కీలక ఘట్టం సర్వం సిద్ధం బాలాపూర్-హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర
ఉదయం 9 గంటలకే ఊరేగింపు ప్రారంభం నిమజ్జనం త్వరగా పూర్తయ్యేలా చర్యలు
నగరవ్యాప్తంగా సీసీ, వీడియో కెమెరాల నిఘా 15 వేల మంది సిబ్బందితో బందోబస్తు : కొత్వాల్
ఏర్పాట్లు పూర్తిచేసిన జీహెచ్‌ఎంసీ
భాగ్యనగరి ఉత్సాహంతో ఊగిపోతోంది. నగరం ‘బోలో గణేష్ మహరాజ్‌కీ’ నినాదాలతో మార్మోగి
పోతోంది. శోభాయమానంగా సాగే మహాయాత్ర, నిమజ్జనోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గణనాథులకు ఘనంగా వీడ్కోలు చెప్పడానికి ఉత్సవ నిర్వాహకులు సంసిద్ధమయ్యారు. పోలీసులు
నగరవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
‘గణ’ ఏర్పాట్లివీ...
21 జలాశయాల వద్ద ఏర్పాటు చేసిన క్రేన్లు 71
ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటుచేసిన క్రేన్లు 40
గజ ఈతగాళ్లు 85
పారిశుద్ధ్య సిబ్బంది 2300
అదనపు బస్సులు 360
ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ప్రాంతాలు 66
రవాణా శాఖ మండపాలకు ఇచ్చిన వాహనాలు 1144
ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు 8
ప్రధాన ఊరేగింపు మార్గం : కేశవగిరి-నాగుల్‌చింత-ఫలక్‌నుమా-చార్మినార్-మదీనా-
అఫ్జల్‌గంజ్-ఎంజే మార్కెట్-అబిడ్స్-బషీర్‌బాగ్-లిబర్టీ-అప్పర్ ట్యాంక్/ఎన్టీఆర్ మార్గం
సికింద్రాబాద్ నుంచి వచ్చేవి: లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి
ఈస్ట్‌జోన్ నుంచి వచ్చేవి: ఉప్పల్ నుంచి బయలుదేరి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద
సికింద్రాబాద్ ఊరేగింపుతో కలుస్తాయి
వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చేవి: ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద
ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి
నగరం వెలుపలే ఆర్టీసీ బస్సులు... సందర్శకులకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్: 040-2320 2813
హెల్ప్‌లైన్ నంబర్లు : 2785 2482, 2785 2486, 90102 03626