ఫిప్టీ..ఫిప్టీ
విశ్వనగరి కలలో సగమే పూర్తి
⇒ కృష్ణా,గోదావరితో గ్రేటర్‌కు జలాభిషేకం
⇒ఆవిష్కరణలకు కేరాఫ్ టీ–హబ్
⇒మెరుగుపడిన సర్కారీ చదువులు
⇒దుర్గంచెరువు ఎలివేటెడ్ కారిడార్‌కు మోక్షం
⇒ రెండుచోట్ల బహుళ వరుసల రహదారులు
⇒ ప్రజల ముంగిటకు ఆర్టీసీ (వజ్ర) సేవలు
⇒ యాదాద్రికి రైల్వేలైన్ పనులు ప్రారంభం
⇒శాంతి భద్రతలు, నేరాల అదుపులో గ్రేట్..
⇒ ‘స్వచ్ఛభారత్’లో బెస్ట్..
⇒నిరంతర విద్యుత్ సరఫరాలో భేష్
⇒పడకేసిన ప్రజారోగ్యం.. పర్యాటకం
⇒వరద ముంపు, నాలాల విస్తరణలో వైఫల్యం
⇒లక్ష్యం చేరని లక్ష ‘డబుల్’ ఇళ్లు
⇒మోడల్ రహదారులకు మోక్షం నిల్..
⇒అధ్వానంగా అంతర్గత రోడ్లు
⇒అటకెక్కిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ
⇒ ప్రహసనంగా హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన
⇒హరితం ఐదుశానికే పరిమితం..
⇒కాలుష్యంతో నగరం ఉక్కిరిబిక్కిరి
⇒‘మెట్రో’ పరుగులు వాయిదా..
మూడేళ్ల పాలనలో విశ్వనగర లక్ష్యాలు సగమే సాకారమయ్యాయి. గ్రేటర్ సిటీజన్ల దాహార్తిని తీర్చడంలో సర్కారు సఫలీకృతమైంది. ప్రభుత్వ విద్య మెరుగుపడింది. దుర్గంచెరువు ఎలివేటేడ్ కారిడార్ పనులకు మోక్షం లభించింది. ఐటీ రంగంలో నవకల్పనలు, ఆవిష్కరణలకు టీ–హబ్ కేరాఫ్‌గా నిలుస్తోంది. సర్కారు వైద్యం దిగజారుతోంది. లక్ష ‘డబుల్’ బెడ్ రూమ్ లక్ష్యంలో సగానికి కూడా చేరలేదు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అటకెక్కింది. హుస్సేన్‌సాగర్, మూసీ నదుల ప్రక్షాళన నీటిమీద రాతలుగానే మిగిలాయి.