Hindu Religion
-
Vivek Ramaswamy: ‘నేను హిందువు.. నా గుర్తింపు తప్పుగా చెప్పను’
హిందూ మత విశ్వాసంపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎన్ఎన్ టౌన్హాల్లో నిర్వమించిన ఓ కార్యక్రమంలో ఒక ఓటరు తన మతం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ‘మీరు మా అధ్యక్షుడు కాదు, ఎందుకంటే మీరు మా పూర్వికులకు సంబంధించిన మతానికి చెందినవారు కాదని అంటే?’ ఏం చెబుతారని ప్రశ్నించారు. దీనికి ఆయన.. ‘నేను హిందువును. నా గుర్తింపును తప్పుగా చెప్పుకోను. హిందూ మతం, క్రైస్తవం రెండూ కూడా ఒకే రకమైన విలువలను బోధిస్తాయి’ అని తెలిపారు. ‘హిందూ మతం నమ్మకాల ప్రకారం ఈ భూమ్మీదికి ప్రతి మనిషి ఓ కారణంతో వస్తారు. ఆ కారణాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనలోనే ఉంటాడు. మనతో ఆయన మంచి పనులు చేయిస్తారు. మనమంతా కూడా ఆయన దృష్టిలో సమానం’ అని వివేక్ రామస్వామి తెలిపారు. A voter tonight in Iowa asked about my Hindu faith. I answered honestly. pic.twitter.com/hkUrZkbhUx — Vivek Ramaswamy (@VivekGRamaswamy) December 14, 2023 దేశంలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చెందించే అధ్యక్షుడను తాను కాదని, కానీ అమెరికా దేశానికి సంబంధించి విలువల కోసం ఎల్లప్పుడూ నిలబడతానని తెలిపారు. 38 ఏళ్ల వివేక్ రామస్వామి.. నైరుతి ఒహియోకు చెందినవారు. అతని తల్లి గెరియాట్రిక్ సైకియాట్రిస్ట్. తండ్రి జనరల్ ఎలక్ట్రిక్‌లో ఇంజనీరు. అయితే ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024లో జరగనున్నాయి. చదవండి: అమెరికాలో ఘనంగా హాలిడే పార్టీ.. పాల్గొన్న400 మంది సీఈవోలు -
ఇంకో మతం ఉండొద్దన్నదే బీజేపీ ఆలోచన: భట్టి
తల్లాడ: దేశంలో ఇంకో మతం ఉండొద్దనే దుష్ట ఆలోచనతో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆజాదీకా గౌరవ్ పేరుతో ఖమ్మం జిల్లాలో ఆయన చేపట్టిన 75 కి.మీ. పాదయాత్ర ఐదో రోజైన శనివారం తల్లాడ, కల్లూరు మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భట్టి మాట్లాడారు. లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ.. హిందూ మతం తప్ప మరొకటి ఉండకూడదని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన కుట్రలను తిప్పకొట్టడానికే రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాయ మాటలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తూ ప్రజలను బహుళజాతి సంస్థల వద్ద తాకట్టు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. మరోపక్క ఆహార వస్తువులు, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని ధ్వజమెత్తారు. యాత్రలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: తెలంగాణపై పూర్తి పేటెంట్ టీఆర్ఎస్దే.. -
హిందూమతంలోకి యూపీ ముస్లిం నేత
Wasim Rizvi Converts To Hinduism: ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ వసీమ్ రిజ్వి హిందూమతంలోకి మారారు. ఘజియాబాద్‌లోని దాస్నా దేవి ఆలయంలో సోమవారం పూజారి యతి నర్సింగానంద్ సరస్వతి ఆయనతో మత మారి్పడి క్రతువు చేయించారు. రిజ్వి పేరును జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా ప్రకటించారు. ‘ముస్లింలు నన్ను మతం నుంచి బహిష్కరించారు. నా ఇష్టం వచ్చిన మతం స్వీకరించే స్వేచ్ఛ ఉంది. చదవండి: సైనికులపై హత్య కేసు నా కుటుంబ సభ్యులు ఇష్టం ఉన్న మతాన్ని ఆవలంభించవచ్చు. బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన పవిత్ర దినాన నేను హిందువుగా మారా. హిందువులను చంపివేస్తూ, వారి ఇళ్లకు ముస్లింలు నిప్పుపెడుతున్నారు. హిందువులు అటువంటి వారికి దూరంగా ఉండాలి’అని త్యాగి అన్నారు. -
ఖబర్దార్ పవన్: రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: హిందూ మతంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. హిందూమతం, ధర్మం గురించి కనీస అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? అని ప్రశ్నించారు. హిందూ మతాన్ని టార్గెట్‌గా చేసిన మట్లాడం సరైనది కాదని, లౌకికతత్వంపై పవన్‌కు కనీస అవగాహన లేదని హితవుపలికారు. పవన్ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఖబర్దార్ పవన్ అని హెచ్చరించారు. కాగా సోమవారం పవన్ కల్యాణ్ తిరుపతిలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అని వ్యాఖ్యానించారు. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని పవన్ ఆరోపించారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని అన్నారు. అలాగే టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందువులేనని ఆరోపించారు. హిందూ నాయకుల ప్రేరణ లేనిదే ఇలాంటివి జరగవని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటేనని..సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమేనని వ్యాఖ్యానించారు. మిగతా మతాల వారు ఇలాంటి పనులు చేయరని చెప్పారు. కాగా, పవన్ హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. పలువర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
హిందూ మతంపై పవన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తిరుపతి : హిందూ మతంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ.. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అని వ్యాఖ్యానించారు. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని పవన్ ఆరోపించారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని అన్నారు. అలాగే టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందువులేనని ఆరోపించారు. హిందూ నాయకుల ప్రేరణ లేనిదే ఇలాంటివి జరగవని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటేనని..సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమేనని వ్యాఖ్యానించారు. మిగతా మతాల వారు ఇలాంటి పనులు చేయరని చెప్పారు. కాగా, పవన్ హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. -
స్తూపిక... జ్ఞాన సూచిక
ఆలయ విమానం పైభాగంలో కనిపించే కలశంలాంటి నిర్మాణాన్నే ఆగమ, శిల్పశాస్త్ర పరిభాషలో స్తూపిక అంటారు. చాలామంది శిఖర కలశం అని పిలుస్తారు. ఆలయంలో ఇది అంతిమభాగం, అతి ముఖ్యమైన భాగమని సంప్రదాయం చెప్తోంది. ఆలయంలోనికి అనంతశక్తిని ప్రసరింపజేయడంలో ఈ స్తూపిక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆలయానికి బ్రహ్మభాగంలో అంటే నట్టనడిమిన ఇది ప్రతిష్ఠించబడుతుంది. ఇందులో అమృతం నిండి ఉంటుంది. అందుకే ఇది బిందుస్థానం(మధ్యభాగం)లో ఉండి నిరంతరం అమృతాన్ని స్రవిస్తుందని విశ్వకర్మీయ శిల్పశాస్త్రం చెప్పింది. ఆలయానికి శ్రీయంత్రానికి (శ్రీచక్రం) అవినాభావ సంబంధం ఉంది. ఈ యంత్రం నుండి పైకి లేచి ఆలయం రూపు దాలిస్తే సరిగ్గా బిందుస్థానంలో స్తూపి ఉంటుంది. బిందువు శక్తి అంశ. అందుకే ఈ స్తూపి అత్యంత శక్తివంతమైనది. సాధారణంగా స్తూపిని అరటిమొగ్గవలె రూపొందిస్తారు. అయితే కొన్ని చోట్ల త్రిశూలం, చక్రం వంటి లాంఛనాలు కూడా కనిపిస్తాయి. మొగ్గ వికసించని సృష్టికి ప్రతీక. అంటే ఇక్కడే సృష్టి ప్రారంభం అవుతోందని గమనించాలి. బిందువు నుండి ప్రారంభమై క్రమక్రమంగా విస్తరిస్తూ ఆలయం పూర్ణాకృతి పొందుతుంది. ఇది అవరోహణక్రమం. పూర్ణదేవాలయం క్రమ క్రమేపి చిన్నదవుతూ ఈ స్తూపి మూలంగానే శూన్యంలో కలిసిపోతుంది. ఇది ఆరోహణ క్రమం. ఉన్నది ఒకటే ’సత్’ అని ఋగ్వేదం చెప్పిన మాటకు ప్రతీకగా ఈ స్తూపి కనిపిస్తుంది.త్రిశూలస్తూపి ద్వారా త్రిశూలంలోని మూడు శూలాలతో త్రిమూర్తి తత్త్వం ఆవిష్కృతమౌతుంది. చక్రస్తూపికతో సమస్త విశ్వం ప్రతిబింబిస్తుంది. ఆలయానికైనా, విమానానికైనా ఒకటి మొదలు ఇరవై ఒక్క స్తూపికల వరకు ప్రతిష్ఠించవచ్చు. అలాగే పారలౌకిక కాములు అంటే మోక్షం కోరువారు సమసంఖ్యా కలశాలను, ఐహిక ఫలాన్ని కోరువారు బేసిసంఖ్యలో కలశాలను ప్రతిష్ఠించుకోవచ్చని ఆగమశాసనం. -
హిందూ ధర్మానికి ఎక్కడ విఘాతం కలిగిన పోరాటం చేస్తాం
-
హిందూ మతం: ఇవేమి తిప్పలు స్టాలిన్ బాబు!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) నాయకులు అవకాశం దొరికినప్పుడల్లా తాము హిందూ వ్యతిరేకులం కాదని, మత వ్యతిరేకులం అస్సలు కాదని పదే పదే చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఏప్రిల్ 9వ తేదీన దక్షిణ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తమది హిందూ వ్యతిరేక పార్టీ కాదని, హిందూయిజం ఒక్క భారతీయ జనతా పార్టీ సొత్తు కాదని అన్నారు. ఒక దశలో ఆయన డీఎంకే హిందూత్వ పార్టీ కాకపోతే డీఎంకేలో ఉన్న వారు ఎవరని ఆయన ప్రశ్నించారు. అసలు ఆయన ఎందుకు పదే పదే హిందూ వ్యతిరేకులం కాదని చెప్పుకోవాల్సి వస్తోంది? అందుకు దారితీసిన కారణాలు ఏమిటీ? ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతిస్తున్న ‘ద్రావిడార్ కళగం’ అధ్యక్షుడు కే. వీరమణి గత మార్చి 27వ తేదీన ఓ సభలో మాట్లాడుతూ.. తమిళనాడులో సంచలనం సృష్టించిన ‘పొలాచ్చి సెక్స్ కుంభకోణం’ కేసు నిందితులను హిందువులు ఆరాధించే శ్రీకష్ణుడితో పోల్చారు. అందుకు హిందూ మక్కల్ కాట్చి అనే పార్టీ ఏప్రిల్ నాలుగో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి బీజేపీ, పాలకపక్ష ఏఐఏడీఎంకే.. డీఎంకే, ద్రావిడార్ కళగంలు హిందూ వ్యతిరేకులంటూ విమర్శిస్తూ వస్తున్నాయి. ఈవీ రామస్వామి పెరియార్ 1920లో ఓ సామాజిక ఉద్యమంలో భాగంగా ద్రావిడార్ కళగంను ఏర్పాటు చేశారు. డీఎంకేగానీ, అన్నా ఏఐఏడీఎంకేగానీ ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చాయి. హిందువులను, హిందువుల ఆచారాలను విమర్శిస్తూనే ఈ రెండు ద్రావిడ పార్టీలు ఎదిగాయి. డీఎంకే నాయకుడు, స్టాలిన్ తండ్రి ఎం. కరుణానిధి నాస్తికుడు. ఏ రోజున గుళ్లూ గోపురాలు దర్శించలేదు. నాస్తికుడిగానే ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. తూత్తుకుడి నుంచి డీఎంకే అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేస్తున్న స్టాలిన్ సోదరి కనిమోళి ఎన్నికల ప్రచారంలో భాగంగా గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారు. పైగా తండ్రి కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయాల్లో పలు మత కార్యక్రమాలు జరిగేవని చెబుతున్నారు. హిందు వ్యతిరేకులు అన్న ముద్ర పడితే ఎక్కడ ఓట్లు రాలవేమోనన్న భయం పట్టుకున్నది వారికి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమంటే ఇదేనేమో! -
సంఘర్షణ నేర్పిన సంస్కృతి
తన సామాజిక ప్రతిఘటనోద్యమంతో సాంస్కృతికపరమైన ఒక నూతన మత సంప్రదాయాన్నీ నెలకొల్పారు. అదే అయ్యవాజీ సంప్రదాయం. ఈ సంప్రదాయానికి దేవాలయం ఉంటుంది. దేవుడు ఉండడు. ఇంటిలో, గుడిలో ఒక అద్దం ముందు నిలబడి మాత్రమే పూజలు చేయాలి. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడనేదే దానర్థం. ఇందులో వేదాలకూ, పురాణాలకూ, ఇతిహాసాలైన మహాభారతం, రామాయణం, భాగవతం లాంటి వాటికీ స్థానం లేదు. సంస్కృత మంత్రాలూ, వచనాలూ ఉండవు. వైకుందార్ ఈ సంప్రదాయం కోసం మొట్టమొదటిగా కన్యాకుమారిలో ఒక దేవాలయం నిర్మించాడు. ఆ దేవాలయం పేరు స్వామితొపే. ‘హిందూమతంతో మాకు ఎటువంటి సామ్యం లేదు. మేము హిందువులు అనుసరించే పూజా పద్ధతులనూ, ఇతర విధానాలనూ అనుసరించటంలేదు. మా దైవం, దేవత అంతా దర్పణమే. అంటే అద్దానికే పూజలు చేస్తాం. దేవాలయాల్లో కొబ్బరి కాయలు కూడా కొట్టం. మా వివాహ పద్ధతులు వేరు. మరణం తర్వాత పాటించే సంప్రదాయాలు వేరు. అందువల్లనే మమ్మల్ని వేరే మతంగా ప్రకటించాలని కోరుతున్నాం’ అంటూ ‘అయ్యవాజి’ సామాజిక వర్గం కోరుతున్నది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా, కన్యాకుమారిలో ఉన్న ప్రధాన దేవాలయాన్ని సందర్శించిన సమయంలో తాము ఇలా విజ్ఞప్తిని చేశామని, ఆమె సానుకూలంగా స్పందించారని, కానీ ఆమె మృతితో తమ డిమాండ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడ విధంగా మిగిలిందని, అయ్యవాజీల అధిపతి బాలప్రజాపతి అడికల్ ఈ మధ్య పత్రికా ప్రతినిధుల ఎదుట వాపోయారు. కర్ణాటకలో లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత వీరి డిమాండ్‌కు ప్రాధాన్యం పెరి గింది. కానీ ఇది కొత్త డిమాండ్ కాదు. అయ్యవాజి సామాజిక వర్గం ఎక్కడిది? ఎలా ఉద్భవించింది అనే ప్రశ్నలు సందర్భోచితం. దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ట్రావెన్కోర్ సంస్థానంలో ఒక సామాజిక ఉద్యమం పురుడు పోసుకున్నది. ఆ ఉద్యమమే ఆ తర్వాత ఒక జీవన విధానమైంది. ఆ ఉద్యమ వ్యవస్థాపకుడినే భగవంతుడి అవతారంగా పరిగణించారు. ఆనాటి అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన తిరుగుబాటు ఒక మత సంప్రదాయంగా అవతరించింది. ఒక సామాజిక పోరాటం మతంగా రూపుదిద్దుకోవడం ఎలా జరిగిందో ఊహించడానికి ఇదొక ఉదాహరణ. పైగా ఇది ఆధునిక యుగంలో జరగడం విశేషం. ట్రావెన్కోర్ సంస్థానంలో కులవివక్ష, అణచివేత, అంటరానితనం కింది స్థాయి ప్రజలను ఎన్నో ఇక్కట్లకు గురిచేశాయి. మెజారిటీ కులాలకు పాఠశాలల్లో ప్రవేశం లేదు. ఉద్యోగాల్లో స్థానం లేదు. అగ్రకులాలు నడిచేదారుల్లో నడవడానికి వీలు లేదు. ఇందులో ఎక్కువగా వివక్షకు, అణచివేతకు గురైంది నాడార్లే. నాడార్ల ప్రధాన వృత్తి కల్లుగీత. వ్యవసాయం ఇతర నిర్మాణ పనుల్లోను వీరి ప్రమేయం ఎక్కువే. వీరి చేత ప్రభుత్వ భవనాలూ, దేవాలయాలూ నిర్మాణం చేయించేవారు. కానీ వేతనాలు లేవు. స్పష్టంగా చెప్పాలంటే వెట్టిచాకిరి. ఇంకా సంస్థానాధీశులు వీరిపైన విపరీతంగా పన్నులు విధించేవారని చరిత్ర చెబుతోంది. దాదాపు 300 రకాల పన్నులు. ఈ పన్నులలో పురుషాంతరం అనే పన్ను తీవ్రమైనది. తాతముత్తాతల ఆస్తిలో దాదాపు 40 శాతం విలువైన డబ్బునీ, ధనాన్నీ, సంస్థానానికి అప్పగించాలి. ప్రాయశ్చిత్తం పేరుతో మరోపన్ను. ఎవరైనా ఒక పురుషుడు ఇతర ప్రాంతాలకూ, దేశాలకూ వెళితే పన్ను. ఇల్లు కట్టుకున్నా, గుడిసె వేసుకున్నా పన్ను. చివరకు చెట్లను పెంచితే, ఒక్కొక్క రకం చెట్టుకి ఒక్కొక్క రకం పన్ను విధించేవారు. కొత్త దుస్తులు, నగలూ, తలపాగా ధరించినా, గొడుగుపట్టినా, పెళ్లి ఊరేగింపు జరిపినా పన్ను చెల్లించాల్సిందే. పెళ్లి చేసుకుంటే తాళి పన్ను. ఆవులను, మేకలను, చివరకు కుక్క లాంటి జంతువులను పెంచుకున్నా పశువుల పన్ను. గానుగ ఆడే వారిపైనా పన్ను. ఓడ నడిపే వారికి ఓడ పన్ను, చేపలు పట్టేవారికి వలపన్ను. ఎడ్లబండి పన్ను. గొడ్డలి పన్ను, సుత్తి పన్ను, గునపం పైన కూడా పన్నులు విధించేవారు. వాటి భారంతో ప్రజలు విలవిల్లాడిపోయేవారు. ఘోరమైన విషయం స్త్రీల పైయ్యెదపై ఏ ఆచ్ఛాదనా ఉండకూడదు. ఒకవేళ ఎదపై వస్త్రాన్ని ధరించినట్టయితే పన్నుచెల్లించుకునే దారుణమైన పరిస్థితి. స్త్రీలు అర్థనగ్నంగా మంచినీళ్ల బిందెలను నెత్తిపై పెట్టుకొని తెచ్చుకోవాలి. అలా బిందెను మోసుకొస్తున్నప్పుడు రెండు చేతులూ పైకెత్తి ఉంచాలి. స్తనాల పరిమాణాన్ని బట్టి పన్నులు చెల్లించాల్సి ఉండేది. స్త్రీలు పన్నులు చెల్లించలేని స్థితిలో ఉంటే అధికారికంగా వారి పైన అత్యాచారాలు చేసే నీచమైన పద్ధతులు ఉండేవి. వీటన్నిటిపైనా స్త్రీజాతిలో అంతులేని ఆగ్రహం నిద్రాణమై ఉండేది. పన్నులు చెల్లించకపోతే తీవ్రమైన శిక్షలు అమలు చేసేవారు. అయినా ప్రభుత్వ భూములను, దేవాలయ భూములను వీరే ఉచితంగా సాగుచేయాలి. పండుగల్లో రాజకుటుంబాలకూ, అధికారులకూ కోళ్లనూ, గుడ్లను, పండ్లను, కూరగాయలనూ, వంటచెరుకునూ అందించాలి. ఆర్థిక ఆంక్షలు, నిషేధాలు, పన్నులు, సామాజిక అణచివేత, అత్యాచారాలు జరుపుతూనే ఆధిపత్య కులాలు వీరిని మతపరంగా వెలివేసినంత పనిచేశాయి. ఆధిపత్య కులాల దేవాలయాల్లో వీరికి ప్రవేశం లేదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించడానికి వీరు అనర్హులు. వాళ్లు ఆధిపత్య కులాల దేవుళ్లు. కింది కులాల కోసం వీరభద్రుడు, సుధాలయ్ మదన్, ఇరులన్, ముత్తురామన్, భద్రకాళి లాంటి దైవాలనే వీరు పూజించాలి. ఇలాంటి నేపథ్యంలోనే 1809లో ఆ సంస్థానంలోని తామరక్కులం గ్రామంలో పొన్ను నాడార్ వెయ్యిలాల్ అమ్మాళ్‌లకు ఒక కొడుకు జన్మిం చాడు. మొదట ముదిచోడుం పెరుమల్గా అతడికి నామకరణం చేశారు. దాని అర్థం కిరీటం ధరించిన ప్రభువు. కానీ ఆధిపత్య కులాలు దానికీ ఆగ్రహించాయి. చివరకు తల్లిదండ్రులు కొడుకు పేరును ముత్తుకుట్టిగా మార్చారు. ముత్తుకుట్టి 22 ఏళ్ళ వరకు సాధారణ జీవితాన్నే గడిపారు. ఇంటి పన్నుల్లో ఇతర వృత్తి పనుల్లో తల్లిదండ్రులకు సాయంగా నిలబడ్డారు. అప్పుడే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గ్రామంలో ఉండే వైద్యులు, దగ్గరి పట్టణాల్లోని వైద్యులు చేసిన చికిత్సకు ఏం ఫలితం లేకపోయింది. కొందరి సలహా మేరకు తన కొడుకుని తిరుచందూరులోని దేవాలయానికి తల్లి తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లిన తరువాత దగ్గరి సముద్రంలోనికి ముత్తుకుట్టి పరుగు లంఘించుకున్నాడు. ఎటు వెళ్లాడో తెలి యదు. మూడు రోజుల తర్వాత ముత్తుకుట్టి ప్రత్యక్షమయ్యాడు. ఏదో దైవాంశతో ఇలా జరిగిందని తల్లిదండ్రులూ, బంధువులూ భావిం చారు. ఆయన తన గ్రామానికి ప్రయాణమయ్యాడు. మార్గంలో ఎంతో మంది ఆరోగ్యాలను మెరుగుపరిచినట్టు ఆయన జీవిత చరిత్రలో ఉంది. సామాజిక పరిశోధకులు ఆయనను మరో రకంగా విశ్లేషించారు. ఆ తరువాత ఆయన పేరు అయ్యావైకుందార్గా మారింది. ప్రజల్లో తన సేవల ద్వారా తన ప్రవచనాల ద్వారా మంచి పేరును సంపాదించారు. అప్పటి వరకు కొనసాగుతున్న అణచివేత, వివక్షలపైన ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమానికి ఆయన పూనుకున్నారు. దీనితో ఆధిపత్య కులాలు సంస్థానానికి ఎన్నో ఫిర్యాదులు చేశారు. ప్రజలను రెచ్చగొడుతున్నాడని, రాజ్యాన్ని కూలదోయాల్సిందిగా ప్రేరేపిస్తున్నాడని నూరిపోశారు. దీనితో తప్పనిసరై సంస్థానాధీశులు అయ్యావైకుందార్‌ను అరెస్ట్ చేయడానికి సైన్యాన్ని పంపించారు. అయితే వేలాది మంది ప్రజలు అరెస్ట్ చేయడానికి వీలు లేదంటూ రక్షణ కవచంగా ఏర్పడ్డారు. కానీ అయ్యావైకుందార్ ప్రజలకు నచ్చచెప్పడంతో సైన్యానికి దారిచ్చారు. సైన్యం ఆయనను అరెస్టు చేసి, సుచింద్రంలోని రాజు ఎదుట హాజరుపరిచారు. రాజు ఆయనను పరీక్షించదలచి, మాయలు, తంత్రాలను ప్రదర్శించాని ఆజ్ఞాపించాడు. ఇందుకు అయ్యావైకుందార్ తిరస్కరించారు. దానితో జైలు శిక్ష విధించారు. రెండు రోజుల తర్వాత రాజధాని తిరువనంతపురం తరలించి, మరోసారి పరీక్షించే యత్నం చేసి, విఫలమయ్యారు. సారాలో విషం కలిపి తాగించారు. అయితే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇది జరుగుతుండగానే ప్రజలు వేలాదిగా ఆయన ఆశీర్వాదం కోసం తిరువనంతపురం చేరుకోవడంతో రాజు కంగారు పడ్డాడు. ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడంతో అయ్యావైకుందార్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ వైకుం దార్ అంగీకరించలేదు. తన శిక్షాకాలం దాదాపు 110 రోజులు జైలు జీవితాన్ని గడిపారు. ఆ తరువాత ఆయన తన సామాజిక ప్రతిఘటనోద్యమంతో సాంస్కృతికపరమైన ఒక నూతన మత సంప్రదాయాన్నీ నెలకొల్పారు. అదే అయ్యవాజీ సంప్రదాయం. ఈ సంప్రదాయానికి దేవాలయం ఉంటుంది. దేవుడు ఉండడు. ఇంటిలో, గుడిలో ఒక అద్దం ముందు నిలబడి మాత్రమే పూజలు చేయాలి. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడనేదే దానర్థం. ఇందులో వేదాలకూ, పురాణాలకూ, ఇతిహాసాలైన మహాభారతం, రామాయణం, భాగవతం లాంటి వాటికీ స్థానం లేదు. సంస్కృత మంత్రాలూ, వచనాలూ ఉండవు. వైకుందార్ ఈ సంప్రదాయం కోసం మొట్టమొదటిగా కన్యాకుమారిలో ఒక దేవాలయం నిర్మించాడు. ఆ దేవాలయం పేరు స్వామితొపే. అందులోభాగంగానే ఆయన ‘అఖిలం’ పేరుతో ఒక గ్రంథాన్ని రచించారు. నిత్యం తిరుణాల్ అని (ప్రతి రోజూ పండుగేనని), ప్రత్యేకమైన పండుగల ఆవశ్యకత లేదనీ ప్రకటించాడు. ఈ రోజు అదే సామాజిక వర్గానికి చెందిన వారు తమిళనాడులో తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనీ, తమకూ హిందూ మతానికీ ఎటువంటి సంబంధం లేదని ప్రకటిస్తున్నారు. అందుకే అయ్యా వైకుందార్ చెప్పిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ‘ఓ భగవంతుడా ఇటు వినండి! నా ప్రజలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వుంది. సంప్రదాయాలూ, కట్టుబాట్లూ మాకు లేవు. మేము దేవాలయాలను నిర్మించం. పూజారులుండరు. మేము ఆవులనూ, మట్టి విగ్రహా లను పూజించం. మేం మేకలనూ, కోళ్ళనూ, గొర్రెలనూ, ఎద్దులనూ, మొత్తంగా పశువులను బలివ్వం. జీవజాతులన్నింటినీ మేం సమంగా ప్రేమిస్తాం.’ మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213 -
'కాపాడేవాళ్లు ఎక్కువవటమే సమస్య'
న్యూఢిల్లీ: దేశంలో ధర్మాన్ని పరిరక్షించే వాళ్లు ఎక్కువైనందునే.. హిందూ మతం ప్రమాదంలో పడిందని.. బీజేపీ ఎంపీ ఉదిత్‌రాజ్ ఢిల్లీలో తెలిపారు. తమిళనాడులో కొందరు దళితులకు ఆలయ ప్రవేశం నిరాకరించినందుకు వారు ఇస్లాం స్వీకరించేందుకు సిద్ధమయ్యారన్న వార్తల నేపథ్యంలో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. దళితుల ఓట్లు చీల్చేందుకు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె ప్రయత్నిస్తున్నారని అధినేత్రి మాయావతి చేసిన విమర్శలపైనా ఆయన స్పందించారు. దళిత నాయకులు రాజకీయంగా ఎదగడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. గత 15 ఏళ్లు తనను కాంగ్రెస్, బీజేపీ ఏజెంట్ గా మాయావతి ఆరోపిస్తూ వస్తున్నారని చెప్పారు. ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోవాలని మాయావతికి హితవు పలికారు. -
ముస్లిం ఇంట్లో వేద మంత్రాలు.. తలంబ్రాలు
- హిందూ సంప్రదాయంపై మక్కువ చాటుకున్న ముస్లిం - శుభలేఖ నుంచి విందు వరకూ అన్నీ హైందవం ప్రకారమే - పెళ్లి కుమారుడి తరపువారిని, బంధువులనూ ఒప్పించి వివాహం రంపయర్రంపాలెం (గోకవరం): హిందూ మత సంప్రదాయాలపై మక్కువ కలిగిన ఓ ముస్లిం సోదరుడు తన కుమార్తె వివాహాన్ని హైందవ సంప్రదాయంలో జరిపించాడు. అతడి ఇంట్లో 'మాంగల్యం తంతునానేన..' అంటూ వేదమంత్రాలు ప్రతిధ్వనించాయి. పెళ్లి కుమారుడి తరఫు వారిని, బంధువులనూ ఒప్పించి ఈ పెళ్లి జరిపించడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, రంపయర్రంపాలేనికి చెందిన వ్యాపారి, వైఎస్సార్సీపీ నేత షేక్ మగ్ధూమ్ (రఫీ)కి చిన్ననాటి నుంచి హిందూ సంప్రదాయాలంటే ఇష్టం ఉండేది. వేదమంత్రాలపై అపార నమ్మకం. ఈ విశ్వాసమే తన కుమార్తె రేష్మీ, వరుడు అబ్దుల్ రహీమ్‌ల వివాహం హిందూ సంప్రదాయంలో నిర్వహించేలా చేసింది. పెళ్లి సందర్భంగా శుక్రవారం ఉదయం రఫీ ఇంట వేద పండితులు ప్రతి మంత్రానికీ అర్థాన్ని వివరిస్తూ వివాహం జరిపించారు. శుభలేఖనూ హిందూ సంప్రదాయం ప్రకారం జానక్యాః కమలామలాంజలి పుటేయూః పద్మరాగారుతాః..’ అనే శ్లోకం, హిందూ దేవతామూర్తుల బొమ్మలతో ముద్రించినట్లు వారు తెలిపారు. పెళ్లి అనంతరం వధూవరుల తలంబ్రాల ముచ్చట బంధుమిత్రులకు కన్నులపండుగలా అనిపించింది. కాగా తన గ్రామానికి చెందిన పదిమంది హిందూ అవివాహిత యువతులకు రూ.10 వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాండ్లను పెళ్లి పందిరిలో రఫీ.. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందించారు. హిందూ సంప్రదాయం, వేద మంత్రాలపై తనకు చిన్ననాటి నుంచి నమ్మకం ఉందని, అందుకే పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిపించానని రఫీ ఆనందంగా చెప్పారు. -
హిందూ ధర్మాన్ని రక్షించండి
సాక్షి, సిటీబ్యూరో: హిందూ ధర్మం, సంస్కృతులను పరిరక్షించడం కర్తవ్యంగా భావించాలని అఖిల భారతీయ సాధ్వీ శక్తి పరిషత్ ప్రధాన కార్యదర్శి వైష్ణవీ ప్రజ్ఞా భారతీయా పిలుపునిచ్చారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్ర సందర్భంగా ఎంజే మార్కెట్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. హిందూ సమాజంపై ఆఘాయిత్యాలకు పాల్పడే వారు ఎక్కడోలేరని, మన మధ్యన ఉంటూనే ప్రమాదం తల పెట్టవచ్చని అన్నారు. హైదరాబాదీ హిందువుల ఐక్యత యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని అభినందించారు. ప్రధానంగా హైదరాబాద్‌లో గోమాతను రక్షించాల్సిన బాధ్యత హిందూ సమాజంపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. చొరబాటుదారులను తరిమి కొట్టాలి భారతదేశంలో చొరబాటుదారులను తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని మధ్యప్రదేశ్‌కు చెందిన సాధ్వీ విభానందగిరి పిలుపునిచ్చారు. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత హిందూ సమాజంపై ఉందని పునరుద్ఘాటించారు. గోవధ నిషేధానికి కృషి గోవధ నిషేధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఒక్క గోమాత ప్రాణం కూడా పోకుండా రక్షించి తీరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి. బీజేపీ జాతీయ నాయకుడు చింత సాంబమూర్తి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంతరావు తదితరులు ప్రసంగించారు. గణేష్ ఉత్సవాలకు అంతర్జాతీయ గుర్తింపు: బండారు దత్తాత్రేయ అబిడ్స్: గణేష్ ఉత్సవాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడతానన్నారు. సోమవారం ఎంజే మార్కెట్-అబిడ్స్ రోడ్డులో ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ ఏర్పాటుచేసిన వేదికపై ఆయన ప్రసంగించారు. కేంద్ర మంత్రిప్రకాష్ జవదేకర్‌తో సమావేశమై గణేష్ ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చే విధంగా ప్రత్యేక కృషి చేస్తానన్నారు. లక్షలాది మంది జనం మధ్య గణేష్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గణేష్ ఉత్సవాలను చిన్న ఘటనలు లేకుండా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ పాలు పంచుకున్నారని దత్తాత్రేయ ప్రశంసించారు. అకృత్యాలను అడ్డుకోండి దత్తాత్రేయనగర్: లవ్ జీహాద్ పేరుతో హిందూ యువతులపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని సాధ్వీ విభానందగిరీజీ, వైష్ణవీ ప్రజ్ఞలు అన్నారు. సోమవారం ఎంజేమార్కెట్‌లో గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదికవద్ద విభానంద గిరీజీ మాట్లాడుతూ అల్లా, దేవునిపై నమ్మకం లేనివారే ఉగ్రవాదులుగా మారుతున్నారన్నారు. వైష్ణవీ ప్రజ్ఞ మాట్లాడుతూ దేశద్రోహ వ్యవహరాలకు పాల్పడే వారికి భారత్‌లో ఉండే అర్హత లేదన్నారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి తదితరులు మాట్లాడారు. ‘వందేమాతరం’ పాడండి యాకుత్‌పురా: హిందుస్థాన్‌లో ఉండాలంటే వందేమాతరం గేయాన్ని పాడాలని అఖండ సంప్రదాయక్ సంస్థ ఉపాధ్యక్షురాలు సాత్వీ విభానందగిరి అన్నారు. చార్మినార్ కట్టడం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై ఆమె పాతబస్తీ నుంచి తరలివచ్చిన వినాయకులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ...భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆంక్షలు పెడుతూ ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ శక్తిపీఠం అధ్యక్షురాలు వైష్ణవీ ప్రజ్ఞ మాట్లాడుతూ ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్కలు నాటాలని సూచించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భక్తులకు గంట కొట్టనివ్వకపోవడం తగదన్నారు. -
నమ్మకం: అద్దం చుట్టూ ఉన్నవి అబద్ధాలా? నిజాలా?
మనం ఎలా ఉంటామో మనకి తెలియాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం... అద్దం. అది మనల్ని మనకు పరిచయం చేస్తుంది. మన అందాన్ని పట్టి చూపిస్తుంది. మన అవకరాలను మనకు తెలియజేస్తుంది. అందుకే మనకు అద్దం కావాలి. కానీ మీకు తెలుసా? మన ఇంటి గోడకు హుందాగా వేళ్లాడే అద్దం వెనుక ఎన్ని కథలున్నాయో... ఎన్ని భయాలు ఉన్నాయో... ఎన్ని నమ్మకాలు, మూఢ నమ్మకాలు ఉన్నాయో! హిందూ మతం ప్రకారం... అద్దం లక్ష్మీస్థానం. అందుకే అద్దం పగిలితే సంపద చెల్లాచెదురైపోతుందని అంటారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే, ఇంట్లోకి ప్రవేశించే ఆరోగ్యకరమైన శక్తి పరావర్తనం చెంది తిరిగి వెళ్లిపోతుందని కూడా అంటారు. ఇంతవరకూ సరే. కానీ అద్దం పగిలితే ఎవరో ఒకరి ప్రాణాలకు ముప్పు అని కొందరు ఎందుకంటారు? ముఖ్యంగా రోమన్లు, గ్రీకులు, చైనీయులు, ఆఫ్రిక న్లు, కొన్ని వర్గాల భారతీయులు దీన్ని గట్టిగా నమ్ముతున్నారు. దానికి వారు చెప్పే సమాధానం... అద్దం మనను ప్రతిబింబిస్తుందని, అది పగిలితే మన రూపం ఛిద్రమైనట్టేనని, అంటే మరణం సంప్రాప్తించే సమయం ఆసన్నమైనదని అర్థం చేసుకోవాలని! పగిలిన అద్దంలో ముఖం చూసుకోవద్దనేది కూడా అందుకే. అయితే ఇది ఎంతవరకూ నిజం అంటే... నిరూపించడానికి ఆధారాలు శూన్యం. అద్దం విషయంలో అమెరికా, ఐర్లాండ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలవారికి ఓ బలమైన నమ్మకం ఉంది. తెలిసినవాళ్లెవరైనా చనిపోతే, వెంటనే ఇంట్లో ఉన్న అద్దాలన్నిటి మీదా గుడ్డను కప్పేస్తారు వాళ్లు. అలా ఎందుకు అంటే... ఖననం చేసిన వ్యక్తి ఆత్మ వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోదని, తనవాళ్ల చుట్టూ తిరుగుతుందని, తనకు ఆశ్రయమిచ్చే మరో శరీరం కోసం వెతుకుతుందని, అది దొరికేవరకూ అద్దంలో తలదాచుకుంటుందని అంటారు. అందువల్లే ఎక్కడ ఆ ఆత్మ వచ్చి చేరుతుందో అని భయపడి అద్దాలను కప్పివేస్తారు. సినిమాల్లో సైతం దెయ్యాలు అద్దంలోనే కనిపించినట్టు చూపిస్తుంటారు. అంటే, అద్దం దురాత్మకు ఆశ్రయమిస్తుందన్న నమ్మకం బలంగా ఏర్పడిపోయింది. అయితే ఈ నమ్మకం ఎలా పుట్టింది అంటే మాత్రం వాళ్లెవరూ సమాధానం చెప్పలేరు. అందుకే దీనిని మూఢనమ్మకంగానే పరిగణిస్తున్నారు చాలామంది ఆధునికులు. నమ్మకాలకేం... ఎన్నయినా పెట్టుకోవచ్చు. కానీ అలా నమ్మడం ఎంత వరకూ కరెక్ట్ అనేది కూడా ఆలోచించుకోవాలి. అద్దంలోకి ఆత్మలు ప్రవేశిస్తాయి అనుకుంటే, ఎవరి ఇంట్లోనైనా చనిపోతే వారి ఆత్మ వారి అద్దంలో ఉండిపోవాలి కదా! వారికి కనిపించాలి కదా! అద్దం పగిలితే మనం మరణిస్తాం అనేదే నిజమైతే, ఎక్కడా అద్దమే పగలడం లేదా? అలా పగిలిన ప్రతిసారీ, అందులో ముఖం చూసుకున్న ప్రతిసారీ ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారా? ఇలా ఆలోచిస్తే మన నమ్మకాల వెనుక ఉన్న నిజానిజాల్ని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అద్దం గురించిన కొన్ని నమ్మకాలు ఏడాదిలోపు బిడ్డకు అద్దం చూపిస్తే... బిడ్డ ప్రాణానికి ప్రమాదం! కొవ్వొత్తి వెలుగులో అద్దంలో చూసుకుంటే... మనకు బదులు మనకిష్టమైన వాళ్ల ఆత్మ కనిపిస్తుంది! పెళ్లాడబోయే వ్యక్తి ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే... అద్దం ముందు కూర్చుని యాపిల్ తినాలి. ఆపైన జుత్తు దువ్వుకుంటూ అద్దంలోకి చూస్తే మన భుజం వెనుక నిలబడి మనల్ని చేసుకోబోయే వ్యక్తి కనిపిస్తారు! వ్యాంపైర్లకు చావు ఉండదు. వాటికి ఆత్మలు ఉండవు. అందుకే అవి అద్దంలో కనిపించవు! -
నమ్మకం: ఎడమ చేయి ఏం పాపం చేసింది ?
Left hand ఎడమ చేతితో తినకూడదు, ఎడమ చేతితో ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు, ఎడమ చేతితో పూజల వంటి పవిత్ర కార్యాలు చేయకూడదు... ఈ మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ ఎందుకు ఎడమ చేతితో అవన్నీ చేయకూడదు అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కుడి కంటే ఎడమ ఎందులో తీసిపోతుంది? కుడి చేతికి ఉన్న ప్రాధాన్యత ఎడమ చేతికి ఎందుకు లేకుండా పోయింది? అసలిది నమ్మకమా... మూఢనమ్మకమా? దీని వెనుక చారి్రత్రక, మత సంబంధిత ఆధారాలు ఏవైనా ఉన్నాయా? ఎడమ చేతితో తినకూడదు అన్నదానికి పరిశుభ్రతే ప్రధాన కారణం. అయితే, ఎడమచేతితో ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు అన్నదానికి పెద్ద కారణమే ఉంది. హిందూ మతం ప్రకారం... శరీరాన్ని రెండు భాగాలుగా విభజించారు. నాభి నుంచి శిరస్సు వరకూ ఉన్నదాన్ని పవిత్ర భాగమని, నాభి నుంచి పాదాల వరకూ అపవిత్ర భాగమనీ అంటారు. అలాగే నిలువుగా కూడా రెండు భాగాలుగా విభజించారు. ఎడమవైపు భాగాన్ని చంద్రభాగమని, కుడివైపు భాగాన్ని సూర్యభాగమనీ అంటారు. చంద్రుడు స్వయంప్రకాశకుడు కాని కారణంగా, అతడు ఎప్పుడూ పరిపూర్ణంగా కనిపించడు. కానీ సూర్యుడు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటాడు. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు పూర్ణ మనసుతో ఇవ్వాలని అంటారు కాబట్టి, నిత్యం పరిపూర్ణుడుగా ఉండే సూర్యుడికి ప్రతిరూపమైన కుడిభాగాన్ని మాత్రమే ఉపయోగించాలని వేదాలు చెబుతున్నాయి. క్రైస్తవ మతంలో కూడా ‘ఎడమ’ను చెడుకు ఆపాదించడం కనిపిస్తుంది. దేవుడి రాజ్యం గురించి చెప్పేటప్పుడు పుణ్యాత్ములంతా దేవుడికి కుడివైపు, పాపం చేసినవాళ్లంతా ఎడమవైపు ఉన్నట్టుగా వర్ణించడం చూడొచ్చు. అందువల్లే ‘ఎడమ’కు ప్రాధాన్యత తక్కువైంది. గ్రీకులు, రోమన్లు ఎడమను చెడుగా చూసేవారని చరిత్ర చెబుతోంది. దుష్టశక్తులు ఎడమ వైపుగానే ఉంటాయని వాళ్లు నమ్మేవారట. ఎడమ భుజమ్మీదుగా చీకట్లోకి చూస్తే దెయ్యాలు కనిపిస్తాయని వాళ్లు విశ్వసించేవారట. ఆ నమ్మకం మెల్లగా చాలా దేశాలకు పాకిందని చెబుతారు పరిశోధకులు. దుష్టశక్తుల్ని పారద్రోలేందుకు గ్రీకులు, రోమన్లు ఎడమచేతి వేళ్లకి రకరకాల ఉంగరాలు ధరించేవారట. నవ దంపతుల మీద వాటి ప్రభావం పడకుండా ఉండేందుకే పెళ్లి సమయంలో ఎడమచేతికి ఉంగరం పెట్టించడం మొదలుపెట్టారని, అదే తర్వాత సంప్రదాయమైందనే వాదన కూడా ఉంది. ఇలాంటి వాటన్నిటిని బట్టే ‘ఎడమ’ను చిన్నచూపు చూడటం మొదలైంది. కానీ నిజానికి... ఎడమచేతి వాటం ఉన్నవాళ్లు అన్ని పనులూ ఆ చేత్తోనే చేస్తారు. అయినా వాళ్లేమీ నష్టపోవడం లేదు కదా! వాళ్లకు మంచే జరుగుతోంది కదా! మరి ‘ఎడమ’ అంత చెడ్డది ఎలా అయ్యింది? మొదట్లో రోమన్లు ఎడమ మంచిదని నమ్మేవారట. గ్రీకుల్ని చూశాక వారి అభిప్రాయం మారిందట. మంచం దిగేటప్పుడు ఎడమ కాలు ముందు పెడితే అరిష్ట మని కొందరు నమ్ముతారు. కెన్యాలోని మేరు తెగవారు ఎడమ మంచిదంటారు. ఎందు కంటే తమ దేవుడు తన ఎడమ చేతిలో దుష్టశక్తుల్ని బంధించి ఉంచాడని వాళ్లు నమ్ముతారు.