మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ శుద్ధి పనులపై స్టే విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు గురువారం నిలుపుదల చేసింది. ఈ మేరకు జస్టిస్ నూతి రామ్మోహనరావు, జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శుద్ధి పనుల పేరుతో సాగర్‌లోని నీటిని తోడి, ఆ జలాలను మూసీలోకి వదులుతున్నారని స్వచ్ఛంద సంస్థ ‘సోల్’ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి విదితమే.
విచారణ జరిపిన ట్రిబ్యునల్, ఆ పనులపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులపై జీహెచ్‌ఎంసీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ వ్యాజ్యాలను గురువారం విచారించింది. జీహెచ్‌ఎంసీ తరపు ఏజీ కె.రామకృష్ణారెడ్డి విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.
హుస్సేన్‌సాగర్ శుద్ధిపై హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులు నిలిపివేత
Published Thu, May 7 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement