
Wasim Rizvi Converts To Hinduism: ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ వసీమ్ రిజ్వి హిందూమతంలోకి మారారు. ఘజియాబాద్‌లోని దాస్నా దేవి ఆలయంలో సోమవారం పూజారి యతి నర్సింగానంద్ సరస్వతి ఆయనతో మత మారి్పడి క్రతువు చేయించారు. రిజ్వి పేరును జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా ప్రకటించారు. ‘ముస్లింలు నన్ను మతం నుంచి బహిష్కరించారు. నా ఇష్టం వచ్చిన మతం స్వీకరించే స్వేచ్ఛ ఉంది.
చదవండి: సైనికులపై హత్య కేసు
నా కుటుంబ సభ్యులు ఇష్టం ఉన్న మతాన్ని ఆవలంభించవచ్చు. బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన పవిత్ర దినాన నేను హిందువుగా మారా. హిందువులను చంపివేస్తూ, వారి ఇళ్లకు ముస్లింలు నిప్పుపెడుతున్నారు. హిందువులు అటువంటి వారికి దూరంగా ఉండాలి’అని త్యాగి అన్నారు.