
బీజేపీపై కత్తిగట్టిన మాయావతి
రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ పార్టీపై కత్తిగట్టారు. దళితులకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
దాదాపు ఉద్యమ రూపంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన చారిత్రక ప్రాంతం మీరట్‌లో ప్రారంభిస్తామన్నారు. పార్టీ వ్యూహకర్తలతో సమావేశం అనంతరం షహరాన్‌పురాలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తనను సభలో మాట్లాడేందుకు అనుమతించడం లేదని, అందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించగా ఈ నెల (జూలై) 18న రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆమె రాజీనామాను ఆమోదించారు. కాగా, ఆమె పదవీ కాలం దగ్గరపడటంతో రాజీనామా డ్రామాలు ఆడారంటూ పలువురు బీజేపీ నేతలు ఆరోపించారు.