హిందూ ధర్మాన్ని రక్షించండి | Protect Hindu religion | Sakshi
Sakshi News home page

హిందూ ధర్మాన్ని రక్షించండి

Published Tue, Sep 9 2014 12:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హిందూ ధర్మాన్ని రక్షించండి - Sakshi

హిందూ ధర్మాన్ని రక్షించండి

సాక్షి, సిటీబ్యూరో: హిందూ ధర్మం, సంస్కృతులను పరిరక్షించడం కర్తవ్యంగా భావించాలని అఖిల భారతీయ సాధ్వీ శక్తి పరిషత్ ప్రధాన కార్యదర్శి వైష్ణవీ ప్రజ్ఞా భారతీయా పిలుపునిచ్చారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్ర సందర్భంగా ఎంజే మార్కెట్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన స్వాగత  కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. హిందూ సమాజంపై ఆఘాయిత్యాలకు పాల్పడే వారు ఎక్కడోలేరని, మన మధ్యన ఉంటూనే ప్రమాదం తల పెట్టవచ్చని అన్నారు. హైదరాబాదీ హిందువుల ఐక్యత  యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని అభినందించారు. ప్రధానంగా హైదరాబాద్‌లో గోమాతను రక్షించాల్సిన బాధ్యత హిందూ సమాజంపై ఉందని ఆమె పిలుపునిచ్చారు.
 
చొరబాటుదారులను తరిమి కొట్టాలి

భారతదేశంలో చొరబాటుదారులను తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని మధ్యప్రదేశ్‌కు చెందిన సాధ్వీ విభానందగిరి పిలుపునిచ్చారు. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత హిందూ సమాజంపై ఉందని పునరుద్ఘాటించారు.
 
గోవధ నిషేధానికి కృషి

గోవధ నిషేధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఒక్క గోమాత ప్రాణం కూడా పోకుండా రక్షించి తీరాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి. బీజేపీ జాతీయ నాయకుడు చింత సాంబమూర్తి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంతరావు తదితరులు ప్రసంగించారు.

గణేష్ ఉత్సవాలకు అంతర్జాతీయ గుర్తింపు: బండారు దత్తాత్రేయ

అబిడ్స్: గణేష్ ఉత్సవాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని  పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడతానన్నారు. సోమవారం ఎంజే మార్కెట్-అబిడ్స్ రోడ్డులో  ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ ఏర్పాటుచేసిన వేదికపై ఆయన ప్రసంగించారు. కేంద్ర మంత్రిప్రకాష్ జవదేకర్‌తో సమావేశమై గణేష్ ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చే విధంగా ప్రత్యేక కృషి చేస్తానన్నారు. లక్షలాది మంది జనం మధ్య గణేష్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గణేష్ ఉత్సవాలను చిన్న ఘటనలు లేకుండా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ పాలు పంచుకున్నారని దత్తాత్రేయ ప్రశంసించారు.
 
అకృత్యాలను అడ్డుకోండి

దత్తాత్రేయనగర్: లవ్ జీహాద్ పేరుతో హిందూ యువతులపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని సాధ్వీ విభానందగిరీజీ, వైష్ణవీ ప్రజ్ఞలు అన్నారు. సోమవారం ఎంజేమార్కెట్‌లో గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదికవద్ద విభానంద గిరీజీ మాట్లాడుతూ అల్లా, దేవునిపై నమ్మకం లేనివారే ఉగ్రవాదులుగా మారుతున్నారన్నారు. వైష్ణవీ ప్రజ్ఞ మాట్లాడుతూ దేశద్రోహ వ్యవహరాలకు పాల్పడే వారికి భారత్‌లో ఉండే అర్హత లేదన్నారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి తదితరులు మాట్లాడారు.
 
‘వందేమాతరం’ పాడండి

యాకుత్‌పురా: హిందుస్థాన్‌లో ఉండాలంటే వందేమాతరం గేయాన్ని పాడాలని అఖండ సంప్రదాయక్ సంస్థ ఉపాధ్యక్షురాలు సాత్వీ విభానందగిరి అన్నారు. చార్మినార్ కట్టడం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై ఆమె పాతబస్తీ నుంచి తరలివచ్చిన వినాయకులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ...భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆంక్షలు పెడుతూ ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. మధ్యప్రదేశ్ జబల్‌పూర్ శక్తిపీఠం అధ్యక్షురాలు వైష్ణవీ ప్రజ్ఞ  మాట్లాడుతూ ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్కలు నాటాలని సూచించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భక్తులకు గంట కొట్టనివ్వకపోవడం తగదన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement