దేశంలో ధర్మాన్ని పరిరక్షించే వాళ్లు ఎక్కువైనందునే.. హిందూ మతం ప్రమాదంలో పడిందని.. బీజేపీ ఎంపీ ఉదిత్‌రాజ్ ఢిల్లీలో తెలిపారు.
న్యూఢిల్లీ: దేశంలో ధర్మాన్ని పరిరక్షించే వాళ్లు ఎక్కువైనందునే.. హిందూ మతం ప్రమాదంలో పడిందని.. బీజేపీ ఎంపీ ఉదిత్‌రాజ్ ఢిల్లీలో తెలిపారు. తమిళనాడులో కొందరు దళితులకు ఆలయ ప్రవేశం నిరాకరించినందుకు వారు ఇస్లాం స్వీకరించేందుకు సిద్ధమయ్యారన్న వార్తల నేపథ్యంలో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.
దళితుల ఓట్లు చీల్చేందుకు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె ప్రయత్నిస్తున్నారని అధినేత్రి మాయావతి చేసిన విమర్శలపైనా ఆయన స్పందించారు. దళిత నాయకులు రాజకీయంగా ఎదగడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. గత 15 ఏళ్లు తనను కాంగ్రెస్, బీజేపీ ఏజెంట్ గా మాయావతి ఆరోపిస్తూ వస్తున్నారని చెప్పారు. ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోవాలని మాయావతికి హితవు పలికారు.