మట్టి గణపతికి జై...
- హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 30వేల ప్రతిమలు
- హుస్సేన్‌సాగర్ పరిరక్షణకు కంకణం
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతికే హెచ్‌ఎండీఏ జై కొడుతోంది. హుస్సేన్‌సాగర్, ఇతర చెరువుల పరిర ణక్షకు నగరవాసులు మట్టి వినాయక ప్ర తిమలకే ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్థానే మట్టి గణపతులను మండపాల్లో ప్రతి ష్ఠించేందుకు భక్తులు ముందుకు రావాలని హెచ్‌ఎండీఏ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ కజూరియా, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్‌డి వి.కృష్ణ పిలుపునిచ్చారు.
మట్టి గణేశ్ ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏటా హెచ్‌ఎండీఏ సబ్సిడీపై గణపతులను సరఫరా చేస్తోందన్నారు. ఈ ఏడాదీ రూ.6 లక్ష ల వ్యయంతో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేయిస్తున్నామన్నారు. ఇళ్లల్లో పూజకు వినియోగించేందుకు వీలుగా 30 వేల మట్టి గణపతి ప్రతిమలను తయారు చేస్తున్నామన్నారు. హుస్సేన్‌సాగర్ పరిరక్షణకు ప్రత్యేకంగా లేక్ కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఇందులో విద్యాసంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు.
మట్టి గణపతి ప్రతిమలను అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలోని వివిధ పార్కుల్లో, అలాగే స్వచ్ఛంద సంస్థల సహకారంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 8 అంగుళాల ప్రతిమల ను పండుగకు రెండ్రోజుల ముందు ఒక్కోటి రూ.13కు అందజేస్తామని ఓఎస్‌డి తెలిపారు. 3 అడుగుల ఎత్తు విగ్రహం ధర రూ.1250 గా నిర్ణయించారు. పెద్ద విగ్రహాలను పాఠశాలలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కమ్యూనిటీ గ్రూప్స్, ఉత్సవ నిర్వాహకులకు మాత్రమే అందజేస్తామని చెప్పారు.
మట్టి గణపతి ప్రతిమలు కావాల్సిన వారు లుంబినీపార్కు వద్దనున్న బీపీపీ కార్యాలయంలో గానీ, లేదా 9885311134, 8008889537 నంబర్లలో గానీ సంప్రదించాలని సూచించారు. మట్టి వినాయక విగ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని ఠీఠీఠీ.జిఝఛ్చీ.జౌఠి.జీలో చూడవచ్చు.