ఫ్లాష్ బ్యాక్ ....న్యూ లుక్ | Flash back .... New Look | Sakshi
Sakshi News home page

ఫ్లాష్ బ్యాక్ ....న్యూ లుక్

Published Mon, Jan 11 2016 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

ఫ్లాష్ బ్యాక్ ....న్యూ లుక్

ఫ్లాష్ బ్యాక్ ....న్యూ లుక్

రిమ్ జిమ్.. రిమ్ జిమ్ హైదరబాద్.. రిక్షావాలా జిందాబాద్.. ఒకప్పటి హిట్‌సాంగ్. ట్యాంక్‌బండ్‌పై ప్రయాణమంటే ఇలాగే ఆహ్లాదంగా.. హాయిగా సాగిపోతుంది. ఓ పక్క పచ్చని చెట్ల వరుస.. మరోపక్క స్వచ్ఛమైన నీటితో తొణికిసలాడే హుస్సేన్‌సాగర్.. దానిపై వీచే పిల్లగాలులు.. అవి మోసుకొచ్చే నీటి తుంపరలు.. గట్టున వెళుతున్నవారిని పలకరిస్తున్నట్టు మోమును తాకుతుంటే అందమైన కలల లోకంలో విహరించిన అనుభూతి.

యాభై ఏళ్ల క్రితం హుస్సేన్‌సాగర్, దాని పరిసరాలు ఎంతో స్వచ్ఛంగా ఉండేవి. ఆనాడు బస్సుల్లో ఇక్కడ ప్రయాణమంటే మనసుకు ఎంతో  హాయిగా ఉండేది. ఇప్పుడు అంత పచ్చదనం లేదు.. నీటి స్వచ్ఛతా లేదు. గట్టున వెళ్లేవారు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఈ అంతరాలకు సాక్ష్యాలు ఈ చిత్రాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement