Ganapathy
-
అసలీ గణపతి అవతారం నేపథ్యమేమిటి?
గణపతి... భారత మావోయిస్టు పార్టీకి సుదీర్ఘకాలం దళపతిగా పనిచేసిన వ్యక్తి. ఆ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎల్లలు దాటించి జాతీయస్థాయి కల్పించిన వ్యూహకర్తల్లో ప్రథముడు. ప్రపంచంలో టాప్ టెన్ తిరుగుబాటు గెరిల్లా సైన్యాల్లో ఒకటైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. అటువంటి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు అనారోగ్య కారణాలతో ప్రభుత్వానికి లొంగిపోబోతున్నాడని కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మావోయిస్టు పార్టీ ఈ వార్తలను అధికారికంగా ఖండించింది. ప్రభుత్వాలు, పోలీసుల కుట్రలో భాగమే ఇటువంటి వార్తలని ఆ పార్టీ ఆరోపించింది. అసలీ గణపతి అవతారం నేపథ్యమేమిటి? ఈ అవతారంతో ప్రస్తుత సమాజానికి ఉపయోగం ఏదైనా ఉన్నదా? ఆయన లొంగిపోతే ఎవరికి నష్టం.. ఎవరికి లాభం?. ఈ సందర్భంలో తలెత్తే ఇటువంటి సహజమైన సందేహాలు తీరాలంటే ఈ దేశంలో గడిచిన యాభయ్యేళ్లలో సంభవించిన కొన్ని పరిణామాలపై కనీసం ఒక విహంగ వీక్షణం అవసరం. తన యవ్వన తేజస్సుతో సమస్త భూమండలాన్ని వెలిగించిన కాలం మన చరిత్రలో ఒకటుంది. అది ఒక దశాబ్దకాలం. ఇరవయ్యో శతాబ్దంలోని అరవయ్యో దశకం. ఐదు ఖండాల్లోని యువతరం సకల జీవన రంగాల్లోని సంప్రదాయ పోకడలపై ధిక్కారస్వరం వినిపించిన కాలం అది. బ్రిటన్ ఆ కాలాన్ని ‘స్వింగింగ్ సిక్ట్సీస్’ అని పిలిచింది. ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఉద్యమ తాకిడికి ఛార్లెస్ డిగాల్ ప్రభుత్వం గడగడలాడింది. యూరప్ అంతటికీ ఆ ఉద్యమం వ్యాపించింది. అమెరికాలో పౌరహక్కుల కోసం మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నడిచిన కాలం. ఆఫ్రికాలోని కాంగో నుంచి లాటిన్ అమెరికాలో బొలీవియా వరకు చేగువేరా విప్లవ శంఖారావాలు చేసిన కాలం. సంగీత ప్రపంచంలో ధిక్కార స్వరం బీటిల్స్. సంప్రదాయ జీవన విధానాలపై అభిశంసన, అవిశ్వాస ప్రకటనగా వెలుగులోకి వచ్చిన హిప్పీ సంస్కృతి ఈ కాలం వేసిన చిగుళ్లే. ఈ స్థాయిలో యువతరం కాలగమనాన్ని శాసించిన సందర్భం మరొకటి లేదు. అరవయ్యో దశకం ఉద్యమాల ప్రభావం ఆ తర్వాత దశాబ్దంలో కూడా కొనసాగింది. ప్రపంచమంతటా వీస్తున్న కొత్త గాలులు భారతదేశంలో కూడా వ్యాపించాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో రకరకాల సమస్యలపై విద్యార్థులు ఉద్యమించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని విద్యార్థులే నిర్మించి 350 మంది ప్రాణత్యాగం చేశారు. వీటితోపాటు గణపతి అవతారానికి దారితీసిన పూర్వరంగం కూడా సిద్ధమైంది. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీది వందేళ్ల చరిత్ర. 1920లో ఏర్పడింది. ఈ వందేళ్ల చరిత్రలో వ్యూహాత్మక తప్పిదాలు చేయడంలో తన రికార్డులను తనే అనేకసార్లు బద్దలుకొట్టుకున్నది. స్వాతంత్య్రం కోసం దేశ ప్రజలంతా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటున్న సమయంలో ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించి కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు దూరమైంది. ఆ తర్వాత కాలంలో నిజాం సంస్థానంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాల ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో, ట్రావెన్కోర్ సంస్థానంలో ఉన్న పున్నప్రా – వాయిలార్ పోరాటాల ఫలితంగా కేరళలోను, ‘తెభాగా’ రైతు ఉద్యమం కారణంగా బెంగాల్లోనూ, బట్టల మిల్లుల కార్మికులను సమీకరించి బొంబాయిలోనూ ఆ పార్టీ నిలదొక్కుకోగలిగింది. భారత్‌కు మిత్రుడిగా నటిస్తూ వెన్నుపోటు పొడిచిన చైనా మన దేశ భూభాగాలను దురాక్రమణ చేసిన సందర్భంలోనూ కమ్యూనిస్టు పార్టీలోని ఒక వర్గం చైనాకు మద్దతుగా మాట్లాడింది. వీళ్లందరినీ భారత ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. బయటకు వచ్చిన తర్వాత వీళ్లంతా పార్టీని చీల్చి సీపీఎంగా ఏర్పడ్డారు. ప్రపంచవ్యాప్త తిరుగుబాటు గాలుల ప్రభావం సీపీఎంను నిలువునా చీల్చింది. బెంగాల్లో చారుమజుందార్, కానూ సన్యాల్‌ల నాయకత్వంలో నక్సల్బరీ విప్లవ పార్టీ ఆవిర్భవించింది. వీళ్లు నక్సలైట్లుగా వాడుకలోకి వచ్చారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళంలో గిరిజన పోరాటాలు మొదలయ్యాయి. ఉస్మానియాలో జార్జిరెడ్డి అనే ఉద్యమ కెరటం ఎగసిపడింది. అతిచిన్న వయసులోనే ఆయన హత్యకు గురైనప్పటికీ, ఆ తర్వాత రెండు దశాబ్దాలపాటు విద్యార్థి ఉద్యమాలను జార్జిరెడ్డి నామస్మరణే శాసించింది. అనంతర కాలంలో వందలాదిమంది విద్యార్థులు నక్సల్స్ బలగాల్లో చేరిపోయారు. దేశవ్యాప్తంగా వందకు పైగా గ్రూపులుగా ఈ నక్సల్స్ చీలిపోయారు. అనేకమార్లు కూడికలు, తీసివేతలు జరిగిన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీపుల్స్‌వార్ గ్రూప్, బిహార్‌లో పనిచేస్తున్న మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) రెండు బలమైన గ్రూపులుగా నిలదొక్కుకున్నాయి. పీపుల్స్‌వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య నిష్క్రమణ అనంతరం ఆ పార్టీ నాయకునిగా గణపతి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీకి ముందు కరీంనగర్ జిల్లాలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న ముప్పాళ్ల లక్ష్మణరావు, గ్రామసీమల్లో భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విప్లవ కమ్యూనిస్టు పార్టీల పట్ల ఆకర్షితుడయ్యాడు. విద్యార్థులు, యువకులతో కలిసి గ్రామీణ పేదలను ఆర్గనైజ్ చేసి భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నారు. ఈ పోరాటాలు ఎంత బలమైన ముద్ర వేశాయంటే 1978లో జరిగిన ‘జగిత్యాల జైత్రయాత్ర’ సభకు లక్షల సంఖ్యలో గ్రామీణ పేదలు హాజరయ్యేంతగా. ఈ పరిణామంతో ఉత్తర తెలంగాణలోని భూస్వాములంతా గ్రామాలను వదిలేసి పట్టణాలకు వెళ్లిపోయారు. ఈ ప్రాంతంలో కొంతకాలం పీపుల్స్‌వార్ సమాంతర పాలన నడిచింది. గణపతి నాయకత్వంలో మరింత మిలిటెంట్ సంస్థగా పీపుల్స్‌వార్ తయారైంది. నక్సల్స్ – పోలీసు ఎన్కౌంటర్లు, దాడులు, ప్రతిదాడులతో దాదాపు దశాబ్దకాలంపాటు ఉత్తర తెలంగాణ పల్లెలు దద్దరిల్లిపోయాయి. ప్రత్యేకంగా యాంటీ–నక్సల్స్ దళాలను ఏర్పాటు చేసుకుని చివరకు పోలీసులు పైచేయి సాధించారు. పీపుల్స్‌వార్ దళాలు గోదావరి నదిని దాటి దండకారణ్యం వైపు, బస్తర్ అడవులు, చంద్రాపూర్ అడవుల వైపు సాగిపోయాయి. ఇంద్రావతి పరీవాహక ప్రాంతంలో ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గణపతి చొరవతో మరో బలమైన నక్సల్స్ పార్టీగా ఉన్న ఎంసీసీలో పీపుల్స్‌వార్ విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించింది. ఈ ఐక్య పార్టీలోను కీలకమైన నాయకత్వ స్థానాలు పాత పీపుల్స్‌వార్ నేతలకే దక్కాయి. కార్యదర్శిగా గణపతి కొనసాగారు. రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో కార్యదర్శి బాధ్యతల నుంచి గణపతి తప్పుకున్నారు. ఆ స్థానంలో మరో తెలుగువాడైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీని బెంగాల్ దాకా విస్తరింపజేసిన వ్యూహకర్త కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు కూడా తెలుగువాడే. కరీంనగర్ జిల్లా స్వస్థలం. మూడున్నర దశాబ్దాలుగా పాతుకుపోయిన సీపీఎం సర్కార్‌ను కూకటివేళ్లతో సహా పెకిలించిన నందిగ్రామ్ పోరాట రూపశిల్పి కిషన్‌జీ. తాను అధికారంలోకి రావడానికి పరోక్ష కారణమైన కిషన్‌జీని అనంతర కాలంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసి చంపడం కొసమెరుపు. ప్రస్తుతం గంగాతీరం నుంచి గోదావరి తీరం వరకు విస్తరించిన బిహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల మీదుగా తెలంగాణ, ఆం్ర«ధా సరిహద్దుల వరకు మావోయిస్టు పార్టీ ప్రభావం కనబడుతున్నది. ఇప్పుడు దేశంలో ఎన్ని కమ్యూనిస్టు గ్రూపులు పనిచేస్తున్నప్పటికీ మూడు మాత్రమే ప్రధానమైనవి. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలో పనిచేస్తూ, ఎన్నికల్లో పాల్గొంటున్న సీపీఐ, సీపీఎం, సాయుధ పోరాట మార్గాన్ని అనుసరిస్తున్న మావోయిస్టు పార్టీ. అజ్ఞాతంలో పనిచేసే రెండు సాయుధ పార్టీలు విలీనం కాగలిగాయి కానీ, రెండు ఎన్నికల పార్టీలు మాత్రం విలీనం కాలేకపోయాయి. ఇక్కడే బ్యాలెట్ కమ్యూనిస్టులపై బుల్లెట్ కమ్యూనిస్టులు ఒక పాయింట్ స్కోర్ చేశారు. ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేసే ఆస్కారం లేని సోషలిస్టు సమాజ స్థాపన తమ లక్ష్యమని కమ్యూనిస్టులందరూ చెప్పుకుంటారు. అందువలన అణచివేతకు గురయ్యే పీడితవర్గాల ప్రజలు ఈ పార్టీలకు ప్రధాన బలగంగా ఉండాలి. కానీ, నిరుపేద వర్గాలైన దళితులూ, గిరిజనులు, వెనుకబడిన కులాల ప్రజలు మొదలైన పునాది వర్గాల్లో బ్యాలెట్ కమ్యూనిస్టులు నామమాత్రపు ఉనికిని కూడా కాపాడుకోలేకపోతున్నారు. మావోయిస్టు పార్టీ ప్రభావిత అటవీ ప్రాంతాల్లో కనీసం గిరిజన పునాదినైనా మావోయిస్టు పార్టీ కొంతమేరకు ఇంకా నిలబెట్టుకోగలిగింది. ఇక్కడ రెండో పాయింట్‌ను బుల్లెట్ కమ్యూనిస్టులు స్కోర్ చేశారు. దేశంలోని ఖనిజ సంపదలో 75 శాతం మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతంలోనే ఉంది. మావోయిస్టులు లేకుంటే మైనింగ్ మాఫియా తమను అడవుల నుంచి గెంటివేస్తుందనే అభద్రతాభావం గిరిజనుల్లో నెలకొని ఉన్న కారణంగా మావోయిస్టుల ప్రభావం ఇంకా అంతో ఇంతో కొనసాగుతున్నది. అయితే మైదాన ప్రాంత పీడిత వర్గాల్లో వారి పలుకుబడి శూన్యం. పేదవర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలను గుర్తించడంలో, బలపరచడంలో సీపీఐ, సీపీఎంలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫలితంగా పేదవర్గాల మద్దతును కోల్పోయి నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది. దళిత పోరాటాల వెనుక, వెనుకబడిన వర్గాల ఆకాంక్షల వెనుక, స్త్రీవాద ఉద్యమాల వెనుక, వెనుకబడిన ప్రాంతాల డిమాండ్ల వెనుక కమ్యూనిస్టులు గట్టిగా నిలబడలేకపోయారు. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో 50 వేలమంది పేదవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వతలపెట్టిన ఇళ్ల స్థలాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ధనిక రైతుల పక్షాన ప్రస్తుతం మైదాన కమ్యూనిస్టులు నిలబడ్డారు. వారి భాషలోనే చెప్పాలంటే పీడితవర్గాలను వదిలేసి పెటీ బూర్జువా వర్గాల అధికార ప్రతినిధులుగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడింది. భారత కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్రలో నక్సల్స్ దశ ప్రారంభమై యాభై ఏళ్లు దాటుతున్నది. ఈ యాభయ్యేళ్లలో ప్రపంచంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి కారణంగా గతితార్కికవాదం, వర్గ పోరాటమూ, సాయుధ విప్లవం వంటి అంశాల ఔచిత్యం ప్రశ్నార్థకంగా మారింది. తర్వాత కాలంలో వచ్చిన యూరో కమ్యూనిజం, న్యూలెఫ్ట్, లాటిన్ అమెరికా బ్రాండ్ సోషలిస్టు ఉద్యమాలు ఈ భావజాలం నుంచి బయటకు వచ్చాయి. యాభై ఏళ్ల కింద ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రారంభమైన మావోయిస్టు సేనలు చాలావరకు సాయుధ పోరాటానికి స్వస్తి చెప్పాయి. భారత మావోయిస్టు పార్టీ కంటే పెద్దదయిన కొలంబియా ఎఫ్ఏఆర్సీ రెండేళ్ల కిందనే సాధారణ జనజీవితంలోకి వచ్చేసింది. ఇందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి కూడా దోహదపడింది. పట్టుమని పదివేలమంది గెరిల్లాలు లేని మావోయిస్టులు అత్యంత బలోపేతమైన లక్షలాదిమంది సైనికుల బలం కలిగిన భారత ప్రభుత్వంతో సాయుధ పోరాటం చేయడం అసంభవం. మైదాన ప్రాంతాల్లో పార్టీ పలుకుబడి పెరిగే అవకాశాలు మృగ్యం. ఇటువంటి పరిస్థితుల్లో కొలంబియా మాదిరిగా ఆయుధాలు అప్పగించి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో విలీనం కావడమే తెలివైన మార్గం. అయితే ఇందుకు ప్రభుత్వాల చిత్తశుద్ధి అవసరం. ప్రభుత్వాలకు మావోయిస్టులను వేటాడటమే లక్ష్యంగా ఉన్నంతకాలం ఈ పరిణామం సంభవించదు. ఈ దశలో గణపతి, మరికొందరు అగ్రనేతలు లొంగిపోతున్నారనే ప్రచారంపై మావోయిస్టుల అధికార ప్రకటనే నిజం కావచ్చు. అలాకాకుండా వేలాదిమంది సహచరులను వదిలేసి కొద్దిమంది అగ్రనేతలు మాత్రమే లొంగిపోతే యాభయ్యేళ్ల విప్లవ పోరాటానికి విషాదకరమైన ముగింపుగానే భావించాలి. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
‘గణపతిని మావోయిస్టు పార్టీ వదులుకోదు’
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటు వార్తల్లో నిజం లేదని మావోయిస్టు పార్టీ మాజీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న స్పష్టం చేశారు. పోలీసులకు గణపతి లొంగిపోతున్నాడని, ఆ క్రమంలోనే సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. ఈ మేరకు ‘సాక్షి’తో మాట్లాడిన జంపన్న.. ‘గణపతికి అనారోగ్యం సమస్యలుంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చూసుకుంటుంది. పోలీసుల స్టేట్మెంట్లో కూడా వాళ్లు వస్తే మేము సహకరిస్తామని మాత్రమే చెప్పారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేవు. గణపతిని మావోయిస్టు పార్టీ వదులుకోదు.మావోయిస్ట్ పార్టీ ఎదుగుదలకు గణపతి ఎంతో కృషిచేశాడు. గణపతి లొంగుబాటు కేవలం ప్రచారం మాత్రమే. డీజీపీ ఏజన్సీ పర్యటనకు గణపతి లొంగుబాటుకు సంబంధం లేదు. తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ ఉనికి కారణంగానే డీజీపీ పర్యటన ఉండొచ్చు. గణపతికి విదేశాల్లో చికిత్స అవాస్తవం. గణపతి లొంగిపోతాడని నేను అనుకోవడం లేదు’ అని జంపన్న తెలిపారు. గణపతి ఆచూకీపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, త్వరలో లొంగిపోతాడని వస్తున్న వార్తలపై ఏపీ– తెలంగాణతోపాటు జాతీయ మీడియాలోనూ వరుస కథనాలు వస్తున్నాయి. తెలంగాణ పోలీసుల సహకారం మేరకు గణపతి లొంగుబాటుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, లొంగుబాటులోని సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఓవైపు గణపతి ఇప్పటికే లొంగిపోవడానికి అంగీకరించాడని, మరికొన్ని రోజుల్లో లొంగుబాటు చూపుతారంటూ సాగుతున్న ప్రచారంపై పోలీసులు పెదవి విప్పడంలేదు. ఆయన లొంగిపోతే మాత్రం స్వాగతిస్తామని, ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని భరోసా మాత్రమే ఇస్తున్నారు. -
లొంగిపోతాడన్న వార్తల్లో వాస్తవమెంత?
-
గణపతి ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు ఆచూకీపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, త్వరలో లొంగిపోతాడని వస్తున్న వార్తలపై ఏపీ– తెలంగాణతోపాటు జాతీయ మీడియాలోనూ వరుస కథనాలు వస్తున్నాయి. తెలంగాణ పోలీసుల సహకారం మేరకు గణపతి లొంగుబాటుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, లొంగుబాటులోని సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంగీకరించినంత మాత్రాన ఈ వ్యవహారానికి తెరపడుతుందా అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. 13 రాష్ట్రాలు, 2 జాతీయ దర్యాప్తు సంస్థలు గణపతి నేతృత్వంలోనే దేశంలో మావోయిస్టు పార్టీ బాగా విస్తరించిందనే అభిప్రాయం ఉంది. దేశ విదేశాల నుంచి నిధులను సమీకరించడంలో, పార్టీ కేడర్‌కు ఆధునిక టెక్నాలజీ, నవీన ఆయుధాలు సమకూర్చడంలో, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీ విధానాలు మార్చుకోవడంలో ఆయన వ్యూహాలు చాలా ముందుచూపుతో ఉంటాయి. అనవసర హింసాచర్యలకు ఈయన వ్యతిరేకం. పీపుల్స్ వార్ గ్రూపు (పీడబ్ల్యూజీ), మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా(ఎంసీసీఐ) విలీనంలో గణపతి కీలక పాత్ర పోషించారు. 13 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని నడిపించిన గణపతిపై వేలాది కేసులున్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కోసం జాతీయ దర్యాప్త సంస్థ(ఎన్.ఐ.ఏ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్(రా) వంటి జాతీయదర్యాప్తు సంస్థలు వెదుకుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం.. గణపతి లొంగిపోవడానికి అంగీకరించాడునుకున్నా.. ఒక్క తెలంగాణ పోలీసులు పాత కేసులు మాఫీ చేసినా.. మిగిలిన 12 రాష్ట్రాల పోలీసులు కేసుల ఎత్తివేతకు సుముఖంగా ఉంటారా? ఎన్,ఐ.ఏ, రా వంటి సంస్థల విచారించకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులన్నీ ఎత్తేయాలంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అదేవిధంగా 43 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెట్టి, దండకారణ్యంలో సమాంతర ప్రభుత్వాలు నడిపిన గణపతి తన లొంగుబాటుకు షరతులకు విధించకుండా ఉంటారా? వాటిని కేంద్రం ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తారా? అన్నది అనుమానమే. ఖండించని మావోయిస్టు పార్టీ.. ఈ మొత్తం వ్యవహారంలో ఇటు పోలీసులు, అటు మావోయిస్టులు మౌనం వహించడం అనేక సందేహాలకు, అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు గణపతి ఇప్పటికే లొంగిపోవడానికి అంగీకరించాడని, మరికొన్ని రోజుల్లో లొంగుబాటు చూపుతారంటూ సాగుతున్న ప్రచారంపై పోలీసులు పెదవి విప్పడంలేదు. ఆయన లొంగిపోతే మాత్రం స్వాగతిస్తామని, ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని భరోసా ఇస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం పోలీసులు వేసిన ఎత్తగడ అన్న ప్రచారమూ ఉంది. మావోయిస్టు కేడర్‌ను గందరగోళంలో నెట్టేయడానికి, అగ్రనేతల ఫోన్ సంభాషణలను విని, గణపతి ఉనికి కనుక్కునేందుకు బిగించిన ఉచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గణపతి లొంగిపోనున్నారనే ప్రచారాన్ని ఖండిస్తూ ఇంతవరకూ మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. లొంగిపోతాడని అనుకోవడం లేదు: జంపన్న సాక్షి, హైదరాబాద్: గణపతి లొంగుబాటుపై మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న స్పందించారు. గణపతి వంటి అగ్రనేత లొంగిపోతాడని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తల విశ్వసనీయతపై కూడా అనుమానాలు వ్యక్తంచేశారు. గత 40 ఏళ్లుగా గణపతి తన కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలూ కలిగి లేడని, ఈ నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. -
మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి ఆరోగ్యం క్షీణించిందని, ఆయన త్వరలోనే జన జీవన స్రవంతిలో కలుస్తారన్న ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఆయన విదేశాలకు దేని కోసం వెళ్లారు?.. అక్కడి నుంచి ఎప్పుడొచ్చారు?.. ఎందుకు వచ్చారు?.. అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకడంలేదు. మావోయిస్టు కేంద్ర కార్యదర్శి పదవి నుంచి 2018 నవంబర్‌లో తప్పుకున్నాక గణపతి ప్రస్థానం సందేహంలో పడింది. ఆయన స్థానంలో నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ సీనియర్ పోలీసు ఉన్నతాధికారి గణపతి ఆచూకీపై సంచలన విషయం వెల్లడించారు. గణపతి ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నుంచి బిహార్ మీదుగా నేపాల్ వెళ్లాడని, అక్కడ నుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్లిపోయాడని తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. మావోయిస్టుల టెలిఫోన్ సంభాషణలపై నిఘా ఉంచగా తమకు ఈ విషయం తెలిసిందని ఆయన అన్నారు. చివరిసారిగా కనిపించింది అక్కడే..! ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కోసం పలు రాష్ట్రాల పోలీసులే కాకుండా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా అన్వేషిస్తోంది. చివరిసారిగా 2017లో బిహార్‌లోని గయ ప్రాంతంలో సంచరించినట్లుగా నిఘా వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. నేపాల్ మీదుగా ఫిలిప్పీన్స్‌కు వెళ్లడం కోసమే ఆయన అక్కడ ఉన్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. గణపతిపై ఎన్ఐఏ రూ.15 లక్షల రివార్డు ప్రకటించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపితే ఆయన తలపై రూ.3.6 కోట్ల వరకు రివార్డు ఉంది. ఒకవేళ గణపతి విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించి ఉంటే.. సదరు పోలీసు అధికారి కథనం నమ్మదగినదే అని పలువురు అంగీకరిస్తున్నారు. భారతీయులంతా బిహార్ ద్వారా రోడ్డు మార్గంలో నేపాల్‌కు వెళ్లడం సర్వసాధారణమే. అక్కడి నుంచి విమానాల్లో పలు దేశాలకు వెళ్లడం పెద్ద విషయమేమీ కాదు. భారతదేశంలో అశాంతికి పాల్పడే అంతర్జాతీయ ఉగ్ర సంస్థల సభ్యులు ఇదే పంథాను అనుసరిస్తారు. (చదవండి: కీలక నిర్ణయం తీసుకోనున్న మావో గణపతి) నేడు గణపతి.. నాడు కత్తుల సమ్మయ్య గతంలో లొంగిపోయిన కరీంనగర్ జిల్లా కాచాపూర్‌కు చెందిన కత్తుల సమ్మయ్య కూడా నక్సలైట్లలో ఉండగా పలుమార్లు విదేశాలకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. అదే క్రమంలో 1993లో దళంతో విభేదించి.. తోటి సభ్యులను కాల్చిచంపిన అనంతరం అతడు పోలీసులకు లొంగిపోయాడు. తరువాత హైదరాబాద్‌లో కొందరు అవినీతి ఉన్నతాధికారుల పరిచయాలతో రియల్ ఎస్టేట్ వ్యవహారాలతో పాటు అనేక దందాలు నడిపాడు. 2001లో కొలంబోలో జరిగిన విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఫిలిప్పీన్స్‌కు ఎందుకు వెళ్లాడు? గణపతి.. ఫిలిప్పీన్స్‌కు వెళ్లి ఉంటే.. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనారోగ్యంతో ఉన్న ఆయన చికిత్స కోసమే వెళ్లారా? అక్కడ ఆయనకు ఆశ్రయం కల్పించిందెవరు? అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. జీవితంలో అధిక భాగం దండకారణ్యంలో ఉన్న గణపతికి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చక్కటి సంబంధాలు ఉన్నాయన్న పేరుంది. పార్టీకి పలువురు ప్రవాసీయుల నుంచి రూ.కోట్ల చందాలు తీసుకురావడంలో ఆయనది కీలకపాత్రగా పలువురు పేర్కొంటారు. నేపాల్, ఫిలిప్పీన్స్‌లోనూ మావోయిస్టు పార్టీ క్రియాశీలకంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చిన అంశాలుగా పరిశీలకులు భావిస్తున్నారు. మంచి వ్యూహకర్త, సిద్ధాంతకర్త అయిన గణపతి.. మావోయిస్టు పార్టీకి అంతర్జాతీయ సంబం ధాల బలోపేతం కోసం ఫిలిప్పీన్స్ వెళ్లి ఉండొచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. (చదవండి: గణపతి లొంగుబాటుకు లైన్‌క్లియర్..!) -
గణపతి లొంగుబాటుకు లైన్‌క్లియర్..!
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుకు పోలీసుల నుంచి లైన్‌క్లియర్ అయ్యింది. 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ఉద్యమం నుంచి బయటకు వచ్చిపోలీసులకు లొంగిపోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసు శాఖ గణపతి సహా ఎవరు లొంగిపోయినా స్వాగతిస్తామని ప్రకటించారు. గణపతి లొంగిపోవాలి అనుకుంటే కుటుంబసభ్యుల, బంధువులతో సంప్రదించవచ్చని తెలిపారు. పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. రానున్న రెండురోజుల్లో లొంగిపోయే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు, ఆయన అంగరక్షకులు కూడా లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామానికి చెందిన గణపతి 40 ఏళ్ల పాటు విప్లయోధ్యమంలో కీలక పదవులు అనుభవించారు. అనారోగ్య కారణాలతో 2018 లో కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన అనంతరం నంబాల కేశవరావు కేంద్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అయితే లొంగుబాటుపై ఆయన తీసుకునే అనూహ్య నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి వయసురిత్యా పోరాటానికి స్వస్తి పలికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
కీలక నిర్ణయం తీసుకోనున్న మావో గణపతి
సాక్షి, కరీంనగర్: మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోయేందుకు యత్నిస్తున్నట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి వయసురిత్యా పోరాటానికి స్వస్తి పలికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్న ఆయన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా, 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మోకాళ్ల నొప్పులు, మధుమేహంతో సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామం. ఇక ఎంపీసీ, నక్సలైట్ పార్టీల విలీనం తర్వాత కేంద్ర కార్యదర్శిగా గణపతి పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2018 లో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన అనంతరం నంబాల కేశవరావు కేంద్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అనారోగ్య సమస్యలతో సతమవుతున్న గణపతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి రాగానే లొంగుబాటుకు సిద్ధమవుతారని గత రాత్రి నుంచి కరీంనగర్ వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన లొంగుబాటు నిజమే అయితే విప్లవోద్యమ చరిత్రలో పెద్ద కుదుపుగానే భావించాలి. మరోవైపు గణపతితోపాటు మరో నలుగురు మవోయిస్టు నేతలు కూడా లొంగుబాటు దిశగా పయనిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. (చదవండి: మావోయిస్టు కేంద్ర కమిటీ.. 10 మంది వారే..!) -
శ్వేతార్క హనుమాన్
గణపతి స్వరూపమైన తెల్లజిల్లేడు వేరును యథాతథంగా శ్వేతార్క గణపతిగా పూజించడం తెలిసిందే. అరుదుగా శ్వేతార్క మూలంపై గణపతి ఆకారం సహజసిద్ధంగా ఏర్పడుతూ ఉంటుంది. అది మరింత విశేషమైనదిగా తలుస్తారు. వినాయకుని విశిష్టతలతో కూడిన శ్వేతార్కమూలంపై ఆంజనేయుని రూపు తీర్చిదిద్దించి, దానిని ఆంజనేయ మూల మంత్రంతో ప్రాణప్రతిష్ఠ జరిపి పూజించడం ద్వారా పిల్లలకు బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి. జాతకరీత్యా ఏర్పడే బాలారిష్టాలు పన్నెండేళ్ల వయసు నిండేంత వరకు పిల్లలను పీడిస్తాయి. బాలారిష్టాల కారణంగా పిల్లలు తరచు ఆరోగ్య సమస్యలకు, ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. లేనిపోని భయాలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి దోషాలను నివారించడానికి శ్వేతార్క హనుమాన్ ఆరాధన బాగా ఉపయోగపడుతుంది. తెల్లజిల్లేడు వేరుపై ఆంజనేయుని రూపును తయారు చేయించి, సిందూరంతో అలంకరించి, పూజ మందిరంలో ఉంచి నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించాలి. శ్వేతార్క హనుమాన్ అర్చనలో భాగంగా ఉభయ సంధ్యల్లోనూ హనుమాన్ చాలీసాను పదకొండుసార్లు చొప్పున పఠించాలి. – పన్యాల జగన్నాథ దాసు -
నిజాయితీకి బలిపీఠం..
డీవైఎస్పీ కల్లప్ప ఆత్మహత్య సంఘటన మరవక ముందే మరో డీవైఎస్పీ గణపతి బలవనర్మణానికి పాల్పడటంతో సిద్దు సర్కార్ సంకట స్థితిలో పడింది. రాజకీయ ఒత్తిళ్లతోనే నిజాయితీ అధికారులు బలవతున్నారని విపక్షాలు ధ్వజమెత్తున్నాయి. మొన్నటికి మొన్న ఐఏఎస్ అధికారి డీకే రవి ఆత్మహత్య, నిన్న డీవైఎస్పీ కల్లప్ప, నేడు గణపతి ఆత్మహత్య వ్యవహారం ఉన్నతాధికారుల్లో ఆందోళన నెలకొంది. విపరీతమైన రాజకీయ జోక్యంతో ఎలా విధులు నిర్వహించాలని అధికారులు మదనపడుతున్నారు. సాక్షి, బెంగళూరు : నిజాయితీ, కార్యదక్షత కలిగిన ఐఏఎస్ అధికారిగా పేరున్న డీ.కే రవి గత ఏడాది మార్చిలో బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. నిర్మాణ రంగంలోని ఓ సంస్థ పన్నులు ఎగ్గొట్టిన విషయానికి సంబంధించి నివేదిక తయారు చేస్తుండగా ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. సదరు నిర్మాణ రంగంలోని సంస్థలో కొంత మంది అమాత్యులకు కూడా ‘షేర్’ ఉండటంతో వారి ఒత్తిళ్ల వల్ల డీ.కే రవి బలవన్మరణానికి పాల్పడ్డారని సమాచారం. మొన్నటికి మొన్న కూడ్లగి డీ.ఎస్పీ అనుపమా షణై కూడా రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేశారు. లిక్కర్ మాఫియాపై ఉక్కుపాదం మోపినందుకు తనపై హోంశాఖలోని ఉన్నతాధికారులతో పాటు మాజీ మంత్రి పరమేశ్వర్‌నాయక్ ఒత్తిళ్లు తెచ్చారని, వాటిని తట్టుకోలేకనే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు బహిరంగంగా పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో పాటు మాజీ హోంశాఖ మంత్రి, ప్రస్తుత బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ తన చావుకు కారణమని ఆత్మహత్య చేసుకోక ముందు మంగళూరు ఐజీ కార్యాలయంలో పనిచేస్తున్న డీవైఎస్పీ గణపతి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ డీఎస్పీ కల్లప్ప ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో సైతం ఓ ఎస్పీ ఒత్తిళ్లు కూడా కారణమనే వాదన వినిపిస్తోంది. వారిపై చర్యలేవి... ఉగ్రవాదిని తుదముట్టించడానికి వెళ్లిన ఎస్ఐ మల్లికార్జున బండే సదరు ‘ఆపరేషన్’లో పాల్గొన్న హోంశాఖలోని ఐపీఎస్ అధికారి తూటాకు బలైనట్లు ఆ శాఖలోని సిబ్బందే చెబుతున్నారు. సదరు ఐపీఎస్ అధికారిపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తాను చెప్పినట్లు వినటం లేదన్న కక్షతోనే సదరు ఉన్నతాధికారి నిజాయితీ అధికారిగా పేరొందిన మల్లికార్జున బండేను పొట్టన పెట్టుకున్నట్లు ఆయన సహచర ఉద్యోగులు చెబుతున్నారు. కేవలం హోంశాఖలోని అధికారులకే కాకుండా ఐఏఎస్ అధికారులు కూడా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న విషయాలు ఇటీవల బయటపడ్డాయి. ముఖ్యంగా సిద్ధరామయ్య ఆప్తుడిగా పేరొందిన కే.మరిగౌడ ఓ తహశీల్దార్ పోస్టింగ్ విషయంలో ఏకంగా మైసూరు కలెక్టర్ శిఖపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆమె మరిగౌడపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినాఎటువంటి చర్యలూ తీసుకోవక పోవడం గమనార్హం. ఇలా వరుసగా రాష్ట్రంలో ఉన్నతాధికారులు ఒత్తిళ్లతో పనిచేస్తుండటం వల్ల పాలన అగమ్యగోచరంగా తయారైందన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..... ఆత్మహత్యకు పాల్పడిన గణపతి అంత్యక్రియలు ఆయన స్వస్థలం సోమవారపేట తాలూకా రంగసముద్రలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. భార్య పావని ఇద్దరు కుమారులు, కుటుంబ సభ్యులు,రాజకీయనాయకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గుమాస్తాగా పనిచేయాల్సి వస్తోంది... ‘మంగళూరు చర్చ్ పై దాడి జరిగినప్పుడు నన్ను అన్యాయంగా సస్పెండ్‌చేశారు. యశ్వంత్‌పుర ఎన్కౌంటర్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఓ రౌడీని విధిలేని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేశాను. ఇందుకు నన్ను సస్పెండ్‌చేశారు. ఈ రెండింటి విషయంలో చాలా కాలంగా నాపై ఉన్న శాఖపరమైన విచారణల నుంచి నేను క్లీన్చిట్ పొందాను. ఎప్పుడో రావాల్సిన డీఎస్పీ ప్రమోషన్ మూడు నెలల ముందు వచ్చింది. అలస్యంగా ప్రమోషన్ రావడానికి మంత్రి కే.జేజార్జ్, ఉన్నతాధికారులు కారణం. చాలా చోట్ల డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నా నాకు ఐజీ కార్యాలయంలో డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ నేను గుమాస్తాగా ఒత్తిడితో పనిచేయాల్సి వస్తోంది.’ అని చనిపోవడానికి ముందు గణపతి తనకు స్నేహితుడైన ఓ లాయర్ వద్ద చెప్పుకుని బాధపడినట్లు తెలిసింది. రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు: ఇదిలా ఉండగా గణపతి ఆత్మహత్య నేపథ్యంలో రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాయి. మడికెర, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకో నిర్వహించారు. -
మావోలపై గిరిజనుల తిరుగుబాటు!
డిప్యూటీ కమాండెంట్, ఇద్దరు మిలీషియా సభ్యుల హత్య విశాఖ ఏజెన్సీలో సంచలనం చింతపల్లి: విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో ఆదివారం మావోయిస్టుల మీద గిరిజనులు తిరుగుబాటు చేసి.. ముగ్గురు నక్సలైట్లను హతమార్చినట్లు పలువురు గిరిజనులు, పోలీసులు మీడియాకు వెల్లడించారు. మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్ పేరుతో ఒక గిరిజనుడిని హత్యచేసి, మరొకరిని శిక్షించేం దుకు ప్రయత్నించటంతో వారిపై ఆగ్రహిం చిన గిరిజనులు మూకుమ్మడిగా తిరుగుబా టు చేశారని.. మావోయిస్టు దళ డిప్యూటీ కమాండెంట్‌ను, మరో ఇద్దరిని చంపేశారని వారు వివరించారు. ఈ సంఘటనతో విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీ ఉద్రిక్తంగా మారింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి.. ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొన్న గిరిజనులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలివీ... విశాఖ జిల్లా జి.మాడుగుల మండలానికి చెందిన కల్కి భవాని దీక్ష గురుస్వామి సింహాచలం శిద్ధి ఆదివారం కోరుకొండలో పూజలు నిర్వహించి.. బలపం గ్రామానికి చెందిన మాలధారుడు సంజీవరావుతో కలిసి ద్విచక్రవాహనంపై జి.మాడుగుల బయలుదేరారు. అక్కడ మాటువేసిన మావోయిస్టు దళ డిప్యూటీ కమాండెంట్ శరత్, మిలీషియా సభ్యులు ఆనంద్, రాజేశ్వరరావు, గణపతిలు రెండు ద్విచక్రవాహనాల్లో వెంబడించారు. రాళ్లగెడ్డ సమీపంలో సింహాచలం, సంజీవరావులను అదుపులోకి తీసుకుని.. సంజీవరావును అక్కడికక్కడే తుపాకితో కాల్చి చంపేశారు. గురుస్వామి సింహాచల శిద్ధిని చేతులు వెనక్కి కట్టి కోరుకొండ తీసుకొచ్చారు. అక్కడ ప్రజాకోర్టు నిర్వహించి ఆయన్ని చంపేయాలని మావోయిస్టులు భావించారు. అప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో కల్కి భవాని దీక్షాధారులు చేరుకున్నారు. తమ గురుస్వామి సింహాచలం శిద్ధిని మావోయిస్టులు హత్యచేయనున్నారని గ్రహించి ఆ దీక్షాధారులంతా ఒక్కసారిగా మావోయిస్టులపై తిరగబడ్డారు. ముందుగా మావోయిస్టు డిప్యూటీ కమాండెంట్ శరత్‌పై దాడిచేసి చంపేశారు. దీంతో దళసభ్యుడు ఆనంద్ ఏకే47 తుపాకితో భక్తులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఆగ్రహంతో రగిలిపోతున్న భక్తులు అతడిపైకి వెళ్లి ఏకే 47ను లాక్కుని గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరపటంతో ఆనంద్ సమీప అడవుల్లోకి పరారయ్యాడు. మిలీషియా సభ్యులు రాజేశ్వరరావు, గణపతి పరారయ్యేందుకు ప్రయత్నించగా భక్తులు వెంటాడి రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. రాజేశ్వరరావు మృతదేహాన్ని సమీప కాలువలో పడేశారు. సమీపంలోని అడవుల్లో ఉన్న మరో 15 మంది వరకు మావోయిస్టులు గిరిజనుల ఆగ్రహాన్ని చూసి పరారయ్యారు. ఈ ఘటనలపై ఆదివారం రాత్రి కొందరు గిరిజనులు చింతపల్లి పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. సోమవారం ఉదయం డీఎస్పీ అశోక్‌కుమార్ సిబ్బందితో వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకుని చింతపల్లి తీసుకొచ్చి పోస్టుమార్టం చేయించారు. డీఐజీ ఉమాపతి, ఎస్పీ కోయ ప్రవీణ్, ఓఎస్డీ విశాల్‌గున్నీ సోమవారం చింతపల్లి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. శరత్ డైరీ స్వాధీనం: ఘటనా స్థలంలో మావోయిస్టు నేత శరత్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీని పరిశీలించగా మావోయిస్టుల పథకం బయటపడినట్లు చెప్తున్నారు. సంజీవరావు ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో గిరిజనులను మావోయిస్టు ఉద్యమానికి దూరం చేస్తున్నారని, గిరిజనులకు డబ్బులు ఆశచూపి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని డైరీలో ఉంది. అందుకే సంజీవరావును చంపేయాలని దళం నిర్ణయించినట్లు రాసివుంది. గిరిజనుల చేతుల్లో హతమైన మావోయిస్టు నేత శరత్‌ది కొయ్యూరు మండలం కన్నవరం. మిలీషియా సభ్యులు రాజేశ్వరరావుది గన్నెలబంద. గణపతిది పెద్దపల్లి గ్రామం. గిరిజనులు మూకుమ్మడిగా ఆగ్రహంతో ఎదురుదాడి చేసి ముగ్గురిని హతమార్చడం మావోయిస్టులకు ఎదురుదెబ్బగానే పరిగణిస్తున్నారు. మావోయిస్టులు ప్రజల మద్దతు కోల్పోయారు: ఏపీ డీజీపీ మావోయిస్టులు ప్రజల మద్దతు కోల్పోయారని, వారిపై ప్రజలే తిరగబడి చంపే పరిస్థితిని తెచ్చుకున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు అన్నారు. విశాఖ ఏజెన్సీలో గిరిజనుల తెగువ అభినందనీయమని విజయవాడలో సోమవారం ఆయన అన్నారు. -
మట్టి గణపతికి జై...
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 30వేల ప్రతిమలు హుస్సేన్‌సాగర్ పరిరక్షణకు కంకణం సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతికే హెచ్ఎండీఏ జై కొడుతోంది. హుస్సేన్‌సాగర్, ఇతర చెరువుల పరిర ణక్షకు నగరవాసులు మట్టి వినాయక ప్ర తిమలకే ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్థానే మట్టి గణపతులను మండపాల్లో ప్రతి ష్ఠించేందుకు భక్తులు ముందుకు రావాలని హెచ్ఎండీఏ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ కజూరియా, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డి వి.కృష్ణ పిలుపునిచ్చారు. మట్టి గణేశ్ ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏటా హెచ్ఎండీఏ సబ్సిడీపై గణపతులను సరఫరా చేస్తోందన్నారు. ఈ ఏడాదీ రూ.6 లక్ష ల వ్యయంతో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేయిస్తున్నామన్నారు. ఇళ్లల్లో పూజకు వినియోగించేందుకు వీలుగా 30 వేల మట్టి గణపతి ప్రతిమలను తయారు చేస్తున్నామన్నారు. హుస్సేన్‌సాగర్ పరిరక్షణకు ప్రత్యేకంగా లేక్ కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఇందులో విద్యాసంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. మట్టి గణపతి ప్రతిమలను అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలోని వివిధ పార్కుల్లో, అలాగే స్వచ్ఛంద సంస్థల సహకారంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 8 అంగుళాల ప్రతిమల ను పండుగకు రెండ్రోజుల ముందు ఒక్కోటి రూ.13కు అందజేస్తామని ఓఎస్డి తెలిపారు. 3 అడుగుల ఎత్తు విగ్రహం ధర రూ.1250 గా నిర్ణయించారు. పెద్ద విగ్రహాలను పాఠశాలలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కమ్యూనిటీ గ్రూప్స్, ఉత్సవ నిర్వాహకులకు మాత్రమే అందజేస్తామని చెప్పారు. మట్టి గణపతి ప్రతిమలు కావాల్సిన వారు లుంబినీపార్కు వద్దనున్న బీపీపీ కార్యాలయంలో గానీ, లేదా 9885311134, 8008889537 నంబర్లలో గానీ సంప్రదించాలని సూచించారు. మట్టి వినాయక విగ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని ఠీఠీఠీ.జిఝఛ్చీ.జౌఠి.జీలో చూడవచ్చు.