Hussensagar
-
వెలుగుల స్మృతి.. మసకబారింది
భాగ్యనగరంలో దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల కంటే ముందే విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. అప్పట్లోనే ఇక్కడ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటైంది. 110 సంవత్సరాల క్రితమే సిటీలో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సాక్షి సిటీబ్యూరో: డీజిల్ జనరేటర్లతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరా నాటి నగర అవసరాలకు సరిపోని పరిస్థితి. దాంతో కొందరు పరిపాలనాధికారులు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పాలని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు సూచించారు. దీంతో 1920లో హైదరాబాద్ పవర్ హౌస్ ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ ఒడ్డున థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. అందులో నాలుగు యూనిట్లు నిరంతరం పనిచేసేవి. ఆ కట్టడంలో మొగలాయిల శైలి దర్శనమిచ్చేది. ‘హైదరాబాద్ పవర్ హౌస్ భవనం తాజ్‌మహల్ నిర్మాణమంత అందంగా ఉండేది’ అని ప్రముఖ చరిత్రకారులు అల్లమా ఏజాజ్ ఫారుఖీ తెలిపారు. అమెరికా నుంచి మిషనరీ.. మిషనరీని అమెరికా, యూరప్ దేశాల నుంచి తెప్పించారు. 22.5 మెగా ఓల్ట్‌ల సామర్థ్యం గల ప్లాంటులో రోజుకు 200 టన్నుల బొగ్గు వాడేవారు. తద్వారా జంట నగరాలతోపాటు ఆనాటి హైదరాబాద్ రాజ్యంలోని 18జిల్లాలకు విద్యుత్ సరఫరా అయ్యేది. గోదావరిఖని నుంచి బొగ్గును తరలించేందుకు ప్రత్యేక రైలు మార్గాన్ని కూడా నిర్మించారు. నాటి రైలు పట్టాల ఆనవాళ్లు ఖైరతాబాద్ గణపతి భవనం వెనుక భాగంలోని గల్లీలో నేటికీ దర్శనమిస్తాయి. జాడలేవి..! హైదరాబాద్ పవర్ హౌస్‌ను హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్‌గా పిలిచేవారు. తెలంగాణ చరిత్రలో ఘనమైన పాత్ర వహించిన ఆ కేంద్రం తాలూకూ జాడలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించవు. 1972లో రెండు ఉత్పత్తి యూనిట్లు మూతబడ్డాయి. మిగతా రెండు యూనిట్లూ నిరంతరాయంగా పనిచేసేవి. అనంతరం హైదరాబాద్ పవర్ హౌస్ 1992 నాటికి పూర్తిగా బంద్ అయింది. పవర్ హౌస్ ఓ జ్ఞాపకం.. విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతేనేం.. ఆ ఆవరణలోని కట్టడాలను పరిరక్షించాలని కొందరు చరిత్ర అధ్యయనకారులు ప్రభుత్వానికి విన్నవించారు. వారసత్వ కట్టడమైన ఆ అందమైన భవన సముదాయాలను మ్యూజియంగా మార్చాలని సూచించినా పట్టించుకోలేదు. 1995లో పవర్ హౌస్ నిర్మాణాలను కూల్చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, ప్రసాద్ ఐమ్యాక్స్ నిర్మాణాలున్న ప్రదేశంలోనే హైదరాబాద్ పవర్ హౌస్ ఉండేది. అంతర్జాతీయ ఖ్యాతి.. హైదరాబాద్ థర్మల్ విద్యుత్ కేంద్రంపై 1939లో ప్రఖ్యాత టైం మ్యాగజైన్ ప్రత్యేక కవర్‌పేజీ కథనాన్ని ప్రచురించింది. నిజాం రాజ్యంలో ఆధునిక, పారిశ్రామికాభివృద్థికి ప్రతీక హైదరాబాద్ పవర్ హౌస్ నిర్మాణమని ప్రశంసింది. దానిపై ప్రత్యేకంగా ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేయడాన్ని కూడా ప్రస్తావించింది. అలా అప్పుడే అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. 1930 నాటికి దేశంలోనే విద్యుద్ధీకరణ చెందిన నగరాల్లో హైదరాబాద్ ముందువరుసలో ఉందని ఆర్కాయిస్ రిటైర్డ్ సూపరిటెండెంట్ అబ్దుల్ నయీమ్ చెబుతున్నారు. 1924–25 మధ్య కాలానికి భాగ్యనగరం కేంద్రంగా 121 పరిశ్రమలు వెలిశాయి. కర్ణాటక స్ఫూర్తి.. దేశంలో చారిత్రక నేపథ్యం గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కర్ణాటకలోని శివనసమద్ర హైడ్రో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రత్యేకమైంది. 700కిలో ఓల్ట్‌ల సామర్థ్యం గత ఆ విద్యుత్తు ప్రాజెక్టును 1902లో మైసూరు మహారాజు నిర్మించారు. అది ప్రారంభమైన రెండేళ్లలోనే బెంగుళూరు నగరానికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆ కేంద్రాన్ని అక్కడి చరిత్రకారులు కాపాడుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆ చారిత్రక ప్రాజెక్టుకు హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు లభించింది. అదే మన దగ్గర మాత్రం హైదరాబాద్ పవర్ హౌస్ ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి. -
ఆకట్టుకున్న‘ప్రళయ్ సహాయ్’
సాక్షి, హైదరాబాద్: భారతీయ రక్షణ దళం దక్షిణ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రళయ్ సహాయ్ కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. శనివారం ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి హుస్సేన్‌సాగర్ వేదికైంది. ఆకస్మిక వరదలు విపత్తుల సందర్భంగా చేపట్టే అత్యవసర సహాయక సేవలు, పునరావాస కార్యక్రమాలపై ప్రదర్శనలను (మాక్‌డ్రిల్) ఏర్పాటు చేశారు. భారతీయ రక్షణ, విమాన, నావికా దళాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నివారణ విభాగాలు ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నాయి. నగరంలో భారీ వరద సంభవిస్తే మునిగిన ఇళ్లు, భవనాల నుంచి ప్రజలను ఏవిధంగా రక్షించాలనే దానిపై సైనికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. దీని కోసం హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయిన ఇళ్లు, భవనాలు, విద్యాసంస్థలు, వాహనాల నమూనాలను ఏర్పాటు చేశారు. ఈ భవనాల్లో ప్రజలు చిక్కుకున్నట్లు కేకలు వేస్తూ కనిపించారు. వారిని సైనికులు స్పీడు బోట్ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించారు. వీటితో పాటు హెలికాప్టర్ నుంచి సైన్యం సాగర్‌లోకి తాడు సాయంతో దిగడం, వారు పడవల ద్వారా నీట మునిగిన భవంతుల వద్దకు చేరుకుని వాటిల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం వంటివి ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టు చూపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ విన్యాసాలను లెఫ్టినెంట్ జనరల్ పీఎం హరీద్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వీక్షించారు. -
ఫిప్టీ..ఫిప్టీ
విశ్వనగరి కలలో సగమే పూర్తి ⇒ కృష్ణా,గోదావరితో గ్రేటర్‌కు జలాభిషేకం ⇒ఆవిష్కరణలకు కేరాఫ్ టీ–హబ్ ⇒మెరుగుపడిన సర్కారీ చదువులు ⇒దుర్గంచెరువు ఎలివేటెడ్ కారిడార్‌కు మోక్షం ⇒ రెండుచోట్ల బహుళ వరుసల రహదారులు ⇒ ప్రజల ముంగిటకు ఆర్టీసీ (వజ్ర) సేవలు ⇒ యాదాద్రికి రైల్వేలైన్ పనులు ప్రారంభం ⇒శాంతి భద్రతలు, నేరాల అదుపులో గ్రేట్.. ⇒ ‘స్వచ్ఛభారత్’లో బెస్ట్.. ⇒నిరంతర విద్యుత్ సరఫరాలో భేష్ ⇒పడకేసిన ప్రజారోగ్యం.. పర్యాటకం ⇒వరద ముంపు, నాలాల విస్తరణలో వైఫల్యం ⇒లక్ష్యం చేరని లక్ష ‘డబుల్’ ఇళ్లు ⇒మోడల్ రహదారులకు మోక్షం నిల్.. ⇒అధ్వానంగా అంతర్గత రోడ్లు ⇒అటకెక్కిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ⇒ ప్రహసనంగా హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ⇒హరితం ఐదుశానికే పరిమితం.. ⇒కాలుష్యంతో నగరం ఉక్కిరిబిక్కిరి ⇒‘మెట్రో’ పరుగులు వాయిదా.. మూడేళ్ల పాలనలో విశ్వనగర లక్ష్యాలు సగమే సాకారమయ్యాయి. గ్రేటర్ సిటీజన్ల దాహార్తిని తీర్చడంలో సర్కారు సఫలీకృతమైంది. ప్రభుత్వ విద్య మెరుగుపడింది. దుర్గంచెరువు ఎలివేటేడ్ కారిడార్ పనులకు మోక్షం లభించింది. ఐటీ రంగంలో నవకల్పనలు, ఆవిష్కరణలకు టీ–హబ్ కేరాఫ్‌గా నిలుస్తోంది. సర్కారు వైద్యం దిగజారుతోంది. లక్ష ‘డబుల్’ బెడ్ రూమ్ లక్ష్యంలో సగానికి కూడా చేరలేదు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అటకెక్కింది. హుస్సేన్‌సాగర్, మూసీ నదుల ప్రక్షాళన నీటిమీద రాతలుగానే మిగిలాయి. -
సాగర్..డేంజర్
హుస్సేన్ సాగర్‌లో మరింత పెరిగిన కాలుష్యం పీసీబీ తాజా పరిశీలనలో వెల్లడి రూ.310 కోట్లు ఖర్చు చేసినా ఫలితం నిల్ తాజాగా నిధులు లేవని ప్రక్షాళన పనులకు ఫుల్స్టాప్ జలాశయంలో ఆక్సిజన్ స్థాయి సున్నాగా నమోదు సిటీబ్యూరో: చారిత్రక హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనను సర్కారు విభాగాలు అటకెక్కించడంతో రోజురోజుకూ జలాశయం గరళాన్ని తలపిస్తోంది. సాగర గర్భంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన ఘన వ్యర్థాలను తొలగించకపోవడం, కూకట్పల్లి నాలా నుంచి వచ్చి చేరుతున్న పారిశ్రామిక వ్యర్థ రసాయనాలతో జలాశయం రోజురోజుకూ మురుగుకూపంగా మారుతోంది. సాగర్ జలాల్లో ఆక్సిజన్ స్థాయి సున్నాగా నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. గతంలో జైకా బ్యాంకు మంజూరుచేసిన రూ.310 కోట్ల నిధులను మహానగరాభివృద్ధి సంస్థ గతేడాది జూలై నాటికే హారతి కర్పూరంలా ఖర్చుచేసింది. తాజాగా నిధుల లేమిని సాకుగా చూపి ప్రక్షాళన విషయంలో హెచ్ఎండీఏ చేతులెత్తేయడంతో జలాశయంలో హానికారక బ్యాక్టీరియా వృద్ధిచెందుతుందని..నీటి నాణ్యత దెబ్బతింటోందని కాలుష్యనియంత్రణమండలి తాజా పరిశీలనలో తేలింది. రాబోయే వేసవిలో నీటిమట్టాలు మరింత తగ్గి హానికారక రసాయనాల కారణంగా జలాశయం నీటి నుంచి విపరీతమైన దుర్గంధం వెలువడే ప్రమాదం పొంచిఉన్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గరళసాగరం ఇలా... 2016 సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి కూకట్పల్లి, బుల్కాపూర్ తదితర నాలాల నుంచి భారీగా వరద నీరు చేరింది. ఈ వరదనీటిలో బల్క్, డ్రగ్ ఫార్మా కంపెనీలు విడుదలచేసిన హానికారక రసాయనాలున్నాయి. జలాశయం అడుగున సుమారు 40 లక్షల టన్నుల ఘన, రసాయన వ్యర్థాలు గుట్టలా పోగుపడినట్లు అంచనావేస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 5 లక్షల టన్నులే తొలగించారు. మిగతాది సాగరగర్భంలో పేరుకుపోవడంతో గరళం నుంచి విముక్తి లభించడంలేదు. అమీర్‌పేట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు ఉన్న ఏ మెయిన్ మురుగు పైప్‌లైన్‌కు ఎన్టీఆర్గార్డెన్ వద్ద గండి పడడంతో తాజాగా ఈమురుగునీరంతా హుస్సేన్‌సాగర్‌లో చేరుతోంది. మురుగునీటిలోని పాథోజెన్స్, హానికారక రసాయనాలతో కలిసి యుట్రిఫికేషన్ చర్య జరిగి ఇ.కోలి, సూడోమోనాస్, సెఫైలోకోకస్, ఎర్గినోసా, షిగెల్లా, సాల్మొనెల్లా, క్విబెల్లా వంటి హానికారక బ్యాక్టీరియా జాతులు వృద్ధిచెందుతున్నాయి.ఈ బ్యాక్టీరియాకు యాంటీబయాటిక్స్ నిరోధకత కూడా అధికమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మురుగు కారణంగా జలాశయంలో డెంగ్యూ, మలేరియాకు కారణమయ్యే దోమల సంతతి వృద్ధి చెందుతోంది. ఈ పరిణామం సమీప ప్రాంతాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జలాశయంలో వృక్ష, జంతుజాలం మనుగడకు అవసరమైన ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గింది.జలాశయంలో భారీగా ఫైటోప్లాంక్టన్, ఆల్గే, గుర్రపుడెక్క తదితరాల ఉధృతి భారీగా పెరిగింది.నీటిలో హైడ్రోజన్సల్ఫైడ్ తీవ్రత క్రమంగా పెరిగి రాబోయే వేసవిలో నీటి నుంచి దుర్గంధం భారీగా వెలువడే ప్రమాదం పొంచిఉంది.ఈ జలాశయం పరిసరాల్లో ఎక్కువసేపు గడిపితే కళ్ల మంటలు, దురద, కళ్లలో ఏర్రటి జీరలు ఏర్పడడం తథ్యమని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. జలాశయం నుంచి వెలువడే గాలి కారణంగా శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏటా గణేశ్ నిమజ్జనంతో జలాశయంలోకి సుమారు 30 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 40 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగరంలో కలుస్తున్నాయి. జలాశయం నీటిలో బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) తాజాగా ప్రతి లీటరు నీటికి 100 పీపీఎంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఇది 35 నుంచి 40 పీపీఎం మించరాదు. సాగర్ నీటిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లీటరు నీటికి (సీఓడీ) 200 పీపీఎంకు మించడం గమనార్హం. సాధారణంగా ఇది 80–100 పీపీఎం మించదు. జలాశయం నీటిలో ఆక్సిజన్ స్థాయి దారుణంగా పడిపోయింది. ఇది ప్రతి లీటరు నీటిలో ’సున్న’గా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. -
హుస్సేన్‌సాగర్ తీరంలో హార్టీ ఎక్స్ పో
-
పే...ద్ద జెండాకు ప్రణామం!
సిటీబ్యూరో: ‘హమారా ఇండియా...హమారా హైదరాబాద్...హమారా జెండా..’అంటూ నగరవాసులతో పాటు సిటీ అందాలను చూసేందుకు వచ్చేవారిలో దేశభక్తి వెల్లివిరిసేలా చేస్తోంది నగరంలోని అతిపెద్ద జెండా. సంజీవయ్య పార్కులో గతేడాది జూన్‌లో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఇప్పుడు లక్షలాది మంది సందర్శిస్తున్నారు. హుస్సేన్‌సాగర్ తీరాన..పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జాతీయ జెండా రెపరెపలాడుతూ భారతావని కళ్ల ముందు కదలాడుతున్నట్టుగా మురిపిస్తోంది. ఆ జెండా చూసిన ఎవరైనా సెల్యూట్ కొట్టకుండా ఉండలేరు. దాదాపు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వచ్చే బలమైన గాలులను తట్టుకొని జెండా రెపరెపలాడుతున్న తీరు అద్భుతంగా ఉంది. భారీగా ఖర్చు... గతేడాది జూన్ 2 వతేదీన తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా సంజీవయ్య పార్కులో ఈ అతిపెద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ పతాకం నిర్వహణ బాధ్యతను చూసుకుంటున్న హెచ్ఎండీఏ ఎక్కడా లోటుపాట్లు లేకుండా జాగ్రత్తపడుతోంది. దీని నిర్వహణ కోసం ఏకంగా ఏడాదికి రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వెచ్చిస్తోంది. తరచూ బలమైన గాలులు వీస్తున్నందున ఇక్కడ ప్రతి నెలా రెండు జెండాలు అవసరమవుతున్నాయి. ఒక్కో జెండా కోసం రూ.1.5 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక విద్యుత్ చార్జీలు, డీజిల్ జనరేటర్ నిర్వహణ, జెండాను ఎత్తడానికి దించడానికి సిబ్బంది, రక్షణ...ఇలా అన్నీ కలిపి నెలకు దాదాపు రూ.3.8 లక్షల వరకు వ్యయమవుతోంది. గతేడాది జూన్ రెండు నుంచి ఇప్పటివరకు దాదాపు 14కుపైగా జెండాలు మార్చారు. రోజుకు షిఫ్ట్‌ల వారీగా ముగ్గురు పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఇక్కడ భద్రత కోసం విధులు నిర్వహిస్తున్నారు. రెండుసార్లు జాతీయ గీతాలాపన... ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో, మళ్లీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత సిబ్బంది ఈ జెండా వద్ద జనగణమన గీతాలాపన చేస్తారు. ఈ జెండాను చూసేందుకు వచ్చిన సందర్శకులు తమ సెల్ఫోన్లలో జాతీయ గీతం పాటను ఆన్‌చేసి మరీ జెండాకు సెల్యూట్ చేస్తూ తమ గొంతుకను కూడా కలుపుతున్నారు. ఎక్కువగా పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రాంతాల పర్యాటకులు సందర్శిస్తున్నారు. నెలకు దాదాపు లక్ష మందికిపైగా జాతీయ జెండాను చూసేందుకు వస్తున్నారు. సూర్యాపేటలోని డీఆర్డీఏలో పనిచేసే కె.సంజీవరావు తయారుచేసిన ఈ జాతీయ జెండాకు ఎంతో మంది నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక్కో జెండాను రెడీ చేసేందుకు 15 రోజుల సమయం అవసరమని, దాదాపు పదిమంది వర్కర్లు అవసరమవుతారని నిర్వాహకులు తెలిపారు. జాతీయ జెండా నిర్వహణ సంతోషదాయకం... జాతీయ జెండా నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. నెలకు ఒకటి రెండుసార్లు జెండా ఆవిష్కరించేటప్పుడు, దింపేటప్పుడు సిబ్బంది చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. రాత్రి సమయాల్లో వెలుతురులో కనిపించేందుకు జెండా చుట్టూ బల్బులను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచుతాం. ఎక్కువగా వర్షాకాలం, చలికాలంలో జెండా చిరిగిపోయే ఘటనలు చోటుచేసుకుంటాయి. అందుకే అప్రమత్తంగా ఉంటాం. జెండా నిర్వహణ విషయంలో హెచ్ఎండీఏ అధికారుల నుంచి పూర్తి సహకారం ఉంది. జాతీయ జెండాకు సేవ చేయడం ఎంతో సంతోషంగా భావిస్తున్నా. – పద్మావతి, జెండా నిర్వాహకురాలు చాలా గర్వంగా ఉంది... ఇంత పెద్ద జాతీయ జెండాను దగ్గరి నుంచి చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది. దేశంలోనే అతి పొడవైన జెండాను భాగ్యనగరంలో ఏర్పాటు చేయడమంటే మామూలు విషయం కాదు. ఈ తిరంగాను చూసినప్పుడు మనకు తెలియకుండానే మనసులో దేశభక్తి భావం కలుగుతుంది. గణతంత్ర దినోత్సవానికి ఒకరోజూ ముందు ఈ జెండాను చూడాలనే ఆశతో వచ్చా. భారత్ మాతాకీ జై. – వెంకటేశ్, డిగ్రీ విద్యార్థి -
మురుగు ముప్పు తప్పాలంటే..
పైపులైన్లు మారిస్తేనే ‘సాగర్’ శుద్ధి కూకట్పల్లి, సికింద్రాబాద్ నాలా పైపులైన్ మారిస్తేనే ప్రయోజనం అప్పటివరకు హుస్సేన్‌సాగర్‌లోకి యథేచ్ఛగా మురుగు ప్రవాహం రూ.376.13 కోట్ల ఆర్థిక సహాయం కోరుతూ కేంద్రానికి వినతి సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌కు మురుగు, పారిశ్రామిక వ్యర్థజలాల నుంచి విముక్తికి కూకట్పల్లి, సికింద్రాబాద్ నాలా పైపులైన్ మారిస్తేనే ప్రయోజనమని జలమండలి పరిశీలనలో తేలింది. ఈ నాలకు సంబంధించిన కె అండ్ ఎస్ మెరుున్(కూకట్పల్లి, సికింద్రాబాద్ మెరుున్)ను 18.25 కిలోమీటర్ల మేర తక్షణం మార్చి కొత్త పైపులైన్ వేస్తేనే ప్రయోజనమని తేల్చింది. ఇందుకు రూ.261 కోట్లు అంచనా వ్యయం అవుతుందని నిర్ణరుుంచింది. లేనిపక్షంలో సాగర్‌కు మురుగు ముప్పు తప్పదని భావిస్తోంది. దీంతోపాటు నగరంలో ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న పైపులైన్లు, భవనాలు, మ్యాన్‌హోళ్లను పునరుద్ధరించేందుకు మొత్తంగా రూ.376.13 కోట్ల మేర నిధులు అవసరమని.. ఈ మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందజేయాలని ఇటీవల నగరానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందానికి నివేదించింది. ఇదీ పరిస్థితి.. కూకట్పల్లి, బాలానగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లోని బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల నుంచి రోజువారీగా సుమారు 450 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు వెలువడుతారుు. ఈ జలాలు కె అండ్ ఎస్ మెరుున్ ద్వారా హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న మారియెట్ హోటల్ వరకు దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్ ద్వారా మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి మూసీలోకి వదిలిపెడుతున్నారు. ఈ పైపులైన్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో సర్ప్లస్ నాలా నుంచి నిత్యం పారిశ్రామిక వ్యర్థజలాలు హుస్సేన్‌సాగర్‌లోకి చేరుతుండడంతో సాగర్‌కు మురుగు నుంచి విముక్తి లభించడంలేదు. మరోవైపు అమీర్‌పేట్ దివ్యశక్తి అపార్ట్మెంట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు ఉన్న ‘ఏ’ మెరుున్ భారీ మురుగునీటి పైపులైన్ కూడా ఇటీవలి భారీ వర్షాలకు ఎన్టీఆర్ గార్డెన్ వద్ద దెబ్బతినడంతో ఈ పైపులైన్ ద్వారా పారే మురుగు నీటిని కూడా సాగర్‌లోకి మళ్లిస్తున్నట్లు తెలిసింది. దీంతో సాగర్‌కు కష్టాలు తప్పడంలేదు. ఈనేపథ్యంలో కెఅండ్‌ఎస్ మెరుున్ పైపులైన్‌తోపాటు ఏ మెరుున్ పైపులైన్లను మార్చేందుకు ఆర్థిక సహాయం అందజేయాలని జలమండలి కేంద్ర బృందానికి సమర్పించిన నివేదికలో కోరింది. -
హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవం: కేటీఆర్
- నిపుణుల కమిటీ సూచన మేరకు నాలాల ఆధునీకరణ - వచ్చే సంవత్సరం వర్షాకాలం నాటికి మార్పు చూపిస్తాం సాక్షి, హైదరాబాద్: నగరంలో వరద, రహదారుల సమస్యల్ని ఇప్పటికిప్పుడు తీర్చలేమని, వచ్చే సంవత్సరం వర్షాకాలం నాటికి గణనీయంగా మార్పులు చూపిస్తామని మునిసిపల్ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి వరద కాలువల్ని మెరుగుపరచడం, నాణ్యమైన రహదారులు వేయడం.. వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడం వంటి చర్యలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలకు అండగా ఉండేందుకు తాను, మేయర్, కమిషనర్ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మేయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డితో కలసి జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. హుస్సేన్‌సాగర్ పూర్వవైభవానికి పటిష్ట కార్యాచరణతో కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే హుస్సేన్‌సాగర్‌లో మురుగునీరు కలువకుండా చర్యలు చేపట్టామని, నాలా మళ్లింపు పనులు చేశామన్నారు. ఏడుగురి మృతి దురదృష్టకరం హైదరాబాద్‌లో భారీ వర్షాలకు ఏడుగురు మృతి చెందడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భోలక్‌పూర్ ఘటనలో విద్యుత్ షాక్ కారణంగా మృతి చెందారని చెబుతున్నారని, విద్యుత్ విభాగానికి ఫోన్ చేసినా స్పందించలేదనే ఆరోపణలపై శాఖాపరమైన విచారణ జరుపుతామన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షలు, జీహెచ్ఎంసీ నుంచి రూ. 2 లక్షల పరిహారంతోపాటు ఆ కుటుంబాలకు ఆపద్బంధుకు అర్హత ఉంటే మరో రూ. 50 వేలు వెంటనే అందజేస్తామన్నారు. హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీ.కాగా, ప్రస్తుతం దాన్ని అధిగమించి 513.61 మీ.కు చేరడంతో మారియట్ హోటల్ దగ్గరి తూము గేటు తెరచి 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. నగరంలో వరదనీరు 93 శాతం మూసీలోకి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, నాలాల ఆక్రమణల వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబాలకు పరామర్శ భారీ వర్షాలకు భోలక్‌పూర్, రామంతపూర్‌లో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు, బంధువులను బుధవారం గాంధీ మార్చురీ వద్ద మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్థీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి పరామర్శించారు. -
వినాయకసాగర్‌గా ప్రకటించాలి
గన్‌ఫౌండ్రీ: హుస్సేన్‌సాగర్‌ను వినాయకసాగర్‌గా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్‌రావు అన్నారు. వినాయకసాగరంలో గణేష్ నిమజ్జనాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. శనివారం బేగంబజార్‌లోని బెహతి భవన్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... సెప్టెంబర్ 5న ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి ఉత్సవాలు 15న సామూహిక నిమజ్జనంతో ముగుస్తాయన్నారు. గణేష్ నిమజ్జనం కారణంగా వాతావరణం కలుషితం కావడంలేదని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమర్పించిన నివేదిక స్పష్టం చేసినా, కొందరు వ్యక్తులు నిమజ్జనంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గణేష్ విగ్రహాల ఎత్తుపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని దీనిపై అపోహలు సృష్టించడం సరికాదన్నారు. రామానుజాచార్య శతజయంతి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ‘సామాజిక సామరస్యత’పై ప్రతి మున్సిపల్ డివిజన్లో సదస్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. -
‘హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యాన్ని తగ్గించండి’
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ కాలుష్యాన్ని తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై గురువారం విచారణ సందర్భంగా ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న విధంగా చర్యలను తీసుకోవాలని సూచించింది. అలాగే, గణేశ విగ్రహాల తయారీలో సహజ రంగులనే వాడేలా చర్యలు చేపట్టాలని కోరింది. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేక ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాగా సహజరంగులు వినియోగానికి రూ.5 కోట్లు కేటాయిస్తామని, విగ్రహాల ఎత్తు తగ్గింపుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. తదుపరి విచారణను జూలై 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. -
మోక్షం!
► జంట జలాశయాలకు వ్యర్థ జలాల నుంచి విముక్తి ► త్వరలో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణం ► 11 గ్రామాలను గుర్తించిన జలమండలి ► శుద్ధి జలాలు స్థానిక అవసరాలకు వినియోగం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని చారిత్రక జంట జలాశయాల పరిరక్షణ దిశగా మరో ముందడుగు పడింది. సమీప గ్రామాల నుంచి నిత్యం వెలువడుతున్న వ్యర్థ జలాలు జలాశయాల్లో కలుస్తుండడంతో మురుగుకూపాల్లా మారుతున్న విషయం విదితమే. విషం నుంచి వీటికి విముక్తి కల్పించేందుకు 11 గ్రామాల పరిధిలో మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ) నిర్మించాలని జలమండలి సంకల్పించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించనున్నారు. ఉస్మాన్ సాగర్ (గండిపేట్)కు ఆనుకొని ఉన్న ఖానాపూర్, వట్టినాగులపల్లి, జన్వాడ, అప్పోజిగూడ, చిలుకూరు, బాలాజీ దేవాలయం, హిమాయత్ నగర్ గ్రామాల పరిధిలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇక హిమాయత్ సాగర్ పరిధిలో హిమాయత్ సాగర్, అజీజ్ నగర్, ఫిరంగినాలా, కొత్వాల్‌గూడ పరిధిలో ఎస్టీపీలు నిర్మించనున్నారు. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను పీబీఎస్ సంస్థ సిద్ధం చేసింది. నిర్మాణ వ్యయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూ.13 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ రూ.27.50 కోట్లు వెచ్చించనున్నాయి. నిర్మాణ, నిర్వహణ పనులను జలమండలి పర్యవేక్షి స్తుంది. ఈ గ్రామాల నుంచి రోజు వారీ ఇక్కడికి వచ్చే గృహ, పారిశ్రామిక, వాణిజ్య సం స్థల వ్యర్థ జలాలను శుద్ధి చేసిన అనంతరం స్థానికంగా వన సంరక్షణకు వినియోగించనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఎట్టకేలకు విముక్తి సుమారు తొమ్మిది దశాబ్దాలుగా భాగ్యనగరి దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాలను మురుగు నుంచి విముక్తి చేసే పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థ ‘నీరి’ నిపుణులు 2011లో సమగ్ర అధ్యయనం చేసి.. తీసుకోవాల్సిన పరిరక్షణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వా నివేదిక సమర్పించారు. ఈ సిఫారసులకు ఐదేళ్లుగా మోక్షం లభించలేదు. దీంతో సమీప గ్రామాల మురుగు నీరు జంట జలాశయాల్లో కలుస్తుండడంతో అవి హుస్సేన్‌సాగర్‌లా కాలుష్య కాసారంగా మారుతాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, జలమండలి స్పందించి మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి ముందుకురావడం శుభ పరిణామమని వారు చెబుతున్నారు. శుద్ధి చేసిన నీరు తిరిగి జలాశయాల్లో చేరకుండా స్థానికంగా గార్డెనింగ్, టాయ్‌లెట్ ఫ్లషింగ్ వంటి అవసరాలకు వినియోగించాలని సూచిస్తున్నారు. ఇన్‌ఫ్లో చానల్స్‌ను ప్రక్షాళన చేయాలి ఎగువ ప్రాంతాల్లో ఉన్న సుమారు 84 గ్రామాల నుంచి జలాశయాలకు వరద నీటిని చేర్చే కాల్వలు (ఇన్‌ఫ్లో చానల్స్) కబ్జాకు గురవడం... ఇటుక బట్టీలు... ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం... ఫాంహౌస్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారడంతో రోజురోజుకూ ఇవి చిన్నబోతున్నాయి. ప్రస్తుత ఎండలకు ఈ జలాశయాల్లో నీరు అడుగంటిపోయింది. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్లో చానల్స్‌ను ఈ వేసవిలోనే ప్రక్షాళన చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతున్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, జలమండలి విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఈ జలాశయాలు పది కాలాల పాటు మహానగర దాహార్తిని తీరుస్తాయని పేర్కొంటున్నారు. ఇవి పూర్వపు స్థాయిలో జలకళను సంతరించుకుంటే నగరానికి రోజువారీగా 40 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని పొందే అవకాశం ఉంటుందని.. దాదాపు పాత నగరం (ఓల్డ్‌సిటీ) దాహార్తి తీరుతుందని అంటున్నారు. -
కాసేపు నీటిలో.. అంతలోనే గాల్లోకి..
ఏప్రిల్ రెండో వారంలోనే హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్ 10 సీట్ల తేలికపాటి విమానాలు నడిపేందుకు సిద్ధమైన సంస్థలు ఒక్కొక్కరికి రూ. 3వేలు చార్జీ పొరుగు పట్టణాలనూ చుట్టిరావచ్చు ‘డక్ బస్’ నడిపే యోచనలో పర్యాటక శాఖ హైదరాబాద్: కొంచెం సేపు హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం చెంత విహరించి... అంతలోనే గాల్లోకి లేచి హైదరాబాద్ పైన చక్కర్లు కొట్టి.. అవసరమైతే ఏ వరంగల్‌లో, కరీంనగర్నో చుట్టేసి.. మళ్లీ వచ్చి హుస్సేన్‌సాగర్‌లో నీటిపై పడవలా తేలియాడుతూ ఉంటే... భలేగా ఉంటుంది కదూ. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ అనుభూతిని స్వయంగా అనుభవించొచ్చు. అదే ‘సీప్లేన్’... నీటి మీద పడవలా విహరిస్తూ రివ్వున ఆకాశంలోకి దూసుకుపోయే తేలికపాటి చిన్న విమానం. ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైన ‘సీప్లేన్’ హైదరాబాద్‌లో కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తోంది. హెలీటూరిజంలో భాగంగా గగనతలం నుంచి హైదరాబాద్ అందాలను హెలికాప్టర్ ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించిన పర్యాటక శాఖ... అదే ఊపులో ‘సీప్లేన్’నూ రంగంలోకి దింపుతోంది. పౌర విమానయాన శాఖ అనుమతి వస్తే ఏప్రిల్ 15 నుంచి దాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలికాప్టర్ రైడ్ కంటే తక్కువే పర్యాటకులను ఆకట్టుకొనేందుకు అండమాన్‌లో స్థానిక యంత్రాంగం ‘సీప్లేన్’ను నడుపుతోంది. ఇది త్వరలోనే ముంబై, కొచ్చిన్, గోవాల్లో కూడా అందుబాటులోకి వస్తోంది. తాజాగా హైదరాబాద్‌కూ రానుంది. హైదరాబాద్‌లో పది సీట్లుండే ‘సీప్లేన్’ను నడిపేందుకు కొచ్చిన్, ఢిల్లీ కేంద్రాలుగా ఉన్న రెండు సంస్థలు ముందుకొచ్చాయి. 800 మీటర్ల వెడల్పు, కిలోమీటరు రన్‌వేకు తగ్గ నీటి వైశాల్యం, 2 మీటర్ల లోతుంటే సీప్లేన్ నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవల ఆ రెండు సంస్థల సిబ్బంది వచ్చి హుస్సేన్‌సాగర్‌ను పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అందులో విహరిస్తూ హైదరాబాద్ అందాలను ఆకాశం నుంచి వీక్షించాలంటే ఒక్కొక్కరు రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇటీవల మొదలుపెట్టిన హెలికాప్టర్ రైడ్ కంటే తక్కువ కావడం విశేషం. హైవేలపై ‘మిడ్వే’లు: చందూలాల్ దూర ప్రయాణాల మధ్యలో పర్యాటకులు సేదతీరేందుకు జాతీయ, రాష్ట్ర హైవేల పక్కన ‘మిడ్ వే (హైవేలపై పలు సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు)’లను ఏర్పాటు చేయనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రకటించారు. గురువారం ఆయన పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘మిడ్ వే’లలో విశ్రాంతి గదులు, రెస్టారెంట్లు, నిత్యావసర వస్తువుల దుకాణాలు, పెట్రోలు బంకులను ఏర్పాటు చేస్తామని... తొలి విడతగా సిద్దిపేట, జడ్చర్లలో వీటిని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఇక పర్యాటక ప్రదేశాల్లో ఆయా ప్రాంతాల చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పా రు. వరంగల్‌లో కాకతీయ ఉత్సవాలు, వేములవాడలో చాళుక్యుల ఉత్సవాలు, కరీంనగర్లో శాతవాహన ఉత్సవాలు, హైదరాబాద్‌లో గోల్కొండ ఉత్సవాల వంటివి ఉంటాయన్నారు. త్వరలోనే నూతన భాషా, సాంస్కృతిక, పర్యాటక విధానాన్ని ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఆయా విభాగాల వార్షిక క్యాలెం డర్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా పర్యాటకుల కోసం హైదరాబాద్‌లో ‘షీక్యాబ్’లను సిద్ధం చేయాలని సూ చించారు. ఆసక్తి ఉన్నవారికి పేరిణి నృత్యంలో శిక్షణ ఇవ్వాలని, రవీంద్రభారతి మరమ్మతులను ఈనెల 24 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలో డక్ బస్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా నీటిలోకి దూసుకుపోతే..? సాధారణ బస్సు అయితే ప్రమాదమేగానీ... ‘డక్ బస్’ అయితే మాత్రం హాయిగా కేరింతలు కొట్టొచ్చు. ఈ బస్సులో రోడ్డుపై ప్రయాణించడమే కాదు నీటిలో పడవలా కూడా విహరిస్తుంది. ఇప్పటివరకు మన దేశంలో ఇలాంటి బస్సు లేదు. త్వరలో హుస్సేన్‌సాగర్‌లో ‘డక్ బస్సు’లో విహరించే అవకాశాన్ని పర్యాటక శాఖ కల్పించనుంది. -
సాగర్‌లో విదేశీ విలాసం
నేటి నుంచి అందుబాటులోకి రానున్న ‘కాటమారన్ పాంటూన్ బోట్’ సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పడవకు ముందువైపు ఒకే హల్లు (మొనదేలినట్టు ఉండే వంపు) ఉంటుంది. కానీ... ఈ పడవకు అలాంటివి రెండుంటాయి. వాటి మీద ప్లాట్‌ఫామ్. దానిపై ఖరీదైన సోఫాలు, ముచ్చొటగొలిపే అలంకరణ వస్త్రాలు, నాణ్యమైన సంగీత ఝరి... వెరసి అదో విలాసవంతమైన బోట్.. పేరు... ‘కాటమారన్ పాంటూన్’. అలలపై రివ్వున దూసుకుపోయే ఈ స్పీడ్ బోట్లో షికారంటే పర్యాటకులకు ఎంతో మక్కువ. తాజాగా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ దాదాపు రూ.22 లక్షలు వెచ్చించి ఈ విలాసవంతమైన పడవను కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు దేశంలో మరే పర్యాటకాభివృద్ధి సంస్థలు ఇలాంటి పడవలను ఉపయోగించటం లేదు. దీన్ని బుధవారం హుస్సేన్‌సాగర్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియామిర్జా ప్రారంభించనున్నారు. 12 సీట్లుండే ఈ కొత్త బోటుపై విహారానికి ఒకరికి రూ.100 చొప్పున టికెట్ నిర్థరించారు. పుట్టినరోజు వంటి చిన్నచిన్న పార్టీలు కూడా ఇందులో జరుపుకొనే అవకాశం కల్పిస్తారు. జాతీయ స్థాయి ప్రదర్శన... కాగా, నగరంలో ఈ నెల 18 నుంచి 27 వరకు సౌత్ సెంట్రల్ కల్చరల్ జోన్ ఆధ్వర్యంలో మరో జాతీయ స్థాయి ప్రదర్శన నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం తెలిపారు. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలుంటాయన్నారు. -
సాగర మథనం..మరింత దూరం!
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులు వాయిదా? మళ్లీ పూర్తిగా నిండిన జలాశయం ఈ వేసవిలో పూడికతీత పనులు లేనట్లే ‘ఆస్ట్రియా టెక్నాలజీ’పై తేల్చని ప్రభుత్వం సిటీబ్యూరో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టు మరికొంత కాలం వాయిదా పడనుంది. తొలుత నాలాల దారి మళ్లింపు తర్వాతే హుస్సేన్‌సాగర్‌లో పూడికతీత పనులు చేపట్టే అవకాశం కన్పిస్తోంది. గత ఏడాది మొత్తం రిజర్వాయర్‌లోని నీటిని ఖాళీ చేసిన యంత్రాంగం.. ఒక దశలో పూడికతీత పనులను ప్రారంభించాలని భావించింది. కానీ పర్యావరణవేత్తల నుండి వచ్చిన అభ్యంతరాలతో సాధ్యం కాలేదు. అయితే ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌లోకి విష రసాయనాలను మోసుకొస్తున్న కూకట్పల్లి నాలా మళ్లింపు పనులు దాదాపు పూర్తయ్యాయి. ముందుగా అనుకున్న పథకం ప్రకారమైతే ఈ వేసవిలో పూడికతీత ప్రారంభం కావాలి. అందుకు హుస్సేన్‌సాగర్ నీటిని ఇప్పటి నుండే ఖాళీ చేస్తే వచ్చే ఏప్రిల్ మాసంలో పూడిక తీసే పనులు ప్రారంభించే ఛాన్స్ ఉంటుంది. కానీ బోట్ల రాకపోకలకు అనువుగా ఉండేందుకు టూరిజం శాఖ సూచన మేరకు హుస్సేన్‌సాగర్‌లో పూర్తి నీటిమట్టం కొనసాగించా లని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం రిజర్వాయర్ పూర్తి నీటిమట్టంతో ఉంది. దీనికి తోడు పూడికతీతకు సన్నాహాలు చేసిన నీటిపారుదల శాఖకు కూడా ఎలాంటి ఆదేశాలు లేకపోవటంతో వారు ఇతర పనులపై దృష్టి సారించారు. ‘ఆస్ట్రియా టెక్నాలజీ’పై స్పష్టత లేదు... హుస్సేన్‌సాగర్‌లో పూడిక తీయకుండానే నీటిని ఏరియేషన్ చేయటం ద్వారా శుద్ధి చేస్తామని ముందుకు వచ్చిన ఆస్ట్రియా కంపెనీ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆస్ట్రియాలో డాన్యూబ్ నదిని శుద్ధి చేసిన తరహాలో రూ.370 కోట్ల వ్యయంతో తాము పనులు చేస్తామని ఆస్ట్రియా ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. ఆ ప్రతిపాదలను సైతం ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టింది. సాగర్‌లో మట్టి ప్రతిమలకే అనుమతి ఈ యేడాది నుండి హుస్సేన్‌సాగర్‌లో మట్టి వినాయక ప్రతిమలనే నిమజ్జనానికి అనుమతించే దిశగా సర్కార్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సోమవారం హైకోర్టుకు సమర్పించిన యాక్షన్‌ప్లాన్‌లో సహజసిద్ధ రంగుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు పీసీబీ తరపున ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయనున్నట్లు కోర్టుకు ఇచ్చిన లేఖలో పేర్కొంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శారదాదేవి అనే మహిళ నేచురల్ (సహజసిద్ధ) కలర్స్ తయారు చేస్తోందని, ఈ రంగుల తయారీకి గాను ఆమె ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కోరగా, పీసీబీ తరుపున కోటి రూపాయలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని రంగుల తయారీకి వాడే రా మెటీరియల్, మిషనరీ కొనుగోలుకు వెచ్చించేందుకు కేటాయించనున్నారు. ఆమె కోరిన మిగిలిన మొత్తాన్ని ఇతర ప్రభుత్వ విభాగాలు సహాయం చేసేవిధంగా పీసీబీ అధికారులు కోరారు. వినాయకప్రతిమలు తయారు చేసే రాజస్థానీలను సైతం మట్టి వినాయకుల తయారీ దిశగా మళ్లించేందుకు త్వరలో ఐదు చోట్ల శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. -
నిగ్గుతేల్చండి..
బీపీపీలో అక్రమాలపై హెచ్ఎండీఏ కమిషనర్ ఆగ్రహం అద్దె బకాయిల వ్యవహారంపై విచారణకు ఆదేశం సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరంలోని హెచ్ఎండీఏ స్థలాల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ అద్దె చెల్లించ ని వ్యాపారులకు సహకరించిన అధికారుల వ్యవహారాన్ని నిగ్గుతేల్చాలని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు ఆదేశించారు. హెచ్ఎండీఏ ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయాన్ని అడ్డుకొన్న అక్రమార్కులపై లోతైన విచారణ జరిపి బాధ్యులను నిగ్గుతేల్చాలని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు(బీపీపీ) అధికారులను ఆదేశించారు. సాగర తీరంలో లీజ్ ప్రాతిపదిక స్థలాలు చేజిక్కించుకొని అద్దెలు చెల్లించకుండా పలువురు వ్యాపారులు దర్జాగా ధనార్జన చేస్తున్న వైనాన్ని... భారీ మొత్తంలో పేరుకుపోయిన అద్దె బకాయిలు, రాత్రికి రాత్రే దుకాణాలు ఖాళీ చేసి సామగ్రిని తరలిస్తోన్న వ్యాపారుల తీరును బట్టబయలు చేస్తూ ‘చక్కబెట్టేస్తున్నారు..!’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు సోమవారం బీపీపీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి అద్దె బకాయీల్లో అక్రమాలపై ఆరా తీశారు. ‘ లీజ్ అగ్రిమెంట్ ప్రకారం ఒక నెల అద్దె మొత్తాన్ని డిపాజిట్‌గా కట్టించుకొని, 4 నెలల అద్దెకు బ్యాంకు గ్యారెంటీ తీసుకొంటున్నాం. సకాలంలో అద్దె చెల్లించనప్పుడు వెంటనే నోటీసులిచ్చి ఖాళీ చేయించాలి. అయితే... వ్యాపారులతో కుమ్మక్కై వారికి సహకరించడం వల్లే అద్దె బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయి. దీనికి బాధ్యులు ఎవరు..?’ అంటూ కమిషనర్ నిలదీశారు. డాక్టర్ కార్స్, మల్లిగ సంస్థలు కోర్టును ఆశ్రయించినప్పు హెచ్ఎండీఏ వైపు నుంచి ఎందుకు కోర్టులో ఫైట్ చేయలేదని ప్రశ్నించారు. ‘పార్టీజోన్ తాలూకు కోటి రూపాయల బకాయి ఉంది. అలాగే ఎన్టీఆర్ గార్డెన్లో డౌన్ టౌన్ లీజ్‌కు తీసుకొన్న వ్యక్తి సుమారు రూ.70 లక్షలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అతను ఖాళీ చేశాక దీన్ని రెండేళ్ల నుంచి ఎందుకు ఖాళీగా ఉంచారు.? సుమారు కోటి రూపాయలు నష్టం వాటిల్లింది. దీనికి ఎవరు బాధ్యులు..’ అంటూ అధికారులను నిలదీశారు. దీనిపై లోతుగా విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసినా బకాయిలు చెల్లించని వ్యాపారులపై కొరడా ఝలిపించాలని కమిషనర్ సూచించారు. అద్దె చెల్లించకుండా ఖాళీ చేసి వెళ్లిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ప్రయోగించి ఆ మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేయాలని బీపీపీ అధికారులను ఆదేశించారు. వెంటనే చర్యలు చేపట్టి ఎన్టీఆర్ గార్డెన్ డౌన్‌టౌన్‌కు, పార్కింగ్ లాట్స్ తదితరాలకు టెండర్లు నిర్వహించాలని సూచించారు. -
పార్కుల్లో భద్రతపై ఆరా..!
లుంబినీ, ఎన్టీఆర్, సంజీవయ్య పార్కును పరిశీలించిన నిఘా బృందం అన్ని పార్కుల్లో బయటపడ్డ భద్రతా లోపాలు సిటీబ్యూరో : హుస్సేన్‌సాగర్ తీరంలో నిత్యం సందర్శకులతో కిటకిటలాడే లుంబిని పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కుల్లో ప్రజాభద్రతపై పోలీసు అధికారుల నిఘా బృందం లోతుగా అధ్యయనం చేసింది. లష్కరే తోయిబా, హిజుబుల్ ముజాహిద్దీన్, ఐఎస్ఐఎస్ వంటి తీవ్రవాద సంస్థలు మెట్రోపాలిటన్ నగరాల్లో విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సాగర్ పరిసరాల్లో సందర్శనీయ ప్రాంతాలైన పార్కుల ను బుధ, గురువారాల్లో సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా లుంబినీ, ఎన్టీఆర్గార్డెన్, సంజీవయ్య పార్కుల్లోని భద్రతాపరమైన అనేక లోపాలు బయటపడ్డాయి. లుంబిని లేజర్ షో ప్రాంగణంలో అగ్నిప్రమాదం సంభవిస్తే నివారించేందుకు ఎలాంటి పరికరాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నిఘా బృందం గుర్తించింది. గతంలో ఇక్కడ తీవ్రవాదులు జరిపిన మారణ హోమంలో 11 మంది అసువులుబాసినా హెచ్ఎండీఏ ప్రజాభద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టక పోవడాన్ని పోలీసు అధికారులు తప్పుబట్టారు. ఎన్టీఆర్ మెమోరియల్ వెనుక సెక్రటేరియట్ వైపు ఉన్న గుడిసెలను వెంటనే తొలగించాలని నిర్ణయించారు. వీఐపీల కదలికలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డుపక్కనే ఉన్న గుడిసెల వల్ల ముప్పు ఉందని నిఘా అధికారులు భావిస్తున్నారు. అలాగే ఐమాక్స్ థియేటర్ వెనుక వైపున ఫెన్షింగ్ పటిష్టంగా లేకపోవడాన్ని నిఘా అధికారులు గుర్తించారు. ఐమాక్స్ థియేటర్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి, అలాగే గార్డెన్ నుంచి థియేటర్ వైపునకు వెళ్లేందుకు మార్గం సులభంగా ఉండటంతో ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సుమారు 90 ఎకరాల విస్తీర్ణం ఉన్న సంజీవయ్య పార్కులో తగినన్ని సీసీ కెమెరాలు లేని విషయాన్ని, అలాగే సాగర్ గట్టు వెంట నిర్మించిన రెయిలింగ్ ఎత్తు చాలా తక్కువ ఉండటాన్ని నిఘా బృందం గమనించింది. పీవీ ఘాట్ వెనుక ప్రాంతంలో పడిపోయిన కాంపౌండ్ వాల్‌ను తిరిగి నిర్మించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. సందర్శకులతో రద్దీగా ఉండే ఈ పార్కుల్లో నామమాత్రంగా సెక్యూరిటీ సిబ్బందిని కొనసాగిస్తున్న తీరుపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లకు వస్తున్న వాహనాలపై ఎలాంటి తనిఖీలు చేయకపోవడం, పార్కింగ్ లాట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం వ ంటి లోపాలను అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని సంబధిత అధికారి ఒకరు తెలిపారు. తనిఖీల్లో ఏసీపీ సురేందర్‌రెడ్డి, ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచి అధికారులు, సైఫాబాద్ పోలీసులు, హెచ్ఎండీఏ ఏఓ, రేణుకాశక్తి సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
పేరు వెనుక కథ..
నగర వాసులు రోజూ ఎన్నో ఏరియాలుచుట్టేస్తుంటారు. సంవత్సరాలుగా ఆ ప్రాంతాల్లో ఉంటున్నా.. దానికి ఆ పేరెలా వచ్చిందో తెలియదు. తెలుసుకోవాలనిపించినా చరిత్ర తిరగేసే అవకాశం, ఓపిక ఉండదు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల ‘పేరు వెనుక కథ’ తెలుసుకుందాం. - సాక్షి, సిటీబ్యూరో ఖైరతాబాద్ రాకుమారి ‘ఖైరియాటున్నిసా’ పేరు మీదుగా ఖైరతాబాద్ వచ్చింది. ఆమె ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1518-80) కుమార్తె. ఖైరియా తరచూ అనారోగ్యంతో ఇబ్బంది పడేది. దీంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉంచితే నయమవుతుందని వైద్యులు సూచించారట. దీంతో కుతుబ్‌షా అల్లుడు, ఇంజినీర్ అయిన హజ్రత్ హుస్సేన్ షా వలిని రాకుమారి కోసం ప్యాలెస్, మసీదు, గార్డెన్, చెరువు నిర్మించమని సూచించాడు. సుల్తాన్ ఆజ్ఞ మేరకు ‘హుస్సేన్‌సాగర్’ తవ్వించాడు వలి. రాజకుమారి పేరుమీదుగా కాలక్రమంలో ‘ఖైరతాబాద్’గా ఈ ప్రాంతానికి పేరు స్థిరపడింది. సుల్తాన్‌బజార్ నిజాం హయాంలో ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రం. 1933 వరకూ ఈ ప్రాంతం బ్రిటిష్ రెసిడెన్సీ పరిధిలో ఉండేది. జూన్ 14, 1933లో దీన్ని నిజాంకు అప్పగించారు. మొదట్లో రెసిడెన్సీ బజారని పిలిచినా.. నిజాం ఆదేశాల మేరకు సుల్తాన్ బజార్‌గా మార్చారు. అప్పట్లో ఇక్కడ ఎక్కువశాతం మరాఠీలు ఉండేవారు. సోమాజిగూడ ‘సోనాజీ’ అనే పండిట్ పేరు నుంచి సోమాజిగూడ పేరు వచ్చింది. 1853 ప్రాంతంలో సోనాజీ.. నిజాం రెవిన్యూ విభాగంలో పనిచేసేవాడు. ఆయన నివసించిన భవంతి ఆ కాలంలో ఎంతో పేరుపొందింది. ఆయన మరణం తర్వాత ఆ ప్రాంతాన్ని సోనాజీగా పిలిచేశారు. కాలక్రమంలో సోమాజీగా మారింది. బషీర్‌బాగ్.. పాయిగా నవాబు అస్మన్జా బషీరుద్దౌలా బహదూర్. ఈ ప్రాంతంలో కళ్లుచెదిరే ప్యాలెస్, పార్కును కట్టించాడు. ఈ రాజభవనం చరిత్రలో కనుమరుగైనా.. పాయిగా ప్రభువు ‘బషీరుద్దౌలా’ పేరు మాత్రం ‘బషీర్‌బాగ్’గా నిలిచిపోయింది. తార్నాక.. నిజాంల హయాంలో ఈ ప్రాంతం మామిడి తోటలతో ఉండేది. వీటి రక్షణకు ముళ్లకంచె వేసి కాపలా కోసం, పహారా కాసేందుకు నిజాంలు కొందరిని నియమించారు. భద్రతా సిబ్బంది కోసం అవుట్‌హౌస్ సైతం కట్టించారు. ఉర్దూలో ‘తార్’ అంటే ‘వైరు’ అని, ‘నాకా’ అంటే ‘రక్షకభటుడి గది’ అని అర్థం. అలా తార్నాక పేరు స్థిరపడింది. -
ఫ్లాష్ బ్యాక్ ....న్యూ లుక్
రిమ్ జిమ్.. రిమ్ జిమ్ హైదరబాద్.. రిక్షావాలా జిందాబాద్.. ఒకప్పటి హిట్సాంగ్. ట్యాంక్‌బండ్‌పై ప్రయాణమంటే ఇలాగే ఆహ్లాదంగా.. హాయిగా సాగిపోతుంది. ఓ పక్క పచ్చని చెట్ల వరుస.. మరోపక్క స్వచ్ఛమైన నీటితో తొణికిసలాడే హుస్సేన్‌సాగర్.. దానిపై వీచే పిల్లగాలులు.. అవి మోసుకొచ్చే నీటి తుంపరలు.. గట్టున వెళుతున్నవారిని పలకరిస్తున్నట్టు మోమును తాకుతుంటే అందమైన కలల లోకంలో విహరించిన అనుభూతి. యాభై ఏళ్ల క్రితం హుస్సేన్‌సాగర్, దాని పరిసరాలు ఎంతో స్వచ్ఛంగా ఉండేవి. ఆనాడు బస్సుల్లో ఇక్కడ ప్రయాణమంటే మనసుకు ఎంతో హాయిగా ఉండేది. ఇప్పుడు అంత పచ్చదనం లేదు.. నీటి స్వచ్ఛతా లేదు. గట్టున వెళ్లేవారు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఈ అంతరాలకు సాక్ష్యాలు ఈ చిత్రాలు. -
ఆపరేషన్ వినాయక!
యుద్ధప్రాతిపదికన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన వ్యర్థాల తొలగింపునకు రంగంలోకి హెచ్ఎండీఏ 200 మంది వర్కర్లు, 10 లారీలు, 3జేసీబీల ఏర్పాటు సిటీబ్యూరో : గౌరీ సుతుడు గంగ ఒడికి చేరడంతో నిమజ్జనోత్సవ ఘట్టం ముగిసింది. జంటనగరాల్లోని వేలాది వినాయక విగ్రహాలు సోమవారం రాత్రి 10 గంటల వరకు హుస్సేన్‌సాగర్‌లో నిక్షిప్తమయ్యాయి. వీటి తాలూకూ వ్యర్థాలను యుద్ధప్రాతిపదికన తొలగించేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. సాగర్‌ను జల్లెడ పట్టి నిమజ్జన వ్యర్థాలను వెలికితీసే కార్యక్రమాన్ని అధికారులు సోమవారం అర్థరాత్రి నుంచే ప్రారంభించారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ మార్గ్‌లోని 9 ప్లాట్‌ఫారాల వద్ద నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాల తాలూకు అవశేషాలు, పూలు పత్రి ఇతర చెత్తాచెదారాన్ని సమూలంగా గట్టుకు చేరుస్తున్నారు. నిమజ్జన విగ్రహాలు నీటి అడుగు భాగానికి జారిపోకుండా ఎప్పటికప్పుడు డీయూసీ, ఫ్లోటింగ్ పాంటూన్ ద్వారా వెలికితీసి కుప్పలుగా చేశారు. ఈ వ్యర్థాలను లారీల ద్వారా కవాడీగూడలోని జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డుకు తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 200 మంది కార్మికులు, 10 లారీలను వినియోగిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. వ్యర్థాలను మూడు రోజుల్లోనే తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ వైపు 4500 టన్నులు, ట్యాంకుబండ్ వైపు 6-7 వేల మెట్రిక్ టన్నుల మేర వ్యర్థాలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని 9 ఫ్లాట్ ఫారాల వద్ద ఇప్పటికే 1500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించిన అధికారులు మిగిలిన వాటిని తొలగించేందుకు మూడు రోజుల పాటు షిఫ్టుల వారీగా 24 గంటలూ పనులు నిర్వహించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. బండ్‌కు భరోసా ఏదీ ? హుస్సేన్‌సాగర్‌లో ట్యాంకుబండ్, ఎన్టీఆర్ మార్గ్‌ల వైపు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నా... ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే ప్రక్షాళన పనులు చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎన్టీఆర్ మార్గ్ వైపున నిమజ్జనం చేసిన విగ్రహాలను మాత్రమే తొలగించే పనులకు హెచ్ఎండీఏ అధికారులు పరిమితమయ్యారు. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంకు బండ్ వైపున నీళ్లలో పడుతున్న విగ్రహాలను వెలికితీసే విషయాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అది లోతైన ప్రాంతం కావడంతో పూడిక తొలగింపు వ్యవహారం అంత సులభం కాదన్న విషయాన్ని కారణంగా చెబుతూ కొన్నేళ్లుగా దాటవేస్తున్నారు. ఏటా అక్కడ పడుతున్న విగ్రహాల వల్ల పూడిక భారీగా పేరుకుపోతోంది. ఇది ట్యాంకు బండ్ ఉనికికే ప్రమాదమని, నీటి నిల్వ సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
నిమజ్జన వైభవం
గంగ ఒడిలో సేదతీరేందుకు గణనాథుడు ఘనంగా తరలివెళ్లాడు. ఆదివారం ఉదయం నుంచే అట్టహాసంగా వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. గ్రేటర్ పరిధిలోని పలు చెరువుల్లో నిమజ్జనాలు జరిగాయి. హుస్సేన్‌సాగర్, కాప్రా చెరువు, కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు, సరూర్‌నగర్‌లోని మినీట్యాంక్‌బండ్, గచ్చిబౌలిలోని దుర్గం చెరువు, గండిపేట్, సఫిల్‌గూడ చెరువులలో నిమజ్జనం జరిగింది. - సాక్షి, సిటీబ్యూరో -
హుస్సేన్ సాగర్‌లోనే గణేశ్ నిమజ్జనం
హిందువుల మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు వద్దు మండపాలకు అనుమతి అవసరంలేదు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే చాలు 13న హిందూ చైతన్య సభ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి వెల్లడి పంజగుట్ట:ఈ ఏడాది కూడా వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని, దీనిపై మరో మాట అవసరం లేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జి.రాఘవరెడ్డి అన్నారు. ఇందిరాపార్క్‌లో కృత్రిమంగా ట్యాంక్ ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేయడం తగదన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం, వ్యవహరించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. బుధవారం ఎర్రమంజిల్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన గురువారం విగ్రహ ప్రతిష్టతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 27వ తేదీన ఆదివారం సామూహిక నిమజ్జనోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. వినాయక మండపాలకు ఎలాంటి పోలీస్ అనుమతి అవసరంలేదని, సంబంధిత పోలీస్స్టేషన్లలో కేవలం సమాచారం ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో సీఎం కూడా చెప్పారని, పోలీసులు మండపాల నిర్వాహకులను వేధించడం మానుకోవాలని అన్నారు. అన్ని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇవ్వాలని కోరారు. గణేశ్ ఉత్సవాలు భారీ ఎత్తున జరుగుతున్నప్పటికీ దేవాదాయ శాఖలో స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఉత్సవాల్లో ఆ శాఖ సైతం పాలుపంచుకోవాలన్నారు. గణేశ్ మండపాల వద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 13న ఎన్టీఆర్ స్టేడియంలో హిందూ చైతన్య సభ 36వ సామూహిక గణేష్ ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించేందుకు సన్నాహకంలో భాగంగా ఈ నెల 13వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో ‘హిందూ చైతన్య సభ’ నిర్వహిస్తున్నట్లు రాఘవరెడ్డి తెలిపారు. ఈమేరకు సభ పోస్టర్, కరపత్రాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవత్‌రావు, ఉపాధ్యక్షులు నర్సింగ్, ఖైరతాబాద్ గణ్ష్ అధ్యక్షులు సుదర్శన్‌లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. సభకు ముఖ్య అతిథులుగా శ్రీ త్రిదండి చిన్న జీయర్‌స్వామి, గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్, సాధ్వి హేమలతా శాస్త్రి, శ్రీ కమలానంద భారతి తదితరులు హాజరవుతారని తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినం కావడంతో ప్రతీ వినాయక మండపం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాన్ని, జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కేంద్ర కమిటీ సభ్యురాలు శశికళ, కార్యదర్శి ఆర్. శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
హుస్సేన్ సా‘డర్’!
సిటీబ్యూరో హుస్సేన్‌సాగర్ అందాలను వీక్షిస్తూ... ట్యాంక్‌బండ్‌పై కాసేపు అలా సరదాగా గడపాలనుకుంటున్నారా... బోటు షికారు సైతం చేయాలనుకుంటున్నారా...అయితే మీరు తప్పకుండా ఓ ఖర్చీఫ్ లేదా నాప్కిన్ టవల్ లేదా స్కార్ఫ్‌ను వెంట తీసుకెళ్లండి. లేదంటే ముక్కుపుటాలదిరే దుర్గంధానికి మీరు ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక వెనుదిరుగుతారు. సాగర్ శుద్ధిని ప్రభుత్వం గాలికి వదిలేయడంతో చారిత్రక హుస్సేన్ సాగర్ మురికి కూపంగా మారింది. ప్రక్షాళన పేరిట కొంతమేర నీటిని బయటికి వదిలివేయడంతో ఇప్పుడు వ్యర్థాలు బయటకు తేలి తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయి. ముఖ్యంగా నెక్లెస్ రోడ్డు వైపు సాగర్ నీటిపై అక్కడక్కడా ‘ఆల్గే’ ఛాయలు కన్పిస్తున్నాయి. ఇది సాగర్ అంతటికీ విస్తరిస్తే ఇక ముక్కు మూసుకోకుండా అక్కడ సంచరించడం అసాధ్యమే. బోట్ షికారుకు వెళ్లి వచ్చిన పర్యాటకులు సాగర్ లోపల భరించరాని దుర్వాసన ఉందంటూ పెదవి విరుస్తున్నారు. బోట్ దిగగానే కొందరు వాంతులు చేసుకొన్న సంఘటనలూ ఉన్నాయి. నెక్లెస్ రోడ్లో పరిస్థితి మరీ దారుణం. పలు ప్రాంతాల నుంచి వచ్చే నాలాలు సాగర్‌లో కలిసే చోట పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల దుర్వాసన గుప్పుమంటోంది. దీంతో నెక్లెస్ రోడ్‌కు వెళ్లాలంటేనే నగర వాసులు హడలిపోతున్నారు. కూకట్పల్లి నాలా నుంచి సాగర్‌లో చేరుతున్న రసాయన వ్యర్ధాలను అడ్డుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి అని తెలుస్తోంది. ఏదిఏమైనా క్రమక్రమంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ఆహ్లాదకర వాతావర ణం దూరమవుతోంది. దీనిపై అధికారులను వివరణ కోరితే సాగర్ తీరంలో అసలు దుర్వాసనే లేదంటూ కొట్టిపారేయడం గమనార్హం. -
నిషేధంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించండి
హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విగ్రహాల ఎత్తు తగ్గింపు చర్యలపై అధ్యయనం చేయండి జీహెచ్ఎంసీకి ఆదేశం హైదరాబాద్: ఈ ఏడాది హైదరాబాద్ లోని హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిస్థాయిలో నిషేధించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విగ్రహాల ఎత్తును తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అధ్యయ నం చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు తెలిపింది. ఈ రెండు విషయాల్లో అందరి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలను ఈ నెల 20న తమ ముందుంచాలంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గణేశ్ విగ్రహాల నిమజ్జనం ద్వారా నీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని గతం లో ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయడం లేదంటూ పలువురు ఐఏఎస్ అధికారులను ప్రతివాదులుగా చేస్తూ న్యాయవాది వేణుమాధవ్ ధిక్కారపిటిషన్ దాఖలు చేశా రు. దీనిని ధర్మాసనం మరోసారి విచారిం చింది. బెంగళూరు విధానాన్ని ఇక్కడ అమలు చేయడం కష్టసాధ్యమని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది కేశవరావు కోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారాన్ని తాము పర్యవేక్షిస్తామంటూ విచారణను వాయిదా వేసింది. -
హుస్సేన్‌సాగర్ శుద్ధిపై హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులు నిలిపివేత
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ శుద్ధి పనులపై స్టే విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు గురువారం నిలుపుదల చేసింది. ఈ మేరకు జస్టిస్ నూతి రామ్మోహనరావు, జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శుద్ధి పనుల పేరుతో సాగర్‌లోని నీటిని తోడి, ఆ జలాలను మూసీలోకి వదులుతున్నారని స్వచ్ఛంద సంస్థ ‘సోల్’ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి విదితమే. విచారణ జరిపిన ట్రిబ్యునల్, ఆ పనులపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులపై జీహెచ్ఎంసీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ వ్యాజ్యాలను గురువారం విచారించింది. జీహెచ్ఎంసీ తరపు ఏజీ కె.రామకృష్ణారెడ్డి విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. -
ఆపరేషన్ ‘సాగర్’
హుస్సేన్ సాగర్ సందర్శనకు ఆస్ట్రియా నిపుణులు నేడు ఉన్నతాధికారులతో సమావేశం సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఆస్ట్రియాకు చెందిన నిపుణులు శనివారం హుస్సేన్‌సాగర్‌ను సందర్శించనున్నారు. సాగర్ ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే తొలిదశ పనుల్ని చేపట్టిన అధికారులు తూములు, అలుగుల ద్వారా వీలైనంత నీటిని వెలుపలికి పంపిస్తున్న విషయం తెలిసిందే. నీరంతా ఖాళీ అయ్యాక పూడిక తొలగింపు.. వ్యర్థాల డంప్ తీవ్ర సమస్యగా మారనుంది. అలాగే సాగర్ భూగర్భంలోని రసాయన విషతుల్యాల ప్రభావం..వాటి ద్వారా వెలువడే దుర్వాసనను అంచనా వేసి, పరిష్కారానికి తగుచర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకుగాను అధికారులు హుస్సేన్‌సాగర్‌లో కూకట్పల్లి నాలా కలిసే చోట ప్రయోగాత్మకంగా పనులు ప్రారంభించారు. నాలాలు, తూముల సామర్థ్యం పెంచడంతోపాటు అక్కడ నీరు త్వరగా ఖాళీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో నీరు ఇంకిపోయింది. ఆస్ట్రియా నిపుణులు తమ పర్యటనలో హుస్సేన్‌సాగర్‌ను పరిశీలించడంతోపాటు నీరు ఇంకిన ప్రదేశం, అక్కడి కెమికల్స్ తదితర అంశాలను అధ్యయనం చేసే అవకాశం ఉంది. సాగర్‌లో పేరుకుపోయిన ప్లాస్టర్‌ఆఫ్‌ప్యారిస్, ప్లాస్టిక్, తదితర వ్యర్థాలతో దుర్గంధం వెలువడుతోంది. నీటిలో పెరిగే పిచ్చిమొక్కలతో పాటు అల్గే వల్ల కూడా వాసన వస్తుందనే అంచనాలున్నాయి. సాగర్‌లో చేరే కాలుష్య కారకల ప్రభావం, తదితర అంశాలు అంచనా వేసి నిపుణులు నీటిని పూర్తిగా ఖాళీ చేసేందుకు అనుసరించాల్సిన విధానాలు, దుర్వాసన రాకుండా ప్రత్యామ్నాయాలపై తగు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హుస్సేన్‌సాగర్‌ను సందర్శించే ముందు లేదా అనంతరం నిపుణులు సాగర్ ప్రక్షాళనలో పాలుపంచుకునే వివిధ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు జీహెచ్ఎంసీ, జల మండలి, హెచ్ఎండీఏ, పీసీబీ, తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. -
నాయకా.. ఇదీ జన ఎజెండా..
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ కోటి ఆశలతో ప్రజల ఎదురు చూపులు ప్రతినిధులు తమ గళాన్ని వినిపించాలని వేడుకోలు హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేస్తాం.. ఎక్స్‌ప్రెస్‌వేలు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు, అధునాతన షాపింగ్‌కాంప్లెక్స్‌లు నిర్మిస్తాం.. గోదావరి, కృష్ణా జలాలను తీసుకువచ్చి నీటి సమస్యను తీరుస్తాం.. హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేస్తాం.. అంటూ పాలకులు ఇస్తున్న హామీలు నెరవేరుతాయా..? ఏళ్లతరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలపై ప్రజాప్రతినిధులు తమ వాణిని వినిపిస్తారా? కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరుగుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల్లో వీటికి పరిష్కారం లభిస్తుందా..? గ్రేటర్ వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘సాక్షి’ ప్రజల కష్టాలను సభ ముందుంచే ప్రయత్నం చేసింది. ‘నాయకా.. ఇదీ జనం ఎజెండా’ అంటూ సమస్యలపై ఫోకస్ పెట్టింది.. అమలుకు నోచుకోని ఎన్నో హామీలు...ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, వెలగని వీధి దీపాలు, పొంగి పొర్లుతున్న నాలాలు, నానాటికి తీవ్ర మవుతున్న విద్యుత్ కోతలు, విజృంభిస్తున్న విష జ్వరాలు, ఆసుపత్రుల్లో అందుబాటులో లేని మందులు, పట్టించుకోని అధికారులు...ముందుకు సాగని ‘మెట్రో’ పనులు, వెరసి ఇదీ భాగ్యనగర వాసుల బతుకు చిత్రం...ఈ నేపథ్యంలో శనివారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ ఇబ్బందులపై తమ పక్షాన ఎమ్మెల్యేలు గళ మెత్తుతారని...తమ క ష్టాలకు పాలకులు ఒక పరిష్కారం చూపుతారని నగర సగటు జీవి ఆశగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు..అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రస్తుతం గ్రేటర్‌ను పట్టి పీడిస్తున్న సమస్యలపై సాక్షి’ జన ఎజెండా..! ‘మెట్రో’కల నెరవేరాలి..! గ్రేటర్ వాసుల కలల ప్రాజెక్టుగా పేరొందిన ‘మెట్రో’పనులను సకాలంలో పూర్తిచేసి రైలు ప్రయాణ భాగ్యం కల్పించాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ఈ నెల 21 ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం వాయిదా పడటం, పాతనగరంలో అలైన్మెంట్ మార్పులు, నిర్మాణ సంస్థ, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం, ఆస్తుల సేకరణ లో జాప్యం, మెట్రో పనుల కారణంగా ట్రాఫిక్ చిక్కులు, గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి కాకపోవడంపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతున్నారు. నాగోల్-మెట్టుగూడ మార్గంలో పూర్తయిన 8 కి.మీ మార్గం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించలేదని నిర్మాణ సంస్థ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ స్టేషన్ వరకు మెట్రో మార్గాన్ని పొడిగించేందుకు ఒలిఫెంటా బ్రిడ్జి, ఆలుగడ్డబాయి, చిలకలగూడ ప్రాంతాల్లో మూడు ఆర్ఓబీలు నిర్మించాల్సి ఉన్నందున మరో ఏడాది పైగా పట్టనుంది. దీంతో 2016 డిసెంబరులోగా ప్రాజెక్టు ప్రారంభంపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం తాజా సమావేశాల్లో స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. పాతనగరంలో జేబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో ఇప్పటికే ఉన్న 14.3 కి.మీ మార్గంలో అలైన్మెంట్ మార్పు చేయడంతో దూరం 3.2 కి.మీ మేర పెరిగింది. కొత్త రూట్లో ప్రాజెక్టును చేపడితే వాణిజ్య పరంగా ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుందనే అంశంపై ఎల్అండ్టీ అధ్యయనం చేస్తోంది. త్వరలో పాతనగరం సహా ఎల్బీనగర్-మియాపూర్,నాగోల్-శిల్పారామం రూట్లలో వచ్చే ఏడాదైనా మెట్రో ప్రాజెక్టును ప్రారంభించాలని సిటీజన్లు భావిస్తున్నారు. పనులను వేగవంతం చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతున్నారు. వాటర్ గ్రిడ్ కావాలి..దాహార్తి తీరాలి... మహానగరం పరిధిలో సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరాకు పైప్‌లైన్ వ్యవస్థ, స్టోరేజీ రిజర్వాయర్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ మంజూరుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని తక్షణమే పూర్తిచేయాలని, అందుకు ప్రస్తుత బడ్జెట్లో సర్కారు రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని సిటీజన్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటడం, జలమండలి సరఫరా నెట్వర్క్ లేకపోవడంతో శివార్ల గొంతెండుతోంది. పైప్‌లైన్ నెట్వర్క్ ఉన్న కొన్ని ప్రాంతాలకు సైతం పది, ఇరవై రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తక్షణం గోదావరి మొదటిదశ మంచినీటి పథకం, కృష్ణా మూడోదశ పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి జనం దాహార్తిని తీర్చాలని నగరవాసులు కోరుకుంటున్నారు. మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలో డ్రైనేజీ వసతి లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాల్లో డ్రైనేజీ వసతుల కల్పనకు మరో రూ.3 వేల కోట్లు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. క్రమబద్ధీకరణకు మార్గం సుగమం చేయాలి ప్రభుత్వ , యూసీఎల్ స్థలాల్లో అభ్యంతరకర ఇళ్ల క్రమబద్ధీకరణకు జారీ చేసిన 58 జీవో ప్రకారం హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో 1,89,243 మంది ఉచిత క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు హైదరాబాద్‌లో 50 శాతానికిపైగా, రంగారెడ్డిలో 40 శాతం దరఖాస్తులు అభ్యంతరకరమైనవిగా పేర్కొంటూ కొర్రీలు పెడుతుండడంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. హైదారాబాద్ జిల్లాలో 64,243 దరఖాస్తులు రాగా, 35,700 దరఖాస్తులను పక్కకు పెట్టారు. నగరంలో యూసీఎల్కు సంబంధించిన స్థలాలు కోనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పడు అన్ని విధాలుగా సహకరించిన అధికారులు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరతో మళ్లీ క్రమబద్ధీకరించుకోవాలని పేర్కొనటంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీసీఎల్ఏ, యూసీఎల్ కార్యాలయాల వద్ద అందోళనలు నిర్వహించారు. అయినా అధికార యంత్రాంగంలో మార్పు రాకపోగా, ఆ ఇళ్లకు నోటీసులు ఇచ్చి, చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించడంపై తీవ్ర నిరసనలు వ్యక్త మవుతున్నాయి.ఈ అంశంపై వామపక్షాలతో సహా ఎంఐఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చించేందుకు సన్నద్ధమవుతున్నారు. వాస్తు పేరుతో గ్రేటర్‌లోని పలు కార్యాలయాలను సుదూర ప్రాంతాలకు తరలించటం, 59 జీవో ప్రకారం సొమ్ము చెల్లించే ఇళ్ల క్రమబద్ధీకరణకు ఆశించిన స్పందన రాలేదనే కారణంతో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భూములను విక్రయించాలనే ప్రభుత్వ యోచనపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశాలున్నాయి. వైద్యరంగాన్ని గాడిలో పెట్టాలి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రతిష్టాత్మక దవాఖానాలకు జబ్బు చేసింది. ఎబోలా, స్వైన్ ఫ్లూ వంటి ప్రమాదకరమైన వైరస్‌లే కాదు...సాధారణ డెంగీ, మలేరియా జ్వరాలతో సిటిజన్లు విలవిల్లాడుతున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రికి చేరినసామాన్యులకు ప్రాణాలపై కనీస భరోసా ఇవ్వలేక పోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తొలి బడ్జెట్లో ఉస్మానియా రూ.100, నిమ్స్‌కు రూ.200, గాంధీకి రూ.100, నిలోఫర్‌కు రూ.30, సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రికి రూ.25, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రికి రూ.25, ఈఎన్టీకి రూ.10, సరోజినిదేవి కంటి ఆస్పత్రికి రూ.10, ఛాతి, మాన సిక ఆస్పత్రులకు రూ.10 కోట్ల చొప్పున కేటాయించింది. అయితే ఆ నిధుల్లో ఇప్పటివరకు సగం కూడా విడుదల చేయక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వైన్‌ఫ్లూ నియంత్రణలో భాగంగా గాంధీ సహా, ఉస్మానియా, ఫీవర్, నిమ్స్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు అధికారులు ఘనంగా ప్రకటించినా..గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో మినహా ఎక్కడా పూర్తి స్థాయి వసతులు లేకపోవడంతో కేవలం రెండు మాసాల్లోనే 50 మందికిపైగా మృత్యువాత పడ్డారు. బడ్జెట్ కేటాయింపుల్లో చూపిన చొరవ నిధుల మంజూరులో చూపించి ఆస్పత్రుల్లోని అత్యవసర విభాగాలను పునరుద్ధరించాలని సీనియర్ వైద్య నిపుణులతో పాటు రోగులు కోరుతున్నారు. చీకట్లోనే 21 ఆస్పత్రులు గ్రేటర్(హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్) పరిధిలో 96 ఆరోగ్య కేంద్రాలు ఉండగా, వీటిలో పంజాషా-1, యాకుత్‌పుర-2, మెట్టుగూడ, మలక్‌పేట్, ఆగపురా, గగన్‌మహల్, నిలోఫర్ యూనిట్ ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు లేకపోవడం తో నర్సులే రోగులకు దిక్కవుతున్నారు. మాదన్నపేట్, గగన్‌మహల్, డీబీఆర్‌మిల్స్, చింతల్‌బస్తీ, అఫ్జల్‌సాగర్, శాంతినగర్, ఆగ పురా, కార్వాన్ -2, పానిపురా, పురాణాపూల్-2, మహరాజ్ గంజ్, దూద్‌బౌలి, భోలక్‌పూర్, మెట్టుగూడ, బోయగూడ, శ్రీరాంనగర్ , వినాయక్‌నగర్ , తారామైదాన్(జూపార్క్ ఎదరుగా), కుమ్మరివాడి, తీగల్కుంట, చందలాల్ బారాదరి ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు 2013 మార్చి నుంచి 2014 సెప్టెంబర్ వరకు విద్యుత్ బిల్లులు చెల్లించక పోవడంతో ఆయా ఆస్పత్రులకు విద్యత్ సరఫరా నిలిపివేయడంతో గత ఎనిమిదినెలలుగా అవి చీకట్లోనే మగ్గుతున్నాయి. రైల్వే పనులు ముందుకు సాగాలి కేంద్రరాష్ట్రాల మధ్య నిధులు, వనరులతో ముడిపడి ఉన్న అనేక రైల్వే ప్రాజెక్టులు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశే ఇందుకు ఉదాహరణ. సుమారు రూ.850 కోట్లతో కూడిన ఈ ప్రాజెక్టు కోసం రాష్ర్టప్రభుత్వం 2/3 వంతున, రైల్వేశాఖ 1/4 వంతు నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం గత రెండేళ్లలో రాష్ర్ట ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్లు మాత్రమే అందజేసింది. మరోవైపు పటాన్చెరు-తెల్లాపూర్, మేడ్చెల్-బోయిన్పల్లి మార్గాల్లో రెండో దశ పనులు జరుగుతున్నప్పటికీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంపై ఏడాది కాలంగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ వివాదానికి తెరదించి రైల్వే మార్గాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. ఊసేలేని భారీ టర్మినళ్లు... హైదరాబాద్ న గరానికి ప్రతి రోజు వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లో ప్రయాణికులు తాకిడిని తట్టుకునేందుకు మౌలాలీ, వట్టినాగులపల్లిలో రెండు భారీ ప్రయాణికుల టర్మినళ్లు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. అయితే అందుకు సంబందించి ఇప్పటివరకు స్థలం కేటాయించకపోవడంతో రైల్వేశాఖ బడ్జెట్లో టర్మినళ్ల ప్రతిపాదన చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. నత్తనడకన ఆర్ఓబీలు,ఆర్‌యూబీలు... జీహెచ్ఎంసీ, రైల్వేశాఖ సంయుక్తం తుకారంగేట్, ఆనంద్‌బాగ్, సఫిల్‌గూడ,ఉప్పుగూడ,కందికల్‌గేట్,ఆలుగడ్డబావి, తదితర ప్రాంతాల్లో ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మిం చాలని ప్రతిపాదించారు.వీటిలో కొన్ని చోట్ల పనులు నత్తనడకన సాగుతుండగా, మరికొన్ని చోట్ల ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. మెట్రో పనుల కారణంగా ట్రాఫిక్ పద్మహ్యూహాన్ని తలపిస్తోంది. దానికితోడు రైల్వేగేట్ల కారణంగా వాహనాలకు బ్రేకులు పడుతున్నాయి. ఈ ఏడాదైనా ఆర్ఓబీలు, ఆర్యూబీ నిర్మాణం పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. మైనార్టీలకు పెద్ద పీట వేయాలి రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమం, అభివృద్ధికి నిధుల కేటాయింపులు జరుగుతున్నా... విడుదల నత్తను తలిపిస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు కనీసం 23 శాతానికి మించి నిధులు విడుదల కాలేదు. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన బడ్జెట్లో సుమారు రూ.480 కోట్లు మురిగిపోగా, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం నిధుల వినియోగంపై సైతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.బ్యాంకింగ్ లింకేజీ రుణాల ఊసే లేకుండాపోగా, గతేడాది దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. షాదీముబారక్ పథకం అమలుపై నీలి నీడలు అలుముకున్నాయి. ఈ పథకానికి వచ్చి దరఖాస్తుల్లో సగానికిపైగా పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉర్దూ అమలు ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. మైనార్టీలకు విద్యా, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్ అమలు కేవలం కమిషన్ ప్రకటనలకే పరిమితమైంది. ఇప్పటికే సచార్, మిశ్రా కమిషన్లు మైనార్టీల ఆర్ధిక,సామాజిక స్థితిగతులపై సర్వే చేసి నివేదికలు సమర్పించినా, ప్రభుత్వం తాజాగా మరో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు వక్ఫ్ భూముల, ఆస్తుల పరిరక్షణ హౌస్ కమిటీలకే పరిమితం కాగా, గతంలో పార్లమెంటరీ, అసెంబ్లీ కమిటీలు వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై సర్వే చేసి సమర్పించిన నివేదికలు పత్తా లేకుండా పోయాయి. మరోమారు హౌస్ కమిటీ వేశారు. మైనార్టీ ఇంజనీరింగ్ కళాశాలలకు ఈ విద్యాసంవత్సరం అనుబంధ గుర్తింపు లభించకపోవడంతో సుమారు 20 వేల మైనార్టీ విద్యార్ధులకు ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలు లేకుండా పోయాయి. మైనార్టీ విద్యార్ధుల ఫీజు రీయంబర్స్మెంట్ పెండిం గ్లో మగ్గుతూనే ఉన్నాయి. నిధులపై స్పష్టత ఇవ్వాలి సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌కు వచ్చిన వారు అచ్చెరువొందేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బహిరంగ ప్రకటన చేశారు. అందులో భాగంగా విశ్వనగరం దిశగా పలు ప్రాజెక్టులనూ ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. వాటిల్లో ఏ ఒక్కటీ ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలనుంచి మొదలు పెడితే అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో స్కైవేల దాకా వీటిల్లో ఉన్నాయి. వాటన్నింటికీ రూ. వేల కోట్ల నిధులు కావాల్సి ఉంది. వాటిని ఎలా తెస్తుందో.. ఎక్కడి నుంచి ఇస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కొత్త ప్రాజెక్టుల సంగతలా ఉండగా, నగరజీవికి అవసరమైన కనీస మౌలికసదుపాయాల కల్పన పనులు ముందుకు సాగడం లేదు.. ఆయా సమస్యలపై సంక్షిప్తంగా.. అధ్వాన్నపు రహదారులు.. గ్రేటర్లో 7వేల కి.మీ.ల మేర రహదారులున్నప్పటికీ, వీటిల్లో వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో తప్ప మినహా మిగతా రోడ్లన్నీ గుంతల మయం. అధ్వాన్నపు రహదారులపై ప్రయాణాలతో ప్రజలు వెన్నునొప్పి నుంచి మొదలుపెడితే వివిధ రుగ్మతల బారిన పడుతున్నారు. బాటిల్‌నెక్స్ ప్రాంతాల్లోని ట్రాఫిక్‌జామ్‌లతో నిత్యనరకం అనుభవిస్తున్నారు. తీరని చెత్త సమస్య.. గ్రేటర్ నుంచి రోజుకు దాదాపు 3700 మెట్రిక్‌టన్నుల చెత్త వెలువడుతుండగా, నిల్వ చేసేందుకు అవసరమైనన్ని కుండీలు లేవు. దీనికితోడు డబ్బాల్లో నిండిన చెత్తను సైతం ఎప్పటికప్పుడు డంపింగ్‌యార్డుకు తరలించకపోవడంతో పరిసరాలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ఇంటింటినుంచి చెత్తను సేకరించేందుకు అవసరమైనని ట్రైసైకిళ్లు లేవు. నడిచే దారేదీ.. ? నగరంలో మాత్రం పాదచారులు నడిచేందుకు దారి లేదు. అనేక ప్రాంతాల్లో ఫుట్ఫాత్లే లేకపోగా, ఉన్న చోట్ల సైతం దుకాణాలు వెలసి ప్రజలకు నడిచే దారి లేదు. ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలపై హైకోర్టు మందలించినా పరిస్థితిలో మార్పులేదు. పార్కింగ్ సదుపాయాల్లేవు.. నడిచే వారికే కాక వాహనాలున్నవారికీ బాధలు తప్పడం లేవు. వివిధ అవసరాల నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు పార్కింగ్ సదుపాయం లేక వారి బాధలు వర్ణనాతీతం. అటు వాణిజ్యసంస్థలు తగిన పార్కింగ్ సదుపాయం కల్పించక, ఇటు జీహెచ్ఎంసీ పబ్లిక్ పార్కింగ్ ఏర్పాట్లు చేయక వాహనాలెక్కడ నిలపాలో తెలియక ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. పబ్లిక్టాయ్లెట్స్..లేవు. నగర ప్రజల అవసరాలకు తగిన విధంగా అవసరమైనన్ని పబ్లిక్‌టాయ్‌లెట్లు లేక ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతం. వెయ్యి టాయ్లెట్ల ఏర్పాటు చేస్తామన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇంకా, మూతల్లేని మ్యాన్‌హోళ్లు.. సదుపాయాలు లేని శ్మశానవాటికలు.. నిర్వహణ లేని కమ్యూనిటీ హాళ్లు. ఇలా ఎన్నెన్నో సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కట్..కటా! గ్రేటర్లో విద్యుత్ కనెక్షన్ల వివరాలు ఇలాః మొత్తం విద్యుత్ కనెక్షన్లు 37.90 లక్షలు గృహ విద్యుత్ కనెక్షన్లు 30.90 లక్షలు వాణిజ్య కనె క్షన్లు 5.50 లక్షలు చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు 40 వేలు అడ్వైర్టైజ్మెంట్లు, స్ట్రీట్‌లైట్స్ 40 వేలకుపైనే లైన్లను ఎప్పటికప్పుడు పునరుద్ధరించక పోవడం, ప్రజావసరాలకు అనుగుణంగా కొత్తలైన్లు వేయక పోవడంతో పాతబస్తీ వాసులు నేటికీ నిజాం కాలం నాటి లైన్ల మీదే ఆధారపడుతున్నారు. చాలా చోట్ల విద్యుత్ స్థంభాలు శిథిలావస్థకు చేరుకోవడంతో చిన్న గాలికే సరఫరా నిలిచిపోతోంది. విద్యుత్ పోల్స్‌కు సపోర్టింగ్‌గా ఏర్పాటు చేసిన వైర్లు ముట్టకుంటే షాక్ కొడుతుండటంతో అమాయకులు బలవుతున్నారు. ఉంటే ఉలుకరు...పోతే పలకరుః బెంగళూర్ , బొంబాయి వంటి మెట్రో నగరాల్లో 80 శాతం భూగర్భలైన్లు ఉండగా.. హైదరాబాద్‌లో 10 శాతం కూడా లేదు. నాశీర కం యూజీ, ఏబీ కేబుల్స్ వాడుతుండటంతో అవి త్వరగా పాడైపోతున్నాయి. సరఫరాలో తలెత్తే లోపాలను వెంటనే గుర్తిం చేందుకు అవసరై మెన ‘జియోగ్రాఫికల్ ఇన్పర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)’నేటికీ అమల్లోకి రాలేదు. విద్యుత్ ప్రమాదాలు, కోతలు, ఇతర సమస ్యల పై వినియోగదాల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు డిస్కం 1219 సర్వీసు నెంబర్‌ను ఏర్పాటు చేసింది. ప్రతి సర్కిల్‌కు ఒక ఫ్యూజ్ ఆఫ్ కాల్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వాటికి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తడం లేదు. కాంట్రాక్టర్లే అడ్డు.. గ్రేటర్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగు పర్చేందుకు కేంద్రం ఆర్-ఏపీడీఆర్పీ పథకం కింద టీఎస్ఎస్పీడీసీఎల్కు 2011 లో రూ.806.78 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఒక్క గ్రేటర్‌లోనే రూ.143. 84 కోట్లతో అరువైనాలుగు 33/11కేవీ సబ్స్టేషన్లు నిర్మించింది. అయినా నేటికీ రీఛార్జీకి నోచుకోలేదు. ఆపరేటర్ల ఎంపికపై కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లడమే ఇందుకు కారణం.దీంతో లోఓల్టేజీతో ఆయా ప్రాంతాల వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశ్వనగరం.. వైఫైసిటీ.....ఎంతటి ఖ్యాతిగాంచిన నగరమైతేనేమీ...చిన్న ఈదురుగాలికే గజగజ వణికి పోతోంది. ఎండ ముదిరి నా...గాలివీచినా...వర్షం కురిసినా...గ్రేటర్లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలుతోంది. మెరుగైన సరఫరా కోసమంటూ అధికారులు చేస్తున్న నెలవారీ సమీక్షలు...ముందస్తు హడావుడి చిన్న ఈదురుగాలి ముందు బలాదూరే. చిన్నచిన్న అంశాలకే కుప్పకూలుతున్న గ్రేటర్ విద్యుత్ వ్యవస్థ మెరుగు పర్చే దిశగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నగరవాసులు కోరుతున్నారు. -
సాగర మథనానికి సై...
రసాయన వ్యర్థాలు నాలాల్లోకి చేరకుండా చర్యలు రూ.40 కోట్లతో నాలా మళ్లింపు పనులకు శ్రీకారం ఫతేనగర్, జీడిమెట్లలోని పరిశ్రమల తరలింపు 170 ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమలు తూప్రాన్‌కు ఫార్మా కంపెనీలు దశలవారీగా ఫార్మాసిటీకి చారిత్రక హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. నిత్యం సాగర్‌లో చేరుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థ జలాలను దారిమళ్లించేందుకు అధికారులు పథకం రచించారు. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలా మళ్లింపు పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. తాజాగా టెండర్ల మూల్యాంకన ప్రక్రియ మొదలుపెట్టారు. మరో పక్షం రోజుల్లో నాలా మళ్లింపు పనులు చేపట్టనున్నారు. దీంతో ‘క్లీన్ హుస్సేన్ సాగర్’ కోసం అడుగులు ముందుకు పడుతున్నాయి.. - సాక్షి, సిటీబ్యూరో కాలుష్య కోరల్లో చిక్కి శల్యమవుతోన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను పరిశుద్ధ సాగరంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ వేసవిలో జలాశయాన్ని పూర్తిగా ఖాళీచేసి సాగరగర్భంలో పేరుకుపోయిన పారిశ్రామిక వ్యర్థాలను తొలగించేందుకు ఆయా విభాగాల అధికారులు నడుం బిగించారు. ముఖ్యంగా కూకట్పల్లి, జీడిమెట్ల, బాలానగర్ తదితర పారిశ్రామిక వాడల నుంచి నిత్యం వచ్చి చేరుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాలు జలాశయంలోకి చేరకుండా ఉండేందుకు కూకట్పల్లి నాలాను నేరుగా అంబర్‌పేట్‌లోని మురుగు శుద్ధి కేంద్రానికి మళ్లించి అక్కడ వ్యర్థజలాలను శుద్ధిచేసి మూసీలో కలిపేందుకు రంగం సిద్ధంచేశారు. ఈ పనులకు సంబంధించి రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలా మళ్లింపు పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి జలమండలి టెండర్లు పిలిచింది. తాజాగా టెండర్ల మూల్యాంకన ప్రక్రియ మొదలుపెట్టింది. మరో పక్షం రోజుల్లో నాలా మళ్లింపు పనులు చేపట్టనున్నారు. ప్రక్షాళన పర్వం ఇలా.. ఫతేనగర్, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న 170 ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమల నుంచి వస్తున్న క్యాడ్మియం, కోబాల్ట్ వంటి హానికారక మూలకాలు, రసాయన వ్యర్థాలు కూకట్పల్లి నాలాలోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి అవి హుస్సేన్‌సాగర్‌లో కలుస్తున్నాయి. రసాయనాల డ్రమ్ములను క్లీనింగ్ చేశాక వెలువడే కలుషిత జలాల్ని సైతం నాలాలోకి వదులుతున్నారు. ఈ రసాయన వ్యర్థాలు కూకట్పల్లి నాలాలోకి చేరకుండా ఉండేందుకు ఆయా పరిశ్రమలను ఔటర్‌కు ఆవల మెదక్ జిల్లాలోని తూప్రాన్ సమీపంలో ఎంపిక చేసిన ఖాళీ ప్రదేశంలోకి తరలించాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల అత్యధిక కాలుష్యం వెదజల్లే రెడ్ కేటగిరీ పరిశ్రమలనేవి లేకుండా చేస్తారు. ఆయా పరిశ్రమల వారికి కూడా ఇబ్బందిలేకుండా అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. పరిశ్రమలపై ఆధారపడిన కార్మికుల కుటుంబాల జీవనోపాధికి ఢోకా లేకుండా ఉండేలా చూస్తారు. పరిశ్రమలను అక్కడకు తరలించినా వివిధ సంస్థల నుంచి వాటికందే ప్రోత్సాహకాలు కొనసాగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. పరిశ్రమలను అక్కడకు తరలించేందుకు, అక్కడ తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తెలంగాణా రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఐఐసీ) తీసుకోనుంది. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ పని పూర్తిచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వీలైనన్ని వ్యర్థాల శుద్ధి కేంద్రాలు(కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్)ను ఏర్పాటు చేసి రసాయనవ్యర్థాల విషతుల్యత తగ్గించాలని ప్రతిపాదించారు. ఆయా పరిశ్రమల్లో రసాయనాలున్న డ్రమ్ములను శుభ్రపరచకుండా కఠినచర్యలు తీసుకునే బాధ్యత పీసీబీ తీసుకోనుంది. డ్రమ్ములను శుభ్రం చేసేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు.నాలాల మరమ్మతులు , నిర్వహణ బాధ్యతలు, ముఖ్యంగా లీకేజీలైనప్పుడు తీసుకోవాల్సి చర్యలను జలమండలి, జీడిమెట్ల ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ లిమిటెడ్‌లు పరస్పర సమన్వయంతో చేపట్టాల్సి ఉంది. రెండింటి మధ్య అవసరమైన సమావేశాలను జీహెచ్ఎంసీ ఈఎన్సీ ఏర్పాటు చేస్తారు. జీడిమెట్లలోని పలు ఫార్మా పరిశ్రమలు కూడా రసాయనవ్యర్థాలను కూకట్పల్లి నాలాలోకి వదులుతున్నాయి. వీటిని నిరోధించేందుకు రసాయన వ్యర్థాలు తీసుకువెళ్లే వాహనాలు వాటిని కూకట్పల్లి నాలాలో వదలకుండా వాటికి జీపీఎస్ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. గంగానదిలో ఏర్పాటు చేసిన మాదిరిగా కూకట్పల్లి నాలాలోని నీటి కాలుష్యాన్ని కొలిచే మీటర్లు ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాత్కాలికంగా ఈ చర్యలు తీసుకోవడంతోపాటు దీర్ఘకాలంలో సదరు ఫార్మా పరిశ్రమలన్నింటినీ ఏర్పాటుకాబోయే ఫార్మాసిటీకి తరలించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. ఇందుకుగాను తిరిగి ఈనెల 9వ తేదీన ఫార్మా కంపెనీల యాజమాన్యాలతో పీసీబీ, టీఎస్ఐఐసీలు సమావేశం నిర్వహించనున్నాయి. నాలాలు మళ్లాల.. వ్యర్థాలు తొలగాల.. పారిశ్రామిక వ్యర్థజలాల ద్వారా ఆర్సినిక్, నికెల్, కోబాల్ట్, మాలిబ్డనమ్ వంటి హానికారక మూలకాలు సాగర్‌లో చేరకుండా చూసేందుకు గ్రేటర్ యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణను త్వరలో సిద్ధంచేయనుంది. జలాశయం అడుగున గుట్టగా పేరుకుపోయిన ఘన వ్యర్థాలను పర్యావరణానికి హానిలేని రీతిలో పునఃశుద్ధి చేసే విధానాలపై కాలుష్య నియంత్రణ మండలి యంత్రాగం నిపుణులు కసరత్తు మొదలుపెట్టారు. గాజులరామారంలో ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ల్యాండ్‌ఫిల్లింగ్ (భూమిలోకి ఇంకని రీతిలో)విధానంలో వ్యర్థాలను పూడ్చిపెడితే పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మరోవైపు జలాశయంలో ప్రస్తుతం కాలుష్యకాసారమైన నీటిని తొలగిస్తే తలెత్తనున్న సమస్యలపై జీహెచ్ఎంసీ, పీసీబీ, ఇరిగేషన్, జలమండలి అధికారులు అధ్యయనం ప్రారంభించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి గురువారం జీహెచ్ఎంసీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్, తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనసంస్థ (టీఎస్ఐఐసీ) ఎండీ జయేశ్‌రంజన్, కాలుష్యనివారణ మండలి (పీసీబీ) కార్యదర్శి అనిల్‌కుమార్, జీహెచ్ఎంసీ ఈఎన్సీ ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
హుస్సేన్‌సాగర్‌లో ఆత్మహత్యకు యత్నం..రక్షించిన పోలీసులు
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో దూకిన ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించారు. నగరంలోని చార్మినార్‌కు చెందిన మహబూబున్నిసా, బన్సిలాల్పేట్కు చెందిన రేణుక గురువారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. వివరాలు... బన్సిలాల్పేటకు చెందిన రేణుకకు జగదీష్ బాబు అనే వ్యక్తితో 2000 సంవత్సరంలో పెళై్లంది. వారికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మొదటి భార్య రేణుకను మానసికంగా వేదిస్తుండటంతో పాటు చంపేస్తానని బెదిరిస్తుండటంతో డిప్రెషన్‌కు లోనై హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకొడానికి ప్రయత్నించింది. చార్మినార్‌కు చెందిన మహబూబ్ఉన్నిసాకు బిహార్‌కు చెందిన వాజిద్అలితో 2011 లో వివాహమైంది. వారికి రెండేళ్ల కుమార్తె ఉంది. పెళై్లనప్పటినుంచి భ ర్త తన స్వస్థలం బిహార్‌కు రమ్మని ప్రతిరోజు వేదిస్తున్నాడు. తనకు చెప్పకుండా వాజిద్ తన కుమార్తెను బిహార్‌కు తీసుకువెళ్లడంతో డిప్రెషన్‌కు లోనైన మహబూబున్నిసా ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించింది. ఈ విషయం గమనించిన లేక్ పోలీసులు వారిని కాపాడి కౌన్సిలంగ్ ఇచ్చి గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. -
మంచి ‘రోజ్’లెప్పుడో!
ప్రారంభం కాని రోజ్‌గార్డెన్ సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరాన అందమైన ‘రోజా పూల’ లోకాన్ని సృష్టించింది మహా నగరాభివృద్ధి సంస్థ. అయితే.. ఆ సుందర ప్రపంచాన్ని వీక్షించే అవకాశం జనానికి దొరకడం లేదు. నెక్లెస్ రోడ్‌లోని దామోదర సంజీవయ్య పార్కులో 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.5 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ గులాబీ నందన వనాన్ని (రోజ్ గార్డెన్) అద్భుతంగా తీర్చిదిద్దింది. వివిధ రంగుల్లో 612 రకాల ‘రోజా’లకు ఇక్కడ చోటు కల్పించారు. దేశవాళీ, హైబ్రీడ్‌లో దాదాపు అన్ని రకాల గులాబీలు ఈ గార్డెన్లో కొలువుదీరాయి. ప్రధానంగా హైబ్రీడ్ టీన్, ఫ్లోరిబండాస్, రాంబ్లర్స్, క్రిపర్స్, స్క్రాబ్రోజ్స్, మినేజర్స్, గ్రౌండ్ కవర్ రోజెస్, మినీ ఫ్లోరిబండాస్ రకాలుకనువిందు చేస్తున్నాయి. సుమారు 12వేల మొక్కలతో అలరారుతోన్న రోజ్‌గార్డెన్‌లో ఇంజినీరింగ్ అధికారులు అందమైన ల్యాండ్ స్కేప్‌ను తీర్చిదిద్దడం అదనపు హంగుగా మారింది. దీని నిర్మాణం పూర్తయి 6 నెలలు గడుస్తున్నా అధికారికంగా ప్రారంభించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాయంత్ర వేళల్లో సేదదీరేందుకు సంజీవ య్య పార్కుకు వచ్చే సందర్శకులు రోజ్ గార్డెన్ ఎంట్రీ ప్లాజా వరకు వెళ్లి... లోనికి అనుమతించకపోవడంతో ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ప్రశంసలు... రాజధాని నగరంలో అద్భుతమైన రోజ్గార్డెన్ను ఆవిష్కరించిందన్న కీర్తిని హెచ్ఎండీఏ దక్కించుకొంది. ‘ఇంటర్నేషనల్ రోజ్ గార్డెన్ సొసైటీ’ ప్రతినిధులు ఇటీవల ఈ గార్డెన్‌ను సందర్శించి హెచ్ఎండీఏపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతదేశంలోనే ఇదో ‘బెస్ట్ గార్డెన్’గా ప్రత్యేక గుర్తింపునిచ్చారు. ల్యాండ్ స్కేప్ పార్కుకు అదనపు హంగును అద్దిందని కొనియాడారు. ఈ గార్డెన్లో అందమైన గులాబీలతో పాటు వాటర్ ఫాల్స్, ఫౌంటెన్లు, శిల్పాలు, వాక్ వేలు వంటివి మరింత శోభను తీసుకొస్తున్నాయి. ప్రారంభానికి సిద్ధం ‘రోజ్ గార్డెన్ ప్రాంభించేందుకు అన్ని ఏర్పాటు చేశాం. మొక్కదశలో పూలు రానందున ఎలా ప్రారంభించాలన్న మీమాంస తలెత్తింది. దీంతో ప్రారంభోత్సవాన్ని కొద్దికాలం వాయిదా వేశాం. ఇప్పుడు మొక్కలు ఏపుగా పెరిగి పూర్తిస్థాయిలో పూలు ఉన్నాయి.త్వరలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నాం. అధికారికంగా ప్రారంభించాకే సందర్శకులను అనుమతిస్తాం. - వి.కృష్ణ, బుద్ధపూర్ణిమ ఓఎస్డీ భవితవ్యం ఏమిటి? ఆకాశహర్మ్యాలతో హుస్సేన్‌సాగర్ ప్రాంతాన్ని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దే ప్రాజెక్టుకు అందరి నుంచీ ప్రశంసలు అందుతున్నాయి. నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్కులో గల 96 ఎకరాల విస్తీర్ణంలోనూ అద్భుతమైన నిర్మాణాలకు అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే... ఇప్పటికే రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన రోజ్‌గార్డెన్ (గులాబీ తోట) భవితవ్యం ఏమిటన్నది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. నిర్మాణం పూర్తయి 6నెలలు గడిచినా ఇంతవరకు అధికారికంగా ప్రారంభించకపోవడం సందేహాలకు తావిస్తోంది. -
‘విశ్వ’మంత ఆశ
సీఎం కలల సాకారానికి కసరత్తు బహుళ అంతస్తుల బాధ్యత ఆర్కిటెక్ట్ హఫీజ్‌కు అప్పగింత ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం హుస్సేన్‌సాగర్ చుట్టూ అందమైన బహుళ అంతస్తుల భవనాలు.. మూసీ చుట్టూ కొత్త అందాలు.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా తెలంగాణ కళాభారతి .. ఇలా ప్రపంచంలోనే ప్రత్యేకంగా... ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన నగరంగా గ్రేటర్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆ దిశగా తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే పనిని ప్రారంభించారు. దీని కోసం ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ సేవ లను వినియోగించుకోనున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై గురువారం జరిగిన సమావేశానికి హఫీజ్‌ను ఆహ్వానించారు. ఈ బహుళ అంతస్తుల భవ నాల నిర్మాణానికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని... అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాల్సిందిగా హఫీజ్ బృందాన్ని కోరారు. అంతేకాదు.. నగరంలోని ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు వస్తే బాగుంటుందో పరిశీలించి ప్రణాళిక రూపొందిం చాలన్నారు. హైదరాబాద్ నగరంప్రపంచంలోనే ప్రత్యేకంగా ఉండాలన్నారు. ఇదీ హఫీజ్ విశిష్టత.. ముంబై యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో డిప్లొమా, కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీ, ఎంఎస్ పూర్తి చేసిన హఫీజ్ ఇంపీరియల్ 1, 2 భవనాలతో పాటు దేశంలోనే అత్యంత ఎత్తయిన భవనాల వాస్తుశిల్పిగా ప్రసిద్ధికెక్కారు. కొత్త పద్ధతులతో... అందరినీ ఆకట్టుకునేలా భవనాలను తీర్చిదిద్దడంలో పేరుపొందారు. హఫీజ్ ప్రాజెక్టుల్లో నోయిడా మహాగున్ మెడోస్, నవీ ముంబైలో డీవై పాటిల్ స్టేడియం, సీవుడ్స్ ఎస్టేట్ (ఎన్ఆర్ఐ కాంప్లెక్స్), గుర్గావ్లో డీఎల్ఎఫ్ అరాలియాస్, హీరానందర్ గార్డెన్స్ వంటివి ఉన్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఎన్నో నిర్మాణాలతో పాటు ఓఎన్జీసీ గ్రీన్‌బిల్డింగ్స్‌కు రూపకల్పన చేశారు. ప్రముఖ నగరాల్లో ఇన్ఫోసిస్ బిల్డింగ్లు, ఏవీ బిర్లా ట్రైనింగ్ సెంటర్ నిర్మాణంలో ఆయన నైపుణ్యం కనిపిస్తుంది. నగరంలోని మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను గతంలో హఫీజ్ సిద్ధం చేశారు. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా బహుళ అంతస్తులతో పాటు మూసీ సుందరీకరణకు హఫీజ్ బృందం డిజైన్ చేయనుంది. చేపట్టనున్న పనులు మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త కట్టడాలు (పార్కులతో సహా) ఇందిరా పార్కు ఖాళీ స్థలంలో తెలంగాణ కళాభారతి (నాలుగు ఆడిటోరియంలతో సహా) రవీంద్ర భారతి ప్రదేశంలో హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలు చాటేలా నిర్మాణం మొజాంజాహి, చార్మినార్, హుస్సేన్‌సాగర్, సాలార్జంగ్ మ్యూజియంల వద్ద కొత్త ఆకర్షణలు టవర్లు, బహుళ అంతస్తుల భవనాలు చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక లక్షణాలు ప్రతిబింబించడంతో పాటు ఆర్థికప్రగతికి దోహదపడేలా నిర్మాణం. -
ఆకాశం అంచులు చూద్దాం
హుస్సేన్‌సాగర్ చుట్టూ రానున్న టవర్లు సింగపూర్, దుబాయ్, షాంఘై నిర్మాణాల పరిశీలన కసరత్తు ప్రారంభించిన జీహెచ్ఎంసీ ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్‌కు చోటు! పట్టుదలతో ఉన్న రాష్ట్ర సర్కార్ ఈ భవంతిని చూశారా... ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవనంగా గుర్తింపు పొందిన బుర్జ్ ఖలీఫా. దుబాయ్(యూఏఈ) లో ఉంది. దీని ఎత్తు భూమట్టం నుంచి 828 మీటర్లు (2,717అడుగులు). దీనిలో 163 అంతస్తులున్నాయి. ఎక్కడో దుబాయ్‌లో ఉన్న భవనం ప్రస్తావన ఇప్పుడెందుకూ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఆకాశాన్ని తాకేలా కనిపించే ఇలాంటి సుందర భవనాలు మన గ్రేటర్ నగరంలో త్వరలో కనువిందు చేయనున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరంలో వీటి నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తథాగతుని సాక్షిగా... విద్యుల్లతల మధ్య ఠీవీగా దర్శనమిచ్చే ఇలాంటి భవంతులను చూసిన వారు ఆనందాశ్చర్యాలకు గురయ్యేలా నిర్మించాలనేది ప్రభుత్వ యోచన. దీనికి అవసరమైన కార్యాచరణ రూపొందించే పనిలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలతో పాటు మన దేశం...మన నగరంలో ఉన్న బహుళ అంతస్తులభవంతుల విశిష్టతలు తెలుసుకుందాం. ఆకాశహర్మ్యాలకు అనువైన ప్రదేశాలను జీహెచ్ఎంసీ గుర్తించింది. వీటి నిర్మాణాలకు గాను నిబంధనలు, ప్రతిబంధకాలు, అనుమతులపై దృష్టి సారించింది. సుప్రీంకోర్టు అనుమతి పొందాల్సి ఉండడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. సాగర్‌కు సమీపంలో 18 మీటర్ల కన్నా ఎత్తయిన భవంతులు నిర్మించాలంటే ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తప్పనిసరి. నిర్మాణ సమయంలో సెట్బ్యాక్లు, రహదారి వెడల్పు తదితర నిబంధనలు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం ఒకింత ఊరట. ఆకాశహర్మ్యాలు ఇక్కడే... టవర్ల నిర్మాణానికి లోయర్ ట్యాంక్‌బండ్, బీఆర్కే భవన్, పాటిగడ్డ తదితర ప్రాంతాలు అనువుగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. అవసరమైతే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం స్థానే బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ భవనాలకు డిజైన్, డ్రాయింగ్, ఆర్కిటెక్చర్ రూపొందించేందుకు జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోనున్నారు. విశ్వనగరం బాటలో... షాంఘై, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ తదితర దేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా సాగర అందాలు వీక్షించేలా అధునాతన టవర్స్ నిర్మించాలన్న సర్కార్ ఆలోచన బాగానే ఉన్నా... వాటి నిర్మాణానికి అయ్యే వ్యయం వేల కోట్లపైమాటే. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన బుర్జ్ ఖలీఫా వంటి భవంతిని మన నగరంలో నిర్మించాలంటే సుమారు రూ.10 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చిస్తుందా? లేక పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో వీటి నిర్మాణాన్ని చేపడుతుందా? అన్నది తేలాల్సి ఉంది. షాంఘై టవర్స్.. చైనాలోని షాంఘై నగరంలో ఉందీ టవర్. దీని ఎత్తు 632 మీటర్లు (2,073 అడుగులు). ప్రపంచంలో రెండో ఎత్తయిన భవంతిగా పేరొందింది. నిర్మాణ వ్యయం 4.2 బిలియన్ అమెరికా డాలర్లు. ఈ భవంతిలో 121 అంతస్తులున్నాయి. హైదరాబాద్ నగరంలో.. లోధాబెలీజా1: దక్షిణ భారత దేశంలో ఎత్తయిన కట్టడంగా పేరొందిన లోథాబెలీజా టవర్స్ మన నగరంలోనే ఉంది. కేపీహెచ్‌బీ మలేషియా టౌన్‌షిప్‌కు వెనకవైపున ఉన్న ఈ భవంతి ఎత్తు 140 మీటర్లు(459 అడుగులు). ఇందులో 42 అంతస్తులున్నాయి. కాగా గ్రేటర్ నగరంలో 20 అంతస్తులు ఆపైబడిన భవంతులు సుమారు 50 వరకు ఉన్నాయి. మరో వంద వరకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉండడం విశేషం. బుర్జ్ ఖలీఫా ప్రపంచంలో అత్యంత ఎత్తయిన కట్టడంగా ప్రసిద్ధి చెందిన బుర్జ్ ఖలీఫా టవర్ దుబాయ్ (యూఏఇ)లో ఉంది. దీని ఎత్తు భూమట్టం నుంచి 828 మీటర్లు (2,717 అడుగులు). ఈ భవంతిలో 163 అంతస్తులుండడం విశేషం. దీని నిర్మాణాన్ని ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ 2010లో పూర్తి చేసింది. నిర్మాణానికి 150 కోట్ల అమెరికా డాలర్లు (రూ.9వేల కోట్లు) ఖర్చు చేశారు. 900 నివాసాలు, 37 కార్యాలయ అంతస్తులు, 160 అతిథి గదులున్న ఆర్మనీ హోటల్, 144 ప్రైవేటు నివాసాలు, క్లబ్‌లు, రూఫ్‌గార్డెన్‌లు, ఫిట్నెస్ క్లబ్‌లు ఈ భవంతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మన దేశంలో.. మన దేశంలోనే ఎత్తయిన భవంతిగా పేరొందిన ఇంపీరియల్ టవర్-1 ముంబై దక్షిణ ప్రాంతంలో ఉంది. 120 అంతస్తుల భవంతి. ఫ్లోర్ ఏరియా 1.30 లక్షల చదరపు అడుగులు.ఎత్తు 254 మీటర్లు(833 అడుగులు). -
ఇంకా డ్రెడ్జింగ్ ఎందుకో?
సాక్షి, సిటీబ్యూరో: వచ్చే వేసవి నాటికి హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయాలనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనకు... ప్రస్తుతం నెక్లెస్ రోడ్డులోని నాలా ముఖద్వారాల వద్ద పూడికతీత పనులకు ఏమాత్రం పొంతన కుదరట్లేదు. సాగర్‌ను సుందర జలాశయంగా మార్చేందుకు పకడ్బందీ బృహత్తర ప్రణాళికకు ఒక వైపు ప్రభుత్వం తెరతీస్తుంటే... మరో వైపు హెచ్ఎండీఏ అరకొరగా పూడికతీత పనులు నిర్వహిస్తుండటంలో అర్థం లేదన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్న సాకుతో హెచ్ఎండీఏ అధికారులు సాగర్‌లో డ్రెడ్జింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పూడికతీత పనులకు సుమారు రూ.19 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించిన అధికారులు మరో రూ.10కోట్ల వరకు ప్రజాధనం వృథాకు సన్నాహాలు చేస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాగర్‌ను కాలుష్య కాసారంలా మారుస్తున్న పికెట్ నాలా, బంజారా నాలా, బల్కాపూర్ నాలా, కూకట్పల్లి నాలాల ద్వారా నిత్యం 380-420ఎంఎల్డీల మురుగు నీరు కలుస్తోంది. వీటి ముఖద్వారాల వద్ద పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు రెండేళ్ల క్రితం రూ.43 కోట్ల అంచనాలతో హెచ్ఎండీఏ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించింది. కూకట్పల్లి తప్ప మిగతా 3 నాలాల వద్ద సుమారు 7 లక్షల క్యూ.మీ. పూడిక తొలగించాలన్నది లక్ష్యం. ఇప్పటివరకు 1.90 వేల క్యూ.మీ. మాత్రమే తొలగించగలిగారు. సాగర్ నుంచి తీసిన వ్యర్థాలను సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన తాత్కాలిక డంపింగ్ యార్డుకు పైపుల ద్వారా తరలించి... అక్కడి పాండ్స్‌లో ఎండబెట్టాక లారీల ద్వారా గాజులరామారంలోని క్యారీపిట్స్లోకి తరలిస్తున్నారు. 18 నెలల్లో పూర్తి కావాల్సిన పూడిక తీత పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. తాజాగా సాగర్‌ను ఖాళీ చేసి పూడికను తొలగించాలని సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో డ్రెడ్జింగ్‌ను నిలిపేయాల్సి ఉంది. దీనితో తమకు సంబంధం లేదన్నట్టుగా హెచ్ఎండీఏ పనులు కొనసాగిస్తోంది. ఇప్పటికే నిర్ణీత గడువు ముగిసినందున ...కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని రుణదాత జైకాకు తెలిపి...పూడిక తీతను నిలిపివేయకపోతే రూ.10 కోట్ల వరకూవృథా ఖాయమని కొందరు అధికారులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం సాగర్‌నే ప్రక్షాళన చేస్తున్నప్పుడు... ఇక నాలాల వద్ద పూడికతీత పేరుతో నిధులు వృథా చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కొందరు అధికారుల స్వప్రయోజనాలకే డ్రెడ్జింగ్ పనులు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఉరుకులు..పరుగులు!
ఆకాశహర్మ్యాల కోసం వేగిరమైన పనులు జిల్లా కలెక్టర్‌కు చేరిన భూ సర్వే నివేదిక నేడో రేపో సర్కారుకు సమర్పణ సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలను నిర్మించాలనే నిర్ణయానికి అనుగుణంగా లక్ష్యాన్ని చేరుకోవటానికి హైదరాబాద్ జిల్లా అధికారయంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. గత నాలుగైదు రోజులుగా సాగర్ చుట్టూ 26 ప్రాంతాల్లో సర్వే నిర్వహించి, గుగూల్ ఆధారంగా రికార్డులు పరిశీలించిన రెవెన్యూ అండ్ భూ సర్వే అధికారులు 165 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనాకు నివేదికను అందజేశారు. ఈ నివేదికను మరోక సారి క్షుణంగా పరిశీలించి సమగ్రంగా ప్రభుత్వానికి గురువారం సమర్పించేందుకు జిల్లా అధికారయంత్రాంగం కసరత్తు చేస్తున్నది. కబ్జాలో సుమారుగా 50 ఎకరాలకు పైగా ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ కబ్జా భూముల్లో భవన, షెడ్ల సముదాయాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ స్థలమని బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు...ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే అందుకు అనుగుణంగా స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ శాఖాధికారులు వివరిస్తున్నారు. కాగా సర్వే అధికారులు కబ్జాల విషయంలో పక్కాగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఒకటికి రెండు సార్లు సర్వే చేసినట్లు తెలిసింది. ఈ సర్వే కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు సర్వేయర్లు సహాకరించారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో మరో 271 ఎకరాలు సాగర్ చుట్టూ ఉన్న 26 ప్రాంతాలతో ఖాళీగా ఉన్న 147 ఎకరాల ప్రభుత్వ స్థలంతోపాటు... కోర్టు కేసులు, వివిధ వివాదాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నట్లు అధికారులు భావిస్తున్నారు. సాగర్ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలు ప్రస్తుతం హెచ్ఎండీఏ అధ్వర్యంలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి. సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే ప్రతిపాదనల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పరిధిలో రికార్డుల ప్రకారం ఉన్న భూముల వివరాలను లెక్కగట్టగా 270 ఎకరాలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. సాగర్ చుట్టూ ఉన్న లుంబినీ పార్కు , పరిసర ప్రాంతాల్లో -10 ఎకరాలు, ఎన్టీఆర్ మెమోరియల్ గార్డెన్- 36 ఎకరాలు, డాక్టర్ కార్స్, ఐమాక్స్, ప్యారడైజ్ హోటల్- 10, ఐమాక్స్ ఎదురుగా పార్కింగ్ లాట్-03, లేక్‌వ్యూ పార్కు- 17.5, నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా-03.5, ఈట్ స్ట్రీట్- 10, నెక్లెస్ రోడ్లో పార్కింగ్ లాట్స్- 03, జలవిహార్- 12.5, ఆకారం పోచయ్య వెట్ ల్యాండ్ -20, సంజీవయ్య పార్కు- 90, సంజీవయ్య పార్కు ఎదురుగా-10, పీవీ జ్ఞాన భూమి- 03, హెర్బల్, మేజ్ గార్డెన్- 04, సెయిలింగ్ క్లబ్ ప్రాంతంలో- 05 , కిమ్స్ ఎదురుగా ఎకో-పార్కు-32 ఎకరాల చొప్పున మొత్తంగా 271 ఎకరాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
నాలాలోంచి పొగలు
నల్లకుంట : నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా సమీపంలోని నాలా లోంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన చెందారు. నాగమయ్య కుంట నుంచి వచ్చే వరదనీరు, డ్రైనేజీ నీటిని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సమీపంలోని హుస్సేన్‌సాగర్ నాలాలో కలిపేందుకు బాక్స్ నాలా నిర్మించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి చౌరస్తా సమీపంలోని లారీల అడ్డా వద్ద నాలాలోంచి పొగలు రావడం ప్రారంభమైంది. అది చూసిన స్థానికులు నాలాలో చెత్త కాల్చి ఉంటారని అనుకున్నారు. రాత్రి 7 గంటలకు పోగలు మరింతగా ఎక్కువయ్యాయి. అదే విధంగా పాత నల్లకుంట పాత రామాలయం వీధి, డాక్టర్ చారీలేన్లలో ఉన్న మ్యాన్ హోళ్లలోంచి కూడా పొగలు వచ్చాయి. అది చూసిన స్థానికులు ఇళ్లలోకి వెళ్లి చూడగా బాత్ రూమ్‌లలోని డ్రెనేజ్ పైపుల ద్వారా పోగలు వస్తుండడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే నల్లకుంట పోలీసులకు సమాచారమందించడంతో వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు తార్నాకలోని అగ్నిమాపక కార్యాలయానికి సమాచారమందించారు. వెంటనే అగ్ని మాపక శకటంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పొగలు ఎక్కడి నుంచి వస్తున్నాయో పరిశీలించగా అంతుచిక్కిలేదు. భూగర్భ కేబుల్ కాలి పోగలు వచ్చి ఉంటాయా? ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా మీదుగా అండర్ గ్రౌండ్ హై టెన్షన్ విద్యుత్ కేబులు, బీఎస్ఎన్ఎస్, ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ ప్రాంతంలో భూగర్భ కేబులును వేశారు. ఇవి ఎక్కడైనా కాలిపోయాయా? లేదా నాలాలో ఎవరైనా గుర్తు తెలియని రసాయనాలు పోశారా అనేది తెలియరాలేదు. కాగా ఒక్క సారిగా పొగలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. -
సొగసు చూడతరమా!
హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు సర్కారు సరికొత్త ఆలోచన జలాశయ అందాలు ప్రతిబింబించేలా ప్రణాళిక సాక్షి, సిటీబ్యూరో: ఆకాశాన్ని తాకేలా విభిన్న ఆకృతులలోని భవనాలు... ఆ ఎదురుగా సుందర జలాశయం... చుట్టూ ఇంద్రధనుస్సును పోలినట్టుండే సప్త వర్ణాల పూలు... ఆ నీటిపై నుంచి భవనాలను కలుపుతూ ముచ్చటగొలిపే విద్యుత్ కాంతులు... ఈ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది కదూ. నగరానికి మణిహారంలా ఉన్న హుస్సేన్‌సాగర్ వద్ద ఈ దృశ్యం సాక్షాత్కరిస్తే... అబ్బో... ఆ ఊహే మహాద్భుతం... ఇక వాస్తవ రూపం దాలిస్తే...‘దాలిస్తే’ ఏంటి? దాల్చబోతోంది. అవును సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు వెలిసేందుకు అవ సరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్‌సాగర్‌ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం మరోవైపు జలాశయం చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే తలంపులో ఉంది. ఇందులో భాగంగా ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించింది. వీటికి సంబంధించి 26 కోర్టు కేసులు ఉన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పం దించిన ఆయన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అడ్వొకేట్ జనరల్‌కు సూచిం చారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న భూములను పలువురు ఆక్రమించడం.. ఏళ్ల తరబడి అవి కోర్టు కేసుల్లో నలుగుతుండటం తెలిసిందే. లీజు గడువు ముగిసిపోయినా కోర్టు స్టేతో ఖాళీ చేయకపోవడం... సాగర్‌కు ఒకవైపు ఆక్రమణలు వంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వాటిని తొలగించాలని యోచి స్తోంది. విదేశాల్లోని ప్రసిద్ధ నగరాలతో పాటు మనదేశంలోని ముంబై, కోచిల్లోని మెరైన్డ్రైవ్ల తరహాలో అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నగరాల మాదిరిగా హైదరాబాద్‌లోనూ ‘స్కైలైన్’ భవనాలను నిర్మించేందుకు అన్ని అంశాలను అధ్యయనం చేసి.. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు. ఈ ‘ఆకాశహర్మ్యాల’ విషయం వాస్తవమేనని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. -
‘సాగర్’ ప్రక్షాళనను పరిశీలించిన సీఎం
‘సాగర్’ ప్రక్షాళనను పరిశీలించిన సీఎం హెచ్ఎండీఏ అధికారులకు ముచ్చెమటలు కూకట్పల్లి నాలా దారి మళ్లింపుపై ప్రత్యేక దృష్టి సాక్షి, సిటీబ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికా రులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ఉన్నట్టుండి హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులను పరిశీలించేందుకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీఎం నెక్లెస్ రోడ్డుకు చేరుకోవడంతో హెచ్ఎండీఏ అధికారులు ఉలిక్కిపడ్డారు. సాగర్ ప్రక్షాళనకు సంబంధించి ఏ పనులను సీఎం పరిశీ లిస్తారో తెలియక ఇంజినీరింగ్ అధికారులు హైరానా పడ్డారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ పరిధిలోని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, జలమండలి తదితర విభాగాలతో సచివాలయంలో సీఎం సమావేశమయ్యారు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టును సమీక్షించిన ఆయన పనుల తీరుపై అధికారులను ఆరా తీశారు. రూ.370 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు సుమారు రూ.200 కోట్లు ఖర్చయ్యాయని వారు తెలిపారు. ప్రస్తుతం పికెట్, బంజారా, బల్కాపూర్ నాలా ముఖద్వారాల వద్ద వ్యర్థాలను తొలగింపు (డ్రెడ్జింగ్) పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. జలాశయం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటుతో పాటు షోర్ లేన్‌లో గ్రీనరీని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ విషయాలను శ్రద్ధగా ఆలకించిన సీఎం... పారిశ్రామిక ప్రాంతాల నుంచి విష రసాయన వ్యర్థాలను మోసుకొస్తున్న కూకట్పల్లి నాలాను దారి మళ్లించకుండా సాగర్ ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మురుగునీటి నాలాలు సాగర్‌లో కలవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కూకట్పల్లి నాలా పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిద్దామంటూ సీఎం బయలుదేరారు. అధికారులకు ముచ్చెమటలు సీఎం ఆకస్మిక తనిఖీకి బయలుదేరడంతో హెచ్ఎండీఏ అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. సచివాలయంలో ముఖ్యమంత్రి కారు ఎక్కగానే సీఈ, ఎస్ఈలు విషయాన్ని కిందిస్థాయి సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో వారు నెక్లెస్ రోడ్డుకు పరుగులు పెట్టారు. ఇంతలో నేరుగా నెక్లెస్ రోడ్డుకు వచ్చిన సీఎం తొలుత జలవిహార్ వద్ద గల బంజారా నాలా (బ్రిడ్జి-2,3)ను, అక్కడి ఐ అండ్ డీ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం కూకట్పల్లి నాలా (బ్రిడ్జి-4) పరిస్థితిని చూశారు.ఈ నాలా సాగర్‌లో కలిసే చోట పెద్దమొత్తంలో మేట వేసిన వ్యర్థాలు, జలాశయంలోకి నేరుగా కలుస్తున్న మురుగునీటిని పరిశీలించారు. ఈ నాలాపై నిర్మించిన ఇంటర్ సెప్టర్ డైవర్షన్ (ఐ అండ్ డి) ద్వారా 100 ఎంఎల్డీ మురుగు నీటిని దారి మళ్లిస్తున్న తీరును సీఈ, ఎస్ఈలు సీఎంకువివరించారు. కూకట్పల్లి నాలా వద్ద 15 నిమిషాలకు పైగా సీఎం గడిపారు. ఆ తర్వాత సంజీవయ్య పార్కు వద్ద ఉన్న పికెట్ నాలా (బ్రిడ్జి-4)ను పరిశీలించారు. పూడికతీత (డ్రెడ్జింగ్) పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదులకు తోడు... విజిలెన్స్ కే సు నమోదు కావడంతో సీఎం ఈ నాలాను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు వినికిడి. అటు నుంచి పాటిగడ్డలోని ఎస్టీపీని పరిశీలించాలని భావించినా భద్రతా కారణాల దృష్ట్యా సీఎం వెనుదిరిగి నెక్లెస్ రోడ్డు మీదుగానే సచివాలయానికి చేరుకున్నారు. ఊపిరి పీల్చుకున్న అధికారులు నెక్లెస్ రోడ్డు వద్ద సాగర్‌లో కలుస్తున్న 5 నాలాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి పాటిగడ్డలోని 30 ఎంఎల్డీ ఎస్టీపీకి వస్తారన్న సమాచారంతో హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ సిబ్బంది అక్కడికి పరుగులు తీశారు. ఆతర్వాత సీఎం అక్కడికి రావట్లేదని, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పక్కన నిర్మించిన 20 ఎంఎల్డీ ఎస్టీపీని పరిశీలిస్తారని సమాచారం రావడంతో ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్నారు. సీఎం నేరుగా వెళ్లిపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. -
బతుకమ్మ నిమజ్జనానికి భారీ భద్రత
బందోబస్తులో 2 వేల మంది పోలీసులు భారీగా మహిళా వలంటీర్ల వినియోగం సైఫాబాద్: సామూహిక బతుకమ్మ నిమజ్జనోత్సవం గురువారం హుస్సేన్‌సాగర్‌లో జరగనున్న నేపథ్యంలో మధ్య మండల పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. బతుకమ్మను తెలంగాణ ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించడంతో గతానికి భిన్నంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. పైగా ఇది మహిళల పండుగ కావడంతో నిమజ్జనంలో చైన్ స్నాచర్లు, ఇతర ప్రాపర్టీ అఫెండర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అనుమానించిన సెంట్రల్ జోన్ అధికారులు వారికి చెక్ చెప్పే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఊరేగింపులు జరిగే ఎల్బీ స్టేడియం నుంచి హుస్సేన్‌సాగర్ వరకు డేగ కంటి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 100 సర్వెలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు వీడియో గ్రాఫర్లను సైతం నియమించి మొత్తం 200 వీడియో కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. బందోబస్తు కోసం రెండు వేల మంది సిబ్బందిని నియమించారు. వీరిలో దాదాపు 500 మంది మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అనుమానితులను పట్టుకునేందుకు మరికొంత మంది సిబ్బందిని మఫ్టీలో ఉంటారు. పోలీసులతో పాటు 400 మంది వలంటీర్లు, మరో 300 మంది ఎన్సీసీ క్యాడెట్లను సైతం ఎల్బీ స్టేడియం నుంచి హుస్సేన్‌సాగర్ వరకు, అప్పర్ ట్యాంక్ బండ్‌పై మోహరిస్తారు. నగరంలో రెచ్చిపోతున్న స్నాచర్లలో బయట జిల్లాల వారు కూడా ఉంటున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆయా జిల్లాల నుంచీ క్రైమ్ టీమ్స్‌ను రప్పిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలో ఉన్న నేరగాళ్ల అడ్డాలపై గురువారం వరకు వరుస దాడులు చేయాలని, అవసరమైన చోట కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. -
విషసాగరం
హుస్సేన్‌సాగర్‌లో పెరిగిన కాలుష్య మూలకాల మోతాదు గత ఏడాది కంటే అధికం పడిపోతున్న ఆక్సిజన్ లెవల్స్ సనత్‌నగర్: చారిత్రక హుస్సేన్ సాగర్‌లోని జలాలు కాలకూట విషంగా మారుతున్నాయా.. హానికర రసాయనాల మోతాదు గణనీయంగా పెరిగిపోతోందా.. ఆక్సిజన్ స్థాయి భారీగా తగ్గి జీవరాసుల మనుగడే ప్రశ్నార్థకంగా మారనుందా.. అవుననే అంటున్నాయి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారుల గణాంకాలు. గత ఏడాదితో పోల్చితే సాగర్ జలాల్లో కాలుష్యం గణనీయంగా పెరిగా యి. వినాయక విగ్రహాల నిమజ్జనం, వర్షాభావం ఇందుకు కారణమని పర్యావరణ శాస్త్రవేతలు అంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలి తాజా లెక్కలు హుస్సేన్‌సాగర్ పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయి. గత సంవత్సరం భారీ వర్షాల కారణంగా కాలుష్య మోతాదు తక్కువగా నమోదైంది. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనాల గాఢత అధికంగా ఉన్న రంగులతో తయారుచేసిన వినాయక ప్రతిమల నిమజ్జనం కారణంగా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీవోడీ) స్థాయి అనూహ్యంగా పెరిగిందని పీసీబీ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఎన్నడూ లేనివిధంగా సాగర జలాల్లో సూక్ష్మజీవుల మనుగడకు అత్యంత ఆవశ్యకమైన నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయి (డీవో) దారుణంగా పడిపోయింది. సాధారణంగా లీటరు నీటిలో 3 మైక్రోగ్రాము/లీటరు ఉండాల్సిన ఆక్సిజన్ మోతాదు నిమజ్జనం ముందు, నిమజ్జన సమయంలో ఏకంగా 1.3 మైక్రోగ్రాములకు పడిపోవడంతో హుస్సేన్‌సాగర్‌లో జీవరాశుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. వినాయక ప్రతిమలతోపాటు పూజకు వినియోగించిన పత్రి, ఇతర వస్తువులు, ప్లాస్టిక్ వంటి పదార్థాలు సాగర జలాల్లోకి చేరడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. కాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏడాది మాదిరిగానే నిమజ్జన సమయంలో హుస్సేన్‌సాగర్ జలాల పరిస్థితిపై పీసీబీ అధ్యయనం చేసింది. నిమజ్జనానికి ముందు, నిమజ్జన సమయంలో, నిమజ్జనం తరువాత మూడు దశలుగా హుస్సేన్‌సాగర్‌లో పలు పాయింట్ల వద్ద పీసీబీ అధికారులు కాలుష్య మోతాదులను లెక్కించారు. వీరి పర్యవేక్షణలో పలు ఆందోళన కలిగించే వాస్తవాలు వెలుగుచూశాయి. కాలుష్యం లెక్కించిన కేంద్రాలివే... బుద్ధ విగ్రహం వద్ద ఉన్న ప్రధాన పాయింట్‌తో పాటు ఎన్టీఆర్‌పార్కు ఎదురుగా ఉన్న ప్లాట్‌ఫాం నంబర్-1, ప్లాట్‌ఫాం నంబర్-2, లుంబినీ పార్కు వద్ద, నెక్లెస్ రోడ్డు, లేపాక్షి హ్యాండీ క్రాఫ్ట్ దగ్గర సాగర్ జలాలను మూడు దఫాలుగా సేకరించి వరంగల్‌లోని పీసీబీ ల్యాబ్‌లో పరీక్షించారు. ఇదిగో సాగరంలో ‘గరళం’ నిమజ్జన సమయంలో అన్ని అన్ని మానిటరింగ్ స్టేషన్ల వద్ద నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు (టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ -టీడీఎస్) భారీగా పెరిగాయి. నిమజ్జనానికి ముందు లీటరు నీటిలో అత్యధికంగా టీడీఎస్ 918 మిల్లీ గ్రాములు/లీటరు ఉండగా నిమజ్జనం తరవాత 956కు పెరిగింది. గతేడాదితో పోలిస్తే టీడీఎస్ మోతాదు నిమజ్జనం తరవాత ఏకంగా 154 మిల్లీగ్రాము/లీటరు పెరగడం గమనార్హం. గాఢత ఉన్న రసాయనాల ఆనవాళ్ల ఉనికిని తెలిపే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీవోడీ) నిమజ్జనం ముందు లీటరు నీటిలో అత్యధికంగా 96 మిల్లీ.గ్రా ఉంటే నిమజ్జనం సమయంలో 112 మిల్లీ. గ్రాకు చేరింది. సాధారణంగా సాగర్ జలాల్లో సీవోడీ 90 మిల్లీగ్రాములుగా ఉంటుంది. నిమజ్జనం తర్వాత మరో 22 మిల్లీగ్రాము/లీటరు పెరిగినట్లు పీసీబీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సీవోడీ పెరిగిందంటే హానికరమైన రసాయనాలు ఉన్నట్లు సుస్పష్టమౌతోంది. సీవోడీ స్థాయిగతేడాది కంటే 16 మిల్లీగ్రాము/లీటరు పెరిగింది. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) విషయానికొస్తే నిమజ్జనం ముందు సరాసరి 52 మీల్లీగ్రాము/లీటరుగా ఉంటే నిమజ్జనం సమయంలో 58కు చేరింది. అత్యధికంగా బుద్ధభవన్ పాయింట్ వద్ద ఈ పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఇదే పాయింట్ వద్ద 48 ఉండగా అదనంగా 10 మిల్లీగ్రాము/లీటరు చేరినట్లు పెరిగింది. జీవరాశుల మనుగడకు అత్యంత ఆవశ్యకమైన నీటిలో కరిగిన ఆక్సిజన్ మోతాదు (డీవో) విగ్రహాల నిమజ్జనం ముందు అత్యధికంగా 1.3 మి.గ్రా ఉండగా, నిమజ్జనం తరవాత దాదాపుగా అంతే ఉండడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయి భారీగా పడిపోయినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా డీవో 3 మీల్లీగ్రాము/లీటరుకు తగ్గకూడదు. అలాంటి 1.3కు చేరడాన్ని బట్టి జీవరాశులకు ఏమాత్రం ఆక్సిజన్ అందడం లేదని తెలుస్తోంది. -
బండ్‌బారుతోంది!
పూడికతో నిండుతున్న ‘సాగర్’ మొక్కుబడిగా ప్రక్షాళన బాధ్యత తీసుకోని యంత్రాంగం భారీగా చేరుతున్న వ్యర్థాలు సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ హిత వినాయకుని తయారు చేయాలని పిలుపునివ్వడం మినహా పక్కాగా ఆంక్షలు విధించలేని ప్రభుత్వ నిస్సహాయత చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను కాలుష్య కాసారంలా మార్చేసింది. మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై నగరంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా... అనుకున్న స్థాయిలో ఆ కార్యక్రమం విజయవంతం కాలేదు. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. పీఓపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో రూపుదిద్దుకున్న గణనాథుడి భారీ విగ్రహాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. గత సంవత్సరం కంటే అధికంగానే పీఓపీ వినాయక విగ్రహాలు సాగర్‌లో నిమజ్జనమయ్యాయి. కృత్రిమ రంగులతో కూడిన భారీ వినాయక విగ్రహాలు అధిక సంఖ్యలో నిమజ్జనం కావడంతో హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యం రెట్టింపైనట్లు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది చిన్నా పెద్దవి కలిపి 50-55 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా, ఈ ఏడాది వాటి సంఖ్య 65 వేలకు పెరిగింది. సాగర్ నుంచి వెలికి తీస్తున్న వ్యర్థాల పరిమాణం కూడా అంతే స్థాయిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది సాగర్ నుంచి 3,723 టన్నుల నిమజ్జన వ్యర్థాలను వెలికి తీయగా, ఈసారి అది 5వేల టన్నులకు పైగా ఉండొచ్చని అధికారుల అంచనా. ఓ వైపు హెచ్ఎండీఏ రూ.370 కోట్ల వ్యయంతో సాగర్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్టు చెబుతోంది. మరోవైపు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి విష రసాయన పదార్థాలతో నిర్మితమైన గణేశ్ విగ్రహాలు వేల సంఖ్యలో వచ్చి చేరాయి. వీటిని వెలికితీసే కార్యక్రమం మాత్రం మొక్కుబడిగా సాగుతోంది. ఒకవైపే శుద్ధి నిజానికి సాగర్‌లో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌ల వైపు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నా... ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే ప్రక్షాళన పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. అటుగా వెళ్లే ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టిలో పడితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో వాటిని తొలగించేందుకే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. అదే ట్యాంక్‌బండ్ వైపు అయితే.... లోతు ఎక్కువగా ఉండటం వల్ల నీళ్లలో పడిన విగ్రహాల ఆచూకీ తెలియట్లేదు. ఒక్కరోజు నీటిలో నానితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కరిగిపోతుండటంతో వ్యర్థాలు సాగర్ గర్భంలోకి చేరుతున్నాయి. ఇలా ట్యాంక్‌బండ్ వైపు కొన్నేళ్లుగా పూడిక పేరుకుపోతోంది. అటువైపు నిర్వహణ తమకు సంబంధం లేదని హెచ్ఎండీఏ, నీళ్లున్న ప్రాంతం తమ పరిధిలోకి రాద ని జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ విభాగాల అధికారులు ఎవరికివారు తప్పించుకుంటూ ఉండడంతో ట్యాంకు బండ్ భద్రతకు భరోసా లేకుండా పోయింది. అంత పరిజ్ఞానం లేదట... వినాయక నిమజ్జనోత్సవానికి భారీ మొత్తం ఖర్చు చేసిన జీహెచ్ఎంసీ ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనమైన విగ్రహాలను వెలికితీసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. లోతైన ప్రాంతం కావడంతో అటువైపు పూడిక తొలగింపు అంత సులభం కాదని, ఆ పరిజ్ఞానం కూడా తమ వద్ద లేదంటూ అధికారులు కొన్నేళ్లుగా దాటవేస్తూ వస్తున్నారు. పైపైన తేలిన విగ్రహాలను డీయూసీ, బోట్ల ద్వారా గట్టుకు చేరుస్తున్నారే తప్ప, అడుగుకు చేరుకున్న వాటి జోలికి వెళ్లట్లేదు. విగ్రహాలు కొన్నిరోజులు నీటిలో నానితే ఔట్ ఫ్లోలో కొట్టుకుపోతాయంటూ కొత్త సిద్ధాంతాన్ని చెబుతున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్ వైపు నిర్వహణ మొత్తం జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ విభాగాల పరిధిలో ఉండటంతో అటువైపు పూడికతీత పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేని కారణంగా సాగర్ ఉనికికే ప్రమాదం వాటిల్లిందన్న విషయం సుస్పష్టం. అసలు లోపాన్ని చక్కదిద్దకుండా సాగర్ ప్రక్షాళన పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేయడం ఎంతవరకు సబబో సర్కార్కే తెలియాలి. అయ్యో.... గణేశా! సాక్షి, సిటీ బ్యూరో: వినాయక చవితి ఉత్సవాలను భక్తులు ఎంత భక్తిశ్రద్ధలతో చేస్తారో... అంతే భక్తి ప్రపత్తులతో గణేశ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఎటొచ్చీ నిమజ్జనానంతరం జరుగుతున్న తంతుభక్తుల మనస్సులను గాయపరుస్తోంది. 11 రోజుల పాటు నీరాజనాలందుకున్న ఖైరతాబాద్ భారీ గణేశుడు ఇప్పుడు ముక్కలు చెక్కలుగా విడిపోయి ‘సాగర్’ తీరంలో కనిపిస్తుండడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. వినాయకుడు పూర్తిగా నిమజ్జనం కాకుండా సాగర్ ఒడ్డునేఅవశేషాలు ఉండడంతో దీన్ని చూస్తున్న జనం అధికారుల తీరును తప్పు పడుతున్నారు. పనులు వేగిరం: కమిషనర్ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జన పూడికతీత పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సాగర్‌లో వినాయక విగ్రహాల తొలగింపు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కూడిన విగ్రహాల వ్యర్థాలను సత్వరం గట్టుకు చేర్చాలని, లేదంటే అవి కరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. నిత్యం ప్రముఖులు రాకపోకలు సాగించే ఎన్టీఆర్ మార్గ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, ఈ విషయంలో ఎక్కడా రాజీ లేకుండా పనులు నిర్వహించాలని బీపీపీ ఓఎస్డీ వి.కృష్ణకు సూచించారు. నిమజ్జనం వ్యర్థాలు 2322 మెట్రిక్ టన్నులు సాక్షి, సిటీబ్యూరో: గణేశనిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీలో 2,322 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జీహెచ్ఎంసీ కార్మికులు తరలించారు. గ్రేటర్లో రోజుకు సగటున 3,800 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, నిమజ్జనం సందర్భంగా ఈనెల 7,8, 9,10 తేదీల్లో అదనంగా 2,322 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. 7వ తేదీన 849 మెట్రిక్ టన్నులు, 8న 321, 9న 482.5, 10న 670 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తరలించారు. -
రేపు ఉదయం 8 కల్లా...నిమజ్జనం పూర్తి
-
రేపు ఉదయం 8 కల్లా...నిమజ్జనం పూర్తి
హైదరాబాద్ : ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి సిద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం ఎనిమిదిగంటల కల్లా నిమజ్జనం పూర్తయ్యేలా చూస్తామన్నారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమవుతున్న వినాయక విగ్రహాల శకలాలు ఎప్పటికప్పుడూ తొలగిస్తున్నట్లు తెలిపారు. సోమవారం దాదాపు అరవై వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నట్లు సోమేష్ కుమార్ అన్నారు. మరోవైపు పాతబస్తీలో నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. అందరూ మత సామరస్యాన్ని పాటించాలని నాయిని కోరారు. అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. -
నేడే గణేశ్ నిమజ్జనం
సర్వం సిద్ధం చేసిన అధికారులు జంట కమిషనరేట్లలో 39,400 మంది పోలీసు బందోబస్తు 900 సీసీ కెమెరాల నిఘాలో శోభాయాత్ర → సందర్శకుల వాహనాల పార్కింగ్ స్థలాలివీ ► ఖైరతాబాద్ జంక్షన్‌లోని ఇన్స్ట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ► ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ ► ఆనంద్‌నగర్ కాలనీ, రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం ► బుద్దభవన్ వెనక వైపు ► గోసేవాసదన్ ► లోయర్‌ట్యాంక్‌బండ్ ► కట్టమైసమ్మ దేవాలయం ► ఎన్టీఆర్ స్టేడియం ► నిజాం కళాశాల ► పబ్లిక్ గార్డెన్స్ → నగర పోలీసు కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 040-27852482,27852486, 9010203626 సైబరాబాద్ పోలీసు కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 9490617100 అత్యవసరమైతే ఫిర్యాదుల్ని 040-21 11 11 11 నంబరుకు తెలియజేయవచ్చు. హైదరాబాద్: నవ రాత్రులు పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు గ్రేటర్ పరిధిలోని 23 చెరువుల వద్ద అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జంట కమిషనరేట్ల పరిధిలో బందోబస్తులో 39,400 మంది పోలీసులు పాల్గొంటున్నారు. శోభాయాత్ర కొనసాగే అన్ని రహదారులపై 900 నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాన శోభాయాత్ర బాలాపూర్‌లో ప్రారంభమవుతుంది. దీనికి అనుబంధంగా ఉప్పల్, సికింద్రాబాద్, మల్లేపల్లి నుంచి వచ్చే శోభాయాత్రలు మొజంజాహి మార్కెట్, లిబర్టీ చౌరస్తా వద్ద ప్రధాన యాత్రతో కలుస్తాయి. గణేశ్ నిమజ్జనం సజావుగా సాగేందుకు జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ, పోలీసు, తదితర విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా సిబ్బందిని నియమించారు. యాత్ర సజావుగా సాగేందుకు జీహెచ్ఎంసీలోని ఆయా విభాగాలు ప్రతి 3-4 కి.మీ.లకు ఒక టీమ్(గణేశ్ యాక్షన్ టీమ్) చొప్పున ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ఆయా చౌరస్తాలలో ఆంక్షలు, మళ్లింపులు చేపట్టారు. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం తిలకించేందుకు సుమారు 15 లక్షలకుపైగా భక్తులు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించారు. సోమవారం దాదాపు అరవై వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా. స్పెషల్ ప్రొటెక్షన్ టీమ్‌లు సైతం విధుల్లో పాల్గొననున్నాయి. దాదాపు రూ. 11.50 కోట్లతో అవసరమైన ఏర్పాట్లు చేశారు. నగరంలో 310 అత్యంత సమస్యాత్మక ం, 605 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాలలో ప్రత్యేక నిఘాతో పాటు పెట్రోలింగ్, పికెట్లు ఏర్పాటు చేశారు. {పతి 3-4 కి.మీ.లకు ఒక గణేశ్ యాక్షన్ టీమ్(జీఏటీ) ఏర్పాటు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం నుంచి ఒక్కో జీఏటీ టీమ్‌లో 1 శానిటరీ సూపర్వైజర్, ముగ్గురు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, 21 మంది కార్మికులుంటారు.ఈ టీమ్‌లు రెండు షిఫ్టులుగా పనిచేస్తాయి. మొత్తం జీఏటీలు : 162 శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు : 364 మంది శానిటరీ సూపర్వైజర్లు : 70 మొత్తం కార్మికులు : 2,763 ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో.. యాత్ర సజావుగా సాగేలా రహదారులు ఎగుడు దిగుళ్లు లేకుండా, గుంతలు లేకుండా మరమ్మతులు నీటి నిల్వ ప్రాంతాల మరమ్మతులు 113 మార్గాల్లో పనులు. పనుల మొత్తం మార్గం : 227.85 కి.మీ.లు లేన్ మార్కింగ్‌లు, కెర్బ్ పెయింటింగ్‌లు కూడా చేస్తున్నారు. దాదాపు 320 ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాల్ని తొలగిస్తున్నారు. జనం అధికంగా ఉండే ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, చార్మినార్ తదితర ప్రదేశాల్లో 19 మొబైల్ టాయ్లెట్లు. విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో.. యాత్ర పొడవునా వీధిదీపాలు. శాశ్వత స్తంభాలు లేని చోట తాత్కాలిక స్తంభాల ఏర్పాటు విద్యుత్ స్తంభాలకు రంగులు ఒక్కో జీఏటీ బృందంలో షిఫ్టుకు సూపర్వైజర్, ఇద్దరు ఎలక్ట్రీషియన్లు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారు. మొత్తం టీమ్‌లు 131. ఎలక్ట్రీషియన్లు 399 మంది ఒక్కోమార్గంలో దాదాపు 3,595 విద్యుత్ దీపాలు తాత్కాలికంగా 1,30,18,020 విద్యుత్ దీపాల ఏర్పాటు ఇవికాక సున్నిత ప్రాంతాల్లో అత్యవసరంగా పనిచేసేందుకు 18 ప్రత్యేక బృందాలు. అవసరమైన సామగ్రితో 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి. ఈ చెరువులలో నిమజ్జనం.... 1.కాప్రాచెరువు 2. సరూర్‌నగర్ చెరువు 3. రాజన్నబావి 4. మీరాలంట్యాంక్ 5. పల్లె చెరువు 6. పత్తికుంట చెరువు 7. దుర్గం చెరువు 8. మల్కం చెరువు 9. గోపీనగర్ చెరువు 10. పెద్ద చెరువు(గంగారం) 11. గురునాథం చెరువు(జేపీనగర్) 12. కైదమ్మకుంట(హఫీజ్‌పేట), ఈర్ల చెరువు 13. రాయసముద్రం చెరువు(రామచంద్రాపురం) 14. సాకి చెరువు(పటాన్చెరు) 15. ఐడీఎల్ ట్యాంక్ 16. ప్రగతినగర్ చెరువు 17. హస్మత్‌పేట చెరువు 18. సున్నం చెరువు 19. పరికి చెరువు 20. వెన్నెలగడ్డ చెరువు 21. సూరారం చెరువు 22.కొత్తచెరువు(అల్వాల్‌లేక్), 23. సఫిల్‌గూడ చెరువు ఏరియల్ సర్వేతో వీక్షించనున్న డీజీపీ నిమజ్జనోత్సవ బందోబస్తును రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే ద్వారా వీక్షించనున్నారు. వేలాది గణపతి విగ్రహాలతో పాతనగరంలోని బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు లక్షలాది జనంతో సాగే నిమజ్జన ఊరేగింపునకు దాదాపు ముప్పై వేల మంది పోలీసులతో భారీ ఎత్తున భద్రతాఏర్పాట్లను చేశారు. డీజీపీతో పాటు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, నగర స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ మల్లారెడ్డిలు కూడా ఈ ఏరియల్ సర్వేలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ప్రశాంతంగా వేడుకలు ముగిసేలా సహకరించాలని డీజీపీ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగినా నిమజ్జనానికి ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారీ ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తున్నారు. అన్ని స్థాయిల్లో కలిపి దాదాపు ఐదు వేల మంది సిబ్బందిని మోహరిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. మహాగణపతికి హై రేంజ్ బుక్ఆఫ్ రికార్డు అవార్డు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతిని గుర్తించి హైరేంజ్ బుక్ ఆఫ్ అవార్డును ఆదివారం హైకోర్టు జస్టిస్ నర్సింహ్మారెడ్డి ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజ్‌కుమార్‌కు అందజేశారు. సుమన్ ఇంటర్నేషనల్ సంస్థ వారు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతిని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ 60 అడుగుల విశ్వరూప మహాగణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పెంచుకో... పంచుకో!
నిమజ్జనం పూడిక తరలింపు వ్యయం భారీగా పెంపు అధికారుల తీరుపై అనుమానాలు సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి ఉత్సవం నగర వాసుల్లో భక్తి ప్రపత్తులను నింపితే... అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. సాగర్‌లో నిమజ్జన పూడిక తరలింపు పేరుతో తాజాగా హెచ్ఎండీఏలో నిధుల దుబారాకు తెరలేచింది. సాగర్‌లో నిమజ్జనమయ్యే గణేశ్ విగ్రహాల శకలాలను వెలికితీసి నగరం వెలుపలకు తరలించే పనులను ఏటా హెచ్ఎండీఏ చేపడుతోంది. ఈ ఏడాది కూ డా ఆ పనులకు రూ.18.56 లక్షల అంచనా వ్యయంతో ఇటీవల అధికారులు టెండరు ఖరారు చేశారు. అయితే పూడిక తరలింపు పేరుతో వెచ్చిస్తున్న నిధులు ఏటా పెరుగుతుండటం విమర్శలకు దారి తీస్తోంది. గత మూ డేళ్లలో ఇందుకు వెచ్చించిన నిధులు... ఈ ఏడాది కేటాయిం చిన మొత్తాన్ని గమనిస్తే అక్రమాలకు ముందే బీజాలు వేశారన్న విషయం అవగతమవుతోంది. 2011, 2012లో ఇందుకోసం రూ.8 లక్షల వంతున వె చ్చించారు. 2013లో ఈ ఏకంగా రూ.16.21 లక్షలకు టెండర్ పిలిచారు. లెస్‌కు కోట్ చేశారన్న నెపంతో తమ అనుచరులకు పనులు అప్పగించి, గుట్టుగా వాటాలు వేసుకున్నారన్న విమర్శలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఈ ఏడాది మరో అడుగు ముందుకేసి, రూ.18.56 లక్షల కు అంచనాలు పెంచడం అధికారుల వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది. గత ఏడాదికీ, ప్రస్తుత పనులకు బేరీజు వేస్తే తేడా ఏమీ లేదు. వ్యర్థాల పరిమాణం, లారీ ట్రిప్పులు, జేసీబీల వినియోగం గత ఏడాది మాదిరిగానే ఉంది. నిధులు మాత్రం రూ.2.35 లక్షలు పెరిగాయి. పక్కాగా ఏర్పాట్లు హుస్సేన్‌సాగర్‌ను వడగట్టి మొత్తం విగ్రహాల శకలాలను వెలికితీసి బయటకు తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశామని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. గతంలో డీయూసీలను హెచ్ఎండీఏనే నిర్వహిస్తుండటం వల్ల వాటి ఖర్చు ఉండేది కాదంటున్నారు. ఇప్పుడు అవి మరమ్మతులకు గురవడంతో వాటిస్థానే 22 జేసీబీలను వినియోగిస్తున్నామని, అందువల్లే ఖర్చు పెరిగిందని వివరణ ఇస్తున్నారు. వాస్తవానికి పూడిక తరలించేందుకు అయ్యే వ్యయంలో గత ఏడాది వరకు జీహెచ్ఎంసీ కూడా భాగస్వామ్యం వహించేదని, ఇప్పుడు ఆ మొత్తాన్ని హెచ్ఎండీఏ భ రిస్తున్నందున అంచనా వ్యయం పెరిగిందని చెబుతున్నారు. నిధులు ఎన్ని ఖర్చు చేశామన్నది కాదు... సాగర్‌లో పూడిక చేరకుండా ఏమేరకు అడ్డుకున్నామన్నదే తమకు ముఖ్యమని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ ఏడాది 32 శాతం లెస్‌కు కోట్ చేసిన సంస్థకు టెండర్ దక్కిందని, ప్రమాణాల మేరకు పనులు నిర్వహిస్తేనే బిల్లు చెల్లిస్తామని స్పష్టం చేశారు. -
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం వద్దు
హైదరాబాద్ : వినాయకచవతి సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకుండా చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు న్యాయవాది వేణుమాధవ్ ఈ పిటి షన్ను దాఖలు చేశారు. విగ్రహాల నిమజ్జనం వల్ల కాలుష్యం పెరుగుతోందని వివరించారు. -
మట్టి గణపతికి జై...
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 30వేల ప్రతిమలు హుస్సేన్‌సాగర్ పరిరక్షణకు కంకణం సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతికే హెచ్ఎండీఏ జై కొడుతోంది. హుస్సేన్‌సాగర్, ఇతర చెరువుల పరిర ణక్షకు నగరవాసులు మట్టి వినాయక ప్ర తిమలకే ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్థానే మట్టి గణపతులను మండపాల్లో ప్రతి ష్ఠించేందుకు భక్తులు ముందుకు రావాలని హెచ్ఎండీఏ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ కజూరియా, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డి వి.కృష్ణ పిలుపునిచ్చారు. మట్టి గణేశ్ ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏటా హెచ్ఎండీఏ సబ్సిడీపై గణపతులను సరఫరా చేస్తోందన్నారు. ఈ ఏడాదీ రూ.6 లక్ష ల వ్యయంతో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేయిస్తున్నామన్నారు. ఇళ్లల్లో పూజకు వినియోగించేందుకు వీలుగా 30 వేల మట్టి గణపతి ప్రతిమలను తయారు చేస్తున్నామన్నారు. హుస్సేన్‌సాగర్ పరిరక్షణకు ప్రత్యేకంగా లేక్ కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఇందులో విద్యాసంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. మట్టి గణపతి ప్రతిమలను అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలోని వివిధ పార్కుల్లో, అలాగే స్వచ్ఛంద సంస్థల సహకారంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 8 అంగుళాల ప్రతిమల ను పండుగకు రెండ్రోజుల ముందు ఒక్కోటి రూ.13కు అందజేస్తామని ఓఎస్డి తెలిపారు. 3 అడుగుల ఎత్తు విగ్రహం ధర రూ.1250 గా నిర్ణయించారు. పెద్ద విగ్రహాలను పాఠశాలలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కమ్యూనిటీ గ్రూప్స్, ఉత్సవ నిర్వాహకులకు మాత్రమే అందజేస్తామని చెప్పారు. మట్టి గణపతి ప్రతిమలు కావాల్సిన వారు లుంబినీపార్కు వద్దనున్న బీపీపీ కార్యాలయంలో గానీ, లేదా 9885311134, 8008889537 నంబర్లలో గానీ సంప్రదించాలని సూచించారు. మట్టి వినాయక విగ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని ఠీఠీఠీ.జిఝఛ్చీ.జౌఠి.జీలో చూడవచ్చు. -
లోతట్టును ముంచిన సాగర్ నీరు
ఊపిరి పీల్చుకున్న అధికారులు, స్థానికులు దోమలగూడ: హుస్సేన్‌సాగర్ నీరు పరుగులు తీసింది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, బస్తీలు నీటమునిగాయి. భారీ వర్షాలకో.. సాగర్ నీటితో నిండి పొంగిపొర్లడంతో ఇలా జరగలేదు. హుస్సేన్‌సాగర్ వరద నీటి పైపులను మరమ్మతు చేస్తున్న క్రమంలో జరిగిన పొరపాటుకు పలుచోట్ల పైపులైన్ల నుంచి నీరు భారీగా బయటకు తన్నుకొచ్చింది. దీంతో లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రవాహాన్ని నియంత్రించడానికి అధికారులు 24 గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు లీకేజీలు ఆగిపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హుస్సేన్‌సాగర్ నుంచి కట్టమైసమ్మ దేవాలయం, ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా ఉప్పల్ వరకు ఉన్న వరద నీటి పైపులైన్లకు ట్యాంక్‌బండ్ వద్ద మరమ్మతులు జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం షెట్టర్ తిప్పడంలో జరిగిన పొరపాటుతో పలుచోట్ల పైపులైన్ల నుంచి వరద నీరు పొంగిపొర్లింది. డివిజన్లోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పాత కార్యాలయం వద్ద, దివంగత నేత పీజేఆర్ ఇంటి సమీపంలో, రామకృష్ణమఠం వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ పైపుల నుంచి వరద నీరు భారీగా రావడంతో ఇందిరాపార్కు ప్రధాన రహదారితోపాటు డివిజన్లోని రోజ్‌కాలనీ, దోమలగూడ, ఏవీ కళాశాల, గగన్‌మహల్ పోలీస్ అవుట్‌పోస్టు తదితర బస్తీలు, రోడ్లు జలమయమయ్యాయి. వరద నీరు బయటకు రావడంతో ఇందిరాపార్కు రహదారితోపాటు బస్తీల రోడ్లు కాలువలను తలపించగా ప్రజలు, ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే ఆయా చోట్లకు చేరుకుని మరమ్మతులు సాగించారు. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు 24 గంటల పాటు శ్రమించి వరదనీటి ప్రవాహాన్ని నియత్రించగలిగారు. గతంలో రామకృష్ణమఠం వద్ద.. గత ఏడాది జూలైలో రామకృష్ణమఠంలో ఏర్పాటు చేయతలపెట్టిన 30 కిలో మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటు కోసం ఎర్తింగ్ కోసం డ్రిల్లింగ్ పనులు చేపడుతుండగా దాదాపు పద్నాలుగు అడుగుల లోతులో ఉన్న పైపులైను పగలడంతో ఒక్కసారిగా పైపు నుంచి నీరు ఎగిసిపడింది. దీంతో ఆరేడు గంటలపాటు శ్రమించి వర ద నీటిని నియత్రించగలిగారు. ఆ తరువాత వారం రోజులకు తిరిగి అక్కడే ఏర్పడిన లీకేజీతో మరోమారు పైపులైను నుంచి వరద నీరు రావడంతో ఇందిరాపార్కు రహదారి జలమయమై ప్రజలు, పాదచారులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిజాం కాలం నాటి పైపులైన్.. జనావాసాల మీదుగా వెళ్లిన ఈ పైపులైన్ దాదాపు ఎనభై ఏళ్ల క్రితం నిజాం హయాంలో వేసినట్టుగా జలమండలి అధికారులు చెబుతున్నారు. హుస్సేన్‌సాగర్ నుంచి కట్టమైసమ్మ దేవాలయం సమీపం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా ఉప్పల్ వరకు ఈ పైపులైన్ ఉన్నట్టు సమాచారం. అప్పట్లో ఈ పైపులైన్ ద్వారా హుస్సేన్‌సాగర్ మంచినీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేవారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పైపులైన్ ద్వారా సరఫరా అవుతున్న నీటిని ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్ ప్రాంతాల్లో మొక్కలు, చెట్ల పెంపకానికి వినియోగిస్తున్నట్టు సమాచారం. -
గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టానికి సర్వం సిద్ధమైంది.
-
గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టానికి సర్వం సిద్ధమైంది.
కీలక ఘట్టం సర్వం సిద్ధం బాలాపూర్-హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర ఉదయం 9 గంటలకే ఊరేగింపు ప్రారంభం నిమజ్జనం త్వరగా పూర్తయ్యేలా చర్యలు నగరవ్యాప్తంగా సీసీ, వీడియో కెమెరాల నిఘా 15 వేల మంది సిబ్బందితో బందోబస్తు : కొత్వాల్ ఏర్పాట్లు పూర్తిచేసిన జీహెచ్ఎంసీ భాగ్యనగరి ఉత్సాహంతో ఊగిపోతోంది. నగరం ‘బోలో గణేష్ మహరాజ్‌కీ’ నినాదాలతో మార్మోగి పోతోంది. శోభాయమానంగా సాగే మహాయాత్ర, నిమజ్జనోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గణనాథులకు ఘనంగా వీడ్కోలు చెప్పడానికి ఉత్సవ నిర్వాహకులు సంసిద్ధమయ్యారు. పోలీసులు నగరవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘గణ’ ఏర్పాట్లివీ... 21 జలాశయాల వద్ద ఏర్పాటు చేసిన క్రేన్లు 71 ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటుచేసిన క్రేన్లు 40 గజ ఈతగాళ్లు 85 పారిశుద్ధ్య సిబ్బంది 2300 అదనపు బస్సులు 360 ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ప్రాంతాలు 66 రవాణా శాఖ మండపాలకు ఇచ్చిన వాహనాలు 1144 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు 8 ప్రధాన ఊరేగింపు మార్గం : కేశవగిరి-నాగుల్చింత-ఫలక్‌నుమా-చార్మినార్-మదీనా- అఫ్జల్‌గంజ్-ఎంజే మార్కెట్-అబిడ్స్-బషీర్‌బాగ్-లిబర్టీ-అప్పర్ ట్యాంక్/ఎన్టీఆర్ మార్గం సికింద్రాబాద్ నుంచి వచ్చేవి: లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి ఈస్ట్‌జోన్ నుంచి వచ్చేవి: ఉప్పల్ నుంచి బయలుదేరి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సికింద్రాబాద్ ఊరేగింపుతో కలుస్తాయి వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చేవి: ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి నగరం వెలుపలే ఆర్టీసీ బస్సులు... సందర్శకులకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్: 040-2320 2813 హెల్ప్‌లైన్ నంబర్లు : 2785 2482, 2785 2486, 90102 03626