నేడే గణేశ్ నిమజ్జనం | Ganesh Immersion today | Sakshi
Sakshi News home page

నేడే గణేశ్ నిమజ్జనం

Published Mon, Sep 8 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

నేడే గణేశ్ నిమజ్జనం

నేడే గణేశ్ నిమజ్జనం

సర్వం సిద్ధం చేసిన అధికారులు  జంట కమిషనరేట్లలో 39,400 మంది
పోలీసు బందోబస్తు  900 సీసీ కెమెరాల నిఘాలో శోభాయాత్ర

 
సందర్శకుల వాహనాల పార్కింగ్ స్థలాలివీ
 
ఖైరతాబాద్ జంక్షన్‌లోని ఇన్‌స్ట్యూట్  ఆఫ్ ఇంజనీర్స్
ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్
ఆనంద్‌నగర్ కాలనీ, రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం
బుద్దభవన్ వెనక వైపు
గోసేవాసదన్
లోయర్‌ట్యాంక్‌బండ్
  కట్టమైసమ్మ దేవాలయం
  ఎన్టీఆర్ స్టేడియం
నిజాం కళాశాల
  పబ్లిక్ గార్డెన్స్

 
నగర పోలీసు కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు
 
 040-27852482,27852486, 9010203626
 సైబరాబాద్ పోలీసు కంట్రోల్ రూమ్
 ఫోన్ నంబర్ 9490617100
 అత్యవసరమైతే ఫిర్యాదుల్ని
 040-21 11 11 11 నంబరుకు  తెలియజేయవచ్చు.

 
 హైదరాబాద్: నవ రాత్రులు పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు గ్రేటర్ పరిధిలోని 23 చెరువుల వద్ద అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జంట కమిషనరేట్ల పరిధిలో బందోబస్తులో  39,400 మంది పోలీసులు పాల్గొంటున్నారు. శోభాయాత్ర కొనసాగే అన్ని రహదారులపై 900 నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాన శోభాయాత్ర బాలాపూర్‌లో ప్రారంభమవుతుంది. దీనికి అనుబంధంగా ఉప్పల్, సికింద్రాబాద్, మల్లేపల్లి నుంచి వచ్చే శోభాయాత్రలు మొజంజాహి మార్కెట్, లిబర్టీ చౌరస్తా వద్ద ప్రధాన యాత్రతో కలుస్తాయి. గణేశ్ నిమజ్జనం సజావుగా సాగేందుకు జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎండీఏ, పోలీసు, తదితర విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా  సిబ్బందిని నియమించారు. యాత్ర సజావుగా సాగేందుకు  జీహెచ్‌ఎంసీలోని ఆయా విభాగాలు ప్రతి 3-4 కి.మీ.లకు ఒక టీమ్(గణేశ్ యాక్షన్ టీమ్) చొప్పున ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ఆయా చౌరస్తాలలో ఆంక్షలు, మళ్లింపులు చేపట్టారు. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం తిలకించేందుకు సుమారు 15 లక్షలకుపైగా భక్తులు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించారు. సోమవారం దాదాపు అరవై వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా. స్పెషల్ ప్రొటెక్షన్ టీమ్‌లు సైతం విధుల్లో పాల్గొననున్నాయి. దాదాపు రూ. 11.50 కోట్లతో అవసరమైన ఏర్పాట్లు చేశారు. నగరంలో  310 అత్యంత సమస్యాత్మక ం, 605 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.  ఈ ప్రాంతాలలో ప్రత్యేక నిఘాతో పాటు పెట్రోలింగ్, పికెట్లు ఏర్పాటు చేశారు.

{పతి 3-4 కి.మీ.లకు ఒక గణేశ్ యాక్షన్ టీమ్(జీఏటీ) ఏర్పాటు   జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగం నుంచి ఒక్కో జీఏటీ టీమ్‌లో 1 శానిటరీ సూపర్‌వైజర్, ముగ్గురు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, 21 మంది కార్మికులుంటారు.ఈ టీమ్‌లు రెండు షిఫ్టులుగా పనిచేస్తాయి.

మొత్తం జీఏటీలు : 162
శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు : 364 మంది
శానిటరీ సూపర్‌వైజర్లు : 70
మొత్తం కార్మికులు : 2,763


ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో..

యాత్ర సజావుగా సాగేలా రహదారులు ఎగుడు దిగుళ్లు లేకుండా, గుంతలు లేకుండా మరమ్మతులు  నీటి నిల్వ ప్రాంతాల మరమ్మతులు
113 మార్గాల్లో పనులు.  పనుల మొత్తం మార్గం :  227.85 కి.మీ.లు లేన్ మార్కింగ్‌లు, కెర్బ్ పెయింటింగ్‌లు కూడా చేస్తున్నారు. దాదాపు 320 ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాల్ని తొలగిస్తున్నారు. జనం అధికంగా  ఉండే ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, చార్మినార్ తదితర ప్రదేశాల్లో     19 మొబైల్ టాయ్‌లెట్లు.

విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో..

యాత్ర పొడవునా వీధిదీపాలు. శాశ్వత స్తంభాలు లేని చోట తాత్కాలిక స్తంభాల ఏర్పాటు  విద్యుత్ స్తంభాలకు రంగులు  ఒక్కో జీఏటీ బృందంలో షిఫ్టుకు సూపర్‌వైజర్, ఇద్దరు ఎలక్ట్రీషియన్లు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారు. మొత్తం టీమ్‌లు 131. ఎలక్ట్రీషియన్లు   399 మంది  ఒక్కోమార్గంలో దాదాపు 3,595 విద్యుత్ దీపాలు   తాత్కాలికంగా 1,30,18,020 విద్యుత్ దీపాల ఏర్పాటు  ఇవికాక సున్నిత ప్రాంతాల్లో అత్యవసరంగా పనిచేసేందుకు 18 ప్రత్యేక బృందాలు. అవసరమైన సామగ్రితో 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి.

ఈ చెరువులలో నిమజ్జనం....

 1.కాప్రాచెరువు 2. సరూర్‌నగర్ చెరువు 3. రాజన్నబావి 4. మీరాలంట్యాంక్ 5. పల్లె చెరువు 6. పత్తికుంట చెరువు 7. దుర్గం చెరువు 8. మల్కం చెరువు 9. గోపీనగర్ చెరువు 10. పెద్ద చెరువు(గంగారం) 11. గురునాథం చెరువు(జేపీనగర్) 12. కైదమ్మకుంట(హఫీజ్‌పేట), ఈర్ల చెరువు 13. రాయసముద్రం చెరువు(రామచంద్రాపురం) 14. సాకి చెరువు(పటాన్‌చెరు) 15. ఐడీఎల్ ట్యాంక్ 16. ప్రగతినగర్ చెరువు 17. హస్మత్‌పేట చెరువు 18. సున్నం చెరువు 19. పరికి చెరువు 20. వెన్నెలగడ్డ చెరువు 21. సూరారం చెరువు 22.కొత్తచెరువు(అల్వాల్‌లేక్), 23. సఫిల్‌గూడ చెరువు

ఏరియల్ సర్వేతో వీక్షించనున్న డీజీపీ

నిమజ్జనోత్సవ బందోబస్తును రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే ద్వారా వీక్షించనున్నారు. వేలాది గణపతి విగ్రహాలతో పాతనగరంలోని బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు  లక్షలాది  జనంతో  సాగే నిమజ్జన ఊరేగింపునకు దాదాపు ముప్పై వేల మంది పోలీసులతో భారీ ఎత్తున భద్రతాఏర్పాట్లను చేశారు. డీజీపీతో పాటు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, నగర స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ మల్లారెడ్డిలు కూడా ఈ ఏరియల్ సర్వేలో పాల్గొంటారని  అధికారులు తెలిపారు. ప్రశాంతంగా వేడుకలు ముగిసేలా సహకరించాలని డీజీపీ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగినా నిమజ్జనానికి ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారీ ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తున్నారు. అన్ని స్థాయిల్లో కలిపి దాదాపు ఐదు వేల మంది సిబ్బందిని మోహరిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది.
 
మహాగణపతికి హై రేంజ్ బుక్‌ఆఫ్ రికార్డు అవార్డుhttp://img.sakshi.net/images/cms/2014-09/41410117820_Unknown.jpg
 
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతిని గుర్తించి హైరేంజ్ బుక్ ఆఫ్ అవార్డును ఆదివారం హైకోర్టు జస్టిస్ నర్సింహ్మారెడ్డి ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజ్‌కుమార్‌కు అందజేశారు. సుమన్ ఇంటర్నేషనల్ సంస్థ వారు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతిని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా  జస్టిస్ నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ 60 అడుగుల విశ్వరూప మహాగణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement