‘హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యాన్ని తగ్గించండి’ | high court ruling to telangana government ovar hussain sagar pollution | Sakshi
Sakshi News home page

‘హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యాన్ని తగ్గించండి’

Published Thu, Apr 28 2016 1:54 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

high court ruling to telangana government ovar hussain sagar pollution

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ కాలుష్యాన్ని తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై గురువారం విచారణ సందర్భంగా ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న విధంగా చర్యలను తీసుకోవాలని సూచించింది. అలాగే, గణేశ విగ్రహాల తయారీలో సహజ రంగులనే వాడేలా చర్యలు చేపట్టాలని కోరింది. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేక ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాగా సహజరంగులు వినియోగానికి రూ.5 కోట్లు కేటాయిస్తామని, విగ్రహాల ఎత్తు తగ్గింపుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. తదుపరి విచారణను జూలై 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement