సాగర్‌లో విదేశీ విలాసం | Foreign luxury in the Sagar | Sakshi
Sakshi News home page

సాగర్‌లో విదేశీ విలాసం

Published Wed, Mar 2 2016 4:17 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

సాగర్‌లో విదేశీ విలాసం

సాగర్‌లో విదేశీ విలాసం

నేటి నుంచి అందుబాటులోకి రానున్న ‘కాటమారన్ పాంటూన్ బోట్’
 
 సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పడవకు ముందువైపు ఒకే హల్లు (మొనదేలినట్టు ఉండే వంపు) ఉంటుంది. కానీ... ఈ పడవకు అలాంటివి రెండుంటాయి. వాటి మీద ప్లాట్‌ఫామ్. దానిపై ఖరీదైన సోఫాలు, ముచ్చొటగొలిపే అలంకరణ వస్త్రాలు, నాణ్యమైన సంగీత ఝరి... వెరసి అదో విలాసవంతమైన బోట్.. పేరు... ‘కాటమారన్ పాంటూన్’. అలలపై రివ్వున దూసుకుపోయే ఈ స్పీడ్ బోట్‌లో షికారంటే పర్యాటకులకు ఎంతో మక్కువ. తాజాగా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ దాదాపు రూ.22 లక్షలు వెచ్చించి ఈ విలాసవంతమైన పడవను కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు దేశంలో మరే పర్యాటకాభివృద్ధి సంస్థలు ఇలాంటి పడవలను ఉపయోగించటం లేదు. దీన్ని బుధవారం హుస్సేన్‌సాగర్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియామిర్జా ప్రారంభించనున్నారు. 12 సీట్లుండే ఈ కొత్త బోటుపై విహారానికి ఒకరికి రూ.100 చొప్పున టికెట్ నిర్థరించారు. పుట్టినరోజు వంటి చిన్నచిన్న పార్టీలు కూడా ఇందులో జరుపుకొనే అవకాశం కల్పిస్తారు.
 
 జాతీయ స్థాయి ప్రదర్శన...
 కాగా, నగరంలో ఈ నెల 18 నుంచి 27 వరకు సౌత్ సెంట్రల్ కల్చరల్ జోన్ ఆధ్వర్యంలో మరో జాతీయ స్థాయి ప్రదర్శన నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం తెలిపారు. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలుంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement