
మలక్‌పేట(హైదరాబాద్): ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న బస్సులోని కండక్టర్ టికెట్ మెషీన్‌ను గుర్తు తెలియని వ్యక్తి కొట్టేశాడు. మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సూర్యాపేట డిపో బస్సు నగరానికి చేరుకుంది. తిరిగి సూర్యాపేటకు వెళ్లే క్రమంలో దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌లోని 2 నంబర్ ప్లాట్‌ఫాంపై డ్రైవర్ బస్సు ఆపాడు.
కండక్టర్ కృష్ణవేణి టికెట్ మెషీన్ తన బ్యాగులో పెట్టి కంట్రోలర్ వద్ద వెళ్లి వచ్చి చూసేసరికి కన్పించలేదు. బ్యాగులో టికెట్ మెషీన్, సెల్‌ఫోన్, పాస్‌బుక్ ఉన్నట్లు పోలీసులకు కండక్టర్ ఫిర్యాదు చేశారు. కండక్టర్ బస్సు దిగిన తర్వాత డ్రైవర్ కార్గో కేంద్రానికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన ఆగంతకుడు బ్యాగును అపహరించాడు. ఇందంతా మూడు నిమిషాల్లోనే జరిగిందని కండక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌లాల్ తెలిపారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment