప్రసంగించారు. కేంద్ర మంత్రిప్రకాష్ జవదేకర్‌తో సమావేశమై గణేష్ ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చే విధంగా ప్రత్యేక కృషి చేస్తానన్నారు. లక్షలాది మంది జనం మధ్య గణేష్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గణేష్ ఉత్సవాలను చిన్న ఘటనలు లేకుండా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ పాలు పంచుకున్నారని దత్తాత్రేయ ప్రశంసించారు. అకృత్యాలను అడ్డుకోండి దత్తాత్రేయనగర్: లవ్ జీహాద్ పేరుతో హిందూ యువతులపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని సాధ్వీ విభానందగిరీజీ, వైష్ణవీ ప్రజ్ఞలు అన్నారు. సోమవారం ఎంజేమార్కెట్‌లో గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదికవద్ద విభానంద గిరీజీ మాట్లాడుతూ అల్లా, దేవునిపై నమ్మకం లేనివారే ఉగ్రవాదులుగా మారుతున్నారన్నారు. వైష్ణవీ ప్రజ్ఞ మాట్లాడుతూ దేశద్రోహ వ్యవహరాలకు పాల్పడే వారికి భారత్‌లో ఉండే అర్హత లేదన్నారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి తదితరులు మాట్లాడారు. ‘వందేమాతరం’ పాడండి యాకుత్‌పురా: హిందుస్థాన్‌లో ఉండాలంటే వందేమాతరం గేయాన్ని పాడాలని అఖండ సంప్రదాయక్ సంస్థ ఉపాధ్యక్షురాలు సాత్వీ విభానందగిరి అన్నారు. చార్మినార్ కట్టడం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై ఆమె పాతబస్తీ నుంచి తరలివచ్చిన వినాయకులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ...భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆంక్షలు పెడుతూ ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ శక్తిపీఠం అధ్యక్షురాలు వైష్ణవీ ప్రజ్ఞ మాట్లాడుతూ ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్కలు నాటాలని సూచించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భక్తులకు గంట కొట్టనివ్వకపోవడం తగదన్నారు. -
గంగ ఒడికి మహా గణపతి
బుధవారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన ఘట్టం గురువారం సాయంత్రానికి పూర్తయింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన ఖైరతాబాద్ మహా గణనాథుని శోభాయాత్ర గురువారం మధ్యాహ్నానికి ట్యాంక్‌బండ్‌కి చేరుకుంది. 1.53 నిమిషాల ప్రాంతంలో గోనాగ చతుర్ముఖ గణపతి సాగర గర్భంలోకి చేరాడు. -
గంగ ఒడికి మహా గణపతి
బుధవారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన ఘట్టం గురువారం సాయంత్రానికి పూర్తయింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన ఖైరతాబాద్ మహా గణనాథుని శోభాయాత్ర గురువారం మధ్యాహ్నానికి ట్యాంక్‌బండ్‌కి చేరుకుంది. 1.53 నిమిషాల ప్రాంతంలో గోనాగ చతుర్ముఖ గణపతి సాగర గర్భంలోకి చేరాడు. మరోపక్క హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఖైరతాబాద్, న్యూస్‌లైన్: గోనాగ చతుర్ముఖ గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. బుధవారం అర్ధరాత్రి 2.30 గంటలకు నిమజ్జనానికి బయల్దేరిన భారీకాయుడు దాదాపు పన్నెండు గంటల పాటు ప్రయాణించి గురువారం మధ్యాహ్నం 1.53 గంటలకు సాగర గర్భంలోకి ప్రవేశించాడు. మహా గణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు అశేష భక్తజనులు తరలివచ్చారు. అర్ధరాత్రి 2.30: మంటపం నుంచి బయల్దేరిన మహా గణపతి తెల్లవారుజామున 4: సెన్సేషన్ థియేటర్ వద్దకు చేరిక 6.40: రాజ్‌దూత్ చౌరస్తాకు రాక 7.45: టెలిఫోన్ భవన్ వద్దకు చేరిన లంబోదరుడు 8.05: సచివాలయం పాతగేటు వద్దకు చేరుకోగా.. భారీగా తరలివ స్తున్న విగ్రహాల కారణంగా అరగంట పాటు అక్కడే నిలిపివేశారు 8.25: తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్దకు రాక 9.25: సచివాలయం వద్దకు చేరిన మహా గణపతి 11.00: 6వ నెంబర్ క్రేన్ వద్దకు చేరిక మధ్యాహ్నం 1.00: తుది పూజలు.. చివరిసారి దర్శనం కోసం భక్తులు దూసుకురావడంతో తోపులాట 1.53: సాగర గర్భంలోకి చేరిన గణపయ్య లడ్డూ బాగుంటే.. నేడు పంపిణీ ఖైరతాబాద్, న్యూస్‌లైన్: వర్షంలో తడిసిన ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ ఏమాత్రం బాగున్నా.. భక్తులకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ లంబోదరుడి చేతిలో ఏర్పాటు చేసిన 4200 కిలోల లడ్డూ బుధవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన వర్షానికి తడిసింది. దాదాపు మూడు గంటల పాటు వర్షంలో తడవడంతో అది చక్కెర పానకంలా తయారైంది. లడ్డూను దించిన తర్వాత కవర్లతో కప్పి ఉంచడం వల్ల గాలి ఆడక కూడా అది చెడిపోయే అవకాశముందని సురుచి ఫుడ్స్ యజమాని మల్లిబాబు తెలిపారు. ఒకవేళ లోపలి భాగం పాడవకుండా ఉంటే శుక్రవారం పంపిణీ చేస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ చెప్పారు. -
జడివానలో గణయాత్ర
-
జడివాననో గణయాత్ర
భక్తుల జయజయధ్వానాల మధ్యగణ..గణమంటూ గణనాథులు నిమజ్జనానికి కదిలారు. జడివానలోనూ భక్తుల ఉత్సాహం హోరెత్తింది. వాన కారణంగా శోభాయాత్రకు ఆటంకం కలిగింది. డప్పుల దరువులు, యువత కేరింతలతో యాత్ర ఆద్యంతం శోభిల్లింది. అటు ట్యాంక్‌బండ్, ఇటు ఎంజే మార్కెట్.. ఎటు చూసినా భక్తజన సందోహపు సందడే. ఇక, లంబోదరుని లడ్డూలు లక్షలు పలికాయి. వేలం పాటలో భక్తులు రికార్డు స్థాయి ధరకు వీటిని దక్కించుకున్నారు. కవాడిగూడ, న్యూస్‌లైన్: భాగ్యనగరం భక్తిభావంతో తడిసిముద్దయ్యింది. గణేష్ నామస్మరణతో పులకించింది. బొజ్జగణపయ్య నిమజ్జనోత్సవం బుధవారం ట్యాంక్‌బండ్‌పై వేలాది భక్తజనుల మధ్య కోలాహలంగా, అత్యంతవైభవంగా జరిగింది. గణేష్ విగ్రహాలను క్రేన్ల సహాయంతో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తుండగా భక్తులు అత్యంత ఆసక్తిగా తిలకించారు. వివిధ ప్రభుత్వ శాఖలు విరివిగా సేవలందించాయి. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనోత్సవ విశేషాలసమాహారం... వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్‌బండ్ జాతరను తలపించింది. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు నిమజ్జనం చేసేందుకు నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి తరలి వచ్చే విగ్రహాల లెక్కింపు కార్యక్రమంలో పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్, రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను, రాణిగంజ్ వైపు వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. విద్యుత్ శాఖ ఇందిరా పార్కు కార్యాలయం ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై విద్యుత్ క్యాంపు ఆఫీసును ఏర్పాటు చేసింది. భక్తుల కోసం జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిటీ పోలీసు ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన కార్యాలయంలో ప్రభుత్వ వైద్యులు వైద్య శిబిరం నిర్వహించారు. కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తప్పిపోయిన పిల్లల కోసం బాలల పరిరక్షణ విభాగం, హైదరాబాద్ జిల్లా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిస్సింగ్ చిల్డ్రన్స్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ట్యాంక్‌బండ్ అటు నుంచి ఇటువరకు మొత్తం కలియదిరిగి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేశారు. -
గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టానికి సర్వం సిద్ధమైంది.
-
గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టానికి సర్వం సిద్ధమైంది.
కీలక ఘట్టం సర్వం సిద్ధం బాలాపూర్-హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర ఉదయం 9 గంటలకే ఊరేగింపు ప్రారంభం నిమజ్జనం త్వరగా పూర్తయ్యేలా చర్యలు నగరవ్యాప్తంగా సీసీ, వీడియో కెమెరాల నిఘా 15 వేల మంది సిబ్బందితో బందోబస్తు : కొత్వాల్ ఏర్పాట్లు పూర్తిచేసిన జీహెచ్ఎంసీ భాగ్యనగరి ఉత్సాహంతో ఊగిపోతోంది. నగరం ‘బోలో గణేష్ మహరాజ్‌కీ’ నినాదాలతో మార్మోగి పోతోంది. శోభాయమానంగా సాగే మహాయాత్ర, నిమజ్జనోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గణనాథులకు ఘనంగా వీడ్కోలు చెప్పడానికి ఉత్సవ నిర్వాహకులు సంసిద్ధమయ్యారు. పోలీసులు నగరవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘గణ’ ఏర్పాట్లివీ... 21 జలాశయాల వద్ద ఏర్పాటు చేసిన క్రేన్లు 71 ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటుచేసిన క్రేన్లు 40 గజ ఈతగాళ్లు 85 పారిశుద్ధ్య సిబ్బంది 2300 అదనపు బస్సులు 360 ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ప్రాంతాలు 66 రవాణా శాఖ మండపాలకు ఇచ్చిన వాహనాలు 1144 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు 8 ప్రధాన ఊరేగింపు మార్గం : కేశవగిరి-నాగుల్చింత-ఫలక్‌నుమా-చార్మినార్-మదీనా- అఫ్జల్‌గంజ్-ఎంజే మార్కెట్-అబిడ్స్-బషీర్‌బాగ్-లిబర్టీ-అప్పర్ ట్యాంక్/ఎన్టీఆర్ మార్గం సికింద్రాబాద్ నుంచి వచ్చేవి: లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి ఈస్ట్‌జోన్ నుంచి వచ్చేవి: ఉప్పల్ నుంచి బయలుదేరి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సికింద్రాబాద్ ఊరేగింపుతో కలుస్తాయి వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చేవి: ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి నగరం వెలుపలే ఆర్టీసీ బస్సులు... సందర్శకులకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్: 040-2320 2813 హెల్ప్‌లైన్ నంబర్లు : 2785 2482, 2785 2486, 90102 03626