లక్నో : మదర్సాలు ఐసిస్ సిద్ధాంతాలను ప్రోత్సహిస్తున్నాయంటూ వాటిని మూసివేయాలని యూపీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ కోరారు. విద్యార్ధులు ఐసిస్ భావజాలానికి లోనవకుండా దేశవ్యాప్తంగా మదర్సాలను మూసివేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రిజ్వీ లేఖ రాశారు. మదర్సాలను మూసివేయకుంటే 15 ఏళ్లలో సగానికి పైగా ముస్లిం జనాభా ఐసిస్‌కు మద్దతు పలుకుతుందని హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పట్టు పెంచుకునేందుకు ఐసిస్ ప్రయత్నిస్తోందన్నారు.మదర్సాలకు వెళుతూ ముస్లిం విద్యార్ధులు సమాజానికి దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మదర్సాల్లో సాధారణ విద్య కొరవడటంతో ఇతర మతాలకు దూరమవుతున్నారన్నారు. ఇస్లామిక్ విద్య పేరుతో విద్యార్ధుల్లో అతివాద ధోరణలను నూరిపోస్తున్నారన్నారు. ఈ ధోరణి ముస్లిం పిల్లలతో పాటు దేశానికి ప్రమాదకరమని రిజ్వీ హెచ్చరించారు. ప్రాధమిక స్ధాయిలో మదర్సాలను మూసివేయాలని, స్కూల్ విద్య అనంతరం సంస్కృతి గురించి తెలుసుకోగోరే విద్యార్ధులు వాటిలో చేరవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment