హిందూ మత విశ్వాసంపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎన్‌ఎన్ టౌన్‌హాల్‌లో నిర్వమించిన ఓ కార్యక్రమంలో ఒక ఓటరు తన మతం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ‘మీరు మా అధ్యక్షుడు కాదు, ఎందుకంటే మీరు మా పూర్వికులకు సంబంధించిన మతానికి చెందినవారు కాదని అంటే?’ ఏం చెబుతారని ప్రశ్నించారు.
దీనికి ఆయన.. ‘నేను హిందువును. నా గుర్తింపును తప్పుగా చెప్పుకోను. హిందూ మతం, క్రైస్తవం రెండూ కూడా ఒకే రకమైన విలువలను బోధిస్తాయి’ అని తెలిపారు. ‘హిందూ మతం నమ్మకాల ప్రకారం ఈ భూమ్మీదికి ప్రతి మనిషి ఓ కారణంతో వస్తారు. ఆ కారణాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనలోనే ఉంటాడు. మనతో ఆయన మంచి పనులు చేయిస్తారు. మనమంతా కూడా ఆయన దృష్టిలో సమానం’ అని వివేక్ రామస్వామి తెలిపారు.
A voter tonight in Iowa asked about my Hindu faith. I answered honestly. pic.twitter.com/hkUrZkbhUx
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) December 14, 2023
దేశంలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చెందించే అధ్యక్షుడను తాను కాదని, కానీ అమెరికా దేశానికి సంబంధించి విలువల కోసం ఎల్లప్పుడూ నిలబడతానని తెలిపారు. 38 ఏళ్ల వివేక్ రామస్వామి.. నైరుతి ఒహియోకు చెందినవారు. అతని తల్లి గెరియాట్రిక్ సైకియాట్రిస్ట్. తండ్రి జనరల్ ఎలక్ట్రిక్‌లో ఇంజనీరు. అయితే ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024లో జరగనున్నాయి.
చదవండి: అమెరికాలో ఘనంగా హాలిడే పార్టీ.. పాల్గొన్న400 మంది సీఈవోలు
Comments
Please login to add a commentAdd a comment